Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

history of tribal freedom fighters in india - విదేశీ పాలనను ఎదురించిన గిరిజన తెగలు

భారతదేశంలో వేల సం||లనుండి గిరిజనులు తమ ప్రాంతాలలో సర్వతంత్ర్య స్వతంత్రులుగా వుంటూ, ఆయా సామ్రాజ్యానికి చేదోడువాదోడుగా ఉండేవారు. గిరి...

భారతదేశంలో వేల సం||లనుండి గిరిజనులు తమ ప్రాంతాలలో సర్వతంత్ర్య స్వతంత్రులుగా వుంటూ, ఆయా సామ్రాజ్యానికి చేదోడువాదోడుగా ఉండేవారు. గిరిజనుల పాలనలో సామ్రాజ్యాలు ఏవీ జోక్యం చేసుకోకపోయేవారు. భారతదేశ చరిత్రను గమనించినట్లైతే వరంగల్ కాకతీయ సామ్రాజ్యానికి అక్కడి గిరిజనులకు మధ్య భీకరపోరాటం జరిగింది. చదురు మొదురు సంఘటనలు మినహా చరిత్రలో గిరిజనులకు వారి సామ్రాజ్యాలకు మధ్య యుద్ధాలు జరగలేదని చెప్పవచ్చు.

ఆ తదుపరికాలంలో ఈస్టిండియా కంపెనీ, బ్రిటీష్ పార్లమెంటు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో బ్రిటీష్ వారు ఈ దేశంలోని పరంపరాగతంగా వస్తున్న చేతివృత్తులను ధ్వసంచేసి తమపరిశ్రమలద్వారా వస్తువులు తయారు చేసి పెద్దఎత్తున వ్యాపారం చేసేవారు. ఈ దేశానికి సంబంధించిన వనరులను దోచుకొనేందుకు వారు ప్రవేశించని ప్రదేశాలు లేవు. పుష్కలమైన వనరులు ఉన్న అడవులను దోచుకున్నారు. వ్యవసాయం, కాఫీ, టీ తోటలకోసం వివిధప్రాంతాలలో వున్న మనుషులను అడవులలోకి పంపించేశారు. అడవులపై ఆర్దిక ఆధిపత్యంకోసం తెగబడ్డారు. ఈ క్రమంలో అడవులలోని గిరిజనులనుండి తీవ్రమైన ప్రతిఘటన వారికి ఎదురైంది. ఈ సంఘటనను అణచివేసి తమ ఆధిపత్యాన్ని నిర్మాణంచేసేందుకు తీవ్రప్రయత్నంచేశారు. కొంతమేరకు సఫలీకృతమయ్యారు. బ్రిటీష్ వారు కేవలం ఆర్థికశక్తికోసమేకాక స్వతంత్రులైన గిరిజనులను బ్రిటీష్ పాలనలోకి తీసుకొని వచ్చారు. అప్పటినుంచి దేశపాలనలో వాళ్ళుకూడా ఒకభాగమయ్యారు.

అందుకే స్వతంత్రం వచ్చిన తరువాత కూడా వాళ్ళ స్వేచ్ఛను, సంస్కృతిని కాపాడుకునేందుకు ఉద్యమించిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఈ సమయంలో బ్రిటీష్ ఆధిపత్యంపై దేశవ్యాప్తంగా గిరిజనులు చేసిన పోరాటాలను ఒకసారి జ్ఞాపకంచేసుకుందాం. ఆ పోరాటంలో చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. దేశంలో మరియే సామాజిక వర్గం చేయని పోరాటాలు గిరిజనులు చేశారు. 1857కు పూర్వము తదుపరి చోటుచేసుకున్నసంఘటనలు ఒకసారి జ్ఞాపకంచేసుకుందాము.

