Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గో ప్రేమికులారా గోవధపై భ్రమలు వీడండి - About Cow Slaughtering and Confusions

మేథావుల పేరుతో గోమాత విషయంలో భ్రమలు సృష్టించారు వాస్తవాలు తెలుసుకుందాం: ఈ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు ఇక్కడి ప్ర...


మేథావుల పేరుతో గోమాత విషయంలో భ్రమలు సృష్టించారు వాస్తవాలు తెలుసుకుందాం: ఈ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు ఇక్కడి ప్రజల ఆలోచనలు, జీవన విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు ఆంగ్లేయులు. దీనికోసం ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపై దాడి చేశారు. భారతీయుడు తమ జీవన విధానాన్ని వదిలిపెట్టి ఆంగ్లేయ పద్ధతులు ఆలోచన సరళిని అంగీకరించే విధంగా చేయాలనుకున్నారు. ఈ లక్ష్యంతోనే 1835 మార్చ్ 7న మెకాలే ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.
పేరుకు భారతీయులు ఆలోచనలు, అభిరుచులు, విలువలు, అభిప్రాయాల్లో నూటికి నూరుపాళ్ళు ఆంగ్లేయులుగా తీర్చిదిద్దడమే నా విద్యా విధానం లక్ష్యం అని మెకాలే స్పష్టం చేశాడు. (మెకాలే మినిట్స్ ఆన్ ఎడ్యుకేషన్, కలకత్తా యూనివర్శిటీ కమిషన్ రిపోర్ట్ VI 16). అలాంటి విద్యావిధానానికి అలవాటు పడి ఆంగ్ల మానసపుత్రులుగా మారిన భారతీయులకు గోవధ అభ్యంతరకర విషయంగా కనిపించలేదు.
మెకాలేయిస్టులు, మార్క్సిస్టులు కలిసి ఈ భూమి నుంచి హిందూ ధర్మ విలువల్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే హిందూ సంస్కృతిలో ప్రధానమైన గోవును లక్ష్యంగా చేసుకున్నారు. డా||ఆర్.ఎస్.శర్మ, డి॥ డి.ఎన్.ఝా వంటి వామపక్ష రచయితలు వేదకాలంలోనే గోవధ ఉండేదని వేదాలు గోవధ తప్పుకాదని చెపుతున్నాయని వ్రాశారు. కానీ నిజానికి గోవు అఘన (చంపదగనిది కాదు) అని వేదాలు స్పష్టంగా చెప్పాయి. వేదకాలంలో గోమాంసాన్ని నిరభ్యంతరంగా భక్షించేవారని, యజ్ఞయాగాది క్రతువుల్లో గోమాంసాన్ని సమర్పించేవారని చెప్పేందుకు ఈ రచయితలు ఎంతో ప్రయత్నించారు. కానీ ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, వేద మంత్రాలు వైదిక సంస్కృతంలో ఉన్నాయి. ఈ వైదిక సంస్కృతాన్ని అర్థం చేసుకోవాలంటే నిరుక్తం నిఘంటువు, మహాభాష్యం, వ్యాకరణం తదితర జ్ఞానం ఉండాలి. ఇవి తెలిసినప్పుడే వేదమంత్రాల అర్థం అవగతమవుతుంది. వేద శబ్దాలకు లౌకికమైన అర్థం చెప్పుకుంటే కుదరదు. పారలౌకిక, అధిభౌతిక అర్ధాన్ని చెప్పుకోవాలి. గాని లౌకికమైన సంస్కృత భాష కూడా రాని మార్కిస్ట్ చరయితలు వేదమంత్రాలకు తమకు తోచిన, కావలసిన అర్థాలు చెప్పడంతో అనర్థాలు జరిగాయి. మనం గుర్తుంచుకోవలసిన రెండవ విషయం - ఈ దేశం సంస్కృతీ సభ్యతల్ని సమూలంగా నాశనం చేసేందుకు ఆంగ్లేయులు పన్నిన కుట్రలో భాగంగా మన వేదాలు, శాస్త్రాల్లో అనేక కల్పితాలు చేరిపోయాయి. వేద పరిశోధన పేరుతో అనేకమంది పాశ్చాత్యులు ఈ పని చేశారు.
