2022లో మొదలైన కథ ఇది… అతడో ధైర్యవంతుడైన జర్నలిస్ట్, పేరు శివం దీక్షిత్. పాంచజన్య పత్రికకు పనిచేస్తూ ఒక భయానకమైన మత మార్పిడి ముటాను వెలికితీశారు. చాంగూర్ మౌలానా అనే వ్యక్తి నాయకత్వంలో సాగుతున్న ఈ రాకెట్, హిందూ యువతులను మతం మార్చించి ఇస్లామీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
విదేశీ నిధులు, దేశవ్యతిరేక శక్తుల మద్దతుతో సాగిన ఈ కుట్రను శివం దీక్షిత్ ఆధారాలతో బయటపెట్టారు. ఇది దేశ భద్రతకు సవాల్ అనే చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే విషయం.
ఎవ్వరూ మాట్లాడని పచ్చి నిజాలు: ఆ సమయంలో నేషనల్ మీడియా, లిబరల్ వర్గాలు, సెల్ఫ్ ప్రోక్లెయిమ్డ్ మేధావులు — ఎవరూ స్పందించలేదు. బదులుగా శివం దీక్షిత్‌ను ఫేక్ న్యూస్ పబ్లిషర్‌గా చిత్రీకరించారు. చట్టపరమైన చర్యలు తీసేందుకు కుట్రలు జరిగాయి. ఆయన ధైర్యాన్ని అణిచివేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కాని అసలైన జర్నలిజం, తాత్కాలిక కష్టాలకు భయపడదు. సత్యం చివరకు గెలుస్తుంది అనే నిజాన్ని శివం దీక్షిత్ మరోసారి రుజువు చేశారు.
2025లో అతను చరిత్ర తిరగరాశారు: జూలై 2025లో యూపీ పోలీసులు చాంగూర్ మౌలానా అక్రమ ఆస్తులపై బుల్డోజర్ నడిపారు. ఇది కేవలం ఒక పోలీసు చర్య మాత్రమే కాదు. ఇది శివం దీక్షిత్ సత్యవిశ్వాసానికి విజయం!
'చాంగూర్ బాబా' అనే పదం వెనుక దాగిన మతపరమైన ఉద్దేశ్యం?: జాతీయ మీడియాలో పదే పదే "చాంగూర్ బాబా" అనే పదాన్ని వినిపిస్తున్నాం. కానీ అసలు పేరు జమాలుద్దీన్. తనను తాను "హాజీ పీర్", "జిందా పీర్" అనేలా ప్రచారం చేసుకున్నాడు. అయితే 'బాబా' అనే పదం సాధారణంగా హిందూ సాధువులకి వాడే పదం కదా? అయితే ఈ పేరుతో హిందూ మతానికీ అనుసంధానాన్ని సృష్టించాలనే కుట్ర ఉందా? ఇది మీడియా బాధ్యతాయుతమైన పాత్రను ప్రశ్నించే అంశం.
నిజమైన దేశభక్తి అంటే ఇదే: శివం దీక్షిత్ వంటి జర్నలిస్టులు ఈ దేశానికి అవసరం. జీవిత భద్రతలేనివారు అయినా ధర్మాన్ని, దేశాన్ని రక్షించేందుకు నిలబడ్డాడు. జర్నలిజాన్ని జిహాదీల శక్తులపై పోరాటంగా మార్చిన వీరుడు.
చివరగా... ఈ దేశంలో సత్యం కోసం పోరాడే ప్రతి పౌరుడు శివం దీక్షిత్ లా ధైర్యంగా ఉండాలి. మీడియా వక్రీకరణను ఎదుర్కొనాలి. మతమార్పిడికి బలవుతున్న అమాయకుల్ని రక్షించాలి.
"ఒక మత మార్పిడి కథను బహిర్గతం చేయడమే కాదు, దేశాన్ని మేల్కొలిపిన జర్నలిజం ఇది!"
ఈ కుట్రవెనుక 500 కోట్ల మతమార్పిడి వ్యాపారం జరిగిందంటే ఆశ్చర్యం కలుగమానదు.... శివం దీక్షిత్ ని ఆదర్శంగా తీసుకుని ప్రతి జర్నలిస్ట్ పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. -రాజశేఖర్ నన్నపనేని. మెగామైండ్స్.