Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆధునిక భారతదేశ నిర్మాతలు స్వాతంత్య్ర సమరయోధులు - The Architects of modern India

ఆధునిక భారతదేశ నిర్మాతలు: భారత దేశం స్వాతంత్యం సాధించిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, అన్ని వర్గాల ప్రజలు అభివ...

ఆధునిక భారతదేశ నిర్మాతలు: భారత దేశం స్వాతంత్యం సాధించిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని స్వాతంత్య్ర సమర యోధులు కలలు కున్నారు. దేశవ్యాప్తంగా సమానంగా అభివృద్ధి జరగాలని ఏ వర్గమూ కానీ, ఏ వ్యక్తి కానీ వెనకబడి పోకూడదని వారు భావించారు. స్వాతంత్య్ర్య సమరయోధులను గౌరవించడానికి వారిని గుర్తు పెట్టుకోవడడానికి ఉద్దేశించినదే 'ఆజాది కా అమృత్ మహోత్సవ్'. అదే సమయంలో సౌభాగ్యవంతమైన భారతదేశ సాధన దిశగా మన ప్రయాణం సాగుతోంది. స్వాతంత్య్ర సమరయోధుల కలల సాధనకు కావలసిన కృషి జరుగుతోంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహిస్తున్న 'అమృత్ మహోత్సవ్' అనేది మన కలలని సాకారం చేయడానికి నూతన భారతదేశ నిర్మాణం కోసం కావల్సిన విలువల్ని కాపాడుకోవడానికిగాను కావాల్సిన మార్గాన్ని ఇస్తోంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన ఈ సమయం అమృత కాలానికి ప్రారంభం. ఈ అమృత కాల సమయంలో మనం దేశాన్ని నిర్మించుకొని ఆధునిక అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. మన ఆకాంక్షలను వాస్తవం చేసుకోవాలి. ఇందుకోసం అందరికీ అందుబాటులో వుండేలా ఆరోగ్యభద్రతను అందించాలి. నివాస గృహాలను, రక్షిత మంచినీరును, విద్యుత్ సౌకర్యాలను అందించాలి.

వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకొని ఆహార తయారీ పరిశ్రమలోని అవరోధాలను తొలగించుకోవాలి.  ఈ సమయంలో మన ఆకాంక్షలను నెరవేర్చుకోవాలంటే మన సైనికుల, రైతుల సంక్షేమం చాలా కీలకం. స్వాతంత్య పోరాట సమయంలో మన పెద్దలు ఇదే కలను కన్నారు. వారి అసంపూర్ణ కలలను నెవవేర్చడం కోసం గత కొన్ని సంవత్సరాల నుండి కృషి చేయడం జరుగుతుంది. ప్రస్తుత ప్రబుత్వం చేపట్టిన విధానాల కారణంగా మన రైతులు స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులు ఉన్నతమైన నైతికతతో తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన అమృత మహోత్సవ్ విభాగంలో మనకు స్ఫూర్తినిచ్చిన స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల గురించి ఈ వ్యాసంలో తెలుసుకుని ప్రేరణ పొందుదాం.

స్వాతంత్య్ర పూర్వ, స్వాతంత్య్ర అనంతర భారతదేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి: భారత మాత ముద్దు బిడ్డల్లో ఒకరు లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంత పెద్ద పదవిలో వున్నప్పటికీ మానవీయ దృక్పథంతో అత్యంత సాధారణంగా జీవించారు. నైతిక విలువల దగ్గర ఎక్కడా రాజీపడకుండా అత్యంత నిజాయితీ, రాజనీతిజ్ఞతతో గౌరవ మర్యాదలు ఉట్టిపడేలా చేశానికి సేవలందించారు. ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్యమైన అంశం సమర్ధవంతంగా, ప్రతిభావంతంగా తన ఆలోచనల్ని ఇతరులకు తెలియజేయడం. సంభాషణ కళలో ఆయన ఆరితేరారు. కమ్యూనికేషన్ విషయంలో మంచి పేరు సంపాదించుకున్నారు. తాను చెప్పేది ప్రతిభావంతంగా చెప్పడమే కాదు ఇతరులు చెప్పేది కూడా స్పష్టంగా అర్ధం చేసుకునేవారు. అదే ఆయన విజయానికి మూలమైంది.

ఇతరుల భావాలకు, ఆలోచనలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాడు. భారతదేశ ప్రగతి కోసం హరిత విప్లవాన్ని, శ్వేత విప్లవాన్ని సాధించాలని జాతికి ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఆయన దార్శనికత కారణంగా భారతదేశం ఆహార భద్రత సాధించింది. దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని మొఘల్ సరాయ్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. ఆయన తండ్రి మున్షీ శారదా ప్రసాద్ శ్రీవాత్సవ పాఠశాల ఉపాధ్యాయులుగా పని చేశారు. లాల్ బహదూర్ శాస్త్రికి ఒకటిన్నర సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి కీర్తిశేషులయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనాలని మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన సమయానికి లాల్ బహదూర్ శాస్త్రి వయస్సు 16 ఏళ్లు.

మహాత్ముని పిలుపు వినగానే దేశం కోసం తన విద్యాభ్యాసాన్ని త్యజించాలని ఆయన నిర్ణయించారు. ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించడం కోసం మహాత్మాగాంధీ 1930లో దండి యాత్ర చేశారు. ప్రతీకాత్మకంగా ఆయన ఇచ్చిన సందేశం దేశ వ్యాప్తంగా విప్లవానికి కారణమైంది. ఈ నేపథ్యంలో లాల్ బహదూర్ శాస్త్రి ఇనుమడించిన ఉత్సాహంతో స్వాతంత్య్ర్య సమరంలోకి దూకారు. ఆ తర్వాత ఆయన బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారు. ఏడు సంవత్సరాలపాటు జైలు జీవితం గడిపారు. స్వాతంత్య్ర్య సమరంలో పాల్గొంటూనే ఆ అనుభవాలతో ఆయన సమర్థుడైన నాయకునిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, సైనికులు ఆయనపట్ల అపారమైన గౌరవ మర్యాదలు చూపారు.

1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారతదేశం కాల్పుల్ని విరమించకపోతే గోధుమలని సరఫరా చేయమని అమెరికా భారతదేశాన్ని బెదిరించింది. అప్పటికి గోధుమ ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించలేదు. దేశ ప్రజలు వారానికి ఒక పూట తిండి తినడం మానేయాలని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. ఈ పిలుపు ఇవ్వడానికి ముందు ఆయన ఈ నియమాన్ని తన జీవితంలో అమలు చేసి చూశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన లాల్ బహదూర్ శాస్త్రి పిలుపును దేశ ప్రజలు ఆహ్వానించారు అమలు చేశారు.

రైతులు, కార్మికులు, సైనికుల సంక్షేమం కోసం ఆయన పరితపించారు. గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేశారు. మన సైనికుల, అన్నదాతల ప్రాధాన్యతను చాటడం కోసం ఆయన జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. తదనంతర కాలంలో ఈ నినాదానికి జై విజ్ఞాన్ అదే నినాదాన్ని జోడించారు అటల్ బిహారీ వాజ్ పేయి. 2019 జనవరి 3న ప్రధాని నరేంద్ర మోదీ ఈ నినాదాలను విస్తరించి జై అనుసంధాన్ అన్నారు. సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ నిరంతరం దేశ సంక్షేమంకోసం ఆలోచించిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి.

పెషావర్ లో నిరాయుధులైన పఠాన్లపై కాల్పులు జరపడానికి నిరాకరించిన వీర్ చంద్ర సింగ్ ఘర్వాలి: భారత స్వాతంత్య్ర్యం కోసం పేషావర్ లో ఆందోళన చేస్తున్న నిరాయుధులైన పఠాన్ల పై కాల్పులు జరపడానికి ఆయన నిరాకరించారు. ఆ విధంగా ఆయన పేరు భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పేరే వీర్ చంద్ర సింగ్ ఘర్వాలి. అది 1930 ఏప్రిల్ 30, విదేశీ వస్తువులు, బట్టలను వ్యతిరేకిస్తూ పెషావర్ (ప్రస్తుతం పాకిస్తాన్ లో భాగం) లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆధ్వర్యంలో, ఆందోళన నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని అణచి వేయాలని బ్రిటన్ ప్రభుత్వం భావించింది. అందుకోసం వీర్ చంద్ర సింగ్ ఘర్వాలి నాయకత్వంలోని ఘర్వాల్ రెజిమెంట్ కు ఆదేశాలు వెళ్లాయి.

పఠాన్లు మొదలుపెట్టిన ఉద్యమాన్ని చూసి బ్రిటన్ ప్రభుత్వం వణికిపోయింది. ఆందోళనకారులను భయపెట్టడానికిగాను వారిపై కాల్పులు జరపాలని ఘర్వాల్ రెజిమెంట్ ను బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించింది. నిరాయుధులైన పఠాన్ల పై కాల్పులు జరపడానికి ఘర్వాల్ రెజిమెంట్ నాయకుడు వీర్ చంద్ర సింగ్ ఘర్వాలి నిరాకరించారు. ఆ విధంగా ఆయన దేశంపైన తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ ఘటన అనేది భారతదేశ స్వాతంత్య పోరాటంలో మైలురాయిగా నిలిచింది. భవిష్యత్ కార్యాచరణకు కావల్సిన పునాది వేసింది. బ్రిటన్ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వీర్ చంద్ర సింగ్ ఘర్వాలికి బాగా తెలుసు. ఉరిశిక్ష కూడా విధించవచ్చు. అయినా సరే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు...

ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆయన పేరు నూరు మ్రోగింది. పెషావర్ తిరుగుబాటు హీరోగా ఆయన పేరు సంపాదించుకున్నారు. దేశంలో కీలకమైన స్వాతంత్య్ర్య పోరాట యోధునిగా నిలిచారు. ఆయన దేశభక్తిని మెచ్చుకున్న మహాత్మాగాంధీ ఆయనకు ఘర్వాలి అనే బిరుదును ఇచ్చారు. ఈ ఘటన తర్వాత ఆయన్ను బ్రిటన్ సైన్యాన్నించి తొంగించి ఉరిశిక్ష వేశారు. తదనంతర కాలంలో ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 1941 డిసెంబర్ 26న విడుదలైన వీర్ చంద్ర సింగ్ ఘర్వాలి 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మరోసారి జైలుకు వెళ్లారు. భారత స్వాతంత్య పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. దేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత కూడా ఆయన జాతి నిర్మాణం కోసం తన సేవలందించారు. ఆయన గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం 1994లో తపాలా బిళ్లను విడుదల చేసింది.

పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన ఉత్కల్ మణి గోపబంధుదాస్: ఆయన సామాజిక సేవా కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, జర్నలిస్టు, సాహిత్యకారుడు ఆయన పేరు ఉత్కణ్ మణి గోపాల బంధుదాస్ వరదలు, తుపానుల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు పేదలను రక్షించడంలో ఆయన ముందండేవారు. ఒరిస్పాకు చెందిన ఆయనకు ఉత్కల్ మణి అనే బిరుదు కూడా వుంది. పేదల సేవలో నిత్యం మునిగి తేలిన ఆయన సొంత కుటుంబానికి కూడా సమయం కేటాయించేవారు కారు. కన్న కొడుకు మరణించిన సమయంలో ఆయనున్నది ఇంట్లో కాదు. వరద బాధితుల సేవలో ఒరిస్సా ప్రజల ఆయన్ను 'పేదల పెన్నిది"గా పిలుస్తారు. 'పేదల బాంధవుని'గా కీర్తించారు. 'దయ కలిగిన విప్లవవాది'గా పేరు గడించారు.

జాతీయ భావాల పైనా, స్వాతంత్య పోరాటం పైనా ఒరిస్సాలో ఎప్పుడు చర్చ జరిగినా అక్కడి ప్రజలు గోప బంధుదాస్ సేవలను గుర్తు చేసుకోవడం జరుగుతోంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో చురుగ్గా పాల్గొని అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు. ఆయన చిన్నప్పటినుంచీ దేశభక్తి భావాలతో పెరిగారు. ప్రతి భారతీయుడు తప్పకుండా చదువుకోవాలనే విధానాన్ని ఆయన బలంగా విశ్వసించి ప్రోత్సహించారు. విద్య గొప్పదనాన్ని గ్రహించారు కాబట్టే ఆయనే స్వయంగా 1919లో ఒక ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. దాన్ని శాంతినికేతన్ విధానంలో రూపొందించి విద్యానిలయంగా మార్చారు. ఆయన రాసిన కవితలు ఎంతో హృద్యంగా వుండేవి. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నింపేవి. ఆయన 1919లో సమాజ్ పేరుతో ఒక వార్తాపత్రికను కూడా ప్రారంభించారు.

ఎంతో సాధారణ జీవితం గడిపిన ఆయన పరిమితంగా అన్నం, పప్పుధాన్యాల భోజనం మాత్రమే తినేవారు. ఇదే విషయాన్ని గతంలో ఒకసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇలా గుర్తు చేశారు. ఒరిస్సాలో 1921లో పర్యటించిన గాంధీజీ ఆ సమయంలో గోపబంధుదాస్ తో మాట్లాడుతూ అంత తక్కువ ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కదా అని అడిగారట. దానికి గోపబంధుదాస్ స్పందిస్తూ. తనకు స్వరాజ్యం మీద మాత్రమే ధ్యాస వుంది తప్ప ఇతర విషయాల మీద లేదని అన్నారు. ఈ పర్యటన తర్వాత దీనిపై "నా ఒరిస్సా పర్యటన "అనే పేరుమీద వ్యాసం రాసిన గాంధీజీ అందులో తాను వంద మంది గోపబంధుదాసులాంటి వారిని సమీకరించగలిగితే చాలు వారి సాయంతో దేశానికి స్వాతంత్య్రం సాధిస్తానని అన్నారు.

భారతీయ స్వాతంత్య్ర సమరానికి మద్దతు పలికి బ్రిటన్ మహిళ అనిబీసెంట్: అనిబీసెంట్ భారతదేశాన్ని తన మాతృదేశంగా భావించిన బ్రిటన్ మహిళ, ఆమె బ్రిటన్ దేశ సాంఘిక సంస్కర్త, మహిళా హక్కుల ఉద్యమకారిణి. భారత జాతీయత, స్వాతంత్య పోరాటానికి గట్టిగా మద్దతు పలికిన మానవతావాది. ఐరిష్ దేశ మూలాలన్న ఆమె బ్రిటన్ పౌరుని పెళ్లి చేసుకొని భారతదేశాన్ని తన రెండో మాతృదేశంగా భావించారు. ఆమె లండన్లో 1847 అక్టోబర్ 1న జన్మించారు. ఆమెకు ఐదు సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆమె తండ్రి కీర్తిశేషులయ్యారు. ఆమె జీవితాంతం కర్మను నమ్మారు. అనిబీసెంట్ ప్రభావంతో భారతదేశంలోని అనేక మంది యువతీయువకులు అరె ఒక విదేశీ వనిత మనదేశం కోసం పాటుపడుతుంటే మనం మన దేశంకోసం పనిచేయకపోతే ఎలా అని స్ఫూర్తిని పొంది దేశానికి సేవ చేశారు.

భారత రాజకీయాలపట్ల 1913 నుంచీ ఆసక్తిని పెంచుకున్న అనిబీసెంట్ భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. ఆమె 1917 లో కాంగ్రెస్ అధ్యక్షురాలై భారతదేశ స్వాతంత్య్ర్యం కోసం అవిశ్రాంత పోరాటం చేశారు. మహిళల ప్రగతి కోసం, విద్య కోసం నిరంతరం శ్రమించారు. ఆమె ఆధ్వర్యంలో సెంట్రల్ హిందూ కాలేజ్ ప్రారంభమైంది. అది బనారస్ హిందూ యూనివర్సిటీలో మొదటి కళాశాలగా గుర్తింపు పొందింది. దేశంలో విద్యారంగ అభివృద్ధి కోసం అసాధారణమైన కృషి చేసినందుకుగాను ఆమెకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. అనిబిసెంట్ లాంటి దార్శనికులు చూపిన మార్గాన్ని అనుసరించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మహిళల విద్యకోసం, ప్రగతి కోసం అలుపెరగని కృషి చేస్తోంది.

అనిబీసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశ శాశ్వత పౌరులే దేశాన్ని పాలించాలని హోమ్ రూల్ ఉద్యమం చాటింది. జాతీయ ఉద్యమంలో విస్తరిస్తున్న నిరాశ నిర్లిప్తతలను హోమ్ రూల్ ఉద్యమం పారద్రోలింది. సామాన్య ప్రజలను స్వాతంత్య్ర్య పోరాటంలో భాగం చేసింది. ఆమె 1914లో కామన్ విలే అనే వారపత్రికను ప్రారంభించారు. మద్రాస్ స్టాండర్డ్ అనే పత్రికను కొనుగోలు చేసి దానికి "న్యూ ఇండియా' అనే పేరు పెట్టారు, అనిబీసెంట్ ముక్కుసూటిగా వ్యవహరించేవారు. సామాజిక దురన్యాయాలను ప్రశ్నించారు. బాల్య వివాహాలను, కులవ్యవస్థను వ్యతిరేకించారు. విధవా వివాహాన్ని సమర్థించారు. తాత్విక సమాజ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె 86 సంవత్సరాల వయస్సులో కీర్తిశేషులయ్యారు. ఆమె కోరిక ప్రకారం ఆమె పార్టీన దేహాన్ని గంగా ఘాట్ లో దహనం చేశారు. చితాభస్మాన్ని గంగానదిలో కలిపారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments