Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గోమాత గురించి బౌద్ధ, జైన, సిఖ్, క్రైస్తవ, ముస్లిం మతాలు ఏమి చెబుతున్నాయి. About Cow in Buddhism, Jainism, Sikhism, Christianity and Islam

మీకు తల్లిదండ్రులు, సోదరీ సోదరులు, ఇతర బంధుగణం ఎంత సన్నిహితమైన వారో ఆవు కూడా అంత దగ్గరది, మన శ్రేయస్సు కోరుకునే ఆవు అన్నాన్ని...


మీకు తల్లిదండ్రులు, సోదరీ సోదరులు, ఇతర బంధుగణం ఎంత సన్నిహితమైన వారో ఆవు కూడా అంత దగ్గరది, మన శ్రేయస్సు కోరుకునే ఆవు అన్నాన్ని, బలరూప సుఖాన్ని ఇస్తుంది. అటువంటి ఆవును చంపతగదు అని గౌతమ బుద్ధుడు అన్నారు (బ్రాహ్మణ ధమ్మిక సుత్తము)
అహింసా పరమో ధర్మ అనేది జైన మతం మూల సూత్రం. జైన గ్రంథాలలో గో సముదాయాన్ని 'వ్రజ' లేదా 'గోకుల్' అని పేర్కొన్నారు. ఆవును కామధేనువు గా వర్ణించారు. ఆవు అహింసకు మారుపేరని మహావీరుడు బోధించాడు.
క్రైస్తవ మతం కూడా గోవధను నిరసించింది. గోసంతతిని వధించినవాడు నరహంతకుడితో సమానం అని అసయ్య (60/3) పేర్కొంది ముస్లింలు గ్రంథమైన ఖురాన్ కూడా గోవధను ఖండించింది. పచ్చని చెట్టును కొట్టేవాడు, పరాయి స్త్రీలను లోబరుచుకోవాలనుకునేవాడు, ఆవును చంపేవాడు, మద్యం సేవించేవాడు భగవంతుని అనుగ్రహం పొందలేడు. అలాంటి వాడిని భగవంతుడు ఎప్పుడూ క్షమించడు (ఖురాన్- సుర్-ఎ-హజ్).
సిఖ్ పంథా గోవధను తీవ్రంగా వ్యతిరేకించింది. గురుగోవిందసింహుడు దశమ గ్రంథంలో ఇలా వ్రాశాడు - గోవధ వలన ఈ లోకానికి కలిగే నష్టాన్ని తప్పించు ఓ!దేవా! గోవుల కష్టాలు తీరి సర్వత్రా సుఖశాంతులు వర్ధిల్లే విధంగా దీవనలు అందించు. & మహారాజా రంజిత్ సింగ్ రాజ్యంలో గోవధ నిషేధం అమలులో ఉండేది.
పుణ్యభూమి భారతంలో ప్రాచీన కాలం నుంచి గోవధ జరగలేదు. గోవు ప్రాముఖ్యత, ప్రాధాన్యతను తెలియచెప్పే అనేక శాసనాలు అయోధ్య, కోశాంబి ఉజ్జయిని, శాతవాహన, పల్లవ రాజ్యాధిపతులు ఏర్పాటు చేశారు. నాణాలపై గోముద్రలను వేయించారు. జహంగీర్, బాబర్, అక్బర్, తదితర ముస్లిం రాజులు కూడా గోవధను నిషేధించారు. ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశంలో అడుగుపెట్టిన తరువాత తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు హిందూ సంస్కృతి, ఆచారాలపై దాడి మొదలు పెట్టారు. అందులో భాగంగా అనేక అసత్యపు సిద్ధాంతాలు, వాదనల్ని ప్రచారం చేశారు.
విద్యావ్యవస్థను సమూలంగా మార్చేశారు. ప్రాచీన భారతంలో ఆర్యులు గోమాంసాన్ని తినేవారని, యజ్ఞాల్లో గోమాంసం ఆహుతిగా సమర్పించేవారని ప్రచారం చేశారు. ఆంగ్లేయుల ఈ కుట్రను మొట్టమొదటిసారిగా స్వామి దయానంద సరస్వతి బయట పెట్టారు. వేదకాలంలో గోవధను నిషేధించడమేకాక, అందుకు పాల్పడినవారికి మరణదండన విధించేవారని తన 'సత్యార్థ ప్రకాశన్'లో వ్రాశారు. అందుకు వేద మంత్రాలనే ఆధారంగా చూపారు. గోవు ప్రాముఖ్యతను తెలియచెపుతూ స్వామి దయానంద గో కరుణానిధి అనే పుస్తకాన్ని రాశారు అందులో.
