Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రాంజీ గోండ్ స్వాతంత్ర్య సమర జ్వాల - ramji gond history in telugu

స్వాభిమాని, అంతకు మించి గొప్ప దేశాభిమాని మన రాంజీగోండ్. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియదు కాని నేటి నిర్మల్ జిల్లాను ఆనాడే పోరాటాల ఖ...

స్వాభిమాని, అంతకు మించి గొప్ప దేశాభిమాని మన రాంజీగోండ్. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియదు కాని నేటి నిర్మల్ జిల్లాను ఆనాడే పోరాటాల ఖిల్లాగా మార్చాడు. అవి స్వాతంత్ర్య సమర రోజులు నింగినంటుకున్న సమరజ్వాలలు. 1857 మొదటి స్వాతంత్ర్య సమర జ్వాలలు దేశాన్ని చుట్టుముట్టిన రోజులవి. బ్రిటిష్ సామ్రాజ్య అడుగులకు మడుగులొత్తుతున్న నిజాం నవాబు పాలనలో ఉంది నిర్మల్ ప్రాంతం. గిరిజన వీరుడు గోండు తెగకు చెందిన ఒక సాధారణవ్యక్తి అసాధారణ వ్వక్తిగా అందునా సమర యోధుడుగా ఎదుగుతాడని అప్పటి చరిత్రకారులు ఊహించి ఉండరు. పైగా పోరుకు నాయకత్వం వహిస్తాడని అసలు ఊహించరు. ఆ అసాధారణ నాయకుడు విప్లవజ్యోతి మన రాంజీ గోండు.
కొంత చారిత్రక నేపథ్యం లోకి వెళ్తే 1830 ప్రాంతంలో ఇప్పటి సిర్పూర్ ప్రాంతం మహారాష్ట్ర నాగపూర్ పాలించిన రెండో రాంజీ భోంస్లే చేతిలో ఉండేది. బ్రిటిష్ రాజకీయ ఎత్తులో సిర్పూర్ ప్రాంతాన్ని ఒక ఒప్పందం ప్రకారం నిజాం వదులుకున్నాడు. భోంస్లే, దీన్ని అదనుగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం నిర్మల్లో తన అధీనంలో ఉండే ఒకరిని కలెక్టరుగా నియమించింది. అప్పటినుంచి నిర్మల్ పాలనా కేంద్రంగా మారింది.
ఈ సమయంలో మహారాష్ట్రకు చెందిన రావు సాహెబ్ పీష్వా నిర్మల్ సమీపంలోని గోదావరి నదీతీరంలో శిబిరం ఏర్పాటు చేసి బ్రిటిష్ వ్యతిరేక భావాలు రగిల్చాడు. దీంతో రోహిల్లాలు తిరుగుబాటు లేవనెత్తారు. ఇదే సరైన సమయంగా ఎంచుకున్న రాంజీ వారికి నాయకత్వం వహించాడు. 1860 ప్రాంతంలో ఏప్రిల్ 9న అప్పటి నిర్మల్ కలెక్టరు పై తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటులో సుమారు 300 మంది గోండులు 200 మంది రోహిల్లాలు ఉన్నారు. దురదృష్ట వశాత్తూ రాంజీ నాయకత్వం వహించిన ఈ తిరుగుబాటుదారులు ఓడిపోయారు. అయినా రాంజీగోండ్ పట్టువదలలేదు. మరోసారి సుమారు వెయ్యి మందితో నిర్మల్ ప్రాంతం పై దాడి చేశాడు. హెూరాహెూరీగా జరిగిన ఈ పోరాటంలో ఇరువర్గాలకు పెద్దనష్టమే జరిగింది.
తిరుగుబాటు దారులు బ్రిటీష్ సైన్యానికి చిక్కారు. చిక్కినవారికి కఠిన కారాగార శిక్షలు విధించారు. చాలామందికి ఉరిశిక్షలు పడ్డాయి. విధి వక్రీకరించింది. తిరుగుబాటుకోనం మరో వ్యూహరచనలో ఉన్న రాంజీగోండ్ బ్రిటీష్ ప్రభుత్వానికి చిక్కాడు. ఇక ఏమాత్రం అలస్యం చేయకుండా బ్రిటీష్ ప్రభుత్వం రాంజీగోండ్ ను నిర్మల్ పట్టణానికి సమీపంలో ఉన్న మర్రిచెట్టుకు ఉరితీసింది. ఆ పెద్ద మర్రి చెట్టుకు ఒకేసారి వేయిమంది గోండువీరులను ఉరి తీశారు. మొన్నమొన్నటి వరకు బ్రతికివున్న ఆ మర్రిని వేయి ఉరుల మర్రి అని పిలిచేవారు. ఆ తరువాత జరిగిన స్వాతంత్ర్య సమరపోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాడు రాంజీ గోండ్.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia



జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

1 comment