1. చౌరాస్లు:
1768-1832 మధ్య పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ సమీప అడవులలో వ్యవసాయమే ప్రధానవృత్తిగా చౌరాసులు జీవించేవారు. ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు చేసిన జమీందారీ వ్యవస్థలో గిరిజన భూములుకూడా భాగస్వామ్యం అయినాయి. ఆ సమయంలో ఈస్టిండియా కంపెనీ వ్యవసాయ భూముల పై విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా చౌరాసులు పోరాటం చేశారు. బ్రిటీష్ ఆధిపత్యంపై పోరాటానికి తెరలేపిన మొదటి గిరిజనులు చౌరాసులు అన్ని చెప్పవచ్చు.
2. భిల్లులు:
వేట, వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉన్న భిల్లులు మహారాష్ట్రప్రాంత అడవులో నివశించేవారు. ఆర్థిక ఆధిపత్యం కోసం బ్రిటీష్ వారు చేస్తున్న ప్రయత్నాలను 1818నుండి 1848 వరకు అంటే 30 సంIIలపాటు సుదీర్ఘమైన పోరాటంచేసి కొంతకాలం తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకున్న వీరులు భిల్లులు. రాజస్తాన్ లోని భాన్సువాడ మొదలైన ప్రాంతాలలో 1913వ సం||లో గోవిందగురు నాయకత్వంలో
3.హో తెగ:
బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ యుద్ధం చేశారు. ఝార్ఖాండ్ ప్రాంతంలోని ఛోటానాగమార్ కు సమీపంలోవున్న సింగభూమి అడవులలో “తెగవారు నివసించేవారు. బ్రిటీష్ వారు ఏర్పాటుచేసిన జమిందారీ వ్యవస్థ కారణంగా తమభూములకు పహనీపట్టా లేనికారణంగా ఆభూములను జమిందారీ వ్యవస్థలో బ్రిటీష్ వారు కలిపేశారు, దానిపై వారు పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక సం||పాటు సుదీర్ఘపోరాటం జరిగింది. చివరికి బ్రిటీష్ వారు వారితో రాజీ కుదుర్చుకున్నారు.
4. ఖోలి తెగః
గుజరాత్, మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత ప్రాంతాలలో ఒక ప్రక్కభిల్లులు మరోప్రక్క ఖోలితెగవారు ఉండేవారు. ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు చేసిన చట్టాలవల్ల 1824-28, 1844-48 సం||ల మధ్య ఖోలి తెగవారు ఈస్టిండియా కంపనీ పై యుద్ధంచేశారు. శక్తివంతమైన సైన్యంవున్న కంపెనీ ఆ తెగ పెద్దలను అదుపులోనికి తీసుకొని చిత్రహింసలకు గురిచేశారు. ఒకప్రక్క నాయకత్వం మరోప్రక్క భూములు కోల్పోయి పోరాటంలో విఫలమైనారు.
5. అహాతెగ:
1828-33వరకు అస్సాంలోని గోముధార్, కన్యార్లో బ్రిటీష్ వారిపై అహెూతెగవారు తిరగబడ్డారు. 
6. ఖాసీ తెగ:
అస్సాం, మేఘాలయలోని ఖాసిగిరిజన ప్రాంతంలో భాసితెగవారు నివసించేవారు. 1829-43వరకు బ్రిటీష్ వారిపై ఈ తెగవారు నిరంతరం పోరాటం చేశారు. చరిత్రలో బ్రిటీష్ వారు ఆ పోరాటాన్ని అంగ్లో-ఖాసి యుద్ధంగా పేర్కొంటారు. బ్రిటీష్ వాళ్ళు తమ సైనిక శక్తితో ఖాసిపర్వత ప్రాంతాలలో పూర్తిపట్టు సాధించుకున్నారు.
7. సింగ్ పోతెగ:
ఈతెగవారు చైనా, బర్మా సరిహద్దులలోవున్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతాలలో అడవులలో జీవించేవారు. ఖాసీలు పోరాటం చేస్తున్న సమయంలో 1830-39 మధ్యలో బ్రిటీష్ వాళ్ళ పై వీరు పోరాటం జరిపారు. పోరాటంలో 80మంది బ్రిటీష్ సైనికులను చంపేశారు. చివరకు ఈ పోరాటం అణిచివేయబడింది.
8. ఖోల్ తెగ: 
1831-32లోచోటానాగపూర్, రాంచీ, ఝార్ఖండ్ లోని సింమభూమి ప్రాంతాలలో నివసించే భోల్తెగవారికి సంబంధించిన వ్యవసాయ భూములను బ్రిటీష్ వారు ముస్లిం వ్యవసాయ దారులకు అప్పగించారు. తమభూములను కాపాడుకునేందుకు బుధుభగత్ నేతృత్వంలో బ్రిటీష్ వాళ్ళపై పోరాటంచేశారు.