శుభాలు కలిగించే గోవు, తదితర పశుపక్ష్యాదులు చంపి కడుపు నింపుకో వారు ప్రపంచానికే నష్టం చేస్తున్నారు. ఇలాంటి వారిని మించిన ద్రోహులు, విశ్వాసఘాతకులు, పాములు ఇంకెవరైనా ఉంటారా? గోవధ ఎక్కడ జరుగుతుందో ఆ రాజ్యం, ప్రజలు పూర్తిగా నాశనమవుతారు అని వ్రాశారు. ఆ పుస్తకంలోనే ఆవు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను కూడా స్వామి దయానంద ప్రస్తావించారు. ఒక ఆవు వల్ల 1980 మందికి పుష్కలంగా పాలు అందుతాయి. కాని ఒక ఆవును చంపితే కేవలం 80 మందికి మాత్రమే మాంసం లభిస్తుంది. కనుక కొందరి కోసం ఎంతో మందికి మేలు చేసే ఆవులను చంపడం ఎంత ఘోరం ఎంత పాపం.. అని ఆయన ప్రశ్నించారు. దయానంద స్ఫూర్తితో అనేక గ్రామాల్లో గో కృష్ణాది రక్షిణి సభలు వెలిశాయి. దేశవ్యాప్తంగా సంతకాలు సేకరించి విక్టోరియా రాణికి పిటిషన్ పంపారు. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో దేశం మొత్తంలో వేలాది గోశాలల్ని ఏర్పాటు చేశారు. గోవధ నిషేధం కోసం ఉద్యమాలు చేశారు.
లోకమాన్య బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వామి దయానంద, పండిత మదనమోహన మాలవ్యా, రాజర్షి పురుషోత్తమ దాస్ టాండన్, జమ్నాలాల్ బజాజ్, లాలాహరదేవ సహాయ్, ప్రభుదత్త. బ్రహ్మచారి తదితరులు గోరక్షకై ఎంతో కృషి చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు లాలాలజపతిరాయ్ ఇలా అన్నారు -గోరక్ష ఈ దేశంలోని ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం. ఆవు పాలు, నెయ్యి ద్వారానే భారతీయుల జీవనం సాగుతుంది. మరొక జాతీయ నేత మదన్మోహన్ మాలవ్య గోరక్షలోనే ఈ దేశ రక్షణ ఉంది అన్నారు.
చట్టం ద్వారా గోవధను నిషేధించాలని కోరుతూ వినోబాభావే- వ్యవసాయ ప్రధాన మైన మనదేశంలో గోసంతతిని వధించడంపై పూర్తి నిషేధం విధించాలి. గోవధ మాతృహత్యతో సమానం. దేశం మొత్తంలో అమలయ్యే విధంగా గోవధను నిషేధిస్తూ కేంద్రం చట్టం చేయాలి. గోమాంస విక్రయాన్ని పూర్తిగా అడ్డుకోవాలి అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వితీయ సరసంఘచాలక్ మాననీయ శ్రీ గురూజీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా గోవధ నిషేధం గురించి ఎలాంటి చట్టాలు చేయకపోవడం దురదృష్టకరం. గోవధ మన సంస్కృతీ సంప్రదాయాలపై జరుగుతున్న దాడిగా గుర్తించకపోవడం విచారం అని అన్నారు. (శ్రీ గురూజీ సమగ్ర గ్రంథావళి) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు హకీం అజ్మల్ ఖాన్ ముస్లింలు గోవధకు పాల్పడకూడదన్నారు. 'ఖురాన్ కానీ, అరబ్ దేశంలో పాటించే నియమ నిబంధనలు కానీ గోవధను అంగీకరించవు అని అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గోవధను నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా వ్యక్తమైన ప్రబలమైన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని 1948లో ప్రభుత్వం పశు సంరక్షణ, సంవర్ధన కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. మన దేశంలో సంపూర్ణ గోవధ నిషేధాన్ని ప్రజానీకం కోరుకుంటోంది. ఇందుకు అవసరమైన చట్టాన్ని వెంటనే రూపొందించాలి అని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సులు దృష్టిలో పెట్టుకుని 24 నవంబర్, 1948 న రాజ్యాంగ సం, సంపూర్ణ గోవధ నిషేధాన్ని విధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించింది. ఇందులో గోవధ నిషేధానికి మద్దతుగా రాకూర్ దాస్ భార్గవ్, సేర్ గోవిందదాస్, మహావీర్ త్యాగి, రా॥ రఘువీర్, గ్యద్ మహ్మద్ తదితరులు గట్టిగా వాదించారు. రాజ్యాంగ అధికరణం 38(3) ప్రకారం గోవధ నిషేధానికి చట్టాన్ని ఏర్పాటు చేయాలంటూ ఠాకూర్ దాన్ భార్గవ్ ఇలా అన్నారు - భారతదేశంలో వ్యవసాయాభివృద్ధి, పేదరిక నిర్మూలనలకు గోరక్ష ఏకైక మార్గం. వ్యవసాయాధార దేశంలో ఆవు కామధేనువు వంటిది. అందుకే గోవధపై సంపూర్ణ నిషేధం విధించాలి.
