బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2025లో చరిత్ర సృష్టించాయి. నవంబర్ 6, 11 తేదీల్లో జరిగిన పోలింగ్ తర్వాత నవంబర్ 14న లెక్కింపులో NDA (భారతీయ జనతా పార్టీ, జనతా దళ్ యునైటెడ్, ఇతర మిత్రపక్షాలు) 200 సీట్ల మార్కును దాటి ఘన విజయం సాధించింది. మహాగఠ్బంధన్ (RJD, కాంగ్రెస్, వామపక్షాలు) పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టబడి, బీహార్ ప్రజలు అవినీతి, కుటుంబ రాజకీయాలపై స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
జంగిల్ రాజ్‌కు ప్రజలు చెక్ పెట్టి, అవినీతి పాలనకు ముగింపు పలికారు: ఒకప్పుడు బీహార్ అంటే జంగిల్ రాజ్, అవినీతి, కుటుంబ పాలన అనే మచ్చ ఉండేది. RJD హయాంలో ఫోడర్ స్కామ్, భూకుంభకోణాలు, నియామక అవినీతి రాష్ట్రాన్ని దెబ్బతీశాయి. తేజస్వీ యాదవ్‌పై కూడా IRCTC భూ కుంభకోణం, బెనామీ ఆస్తుల కేసులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా 2G, కోల్‌గేట్, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లతో ముడిపడిన ఈ చిత్రం బీహార్ ప్రజల్ని మరింత చైతన్యం వైపు మరల్చింది. ఈసారి కాంగ్రెస్ ఒకే అంకెల్లో సీట్లు దక్కించుకోవడం ప్రజలు కాంగ్రెస్ పై వున్న నిరసనను తెలియజేస్తుంది.
NDA నిజాయితీ, అభివృద్ధి, స్థిరత్వానికి ప్రజల మద్దతు: నరేంద్ర మోడీ నాయకత్వంలో NDA గత దశాబ్దంగా జీరో టాలరెన్స్ టు కరప్షన్ విధానాన్ని అమలు చేస్తోంది. నితీష్ కుమార్ మచ్చలేని పరిపాలన, అభివృద్ధి, విద్యుత్, రోడ్లు, నీటి పథకాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు బీహార్‌ను పూర్తిగా మారుస్తున్నాయి. ఈ తేడాను ప్రజలు గుర్తించి NDAకి భారీ మెజారిటీ ఇచ్చారు.
హిందుత్వ, జాతీయత ఎన్నికలలో కీలక ప్రభావం: 2025 ఎన్నికల్లో హిందుత్వ అజెండా కూడా ప్రధాన పాత్ర పోషించింది. రామ మందిరం, యూనిఫాం సివిల్ కోడ్, సీఏఏ వంటి అంశాలు ప్రజల్లో మద్దతు తెచ్చాయి. లాలూ యాదవ్ హయాంలో జరిగిన మత కలహాలు ప్రజలను బాధపరిచిన నేపథ్యంలో, మోడీ–నితీష్ పరిపాలనలో స్థిరత్వం, శాంతి నెలకొనడం NDAకి బలాన్నిచ్చింది.
మోడీ ప్రభుత్వ జాతీయ ప్రాభావం, బీహార్ ఓటులో కనిపించిన ప్రతిఫలం: ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, ఉజ్వల, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరాయి. త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ స్ట్రైక్ వంటి నిర్ణయాలు జాతీయ భద్రతపై ప్రజల నమ్మకాన్ని పెంచాయి. భారతదేశం అంతర్జాతీయ వేదికపై ఎదిగిన తీరు మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేసింది.
మహిళలు, యువత – NDA విజయానికి ప్రధాన బలం: ఈ ఎన్నికల్లో మహిళల పోలింగ్ రేటు 71.78% నమోదైంది. ఇది బీహార్ రాజకీయ చరిత్రలోనే రికార్డు. నితీష్, మోడీ ప్రభుత్వాలు మహిళల కోసం తీసుకున్న చర్యలు వారికి నేరుగా చేరాయి. యువత కూడా ఉద్యోగ హామీలపై కాకుండా నిజాయితీ పరిపాలనకు ఓటు వేసింది. తేజస్వీ ఇచ్చిన ఉద్యోగ హామీలు వాస్తవ ప్రమాణాలను అందుకోలేకపోయాయి.
ప్రశాంత్ కిషోర్ హైప్ అటకెక్కింది, క్షేత్ర స్థాయి నేతలను మాత్రమే ప్రజలు ఆమోదించారు: జన సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ప్రజలు హైప్ కన్నా, అనుభవం, స్థిరత్వం, అభివృద్ధినే కోరుకుంటున్నారని నిర్ధారించింది.
బీహార్ తీర్పు దేశానికి రాజకీయలకు ఒక స్పష్టమైన సంకేతం: 2024 లోక్‌సభ విజయానికి కొనసాగింపుగా బీహార్ ఫలితం మోడీజీ నాయకత్వం ఇంకా బలంగా ఉందని నిరూపించింది. అవినీతి, కుల రాజకీయాలు ఓడిపోయాయి; అభివృద్ధి, జాతీయత గెలిచాయి. ముఖ్యంగా బీహార్ ప్రజలు ఇంతలా చైతన్యం కలిగి భాజాపాను గెలిపించడానికి మరొక కారణం వుంది, బీహార్ నుండి కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుండి ఒక సైనికుడు ఉన్నాడు. దేశ సరిహద్దులో జరిగే ప్రతి విషయం సైనికుల ద్వారా తల్లిదండ్రులకు చేరుతుంది. గత పదేళ్లలో సైన్యానికి, దేశ సరిహద్దుల భద్రత పై మోడీజీ నిబద్ధత ప్రతి ఇంటికీ వాళ్ల బిడ్డల ద్వారా తెలిసింది.
డేంజర్ బెల్స్: అందరూ బీహార్ ఫలితాల పై గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే బీహార్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఒక సన్నని చెకెన్ నెక్ మార్గం వైపు ఉన్న 7 నియోజక వర్గాల్లో 5 AIMIM, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అలాగే Thakurganj నియోజకవర్గం మాత్రం JDU గెల్చుకున్నప్పటికీ ముస్లిం ప్రభావితం ఉన్న ప్రాంతం. ఈ నియోజకవర్గాలలో BJP, JDU ఇకముందు కూడా ఎప్పటికీ గెలవనంతగా ముస్లింల ఓట్లు పెరిగాయి. మనకు భద్రత, ఈశాన్య రాష్ట్రాలకు మార్గం దృష్ట్యా చాలా కీలక ప్రాంతం. అలాగే బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ముస్లిం ఓట్లు గణనీయంగా పెరిగాయి.
బీహార్ భవిష్యత్తు వెలుగులు: NDA కూటమి నుండి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ద్వారా బీహార్ మళ్లీ డబుల్ ఇంజిన్ సర్కార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువతకు ఉద్యోగాలు, మహిళలకు భద్రత, ప్రజలందరికీ సమాన అవకాశాలతో బీహార్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. నావరకైతే ఈసారి యువనేతకు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే మరింత వేంగంగా బీహార్ అభివృద్ధిలో దూసుకుపోగలదు. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds


