ఎంత కష్టమైన ప్రయాణమైనా సరైన దిశ, పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధ్యమే.
అమూర్ ఫాల్కన్ పక్షుల అద్భుత వలస ప్రయాణం — 2025 గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం... తప్పకుండా చదవండి.
అమూర్ ఫాల్కన్లు (Falco amurensis) ప్రపంచంలోనే అతి దీర్ఘ వలసలు చేసే చిన్న రాప్టర్లలో (మాంసాహార పక్షులు) ఒకటి. రష్యా, చైనా ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ లలో దక్షిణాఫ్రికా వరకు 20,000–22,000 కిలోమీటర్ల అద్భుత ప్రయాణం చేస్తాయి. ఈ 150 గ్రాముల చిన్న శరీరం చేస్తోన్న పక్షుల దీర్ఘ వలసలు ప్రకృతిలోని అసమాన సహనానికి చిహ్నం.
ఈ ప్రయాణంలో అతి ప్రమాదకరమైన దశ అరేబియా సముద్రం మీదుగా సుమారు 3,000 కిలోమీటర్ల నాన్-స్టాప్ ఫ్లైట్. అమూర్ ఫాల్కన్లు నీటి మీద ల్యాండ్ చేయలేవు; కాబట్టి ఒకసారి సముద్రం ఎగిరితే, ఒక్క నిమిషం కూడా ఆగకుండా గమ్యం చేరాలి.
2025 నవంబరు 11న మణిపూర్‌లోని చియులువాన్ రూస్టింగ్ సైట్‌లో మూడు అమూర్ ఫాల్కన్లకు సాటిలైట్ ట్యాగ్‌లు అమర్చారు — అడల్ట్ మేల్ అపపాంగ్, యంగ్ ఫిమేల్ అలంగ్, అడల్ట్ ఫిమేల్ అహూ. ఈ ట్రాకింగ్ ప్రాజెక్ట్‌ను వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) మరియు మణిపూర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్నాయి.
ట్యాగింగ్ జరిగిన కొద్ది రోజుల్లోనే అపపాంగ్ అద్భుత వేగం ప్రదర్శించింది. మణిపూర్ నుంచి సెంట్రల్ ఇండియా దాటి అరేబియా సముద్రం అంచు వరకు చేరి, తరువాత 76 గంటల నాన్-స్టాప్ ఫ్లైట్‌లో 3,100 కిలోమీటర్లు ఎగిరింది. ఈస్టర్లీ గాలుల సాయంతో రోజుకు సగటున 1,000 కిలోమీటర్ల దూరం దాటింది. (MegaMindsIndia వెబ్‌సైట్ ని సందర్శించండి.)
నవంబరు 16న అపపాంగ్, అలంగ్, అహూ ముగ్గురూ సముద్రం దాటే 3,000 కిలోమీటర్ల ప్రమాదకర ఓషియానిక్ సెగ్మెంట్‌ను ప్రారంభించారు. ఏ ఆహారం, నీరు లేకుండా, రెక్కలు ఒక్కసారి కూడా ఆపకుండా ఈ ప్రయాణం చేయడం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
నవంబరు 17 నాటికి అపపాంగ్ సోమాలియా తీరం చేరింది. మొత్తం 5,400 కిలోమీటర్లను 5 రోజులు 15 గంటల్లో పూర్తి చేసింది. అడల్ట్ మేల్ కావడం వల్ల ఇది ఇలాంటి క్లిష్ట వలసలను ఇంతకు ముందూ పూర్తి చేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
నవంబరు 18 ఉదయం నాటికి అలంగ్, అహూ కూడా అరేబియా సముద్రాన్ని విజయవంతంగా దాటాయి. ప్రస్తుతం ఈ మూడు పక్షులు ఆఫ్రికా లోతుల్లో ముందుకు సాగుతున్నాయి. వీటి ప్రతి మూవ్‌మెంట్‌ను వేలాది మంది ఆన్‌లైన్‌లో ఉత్కంఠగా ఫాలో అవుతున్నారు.
అమూర్ ఫాల్కన్లు ఎందుకు వలస వెళ్తాయి? చలికాలంలో ఆహార కొరత, కఠిన వాతావరణం, మరియు గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాల కోసం. పరిణామ క్రమంలో ఇటువంటి దీర్ఘ వలసలు చేయగలిగిన పక్షులే ఎక్కువ కాలం బతికి సంతానం పెంచగలిగాయి కాబట్టి మైగ్రేషన్ ఇప్పుడు వాటి DNAలో భాగమైంది.
ఈ పక్షుల వలసలకు ముందుగా నార్త్‌ఈస్ట్‌లో టెర్మైట్ ఎమర్జెన్స్ సమయంలో “హైపర్‌ఫాగియా” అనే ప్రక్రియలో అవి తీవ్రంగా తింటాయి. శరీరంలో కొవ్వు భారీగా నిల్వవుతుంది. అదే కొవ్వు సముద్ర ప్రయాణానికి ఇంధనంగా, అలాగే మెటబాలిక్ వాటర్‌గా మారి శరీరానికి తేమ అందిస్తుంది.
సాటిలైట్ ట్రాకింగ్ కారణంగా అమూర్ ఫాల్కన్ల రూట్లు, స్టాప్‌ఓవర్ సైట్లు, వాతావరణ మార్పుల ప్రభావం, వేట ప్రమాదాలు అన్నీ ఖచ్చితంగా తెలుస్తున్నాయి. ఒకప్పుడు నాగాలాండ్‌లో లక్షల సంఖ్యలో వేటాడబడిన ఈ పక్షులు, ఇప్పుడు “ఫ్రెండ్స్ ఆఫ్ అమూర్ ఫాల్కన్” ప్రయత్నాలతో కాపాడబడి, అక్కడి గ్రామాలు ఫాల్కన్ టూరిజంతో ఆదాయం సంపాదిస్తున్నాయి. ఈ చిన్న పక్షుల ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే — ఎంత కష్టమైన ప్రయాణమైనా సరైన దిశ, సరైన సన్నాహాలతో, పట్టుదల ఉంటే తప్పకుండా సాధ్యమే. రాజశేఖర్ నన్నపనేని. MegaMinds.
MegaMinds Raja, Amur Falcons, Amur Falcon migration, bird migration, longest bird migration, Amur Falcon India, Amur Falcon Nagaland, migratory birds, wildlife conservation, raptor migration, Asia to Africa migration, Amur Falcon journey, bird watching, nature migration marvel, sky warriors birds, transcontinental migration