ఆవు మూత్రం, పేడల విలువ గో నిర్వహణ ఖర్చు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని నేను నిరూపించగలరు. గోసంతతి అంటే అందులో ఆవు, ఎద్దు, ఆంబోతులు అన్నీ కలిసే ఉంటాయని సేర్ గోవిందదాస్ స్పష్టం చేశారు. రాజ్యాంగ సభలో మాట్లాడుతూ - సమాజంలో ధార్మిక వ్యక్తి చులకన భావంతో చూసేవారంటే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు.
ఈ ప్రపంచంలో ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకోవడం అవివేకం. ధర్మానికి నాశనం లేదు. ఆవు ధార్మిక చిహ్నమే కాదు ఆర్ధిక, సాంస్కృతిక మూలకేంద్రం కూడా. మతపరంగా వేరైనా సాంస్కృతికంగా ఒకటిగా జీవించే జాతిగా మనం మెలగాలని నేను ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు‌. గోవధను పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే గోహత్య బ్రాహ్మణ హత్యతో సమానం. ఇది ఋషి హత్య, విజ్ఞానపు హత్య. ఆవు మన జాతికి తల్లి వంటిది అని అన్నారు డా॥ రఘువీర్ ఇలా రాజ్యాంగ సభలో ఎక్కువమంది సభ్యులు గోవధను వ్యతిరేకించారు‌.
మతాలకు అతీతంగా నిషేధం విధించాలని వాదించారు. కానీ జవహర్ లాల్ నెహ్రూతోపాటు మరికొంతమంది సెక్యులర్ వాదులు మాత్రం గోవధ నిషేధంపై చట్టాన్ని చేసేందుకు అంగీకరించలేదు. ఈ అంశాన్ని రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాలు చేర్చడానికి బదులు మార్గదర్శక సూత్రాలు పేర్కొంటే చాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఈ అంశానికి చట్టబద్ధత లేకుండా పోయింది. ఈ విషయంపై మాట్లాడుతూ మైనారిటీ కమిషన్ మాజీ అధ్యక్షుడు డా॥తాహిర్ మహ్మద్ ఇలా అన్నారు -రాజ్యాంగ సభలో ముస్లిం సభ్యులు అందరూ సంపూర్ణ గోవధ నిషేధానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. హిందువుల మతవిశ్వాసాలను గౌరవిస్తూ తాము ఇందుకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు (హిందూస్తాన్ టైమ్స్ - 22 ఆగష్టు, 2003).
బక్రీద్ సందర్భంగా గోవధ చేయడం ముస్లిముల కర్తవ్యమంటూ దాఖలైన పిటిషన్ ను 1994లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. బక్రీద్ నాడు గోవధను అనుమతించరాదన్న పిటిషన్ పై కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. బక్రీద్ కు గోవధకు సంబంధం లేదు. ఆనాడే కాదు ఎప్పుడైనా గోవధను నిషేధించడం రాజ్యాంగంలోని 25(1) అధికారం పేర్కొన్న మత స్వేచ్ఛను అడ్డుకోవడం కాదు. గోవధ చేయడం తమ మత విశ్వాసాలకు సంబంధించిన అంశమని ముస్లిములు వాదించేందుకు తగిన ఆధారాలేవీ కనిపించడం లేదు (పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అశుతోష్ లహరి తదితరులు, సివిల్ అప్పీల్ 6790/1983).
ప్రసిద్ధ ఉర్దూ కవి అక్బర్ ఇలహాబాదీ ఇలా వ్రాశారు - మెహతర్ యహీ హై, ఫేర్ లే ఆంఖోకో గాయ్ సే క్యా రఖా హై రోజ్ కీ ఇస్ హాయ్ హాయ్ సే (అనవసరమైన ఈ వాదాలు ఎందుకు? ఆవు గురించి ప్రస్తావించడం ఇప్పటికైనా (ముస్లిములు) మానుకంటే మంచిది). జాతీయ కవి మైథిలీ శరణ్ గుప్త ఆవు చూపే కరుణ, దయ గురించి తన భారత భారతి కావ్యంలో విస్తారంగా వర్ణించారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments