Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

డిల్లీ రహస్యం-మోడీ మగాడు - raka sudhakar

ఢిల్లీ కా లడ్డూ ఇదేదో చాలా స్పెషల్ అనుకుంటారు. ఢిల్లీ లడ్డూ తినాలని చాలా మంది కోరుకుంటారు. తహతహలాడతారు. ఉబలాటపడతారు. కానీ తిన్నాక అయ్యో ...

ఢిల్లీ కా లడ్డూ ఇదేదో చాలా స్పెషల్ అనుకుంటారు. ఢిల్లీ లడ్డూ తినాలని చాలా మంది కోరుకుంటారు. తహతహలాడతారు. ఉబలాటపడతారు. కానీ తిన్నాక అయ్యో ఇంతేనా అనుకుంటారు. ఉసూరుమనుకుంటారు. అందుకే ఢిల్లీ కా లడ్డూ జో నహీ ఖాతా హై, వోహ్ పఛ్ తాతా హై. జో ఖాతా హై, వోహ్ భీ పఛ్ తాతాహై అని సామెత పుట్టుకొచ్చింది. అంటే ఢిల్లీ లడ్డూ తినని వాడు కావాలని తహతహలాడతారు. తిన్న వాడు ఇంతేనా అని ఉస్పూరుమంటాడు. ఢిల్లీ కా లడ్డూ మోహాన్ని జయించిన వాడు నిజంగా ఘనుడు, ఘటికుడూనూ.

ముత్తువేల్ కరుణానిధి ఏనాడూ ఢిల్లీ వెంట పడలేదు. ఢిల్లీయే ఆయన వెంట పడింది. తన ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రుల సమావేశాలు మినహా ఢిల్లీకి వెళ్లింది తక్కువ. 1969 లో పెద్ద పాచిక వేసి తన ఇరవై అయిదు మంది ఎంపీలను ఇందిరమ్మకు మద్దతుగా నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ ఆయన దగ్గరకు వచ్చింది తప్ప ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. తరువాత ఎమర్జెన్సీని వ్యతిరేకించినప్పుడు దేశంలోని చాలా మంది విపక్ష నేతలు ఆయన దగ్గరకే వచ్చారు తప్ప ఆయన వారి దగ్గరికి వెళ్లలేదు. తరువాత అస్థిర రాజకీయాల ఎనభైయవ దశకంలో, 90 వ దశకంలో సంకీర్ణ రాజకీయాలు దక్షిణాగ్రంలోని కరుణానిధిని దేశ రాజకీ యాల శిఖరాగ్రానికి తీసుకెళ్లాయి. అప్పుడూ ఆయన ఢిల్లీని తన వద్దకు రప్పించుకున్నారే తప్ప ఢిల్లీకి వెళ్లలేదు.ఆయన ప్రతినిధులే ఢిల్లీలో ఆయన గొంతును వినిపించారు తప్ప ఆయన ఢిల్లీ గ్రూప్ ఫోటోలో చోటు కోసం తహతహలాడలేదు. వాజ్ పేయీ, అడ్వాణీ ఎవరైనా చెన్నై ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సిందే తప్ప కరుణానిధి రాజధాని ఎక్స్ ప్రెస్ ఎక్కలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా టెలికాం, వాణిజ్య శాఖలు తమ చేతుల్లోనే పెట్టుకుని స్పెక్ట్రమ్ ప్రపంచాన్ని కరుణానిధి శాసించారు. ఆఖరికి స్పెక్ట్రమ్ స్కాము పాములా కాటేస్తే నురగలు కక్కుకున్నది కాంగ్రెస్. బోనెక్కింది మన్మోహన్ సింగ్. సంజాయిషీలు చెప్పింది సోనియా గాంధీ. కనిమొళి, రాజాలు జైలుకెళ్లినా కరుణానిధి మాత్రం కడిగిన ముత్యమే అన్నట్టు ఉండిపోయారు. ఇంత జరిగినా కాంగ్రెస్ కరుణానిధి నివాసం దగ్గర చేతులు కట్టుకుని నిలుచుందే తప్ప మరేం చేయలేదు. 