9. కోయలు:
అంధ్రప్రదేశ్ లోని గోదావరి పరిసర ప్రాంతంలో కోయలు జీవిస్తున్నారు. తమ భూముల రక్షణకోసం 1879-80 మధ్య తోమవార నాయకత్వంలో, 1886లో మల్కాన్ గిరి రాజు నాయకత్వంలో బ్రిటీష్ వాళ్ళపై తీవ్రపోరాటంచేశారు. చివరగా 1924నం||లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో పోరాటం జరిగింది. అల్లూరి సీతారామరాజును బ్రిటీష్ వాళ్ళు కాల్చి చంపాక ఆ ఉద్యమం బలహీన పడింది.
10. గోండ్లు:
ఒరిస్సా ప్రాంతంలోని అడవులలో నివసిస్తారు 1846-48, 1883-1914వరకు చక్రబిపోయి నాయకత్వంలో బ్రిటీష్ వాళ్ళ పై భీకరపోరాటంచేశారు. 1857లో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలోకూడా గోండులు కీలకపాత్రపోషించారు.
11. సంతాల్లు:
ఝార్ఖాండ్ ప్రాంతంలోని రాజమహల్ కు చెందిన గిరిజనులే సంతాల్లు. ఆ తెగకు చెందిన సిద్ధు, కాను నాయకత్వంలో 1885సం||లో పదివేల బ్రిటీష్ వారు ఏర్పాటుచేసిన జమిందారీ వ్యవస్థ పైనా, మరో మందితో బ్రిటీష్ వారిపై పోరాటం జరిపారు. ఒకప్రక్క ప్రక్క బ్రిటీష్ సైన్యం పైనా భీకరంగా పోరాటం జరిగింది. ఈ పోరాటం కారణంగా తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలిగారు.
12. నాయక్లు:
గుజరాత్ లోని పంచమహల్ప్రాంతంలో నాయక్ తెగ గిరిజనులు నివసిస్తారు. 1858-59, 1868 సం||లలో రూప్ సింగ్, జోరియాల నాయకత్వంలో ధర్మరాజ్యస్థాపనకోసం బ్రిటీష్ పోలీస్ స్టేషన్ పై గెరిల్లా దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు.
13. కోచార్ నాగ తెగ:
అస్సాం లోని కుర్చీలు ప్రాంతంలో ఈ తెగవారు నివసించేవారు. 1882 లో శంభుధన్ ఫుంగ్రోసా నాయకత్వం లో బ్రిటిష్ నాయకత్వాన్ని సవాలు చేస్తూ పోరాటం చోటానాగపూర్ ప్రాంతంలో (నీటి ఝార్ఖండ్ మరియు ఒరిస్సా లోని కొంత భాగం) నివసించే ఈ తెగవారుచేశారు.
14. ముండా:
1899-1900 మధ్యలో బిర్సాముండా నాయకత్వంలో తమ హక్కుల రక్షణ కోసం తీవ్రంగా పోరాటం చేశారు. బిర్సాముండా ను బ్రిటీష్ వారు తమ అదుపులోకి తీసుకుని జైల్ లో బంధించారు. దాంతో ఉద్యమం బలహీనమైంది. జైల్లి ఉన్న బిర్సా అమరుడయ్యాడు.
15. ఒరావ్:
1914-15 మధ్యలో చోటానాగపూర్ ప్రాంతంలో ఉన్న ఒరావ్ తెగవారు బ్రిటీష్ వారి యుద్ధం చేశారు.
16. తాడో కుకీలు:
1917-19 మధ్యకాలంలో మణిపూర్ ప్రాంతంలో జాదు నాగ్ మరియు రాణీమా గైడిన్ల్యూ నాయకత్వంలో బ్రిటిష్ వారిపై గెరిల్లా పోరాటం చేశారు. కొంతకాలం పాటుతమ స్వాతంత్ర్యాన్ని కూడా కాపాడుకున్నాడు.
17. చెంచులు:
1921-22 లో ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అడవులలో బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ హనుమంతు నాయక్ నాయకత్వంలో చెంచులు పోరాటం చేశారు.
పై విధంగా దేశంలోని సంస్థానాలు, రాజులు చేయలేని పోరాటాలను గిరిజనులు ధైర్యంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేసి తమదైన స్థానాన్ని చరిత్రలో లిఖించుకున్నారు. పరిమిత సైన్యమున్నాకూడా ధైర్య సాహసాలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి బలిదానమైన ఆ అమరుల రాబోవు తరాలకు ఒక ప్రేరణ గాయకులు గా నిలుస్తారు. వారి చరిత్ర ఈ సమాజానికి సమగ్రంగా అందించడం మన బాధ్యత.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


No comments