ఇలాంటి వారి గురించి ఆచార్య ఆనందతీర్థ 'మహాభారత తాత్పర్య నిర్ణయ్' అనే గ్రంథంలో 'దురాలోచన కలిగిన రచయితలు ముఖ్యమైన గ్రంథాల్లో పదాలను తొలగించడం, లేదా కొత్తవి చేర్చడం కనిపిస్తుంది. ఇలా ఆ గ్రంథాలను నాశనం చేశారు‌. ఆంథోనీ మెక్ డొనాల్డ్, ఆర్థర్ కీలు రూపొందించిన ఋగ్వేద పారిభాషిక పదకోశం ఇలాంటిదే. ఇందులో ఋగ్వేదంలోని 10-85-13 మంత్రం ప్రకారం ఆనాటి కాలంలో పెళ్ళిళ్ళ సందర్భంగా గోమాంసాన్ని వడ్డించేవారు' అని వ్రాశారు. కానీ వాల్చు మంత్రంలోని 'హన్' అనే ఏ పదానికి 'చంపుట', 'వధించుట' అని అర్థం చెప్పారో ఆ పదానికి 'గతి', 'జ్ఞానం', 'ప్రాప్తి' అని అసలు అర్థం పాణిని వ్యాకరణం ద్వారా తెలుస్తుంది. ఆ ప్రకారం చూస్తూ వివాహాది శుభకార్యాల్లో గోదానం ఇచ్చేవారని, గోవును ఇతరులకు తరలించే (గతి) వారని తెలుస్తుంది.
గోదానం గురించి భారతదేశంలో అందరికీ తెలుసు. ఆంగ్లేయులు ఎంతో ఖర్చు పెట్టి కలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత ప్రొఫెసర్ తారానాథ్ తో 'వాచస్పత్యం' అనే సంస్కృత శబ్దకోశాన్ని తయారు చేయించారు. ఇందులో అనేక సంస్కృత పదాలకు అసత్యపు అర్థాలు వ్రాశారు. ఈ శబ్దకోశం ఆధారంగా 1872లో బారిస్టర్ రాజేంద్రలాల్ మిత్ర 'బీఫ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా' అనే పుస్తకాన్ని వ్రాశాడు. దీన్ని బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ ప్రచురించారు. గోవధ, గోమాంస భక్షణ ఏమాత్రం తప్పు కాదంటూ ఈ పుస్తకంలో మిత్ర వ్రాశాడు. గోఘ్న' అనే పదానికి వాచస్పత్యం ప్రకారం ఉన్న 'గోవధ చేసేవాడు' అనే అర్థాన్ని తీసుకుని మిత్ర అలా వ్రాశాడు. కానీ పాణిని అష్టాధ్యాయి ని 'దాస గోఘ్నీ సంప్రదాయం' అనే సూత్రం(3-4-73) లో 'గోఘ్న' అనే 'సంప్రదాన' సందర్భంలో ఉపయోగించారు. సంప్రదాన అంటే సంహరించడం కాదు దానం చేయడం. గోవులను దానం చేయడం గోఘ్న ప్రసిద్ధ దార్శినికులు స్వామి ప్రకాశానంద సరస్వతి కూడా తమ "The true history of Religions of India" అనే పుస్తకంలో గోఘ్న పదానికి అర్థాన్ని వివరించారు. 'బహుమతి రూపంగా గోవులను స్వీకరించే అతిథిని గోఘ్న అంటారు' అని స్పష్టం చేశారు. పాణినీయం ప్రకారం 'గతి' అనే పదానికి మూడు అర్థాలు ఉన్నాయి. జ్ఞానం, గమనం, ప్రాప్తి అనే అర్థం ప్రకారం గోవులను స్వీకరించేవాడు గోఘ్ను అవుతాడు. కానీ ఈ అర్థాన్ని వక్రీకరిస్తూ మార్క్సిస్ట్ రచయిత డిఎన్ రా "Paradox of Indian Cow" అనే పుస్తకంలో 'ఋగ్వేద మంత్రం 10-85-13 ప్రకారం గోఘ్న అంటే ఎవరి కోసమైతే ఆవును వధించారో అతడు' అని వ్రాశాడు. గోఘ్న శబ్దాన్ని గోవధ ముడిపెట్టిన పాణిని కాదు తారానాథ్. ఈ ఋగ్వేద మంత్రానికి హెచ్.ఎస్. విల్సన్ సరైన అర్థం చెప్పగలిగాడు.
ఈ పదం ఖగోళ విషయానికి సంబంధించినది అయి ఉండవచ్చును అని వ్రాశారు. తన వాదానికి మరింత బలం చేకూర్చుకునేందుకు ప్రొఫెసర్ ఝా మనుస్మృతి కూడా వాడుకున్నాడు. మనుస్మృతిలో లేని, తరువాత కాలంలో కల్పితమైన కొన్ని శ్లోకాలు ఉదహరించాడు. నిజానికి మనుస్మృతి లోని ఐదవ అధ్యాయంలో 45 నుండి 54 శ్లోకం వరకు పశువధను ఖండిస్తూ అనేక విషయాలు ఉన్నాయి.
పశువులను చంపేందుకు, మాంసం విక్రయించేందుకు, ఇందుకోసం పశువులకు కొనేవారు ఇలా ఎనిమిది రకాల వ్యక్తులు మహాపాపులని మనుస్మృతి స్పష్టం చేసింది. ఋగ్వేదంలోని 36/8 మంత్రం ఇలా చెపుతుంది - “మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్ష నామ్। మిత్రస్యాహమ్ చక్షుషా సర్వాణి భూతాని సమీక్ష! మిత్రస్య చక్షుషా సమీక్షా మహే?" అంటే అన్ని ప్రాణులు నన్ను మిత్రునిలా చూడాలి. నేను కూడా వాటిని మిత్రులుగా భావించాలి. పరస్పరం మిత్ర భావనతో మెలగాలి. గో శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అవి 1) గోమాత, 2) భూమిని వ్యవసాయ యోగ్యం చేయడం, 3) ఆవు పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి.
ప్రముఖ వేదపండితులు యుధిష్ఠిర మీమాంసక్ వేదాల్లో గోశబ్దానికి 47 అర్థాలున్నాయని చెప్పారు. ఆర్థర్ కీత్, మెక్డొనాల్డ్ కూడా వేద పరిభాష అనే గ్రంథంలో 'వేదాల్లో 'గో' అనే శబ్దం ఆవుపాలు, పెరుగు తదితర ఉత్పత్తులను తెలిపేందుకే ఎక్కువగా ఉపయోగించారు' అని వ్రాశారు. ఇలా ఎక్కడ గో శబ్ద వచ్చిందో అక్కడ గో ఉత్పత్తులనే అర్థం చేసుకోవాలి. అలాగే పశు శబ్ద అర్థం అన్నానికి సంబంధించినదిగా తీసుకోవాలి. అధర్వణ వేదం (18-4-32) ప్రకారం ధాన్యమే గోవు, తిలలే దూడలు. మేథ్ అనే పదం యజ్ఞార్థంలో ఉపయోగించారు. కానీ దానిని సంహరించుట అనే అర్థం చెప్పుకుని గోమేగ్, అశ్వమేథ్, నరమేథ్ అని యజ్ఞంలో హింస జరుగుతుందని భ్రమ కల్పించారు. వేదాల్లో అశ్వమేథం గురించి తప్ప ఇతర యజ్ఞాల గురించి వర్ణించలేను.
నిరుక్తం (1-8 సూత్రం) ప్రకారం 'అధ్వర్ అంటే 'హింస రహిత కార్యము అని అర్థం. అన్ని వేదాలలో పలుచోట్ల యజ్ఞం అనే పదానికి పర్యాయపదం అధ్వర్ పదాన్ని వాడారు. అలాంటప్పుడు యజ్ఞంలో హింసకు/బలికి తావెక్కడ ప్రముఖ చరిత్రకారుడు డా||రాధాకుముద్ ముఖర్జీ 'ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా' అన్న గ్రంథంలో "వైదిక మతంలో ఎక్కడా యజ్ఞం పేరుతో బలిని, హింసను ప్రోత్సహించలేదు. యజ్ఞం వద్ద బలి అంటే హింస కాదు ఆత్మబలిదానం ” అని అన్నారు.
ఈ దేశంలో ఆవులను కేవలం జంతువులుగా పరిగణించలేదు. ఆవును తల్లిగా, సకల దేవతలకు నిలయంగా భావించి, పూజించారు. గోపూజను పుణ్య కార్యంగా భావించారు. గోవులను కలిగి ఉండడాన్ని 'గోసంపద గా గుర్తించారు. రాజు వద్ద ఎన్ని గోవులుంటే అంత ధనవంతునిగా గుర్తించేవారు.
ఒక వ్యక్తి సంప్రదాయం ఈ దేశంలో అనాదిగా ఉంది. గోసేవ ఆర్థిక ఆదాయంతో ముడిపెట్టి చూడలేదు. మహాభారతంలో విరాట మహారాజు గోసంపదను కౌరవులు అక్రమంగా తరలించుకుపోవడంతో, విరాట మహారాజు తరఫున అర్జునుడు కౌరవులను ఓడించి, ఆ పశు సంపదను సురక్షితంగా తిరిగి విరాట మహారాజుకు అప్పగించిన సంఘటన మనం ఎరిగినదే. ఇలాంటి సంఘటనలు మన చరిత్రలో ఎన్నెన్నో.... కనుక భ్రమలు తొలగించుకొని గో సంరక్షణ కై పూనుకోవాలని మనవి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments