Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

August 15 Speech మీకోసo- Speech About freedom struggle - Independence Day Speech

మన‌ ఊర్లో  అగష్టు 15 వ తేదీ రాగానే ఊర్లో జండా ఎగరేయడం, వందనాలు, మిఠాయిలు పంచుకోవడం, పాత లత, రఫీ,  బదల్ గయా ఇన్సాన్  పాటలు‌ జెండా కింద గాం...

మన‌ ఊర్లో  అగష్టు 15 వ తేదీ రాగానే ఊర్లో జండా ఎగరేయడం, వందనాలు, మిఠాయిలు పంచుకోవడం, పాత లత, రఫీ,  బదల్ గయా ఇన్సాన్  పాటలు‌ జెండా కింద గాంధి, నెహ్రు ఫొటోలు, ఇలా అన్ని చోట్లా మూస పోసినట్లు కార్యక్రమాలు జరుగుతుంటాయు. జెండా ఎగరేసిన నాయకుడు వాడికి తెలిసినా, తెలియకపోయినా జాతికి పిత ఈయన‌, వారి తమ్ముడు చాచా ఈయన అని రెండు‌మాటలు చెబుతుంటాడు.  నిజానికి స్వతంత్ర ఉద్యమం గాంధి గారితో మొదలు కాలేదు. స్వతంత్రం‌వచ్చే నాటికి‌ మిగిలి ఉన్న చివరి నాయకుల్లో ఆయన ఒకరు.

ఓ సంఘటన చెబుతాను ఓ జెండా వందనంలో మాట్లాడుతూ  మనం ఇమగ్లీషువాడు పరిపాలించిన షుమారు రెండు వందల‌ సంవత్సరాలే కాదు, అంతకు ముందు ఎనిమిది వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నామని చెప్పాను పిల్లలు ఏమనలేదుకానీ, హిస్టరీ టీచర్ నన్ను ప్రశ్నించింది. అంతకు ముందు మన దేశాన్ని పరిపాలించిన  మొఘలులు కదా!  పరతంత్రం అంటారేమిటి ?  అని అడిగింది. మోఘలులు, బహమనీ సుల్తానులు, లోడీలి, ఖిల్జీలు వీరంతా మన దేశం వారేనా? బయటినుండి వచ్చారా? అని నేనడిగితే వాళ్ళూ బయటినుండి వచ్చినవారే, కాని ఇక్కడే ఉండిపోయారు కదా! అంటూ సాగదీసింది. మీరు అవకాశం‌ఇస్తే ఇంగ్లీషువారూ ఇక్కడ ఉండిపోయేవారు. అప్పుడు మనవారు అవుతారా? అని నేనడిగిన ప్రశ్నకు జవాబు లేదు, భారతీయ ముస్లిములు మన దేశం వారే తల్లి, కాని పరిపాలకులు విదేశీ ముస్లిములు. ఏ మతస్తులైన వారు విదేశీయులు అవునా? కాదా,?అంటే ఆమె నోట మాట రాలేదు. భారతీయ ముస్లిములు కూడా విదేశీయుల పాలనలో ఉన్న బానిసలే. ఏ మతం వారైనా విదేశీయులు,స్వదేశీయుల మధ్య తేడా ఉంటుందిగా?

ఇంగ్లీషువారు క్రైస్తవులు కాబట్టి‌వారి పాలనలో భారతీయ క్రైస్తవులు స్వతంత్రులు. మిగతావారే బానిసలు అని  కాదుకాదా? నా ప్రశ్నల వర్షానికి‌ ఆమె దగ్గర సమాధానం‌లేదు. కాబట్టి విదేశాల వారు మనపై దండెత్తిన‌ అలెగ్జాండర్ ఎంతో, హూణులు,శకులు, కుషాణులు, పశ్చిమాసియా మూకలు(ఘోరిలు, ఖిల్జీలు, లోడీలు, మొఘలులు, బహమనీ సుల్తానులు, తానేషాలు, నిజాములు) వీరంతా విదేశీయులే! ఏ దేశం‌నుండి వచ్చారు అనేది గూగుల్ లో చూసి తెలుసుకోవచ్చు.

మనం విదేశీయుల పాదాక్రాంతమై మగ్గినది ఆంగ్లేఉలు పరిపాలించిన కాలమే కాదు. అంతకు ముందు మన దేశ రాజ్యాధికారం చేసిన‌ పశ్చిమాసియా మూకల పరిపాలనా కాలం కూడా.  దాన్ని అంతా మహమ్మదీయుల‌ పరిపాలన అని ఒకే గాట కట్టడం తప్పు.  వారుకూడా అనేక దేశాలనుండి వచ్చారు. బీజాపూర్ నవాబులకు, మొఘలుల మధ్య వైరం ఉండింది. వారు శివాజీ తో మైత్రి కొసం‌ పాకు లాడినవారే.  ఏ ఏ దేశాలనుండి‌మీరు గూగుల్ వెతకండి.గోలకొండ నవాబును ఔరంగజేబు ఓడించి ఆక్రమించుకున్నాడు.

కాబట్టీ ఆ కాలంలో అ పశ్చిమాసియా మూకల సమ్రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడిన రాణా ప్రతాప్, శివాజీ, గురుగోవిందుడు, రాజా ఛత్రసాల్ , లాచిద్ బడ్ ఫుకాన్, లాంటి అనేక మంది రాజులు కూడా స్వతంత్ర వీరులే. వారిని రాజస్థాన్ వీరులు, పంజాబు సింహాలు, మరఠా యోధులు అని వేరు చేసి ఆయా ప్రాంతాల వారిగా ఒకే దేశం‌వారిని విడదీసి వారు భారత స్వతంత్ర యోదులుగా గుర్తించ లేని మనం, సిరియా, ఆఫ్గనిస్తాన్, టర్కీ, అరబ్బు  దేశాలవారందరినీ కలిపి మహమ్మదీయు లన్నాము. ఇది దేశాన్ని విడదీయడంలో, విజాతీయులను కలపడమనే ఇంగ్లీషువారువ్రాసిన‌చరిత్ర వల్లెవేసిన‌మన‌ మేధావుతప్పిదం. ఎందరో రాజులు మన స్వతంత్రం‌ నిలబెట్టారు. వారందరినీ మనం తలుచుకోవాలి.

దేశంలో‌చాలా భాగం ఆక్రమించి, స్వతంత్ర రాజులతో సంధి చేసుకున్న‌బ్రిటిష్ వారు అస్సాం ని, ఒరస్సా ను‌పరిపాలించ లేక పోయారనే విషయం మనకు గుర్తుకు రాదు. వారు స్వతంత్ర వీరులే. సీతారామరాజు మన్యం వీరుడని‌మాత్రమే అనడం‌కాదు. భారత స్వతంత్ర వీరుడు అనాలి. వీర పాండ్య కట్టబ్రహ్మన లాటి వీరులూ స్వతంత్ర వీరులే.
ఉరికొయ్యలను ముద్దాడిన భగత్సింగ్, రాజ గురు సుఖదేవ్ లు, వాసరిని సంఘటనంచేసి నడిపిన చంద్ర శేఖర్ ఆజాద్  లాంటి యోధులూ స్వతంత్ర  సమర యోధులే. భారత దేశం బయట ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణం చేసిన నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ప్రత్యక్ష యుద్ద సారధి.  బ్రిటిష్ వాళ్ళు దేశం వీడాలనే భీతావహ వాతావరణం సృష్టి కర్త ఆయనే. పై వారెవ్వరూ అహింస మంత్రాన్ని పఠించలేదు. యుద్దం వీర భొజ్యం అనే సమరంలో కురికిన వారే.

1857 లో జరిగిన మహా యుద్దం  బ్రటిష్ వారితో జరిగిన మహాయుద్దం. నానా సాహెబ్ పీష్వా, తాంతియా తోపే, ఝాన్సీ రాణి లక్ష్మిబాయితో పాటు బ్రిటిష్ సైన్యంలో ఉండే భారతీయుల తిగుబాటు అంతా హింసాత్మకమే. అప్పటినుండి 1947 వరకు జరిగిన అన్ని‌ప్రయత్నాలలో లక్షలాది దేశభక్తుల ప్రాణాలు కొల్పోయాం.  ఇదేదీ అహింసా యుద్దం కాదు. వారిని పంద్రాగష్టు తలుచుకోక పోతే మనం  కృతఘ్నులం అవుతాము.

స్వతంత్రం కోసం జరిగిన మహా యుద్దం 1857   చాలా యోజన చేసి చేసారు.  బ్రిటిష్ సైన్యంలోని భారతీయు లందరికీ రహస్యంగా దేశంకోసం తమ ఆయుధాలు వాడి బ్రటిష్ వాళ్ళను తుద ముట్టించాలనీ స్వతంత్రమనే రొట్టెలను ముక్కలుగా పంచుకొని తమ ఆమోదం తెలియజేసే గొప్ప ప్రణాళిక తో సైనికశిబిరాలలో మంత్రంఅమోదించడం, నిర్ణయింపబడిన రోజు కోసం ఎదరు చూసారు.  బ్రిటిష్ ఇండియా లొ లేని నానా సాహెబ్ పీష్వా నాయకత్వం వహించినసైన్యాలు  బయటనుండి ఇంగ్లీషువారిని తుదముట్టించడం కోసం ఒక్క సారిగా దాడి చేయాలనీ నిర్ణయింపబడి, ముహుర్తం కంటే ముందుగా బ్రిటిష్ వారి ఆగడాలకు తట్టుకోలేక మంగల్ పాండే అనే బ్రిటిష్ సైనికుడు  ముందుగా  బ్రటిష్ వారిపై  దాడి చేసి ,దొరికి పోవడం కారణంగా సైన్యం లో ఈ ధైర్యానికి కారణం ఊహించి అప్రమత్తమైన కారణంగా   బయటి రాజుల దాడిని, సైనికుల అంతర్యుద్దాన్నీ  తట్టుకుని అణిచివేయగలిగారు. లేకపోతే భారత దేశం లోని బ్రిటిష్ వారిని అందరినీ నామ రూపాలు లేకుండా చంపేసే యోజన జరిగి విఫలంఅయ్యింది. యుద్దం ఒకసారి మొదలు కాలేదు. వేరు వేరుగా తలపడ్డారు.  అన్నిరెజిమెంట్ల దాడిని అణిచివేయ గలిగ ారు.  వివరాలకు ఆ  గాధలు చదవాల్సిందే.. వేలాది ఇంగ్లీషు వారిని హతమార్చారు. ఆ సమయంలో లక్షల సంఖ్యలో ‌మన సైనికులు, బయటి రాజుల సైనికులు స్వతంత్ర  పోరాటం లో ఆహుతి అయ్యారు. మరో 90 సంవత్సరాల కాలం మన పోరాటం సాగాల్సి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు దాన్ని సిపాయిల తిరుగుబాటు అని ముద్రవేసి ప్రచారంచేసారు. అణిచి వేయడం రాజు హక్కుగా ప్రచారం చేసుకున్నారు.

అప్పుడు శాంతి ప్రక్రియలు, ఈస్ట్ ఇండియా కంపనీ నుండి రాజ్యాధికారం బ్రిటన్ రాణి చేతులోకి తీసుకొని అప్పటిదాకా ఉన్న గవర్నర్ జనరల్‌ ను తొలగించి వైస్రాయి పాలన‌వచ్చింది.   ఇంగ్లీషు వారు తమ పాలను స్థిరం చేసుకోవడానికి  వారి బుర్ర విపరీతంగా వాడారు.  ప్రజల వ్యతిరేక భావాలని తగ్గించు కోవడానికి వారి కోరికల అర్జీలు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రారంభింప‌ బడింది.  ప్రజల కష్టాలను కాంగ్రెస్ ద్వారా వైస్రాయ్ విని‌పరిష్కరించడం ప్రారంభం అయ్యింది.
ఇది ఒక‌పక్కన‌చేస్తూనే మరో ప్రక్క ముస్లిములను  వేరు చేసే ప్రక్రియ ప్రారంభం చేసారు.  మేము రాక‌ముందు మీరు పరిపాలకులు , మేము వెళ్తే పరిపాలన మీ కివ్వాలి అని‌నమ్మ‌పలికి వారికి వేరే దేశం నినాదం వారితో పలికించారు. విదేశస్తుల పాలనను భారతీయ ముస్లిముల పాలనగా వారికి చిత్రించారు. నిజానికి పశ్చిమాసియా మూకల పరిపాలనలో భారతీయ ముస్లిములు కుడా బానిసలే.

