ధర్మస్థలం పవిత్రతను కాపాడుకుందాం, ఇది హిందువులందరి కర్తవ్యం:
భారతదేశం అనేది కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, ఇది వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది. ప్రతి పుణ్యక్షేత్రం, ప్రతి పీఠం మన హిందూ సంప్రదాయాలకు మూలాధారంగా ఉంటుంది. దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కాదు – అవి మన భక్తి, మన సంస్కృతి, మన ధర్మానికి ప్రతీకలు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ పవిత్ర క్షేత్రాలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయి.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం: భక్తుల విశ్వాసానికి నిలయమైన ఈ ఆలయం పవిత్రతను దెబ్బతీయడానికి పలు సందర్భాల్లో ప్రయత్నాలు జరిగాయి. కొందరు తప్పుడు ప్రచారం ద్వారా, మరికొందరు పరిపాలనా విధానాల ద్వారా ఈ ఆలయ పవిత్రతను దెబ్బతీయాలని చూశారు.
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం: శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను మార్చడానికి కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. అయ్యప్ప స్వామి భక్తుల విశ్వాసాన్ని లెక్కచేయకుండా, సంప్రదాయ విరుద్ధ చర్యలను రుద్దే ప్రయత్నాలు చూశాం.
కంచి పీఠం: భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన కంచి పీఠంపైనా దాడులు జరిగాయి. అబద్ధపు ఆరోపణలు, అపవాదుల ద్వారా పీఠాధిపతులను కించపరిచే ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ జరిగాయి. ఈ దాడుల వెనుక ఒకే ఉద్దేశం ఉంది – హిందువుల విశ్వాసాలను కించపరచడం, పవిత్రతను మసకబార్చడం.
అలాగే ధర్మస్థలంపై కూడా కుట్రలు పన్నుతున్నారనిపిస్తుంది:
ధర్మస్థలం గురించి క్లుప్తంగా: ధర్మస్థలం కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఇది శివయ్య దేవాలయం. మంజునాథ క్షేత్రం. అర్జున్ నటించిన సినిమా శ్రీ మాంజునాథ సినిమా ఈ దేవాలయానికి సంభందించినదే.....
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రాంతంలో 1998 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మంది మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి, సామూహిక ఖననం చేసినట్లు జూలై 3న తన న్యాయవాదుల ద్వారా పోలీసులను ఆశ్రయించిన మాజీ పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదుతో తొలుత దర్యాప్తు ప్రారంభమైంది. 1995 నుండి 2014 మధ్య ధర్మస్థల ఆలయ పరిపాలన కోసం పనిచేస్తున్నప్పుడు, అనేక మృతదేహాలను ఖననం చేయవలసి వచ్చిందని, వాటిలో కొన్ని లైంగిక హింసకు సంబంధించిన సంకేతాలను కలిగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. దాదాపు దశాబ్దం క్రితం తాను అపరాధ భావనతో. ఆ ప్రాంతం నుండి పారిపోయానని, ఇటీవలే తిరిగి వచ్చానని అతను చెప్పాడు.
ఫిర్యాదు చేసిన వారం తర్వాత, తన ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు సాక్ష్యం చెప్పడానికి తల నుండి కాలి వరకు వస్త్రం కప్పుకుని కోర్టుకు హాజరయ్యాడు. నిందితులు ఆలయ పరిపాలనతో సంబంధం ఉన్న ప్రభావవంతమైన వ్యక్తులని అతను పేర్కొన్నాడు. శరీరాన్ని డీజిల్ తో కాల్చమని తనకు సూచించారని చెప్పారు. తడి మట్టి కారణంగా మృతదేహాలు గుర్తించకుండా, త్వరగా కుళ్ళిపోటానికి నేత్రావతి నది ఒడ్డున కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టమని తనను ఆదేశించినట్లు వెల్లడించారు. అలా చేయకపోతే చంపేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించారు. తన కుటుంబంలోని మైనర్ బాలికపై తన సూపర్‌వైజర్లతో సంబంధం ఉన్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన తర్వాత 2014 డిసెంబర్‌లో ధర్మస్థల నుండి పారిపోయానని ఆయన చెప్పారు. పారిపోయిన తర్వాత, అతను చాలా సంవత్సరాలు పొరుగు రాష్ట్రాల్లో దాక్కున్నాడు. ఇప్పుడు ఇలా ప్రత్యక్షమై చేసిన తప్పును ఒప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
ఈ సంఘటనలపై సమగ్రంగా విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. కేసుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడం, మృతదేహాల ఆవశేషాల విశ్లేషణ, డిఎన్ఏ పరీక్షలు వంటి అంశాలు ఇందులో భాగం కానున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే, ఇది కర్ణాటకలో ఇప్పటి వరకు వెలుగుచూసిన అత్యంత భీకరమైన మానవ హత్యల కేసుగా నిలవనుంది. వందలాది మహిళలు గల్లంతయ్యారన్న వార్తలు స్థానికులను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ఇప్పటివరకు పోలీసులకు తెలియనిది, ఇన్నేళ్ల తర్వాత బయటపడుతుండటం కూడా చర్చనీయాంశమైంది.
అయితే గత 40 రోజులుగా సిట్ సమగ్రమైన దర్యాప్తు జరిపించింది. ఇప్పటి వరకు అతను చెప్పినట్లుగా 18 చోట్ల 10 అడుగుల లోటు తొవ్వగా ఎక్కడ మానవ అస్తి పంజరాలు లభించలేదు. కేవలం కొన్ని జంతువుల అస్తి పంజరాలు లభించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే తాజాగా మాజీ పారిశుధ్య కార్మికుడు తనను ఇలా చేయమని 2023 నుండి కొంత మంది బెదిరించినట్లుగా చెప్పారని.. ఒక పుర్రె ని తనకిచ్చి ఒకచోట పెట్టమన్నారని చెప్పాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఈలోపల పనిగట్టుకుని హిందువుల శతాబ్దాల భక్తిని, సంప్రదాయాలను, ఆచారాలను చెరిపివేయాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ఇది కేవలం ఒక దేవాలయంపై దాడి కాదు. ఇది మన హిందూ ధర్మం మీద, మన ఆధ్యాత్మిక మూల్యాల మీద నేరుగా జరిగే యుద్ధం.
ధర్మస్థలం కేవలం ఒక ఆలయం కాదు, ఇది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. దీని పవిత్రతను దెబ్బతీయాలని చేసే ప్రయత్నం అనేది లక్షలాది భక్తుల హృదయాలను గాయపరచడమే. ఇలాంటి సందర్భంలో ప్రతి హిందువు తన బాధ్యతను గుర్తుంచుకోవాలి. పుణ్యక్షేత్రాలను రక్షించడం మనందరి ధర్మం. హిందూ ఐక్యతే ఈ కుట్రలకు సరైన సమాధానం. భక్తి, ఆచారం, ధర్మపరమైన అవగాహనను పెంచుకోవాలి. పవిత్ర క్షేత్రాల మహాత్మ్యం గురించి కొత్త తరాలకు తెలియజేయాలి. ప్రతి ఒక్క హిందువు తన భక్తిని కేవలం మనసులోనే కాకుండా, కార్యరూపంలో చూపినప్పుడే ధర్మం నిలుస్తుంది. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds
జయ్ హిందూ రాష్ట్ర ✊
ReplyDelete