Page Nav

HIDE

Classic Header

{fbt_classic_header}

Top Ad

Popular Posts

Latest Posts

latest

విప్లవ వీరుడు-చంద్ర శేఖర్ ఆజాద్-Freedom Fighter Chandra Sekhar Azad

జననం: జూలై 23, 1906 మరణం: ఫిబ్రవరి 27, 1931 భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన ...

జననం: జూలై 23, 1906
మరణం: ఫిబ్రవరి 27, 1931
Image result for chandra sekhar azad

భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.
భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా (భాబ్ గా) గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.
1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.
విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై (వందేమాతరం) అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.
సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు.
1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన 'పంజాబ్ కేసరీ లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారంగా రాజ్ గురు, భగత్ సింగ్, బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపగా, సాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టబులు రాండ్ ను అజాద్ కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా 30 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు. అ రోజు 1931, ఫిబ్రవరి 27, శుక్రవారం అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.
భారత స్వాతంత్య్రో ద్యమంలో తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి చివరిి బ్రిటిష్‌ వారితో పోరాడుతూ ప్రాణాలను దేశానికి అర్పించిన భారతమాత ముద్దు బిడ్డ చంద్రశేఖర్‌ ఆజాద్‌. నేటికి ఆయన త్యాగాన్ని స్మరించని భారతీయుడు లేడు. ఆజాద్‌ మధ్యప్రదేశ్‌లోని జబువ జిల్లాలో ,భవ్రా అనే గ్రామంలో 1906 జులై23న జన్మించాడు. ఆజాద్‌ను చాలా మంది పండిత్‌జిగా కూడా పిలిచేవారు. 1857 తొలి స్వాతంత్య్ర పోరాటం తరువాత ఆ స్థాయిలో విప్లవం పట్ల ప్రజలను ప్రేరేపించిన వ్యక్తి ఆజాద్‌.సంప్రదాయ ్ర బాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆజాద్‌ ఇతరుల కోసం పోరాటం చేయడం ‘ధర్మం’గా భావించేవాడు. అంతేకాకుండా సైనికుడు కేవలం తన ఆయుధంపై మాత్రమే ఆధారపడకూడదని ఆయన బలంగా నమ్మేవాడు.1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ దుశ్చర్య ఆజాద్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది.1921లో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సహాయక నిరాకరణోద్యమంలో ఆజాద్‌ చురుకుగా పాల్గొన్నాడు.
ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు పదిహేన్నేళ్ల ఆజాద్‌ తొలిసారిగా అరెస్ట్‌ అయ్యాడు కూడా. కోర్టులో మెజిస్ట్రేట్‌ అతని పేరు అడిగినప్పుడు ‘నా పేరు ఆజాద్‌’ (స్వాతంత్య్రం) అని తెలిపాడు. దీంతో ఆగ్రహించుకున్న మెజిస్ట్రేట్‌ పదిహేను కొరడా దెెబ్బలు కొట్టాల్సిందిగా రక్షణ సిబ్బందిని ఆదేశించాడు. దెబ్బ పడిన ప్రతీసారి ‘ భారత మాతా కి జై’ అని నినాదాన్ని పలికాడు. ఆ తరువాత చంద్రశేఖర్‌ను అందరూ ఆజాద్‌గా పిలవడం ప్రారంభించారు.
సహాయ నిరాకరణోద్యమం తరువాత ఆజాద్‌కు హింసాత్మక మార్గంవైపు ఆసక్తి కలిగింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ప్రాణాలను అర్పించడానికే కాకుండా, ప్రాణాలను తీయడానికి కూడా సిద్ధం అయ్యాడు. అందులో భాగంగానే ‘హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ను ప్రారంభించాడు. భగ త్‌సింగ్‌, సుఖ్దేవ్‌, భటుకేశ్వర్‌ దత్‌, రాజ్‌గురు వంటి స్వాతంత్య్రోమ యోద్దులకు మార్గదర్శకులుగా నిలిచారు. భారతదేశాన్ని సామ్యవాద సూత్రాలకు అనుగుణంగా నిర్మిద్దామని భావించాడు. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించుకున్నాక...బ్రిటిష్‌ వారిపై భౌతికంగా దాడులకు దిగాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన మిత్రులతో పాటు అనే దాడులకు ప్రణాళిక వేసి, వాటిని పూర్తి చేశాడు.
చివరి క్షణాలు
అది ఫిబ్రవరి 27, 1931. చంద్రశేఖర్‌ ఆజాద్‌ అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్‌ పార్క్‌లో తన ఇద్దరు కామ్రెడ్‌లను కలిశారు. అయితే ఈ సమావేశాన్ని దూరం నుంచి ఒక బ్రిటిష్‌ పోలిస్‌ గమనించాడు. కొద్ది క్షణల్లోనే పోలీసులు పార్కును చుట్టుముట్టారు. లొంగిపొమ్మని ఆజాద్‌కు ఆజ్ఞాపించారు. ఆజాద్‌ ససేమిరా కాదన్నాడు. చివరికి ఫైరింగ్‌ ప్రారంభమైంది. ఆజాద్‌ గన్నులో ఉన్న బుల్లెట్స్‌తో నలుగురు పోలిస్‌లను కాల్చిచంపాడు. ఈ ఫైరింగ్‌లో అతని తొడలోకి ఒక బుల్లెట్‌ దూసుకెళ్లింది. దీంతో ఆజాద్‌ ఒక చెట్టు చాటున నక్కి కూర్చున్నాడు. తన వద్ద ఆయుధాలు లేవని తెలుసుకుని, తప్పించుకునే మార్గం లేదని నిర్ధారించుకున్నాడు ఆజాద్‌.
‘నా వద్ద తుపాకీ ఉన్నంత కాలం నన్నెవ్వరూ సజీవంగా పట్టుకోలేరు’ అని ఒక సందర్భంలో తెలిపిన ఆజాద్‌ చావడానికైనా సిద్ధం అయ్యాడు కానీ లొంగడానికి సిద్ధం కాలేదు. అందుకే వెంటనే తన వద్ద ఉన్న ఒక బుల్లెట్‌ ను చూసి గన్నును తలకు ఎక్కుపెట్టి ట్రిగ్గర్‌ నొక్కి భారతమాత కోసం ప్రాణాలను అర్పించి ప్రజల జ్ఞాపకాలలో అమరుడయ్యాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..