మహిళలపై నెగటివ్ వార్తల మాయలో పడకండి!! - Spread Positive News

megaminds
0

మహిళలపై నెగటివ్ వార్తల మాయలో పడకండి!!

సమాజం లో నేడు మహిళల గురించి జరుగుతున్న ప్రచారాల పై ఓ సంవేదనాశీలతతో కూడిన సునిశిత పరిశీలన.

రోజూ మనం వార్తా పేపర్ లేదా సోషల్ మీడియాలో వచ్చే కథనాలను చూస్తే కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా మనం భావించక తప్పదు. ప్రతి క్షణం ఒక వార్త చక్కెర్లు కొడుతుంది. భర్తను మోసం చేసిన భార్య,  మరీ ఈ మధ్య అక్రమ సంబంధం భయటపడటంతో భర్తను లవర్ తో కలిసి చంపిన భార్య ఇలాంటివి అత్యధికంగా చూస్తున్నాము.

ఇలాంటి వార్తలే ఎక్కువ ఎందుకు ప్రచారం అవుతున్నాయి.    అలాగే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ప్రేమ అంటూ మరో రకమైన కథనాలు అనేకం. మనం రోజూ శేర్ చేయడానికి ఇంతకన్నా మంచి వార్తలు లేవా? సమాజం లో ఒకటుంది. ప్రస్తుత ఉన్న సమాజం ఎగ్రెసివ్ వార్తను, ఎమోషనల్ వార్తను ఎక్కువగా ప్రచారం చేసే మానసిక వైకల్యం ఉన్న సమాజం. సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలకే ఎక్కువ ప్రచారం కోసం, వ్యుస్ కోసం అందరూ అదే బాట పడుతున్నారు. ప్రస్తుతం ఎల్లో (పెయిడ్) జర్నలిజానికి సోషల్ మీడియాకి పెద్ద తేడా లేదు.

నిజంగా సమాజంలో ఉన్న మహిళలు లేదా పురుషులు ఇదే దోరణిలో ఉన్నారా? ఉన్నప్పటికీ అది ఒకటి రెండు శాతానికి మించి ఉండదు.

మీరు ప్రస్తుత సమాజం లో చూస్తే ప్రపంచం అంతా నిరుద్యోగ సమస్యతో విలవిల‌ లాడుతోంది. ఉద్యోగాలు లే ఆఫ్స్ తో పోతే భార్య సంపాదనతో నడుస్తున్న కుటుంబాలెన్నో, భర్త దురదృష్టవశాత్తూ చనిపోతే రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచి సంస్కారవంతులుగా తీర్చి దిద్దుతున్న సమిధలైన వనితలెందరో, ఇక పల్లెటూళ్లల్లో భర్త తాగుడుకి బానిసైతే మిషన్ కుట్టో, కూరగాయలు పండించో పిల్లల్ని చదివిస్తున్న మాతృమూర్తులెందరో. అలాగే భార్యకి జబ్బుచేస్తే పిల్లల్ని చూసుకుంటూ భార్యకు సేవలు చేసే భర్తలెంతమందో... ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో కోకొల్లొలు ఒక సమాజం, కుటుంబం, విలువలతో కూడిన వ్యవస్థని వ్యుస్ కోసం బద్నాం చేయకండి.

కొంతమంది పిల్లలైతే మేము పెళ్లిచేసుకోము పలాన పేపర్ లో ఇలా వచ్చింది. సోషల్ మీడియాలో అలా వచ్చింది. పెళ్లంటే భయంవేస్తుంది‌ అంటున్నారు. నిజంగా ఇంట్లో మహిళలు అలా ఉన్నారా? అలా ఉంటే మన అమ్మా, మన అక్క, చెల్లి కూడా అలానే ఉన్నారా ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్తితులు కూడా మనం గమనించాల్సి వస్తుంది. ఎప్పుడూ లేనిది ఈ సోషల్ మీడియా యుగంలో స్త్రీని భోగ వస్తువుగా చూసే పాశ్చాత్య సంస్కృతి మనకు ఎలా వచ్చింది. మనకా ఊహకూడా రాకూడదు.

కాబట్టి సోషల్ మీడియాలో కనీసం ఈ సంవేదనా పరిశీలనను చదివిన ఏ ఒక్కరూ కూడా ఇతరుల కుటుంబాలకు సంబంధిత విషయాలు శేర్ చేయకండి అదిఉ నెగటివ్ వార్తలు అస్సలు ఇతరులతో‌ పంచుకోకండి. మంచి సమాచారాన్ని వార్తలను స్ప్రెడ్ చేయండి.

ఉదాహరణకు:

ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సేవా సంస్థ వైదేహీ ఆశ్రమం లో నిరాశ్రయులైన ఆడపిల్లలకు వసతి తో పాటు చదివించి, మంచి‌ సంస్కారములు అందించి వారికి కుటుంబ విలువలు నేర్పించి పెళ్ళి కూడా చేస్తున్నారు. అలాగే వనవాసీ పిల్లలకోసం శ్రీ రామ ఆవాసం, వాత్సల్య సింధు, మాతృచాయ ఇంకా అనేక చోట్ల పలు ఆవాసాలు నడుపుతున్నారు. ఇటువంటి వాటిని ప్రచారం చేయాలి.

మోడీ గారు మన్ కీ బాత్ లో అనేక విషయాలు ఇటువంటివి ప్రేరణాదాయకమైన సంఘటనలు ఉదాహరిస్తున్నారు.

అలాగే మన ఆర్మీ జమ్మూ, కాశ్మీర్, లద్ధాక్, అరుణాచల్, మణిపూర్ రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి వాటి గురించి పోస్ట్ లు చేయలేము. ఈ రోజు వేకువ జామున కూడా ఆర్మీ ఉల్ఫా తీవ్రవాదుల్ని వందడ్రోన్ లతో మయన్మార్ క్యాంప్ లపై దాడి చేసింది. ఇటువంటి ఒక పాజిటివ్ వార్తను కూడా ప్రచారం చేయరు. ఒక వేళ చేసినా ఆస్థాన పండితులు వ్రాస్తేనే నమ్ముతాము అనే వారూ లేకపోలేదు. 

ఒకసారి వెనక్కి తిరిగి చూడండి మన సోషల్ మీడియా వాల్ మీద ఎంత చెత్తను ప్రమోట్ చేస్తున్నామో...

మీ రాజశేఖర్ నన్నపనేని.
మెగామైండ్స్ మీడియ

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.




Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top