జమ్మూ కశ్మీర్ పోలీస్‌ (JKP): దేశ సేవలో త్యాగమయ వీరగాథ Jammu & Kashmir Police (JKP): A Legacy of Sacrifice in Service of the Nation

megaminds
0
Jammu & Kashmir Police

జమ్మూ కశ్మీర్ పోలీస్‌ (JKP): దేశ సేవలో త్యాగమయ వీరగాథ

ప్రస్తుత సందర్భంలో దేశాని గత 78 ఏళ్లగా సేవలందిస్తున్న జమ్ము కాశ్మీర్ పోలీస్ గురించి మననం చేసుకోవడం మన బాధ్యత అని గుర్తు చేయడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందరూ తప్పనిసరిగా పూర్తిగా చదవండి. జమ్మూ కాశ్మీర్ పోలీస్ ని అభినందించకుండా ఉండలేరు.

దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి జమ్మూ కశ్మీర్ పోలీస్‌ భారతదేశానికి ఒక రక్షణ కవచంగా, నిర్భీతికి ప్రతీకగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడిన ఘర్షణ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ పోలీస్ బలగం ఒక అసాధారణ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగం, నిబద్ధతతో పనిచేస్తూ జాతీయ ఏకతను కాపాడింది, కాపాడుతుంది. పాకిస్తాన్‌ ప్రేరేపించిన ఉగ్రవాదం, వేర్పాటువాద హింస, హైబ్రిడ్‌ వార్‌ఫేర్‌ ఏది వచ్చినా జమ్ము కాశ్మీర్ పోలీసులు వెనుకడుగేయలేదు.

త్యాగమయ జీవిత గాథ: 1989లో తిరుగుబాటు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 1,614 మంది పోలీసులు ప్రాణాలు అర్పించారు. వీరిలో వందలాది మంది ఈ పదేళ్లలో అమరులయ్యారు. ఈ వీరులు తమ కుటుంబాలను, జీవితాన్ని త్యజించి దేశానికి రక్షణ కవచంలా నిలిచారు. చాలామంది స్థానిక యువకులే తమ గ్రామాల శాంతికోసం ప్రాణాలర్పించారు. వారి త్యాగాల వలన నేడు కశ్మీర్‌ లోయలో శాంతి సూర్యుడు ఉదయిస్తున్నాడు.

అగ్నిపరీక్షల కాలం: బుర్హాన్ వానీ హతమైన తర్వాత, 2016 నుంచి 2019 వరకూ కశ్మీర్‌ దద్దరిల్లింది. ప్రతిరోజూ రాళ్లదాడులు, పోలీస్‌ స్టేషన్లపై దాడులు, పాకిస్తాన్‌ ప్రేరేపిత అల్లర్లు కానీ JKP నిలువెత్తు శాంతి సైనికుల్లా వ్యవహరించింది మన జమ్మూ కాశ్మీర్ పోలీస్. 2017లో 42 మంది, 2018లో 40కి పైగా అధికారులు అమరులయ్యారు. అయినా వారు పరిస్థితిని అదుపులో ఉంచి, వందలాది ఉగ్రవాదులను నిష్క్రమింపజేశారు.

ఆర్టికల్‌ 370 రద్దు: మార్పు యొక్క మౌన విప్లవం గా దీనిని మార్చారు. ఈ సమయంలో సైనికులతో కలిసి కాశ్మీర్ మొత్తం చైతన్యం తీసుకొచ్చారు. 2019 ఆగస్టు దేశ చరిత్రలో కీలకమైన రోజు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత, హింస చెలరేగుతుందని అంతర్జాతీయ మీడియా ఊహించింది. కానీ JKP తన క్రమశిక్షణతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ లేకున్నా పోలీసులు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆత్మస్థైర్యాన్ని నిలిపారు, అవసరమైన సరఫరాలు అందించారు, పుకార్లను అడ్డుకున్నారు. ఈ మౌన సేవాసహాయలే నూతన జమ్మూ కశ్మీర్‌ ప్రారంభానికి నాంది పలికాయి.

ధైర్య సాహసాలకు దక్కిన జాతీయ గౌరవం: JKP ధైర్యానికి లభించిన గుర్తింపు అద్భుతం. 2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 127 గాలెంట్రీ మెడల్స్, రిపబ్లిక్‌ డే సందర్భంగా మరో 15 పురస్కారాలు అందుకుంది. భారత చరిత్రలో ఏ పోలీస్‌ బలగం ఇంత గౌరవం పొందలేదు. ఒకే ఏడాదిలో అశోక్‌ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర ఈ మూడు అత్యున్నత పీస్‌టైమ్‌ అవార్డులు పొందిన ఏకైక బలగం ఇదే.

ఉగ్రవాదంపై నిర్దాక్షిణ్య పోరాటం: JKP యొక్క స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (SOG) మరియు కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ యూనిట్లు ఉగ్రవాద నిర్మూలనలో ముందంజలో ఉన్నాయి. లష్కరే తోయిబా, జైష్‌-ఇ-మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ఉగ్రసంస్థల ప్రధాన కమాండర్లను సఫలంగా అంతమొందించాయి. ఒకప్పుడు సంవత్సరానికి 100 దాటిన స్థానిక ఉగ్ర నియామకాలు 2025 నాటికి దాదాపు సున్నా.

సేవా సహాయతలో JK పోలీస్ బలం, బలగం: JKP కేవలం భద్రతా బలగం కాదు, సేవా బలగం కూడా. 2014 వరదల్లో వేల మందిని రక్షించిన వీరులు, కోవిడ్‌ కాలంలో మందులు, ఆహారం పంపిణీ చేశారు. అమర్నాథ్‌ యాత్రలో భద్రతా ఏర్పాట్లు flawless‌గా నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

ప్రజలతో అనుబంధం – Civic Action Programme: “సివిక్‌ యాక్షన్‌ ప్రోగ్రామ్‌” ద్వారా JKP పాఠశాలలు, క్రీడా కార్యక్రమాలు, వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉగ్రవాదంతో దహించిపోయిన గ్రామాలు, నేడు ఆ బలగం సహకారంతో అభివృద్ధి కేంద్రాలుగా మారాయి. ప్రజలు పోలీసులనే తమ సొంత బంధువుల్లా స్వీకరిస్తున్నారు.

చరిత్రాత్మక శాంతియుత ఎన్నికలు: 2024–2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, దశాబ్దం తర్వాత జరిగిన ప్రజాస్వామ్య ఉత్సవం. 60% దాటిన ఓటింగ్‌ శాతం, ఉగ్రవాద బెదిరింపులు మధ్యలోనూ ప్రజల విశ్వాసం గెలుచుకున్న JKP గర్వకారణం. జమ్మూ నుంచి లడఖ్‌ వరకు, కశ్మీర్‌ లోయల వరకు ప్రజలు శాంతియుతంగా ఓటేశారు.

ఆధునిక సాంకేతికతతో సన్నద్ధమైన బలగం: డ్రోన్లు, సైబర్‌ ఇంటెలిజెన్స్‌, నైట్‌విజన్‌ పరికరాలతో సుసన్నద్ధమైన JKP  డోడా, కతువా, రీయాసీ ప్రాంతాల్లో పాకిస్తాన్‌ ప్రేరేపిత చొరబాట్లను సమర్థంగా అడ్డుకుంటోంది. క్షేత్రస్థాయి సమాచార నెట్‌వర్క్‌తో కలిపి ఈ ఆధునిక దృక్పథం, ఉగ్రవాదాన్ని మూలాలతో సహా తుడిచిపెట్టేస్తోంది.

2,900 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం, ఉగ్ర కుట్రల భంగం: 2025 నవంబరులో JKP నిర్వహించిన బహుళ రాష్ట్ర ఆపరేషన్లలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం అయ్యాయి. ఈ చర్యతో “వైట్‌-కాలర్‌ టెర్రర్‌ ఎకోసిస్టమ్‌” మొత్తం భగ్నమైంది. నార్కో-టెర్రర్‌ నెట్‌వర్క్‌లు, ఆయుధ రవాణా ముఠాలు, ఆన్‌లైన్‌ రాడికలైజేషన్‌ కుట్రలు అన్నీ కూలిపోయాయి.

త్యాగమయ జీవులకి వందనం: జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ ఈ దశాబ్దం ఒక నిశ్శబ్ద వీరగాథ, ఒక త్యాగయజ్ఞం, ఒక దేశభక్తి సింహగర్జన. వారు కేవలం భారత సార్వభౌమాధికారాన్ని కాపాడడం మాత్రమే కాదు కొత్త, శాంతియుత, అభివృద్ధి చెందిన జమ్మూ కశ్మీర్‌కి దారి చూపారు. వారు ప్రాణాల కంటే బాధ్యతను, భద్రత కంటే సేవను, జీవితం కంటే దేశాన్ని ఎంచుకున్నారు. వారి కథ ప్రతి భారతీయుడి హృదయంలో మార్మోగాలి. ఎందుకంటే వారు మన ఏకత్వం, సమగ్రత, స్వాభిమానానికి నిజమైన సంరక్షకులు. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని, Mega Minds

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

MegaMinds

MegaMinds Raja, Jammu Kashmir Police, JKP sacrifice story, JKP bravery, JKP heroes, Kashmir security forces, Indian police sacrifice, JKP martyrs, Jammu Kashmir terrorism fight, JKP nation service, Kashmir peace efforts


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top