Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశీయ గో జాతులు వాటి ప్రాముఖ్యత - Desi Cows and Importance of cow in Telugu

భారతీయ సంతతికి చెందిన ఆవుల విశేషాలు: అత్యంత ప్రాచీనకాలం నుండి భారతదేశంలో ఆవు, మానవులకు ఒక సహచరునిగా, ఇంట్లో పెంచి పోషించుకునే...

భారతీయ సంతతికి చెందిన ఆవుల విశేషాలు: అత్యంత ప్రాచీనకాలం నుండి భారతదేశంలో ఆవు, మానవులకు ఒక సహచరునిగా, ఇంట్లో పెంచి పోషించుకునే జంతువుగా ఉంది. భారతీయ ఆవు శాకాహారి. మూపురము, గంగడోలు భారతీయ గోసంతతి విశేషత. భారతీయ సంతతి ఆవులు ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి.

పాశ్చాత్య దేశాల్లో 'యోరాస్' అనే పేరుగల మాంసాహారి జంతువు అడవుల్లో ఉండేది. 7 అడుగుల పొడవుతో భారీకాయంతో ఉండే ఈ జంతువు కొమ్ములు 3 అడుగులు. దీని పాలు త్రాగడానికి అనువుగా ఉండడంతో అక్కడి మానవులు ఈ జంతువులను మచ్చిక చేసుకున్నారు. అయితే ఈ జంతువు గోవంశానికి చెందినది కాదు. నేడు ఎక్కువ పాల కొరకు జెర్సీ ఆవులను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ జెర్సీ పాలలో ఆవు పాలు శ్రేష్ఠత్వం లేదు. పాశ్చాత్య దేశాలలో పాలతోపాటు, మాంసం కొరకు ఆవులను పెంచుతారు.

గోవధ నిషేధాన్ని మన ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయని కారణంగా భారతీయ తెగల్లో నేటికి 32 మాత్రమే మిగిలి ఉన్నాయి. పట్టణాలలో పశుగ్రాసం కొరత, ఆవులు తిరిగే స్థానం లేకుండా పోవడం వల్ల ఆవులు పట్టణాలలో స్థానం లేకుండా పోయింది. నేడు గ్రామాల్లోను ఇదే పరిస్థితి ఉంది. 6.4% ఆవులు మాంసం కొరకు నేడు ప్రతి సంవత్సరం గోవధశాలలకు తరలింపబడుతున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1951 నాడు ప్రతి 1000 మంది జనాభాకు 700 ఆవులు ఉండేవి. నేడవి 1000 మందికి 400 కు తగ్గాయి. సంకరిత ఆవులు ఎక్కువ పాలను ఇస్తాయి. అయితే అవి కొద్ది సంవత్సరాలే ఇస్తాయి. స్వదేశీ గోసంతతి ద్వారా వచ్చే పాలు, గోమూత్రము, పేడ వీటిలో మాత్రమే ఔషధ గుణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి, వేడి ప్రాంతంలో కూడా శ్రమించగలగడం, ఔషధగుణాలు కలిగిన పంచగవ్యాన్ని ఇవ్వడం భారతీయ గోవంశపు ప్రత్యేకత. స్వదేశీ గోసంతతి రక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇంకా అనేక స్వదేశీ తెగలు అంతరించే ప్రమాదం ఏర్పడింది.

దేశీయ ఆవుల లక్షణాలు: నడుముపై మూపురము, మెడ క్రింద గంగడోలు
స్వదేశీ ఆవుల విశేషతలు: మూపురంలో సూర్యనాడి ఉంటుంది. ఫలితంగా పాలు పచ్చగా ఉంటాయి. సాధారణంగా కొమ్ములు పొడుగ్గా ఉంటాయి. శరీరం సాధారణంగానే ఉంటుంది. దేశీయ గో సంతానమైన ఎద్దులు బాగా శ్రమించగలవు. వ్యవసాయంలో విరివిగా ఉపయోగపడతాయి. దేశీయ ఆవు ఉచ్ఛస్వరంతో అరుస్తుంది. ఆవు చాలా చలాకీగా, చరుగ్గా ఉంటుంది. ఈ ఆవులు తన యజమానికే పాలనిస్తాయి. క్రొత్తవారికీయవు. వందల ఆవుల మధ్యకూడా దూడ తన తల్లిని గుర్తిస్తుంది. ఆవు ఎంత దూరంలో ఉన్నా తన ఇంటిని గుర్తుపట్టగలుగుతుంది.

దేశీయ ఆవుల వల్ల కలిగే ప్రయోజనాలు: దేశీయ సంతతికి చెందిన ఆవు పాల వల్ల బుద్ది సునిశితమౌతుంది. అన్ని పౌష్టిక పదార్థాలను కలిగి ఉంటుంది. విషకరమైన వాటిని నిరోధించి, శక్తిని కలిగిస్తుంది. ఇది సర్వోత్తమమైనవి. తల్లి పాలవలె సులభంగా జీర్ణమవుతుంది. తల్లి పాలలో ఉండే అన్ని సుగుణాలు దేశీయ సంతతి ఆవు పాలలో లభ్యమవుతాయి. పాలు ఎక్కువ పరిమాణంలో ఇవ్వదు. అయితే 12-13 సంవత్సరాల పాటు పరుసగా ఇస్తుంది. దేశీయ సంతతికి చెందిన ఆవు కార్బన్డైఆక్సైడ్ను శ్వాసగా తీసుకుని ఆక్సిజన్ ను శ్వాసగా వదులుతుంది.

దేశీయ ఆవు నెయ్యి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, బుద్ధి సునిశితం ఇస్తుంది. విష పదార్థాల నుండి రక్షించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పాలలో అనేక ఔషధపరమైన గుణాలున్నాయి. దేశీయ ఆవు చర్మానికి విషగుణాలను హరించే లక్షణం ఉంది. తోకద్వారా చర్మాన్ని శుభ్రంగా ఎప్పుడూ ఉంచుకుంటుంది. ఆవు శరీరాన్ని నిమిరేవారికి సైతం ఆరోగ్యం మెరుగవుతుంది. దేశీయ ఆవు పాల వల్ల లభించే మజ్జిగ చలవ ను కలిగిస్తుంది. పైత్యాశయము, ప్రేగులను శుభ్రపరుస్తుంది. బుద్ధి బలాన్నిస్తుంది. ఫలితంగా శరీరంలో చురుకుతనం పెరుగుతుంది.

స్వదేశీ ఆవులు: బి.సి.ఎం. (బీటా కాసో మార్లెన్) అనే విషకణం ఉండదు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ వైద్యపరంగా చాలా విలువైనవి. ఆవు మరణ అనంతరము కొమ్ములు ఇతర శరీర భాగాలు భూమిలో, పొలంలో పాతిపెడితే ఆరునెలల తరువాత విశేష ఎరువుగా మారుతుంది.

దేశీయ ఆవు పాల విశేషాలు: దేశీయ ఆవు పాల వల్ల లభించే నెయ్యి ఒక తులాన్ని మండిస్తే ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది. ఆవు పాలల్లో 'కైరోటిన్' అనే పదార్ధముంటుంది. దీని వల్ల నేత్ర వ్యాధులు నయమవుతాయి. ఇది 'విటమిన్ ఎ' కు పర్యాయపదంగా కనిపిస్తుంది. ఆవు పాల వలె నెయ్యి, పెరుగు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆవు పాలు పలుచగా ఉంటాయి. శిశువులకు సైతం సులభంగా జీర్ణమవుతాయి. తల్లిపాలకుండే అన్ని సుగుణాలు దేశీయ ఆవు పాలున్నాయి. తల్లి పాలతో సమానంగా దేశీయ ఆవు పాలను శ్రేష్ఠంగా భావిస్తారు. కనుకనే ఆవును తల్లిగా భావిస్తారు. ఇదండీ స్వదేశీ ఆవుల వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు 89 కేజీల మాంసము కోసం గోవద చేయడం భావ్యము కాదు... గో సంరక్షణ తప్పనిసరి... గో మాతాకీ జై.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. అద్భుతమైన చారిత్రక సమాచారం.. ధన్యవాదాలు

    ReplyDelete