హిందువులలో కులాల వ్యత్యాసాలను జస్టిస్ పార్టీ  పెట్టించి‌ అన్ని వ్యవస్థలను ఛిద్రం చేయడం ప్రారంభించారు.  ఆ పార్టీ ఉత్తర, దక్షిణాల విభజన వాదం  తమిళనాడు నుండి ప్రారంభించారు. వాటికి ఆర్థిక సాయంచేస్తూ హిందువులలో విభజన వాదం  సోషియల్ ఈక్వాలిటీ ,  మూఢ  ఆచారాల సంస్కరణల‌రూపంలో హిందూ వ్యవస్థలపై దాడి చేసి‌ నిర్వీర్యం  చేయడం మన వారితోనే చేయించడం ద్వారా మనలను విడగొట్టే ప్రక్రియ ప్రారంభం చేసి తమ పాలన‌సుస్థిరం చేసుకునే పని చేసారు.‌ మన‌పిచ్చి నాయకులు వారి సంస్కరణలు నెత్తిన వేసుకొని స్వతంత్ర ఉద్మమాన్ని పక్కన పెట్టారు.

తరువాత కొద్ది రోజులకు తిలక్ కాంగ్రెస్ కు ఉద్యమ బాట పట్టించి స్వతంత్రం నా జన్మ హక్కనినినదించి కకావికలమైన‌ ఉద్యమానికి ఊతం ఇచ్చాడు.  మెల్లిగా కాంగ్రెస్ వారి చేతి లోకి వచ్చింది. దేశమంతా వారి మాట చెల్లుబాటు కావడం ప్రారంభం అయ్యింది. బెంగాల్, పంజాబ్ లో కూడా ఉద్యమం బలపడింది.

ఇంగ్లీషు వాడు బెంగాల్ పెద్ద రాష్ట్రం అని దాన్ని‌ తూర్పు బెంగాల్ (ముస్లిములు అధికంగా ఉండే ప్రాంతం)  అని, పశ్చిమ బెంగాల్ (హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతం)  విడగొట్టారు.  దేశాన్ని హిందూ ముస్లిములుగా విడగొట్టే బ్రిటిష్ వారి పన్నాగం గమనించిన దేశం ఒక్క సారిగా వందేమాతరం, బెంగాల్ విభజన‌వ్యతిరేకిస్తూ లాలా లజపతిరాయ్(పంజాబ్), బాల గంగాధర తిలక్(మహారాష్ట్ర) బిపిన్ చంద్రపాల్(బెంగాల్) నాయకత్వంలో దేశమంతా ఉద్యమం జరిగి బ్రటిష్ వారు  ఆ విభజన ఆలోచనను ప్రక్కన‌పెట్టాల్సి వచ్చింది.  కాంగ్రెస్ పాత్ర ప్రముఖం కావడం ప్రారంభం అయ్యింది.  ఇంతలో తిలక్ పరమపదించడం. లజపతిరాయ్ సాండర్స్ అనే పోలీసివాడి లాఠీ దాడికి మరణించడం. ఉద్యమం‌ మళ్ళీ చప్పబడటం ప్రారంభం అయ్యింది.

వందేమాతరం ఉద్యమంతో బెంగాల్ విభజన ఆప గలిగిన మన శక్తి, నాయకుల మరణాలతో నీరు కారి పోయింది.  గోపాలకృష్ణ గోఖలే లాంటి మితవాదుల చేతిలోకి కాంగ్రెస్ కొంత నీరసంగా నడిచింది. కేవలం నాయకుల ప్రేరణ తోటే నడిచే ఉద్యమం‌ ఎంతో కాలం నిలబడదు.  సామాన్య పౌరుడిలో ఆ జ్వలంత దేశభక్తి‌ లేని కారణంగా నాయకుల పటిమతో మాత్రమే నడిచే సంఘటనలను చూసిన డాక్టర్ జీ  ఈ జ్వలంత దేశభక్తుల నిర్మాణం కోసం ఆర్ యస్ యస్ స్థాపన చేసి దాని నిర్మాణంలో తలమునకలయ్యారు.


దక్షిణాఫ్రికా ఉద్యమం లో పేరుగన్న గాంధీజీ కాంగ్రెస్  పగ్గాలు అందుకున్నారు.  ఆ సమయంలో బెంగాల్ లో చిత్తరంజన్ దాస్ శిష్యుడు సుభాస్ బాబు, నెహ్రు, జిన్నా, ఆంధ్రప్రదేశ్ లో టంగుటూరి, పశ్చిమోత్తర భారతం లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ,గుజరాత్ నుండి పటేల్ లాంటి యోధానుయోధులు జట్టు కట్టారు. సామాన్య ప్రజలలో, గ్రామాల్లో యువత పాల్గొనడానికి గాంధిజీ అనేక రకాల సత్యాగ్రహాలు ప్రారంభం చేసారు. కొంతవరకు సఫలీకృతులయ్యారు. 

సరిగ్గా ఈ సమయంలో ముస్లిం విభజన‌వాదానికి  భారత స్వతంత్రంలో ముస్లిములకు ప్రత్యేక దేశం నినాదం, మేము వేరు అనేభావం కాంగ్రెస్ లో కూడా పొడచూపడం మొదలయ్యింది. వందేమాతరం  పాడే సమయాన్ని ముస్లిం నాయకులు బహిష్కరించడం అందరినీ బాధించింది. ముస్లిం లీగ్ అనే పార్టీ జిన్నా స్థాపన చేసిన తరువాత కూడా చాలా మంది ముస్లిములు గాంధి గారి వెంట ఉన్నారు. ఆ సపోర్టు పొందడానికి ఖిలాఫత్ అనే ఉద్యమాన్ని కాంగ్రెస్ బలపరుస్తుందని గాంధీజీ బలపరచడం  వారు వేరే అనేభావం వారిలో పెంచింది.  టర్కీ లో ఖలీఫాను కమాల్ పాషా అనే ఆదేశస్తుడే తీసేస్తే భారత దేశం లో ఉద్యమం ఏమిటని కాంగ్రెస్ లో గాంధిగారిని ప్రశ్నించారు. గాంధిగారు మాట్లాడలేదు. ఆ ఉద్యమం లో కేరళ లోని మల్లపురంప్రాంతం లో హిందువుల ఊచకోత, విపరీత హింసను గాంధీ ఖండించలేదు. టర్కీ లో ఖలీఫా తొలగింపుకు భారత దేశ హిందువులపై దాడి ఏమిటని ప్రశ్నించక పోవడానికి కారణం ముస్లిములను స్వతంత్ర ఉద్యమం లొ కలుపుకొని పోవాలని గాంధిగారి ఆలోచన చాలా మంది విమర్శించారు. తాను చలించలేదు. ప్రత్యేక దేశానికి కూడా హింసే మార్గం అని ముస్లిములు నిర్ణయించడానికి ఇది కారణం అయ్యింది. అప్పుడు సహించిన కాంగ్రెస్ నేటికీ అదే పాలసీ అమలు చేస్తున్నది.

ఒకవైపు కాంగ్రెస్ ఉద్యమం సాగుతూండగానే, ఈ అర్జీల సంస్కృతి మాకొద్దని,  చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, ఉద్దామ సింగ్, బెంగాల్ లో అనుశీలన సమితి హింసాత్మకంగా బ్ఇటిష్ వారిని వ్యతిరేకించారు.  ఆ కోవ లోకే  అల్లూరి సీతారామరాజు కూడావస్తారు. లండన్ లో వీర సావర్కర్ ఇండియా హౌస్ ద్వారా మదన్ లాల్ ధింగ్రా ద్వారా ఇక్కడ అరాచకాలు చేసిన ఆంగ్లేయులని‌ లండన్ లో కాల్చి చంపేయడం ద్వారా ఇంగ్లాండు లోనే భారత స్వతంత్ర సమర బావుటా ఎగరేసారు.

రెండవ ప్రపంచయుద్దం వచ్చింది. ఇంగ్లీషు వారిపై కక్ష తీర్చుకునే తరుణం ఇదే అని సుభాస్ బాబు ఇంగ్లీషు వారు విధించిన గృహ నిర్బంధం నుండి మారువేషం లో తప్పించుకొని వెళ్ళి కలకత్తానుండి ఆఫ్గనిస్తాన్ దాకా ప్రయాణం చేసి మాస్కో చేరుకొని అక్కడ నుండి జర్మనీ వేళ్ళి, అధినేత హిట్లర్ని కలిసి యుద్దం లో జర్మనీకి లొంగిపోయన భారతీయుసైనికులను తనకిమ్మని, బ్రిటిష్ వారిని ఇండియా నుండి తరిమి‌ వేయడానికి సహకరించమని హిట్లర్ని ఒప్పించి సైనికుల నాసవలో సింగపూర్ చేర్చి  ఆ సైన్యానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే నామకరణం చేసి చలో ఢిల్లీ నినాదం తో బర్మా మీదుగా అస్సాం లో ప్రవేశించారు. విపరీతమైన వర్షాలలో బ్రహ్మపుత్ర వరదల్లో ఆ సైన్యం అస్సాం ని దాటలేక, మరోసారి కూడా ప్రయత్నం చేసారు.  దీని ప్రభావం బ్రటిష్ వారుని భయపెట్టింది.

చావుతప్పి కన్ను‌లొట్టపోయినట్లుగా జర్మనీ పై మిత్రపక్షాల గెలుపు జరిగి, హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నారు. కాని ఆర్థికంగా, సైనిక పరంగా ఇంగ్లాండు బాగా నాశనం అయ్యింది. గాందిజీ క్విట్ ఇండియా ఉద్యమం అర్థాంతరంగా ఆగిపోయి, బోసు సైన్యాలు వెనుతిరిగి తాను జపాన్ చేరికొని అంతర్థానం కావడం ఒక‌మిస్టరీ అంశం అయ్యింది.
‌కాంగ్రెస్ మళ్ళి  అస్త్ర సంధానం మొదలయ్యి, పరిపాలన చేయలేని ఇంగ్లాడు స్వతంత్రం ఇవ్వడం విషయం సమాలోచనలు ప్రారంభం చేసి జిన్నా ను ఊదరగొట్టి ముస్లిములకు వేరే రాజ్యం మాట వైపు మొగ్గింది. కాంగ్రెస్ విభజనకు ఒప్పుకుంది. సింధు, పశ్చిమపంజాబు, తూర్పు బెంగాల్ ముస్లిముల జనాభా ఎక్కువ ఉన్నారని ఆ ప్రాంతాలను పాకిస్తాన్ పేరుతో విభజించారు. దేశంలో ఉండే ఇతర రాజుల వారికిష్టమైన భారత దేశం లో గాని పాకిస్తాన్ లో కాని కలిసే హక్కు వారిదే అని బ్రటిష్ వారు మనలో విభజన స్థిరంచేసారు. తూర్పు బెంగాల్, పశ్చిమపంజాబ, సిందు ప్రాంతాలలో హిందువులపై దాడులు, మారణ హోమాలను సహిస్తూ ప్రజల పంపిణీ మొదలయ్యింది. భారత దేశంలోఇక్కడి ముస్లిములు ఉండవచ్చని కాంగ్రెస్ ప్రకటన తో ఇక్కడి వారిక్కడే ఉన్నారు. కాని అక్కడినుండి శవాలు వదిలేసి క్షతగాత్రులు కట్టుబట్టలతో ఆస్తులొదిలేసికొని  భారత్ చేరి కాందిశీకులయ్యారు. 14 ఆగష్టు పాకిస్తాన్, 15 అఅగస్టు భారత స్వతంత్ర దేశాలని బ్రటిష్ వారు ప్కటన చేసారు. పాకిస్తాన్ కి మహ్మద్ అలీ జిన్నా నాయకత్వం వహించారు.  భారత దేశానికి ప్రధానిగా పటేల్ ను ఎన్నిక చేసిన కాంగ్రెస్ కమిటీల నిరణయాన్ని పక్కకు తోసి గాంధిజీ నెహ్రును ప్రధాని చేసి నేటి భారతానికి కారకుడయ్యాడు.
‌స్వతంత్ర మైన భారతంలో జునాగడ్ సంస్థానం, నిజాము నవాబు పాకిస్తాన్ వైపు మొగ్గు చూడటంతొ నాటి హోం మంత్రి పటేల్ పోలీస్ యాక్షన్ తో భారత దేశం లో కలిపేసారు. కాశ్మీర్  రాజు హరిసింగ్ భారతంలో కలవడానికి వ్రాసి ఇచ్చినా షేక్ అబ్దుల్లా అనే స్థానికుడు నెహ్రు గారి ప్రపకంతో కాశ్మీరుకుప్రత్యేక ప్రతిపత్తి అని, వేరే జెండా, అని వేరే రాజ్యాంగం అనీ సాధించుకుని దాదాపు వేరే దేశంగా దానికి రాజు అయ్యాడు. తరువాత శ్యాంప్రసాద్ ముఖర్జీ అనే బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ ప్రారంభం చేసి ఆ జెండా, రాజ్యాంగం వేరు, కాశ్మిర్ ప్రధాన మంత్రి అనే పేర్లను తీయించి, తను కాశ్మీర్ లోనే బంధింపబడి, చనిపోయారని ప్రకటించారు.  ఇది మన స్వతంత్ర సంగ్రామాలు, పర్యవసానాలు, ఫలితాలు. చదవండి చదివించండి.  ఇది మన దేశ చరిత్ర. మీ నరసింహ మూర్తి 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans  ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

2 comments