ఢిల్లీ రహస్యం ఇదే. కరుణానిధిలా ఈ రహస్యం తెలిసిన నాయకులు దేశరాజకీయాల్లో చాలా కొద్ది మంది ఉన్నారు. అలాంటి వాడే బాలాసాహెబ్ ఠాక్రే. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనీసం వార్డు కౌన్సిలర్ గా కూడా నిలబడలేదు. ఆయన  పెదవినుంచి సిగార్ పైప్ తీసేలోపల ముఖ్యమంత్రి సహా సెక్రటేరియట్ మొత్తం మాతో శ్రీకి పరుగు పరుగున వచ్చి చేతులు కట్టుకుని నిలబడేది. నిన్ను చూసి ముంబాయి అంతా భయపడుతుందట కదా? అని సుప్రసిద్ధ జర్నలిస్టు రజత్ శర్మ ఒక సారి బాలాసాహెబ్ ఠాక్రేని ప్రశ్నించారు. నన్ను చూసి భయపడకపోతే నిన్ను చూసి భయపడుతుందా? అని బాలాసాహెబ్ ఎదురు ప్రశ్న వేశారట. అందరి నోళ్లూ మూయించే రజత్ శర్మ నోరు మూత పడింది.

దళిత దార్శనికుడు కాన్షీరామ్ కూడా అంతే. ఆయన ఒకసారి లోకసభకు పోటీ అయితే చేశారు.  కానీ ఆయన ఢిల్లీలో ఉంటూనే ఢిల్లీకి వెళ్లలేదు. ఆయన బామ్ సెఫ్ సంస్థ పనిమీదో, డీ ఎస్ ఫోర్ సంస్థ పని చేశారు తప్ప రాజకీయ నేతల గడప తొక్కలేదు. ఆ విషయంలో ఆయన తామరాకుమీద నీటి బొట్టే. కానీ ఆయన కూడికలు, కుండలీకరణలన్నీ దళితులకు ఢిల్లీ పీఠాన్ని ఇప్పించేందుకే. ఆయన దళితుల కోసం పాముతోనైనా దోస్తీ చేస్తానన్నారు. కమ్యూనిస్టులు తప్ప అందరితోటీ పొత్తులు పెట్టుకున్నారు. ఎక్కడో స్కూళ్లో పాఠాలు చెప్పుకుంటూ బతుకుతున్న మాయావతి అనే ఒక పంతులమ్మను ఉద్యోగం మాన్పించి, బిజ్నోర్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి లక్నో లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రిని చేశారు. దళితులకు రాజ్యాధికారం అన్న స్వప్నంలో తొలి అంకాన్ని నిజం చేసుకున్నారు. దేశం లోని పెద్ద పెద్ద పార్టీలన్నీ పొత్తులు కట్టేందుకు, వోట్లు చీల్చేందుకు, వోట్లు వేయించుకునేందుకు కాన్షీరామ్ దగ్గరికి క్యూ కట్టాయి. బేరాలు సాగించాయి. ఆయన ఎవరి వద్దకూ వెళ్లిన దాఖలాలు లేవు. నిజం!! ఢిల్లీ ఆయన దగ్గరకి వచ్చింది తప్ప ఆయన ఢిల్లీకి వెళ్లలేదు.
ఇలాంటి ఆయనే ఇంకొకరున్నారు. ఆయన వీరందరిలాంటి వాడే. కానీ వీరందరి కంటే భిన్నం. ఆయనని ఢిల్లీ వద్దంది. ఆయన సొంత రాష్ట్రంలో సొంత పార్టీలో ఒకవర్గం వద్దంది. ముఖ్యమంత్రి గారు ఆయన రాష్ట్రానికి రాకూడదని పార్టీ అధినాయకత్వానికి షరతు విధించాడు. చివరికి ఎవరో దయదలచి ఢిల్లీలో తల దాచుకునేందుకు పార్టీ కార్యలయంలో ఒక గదిని ఇచ్చారు. ఆ గదీ ఇంకొకరితో పంచుకోవాల్సి వచ్చింది. నాలుగేళ్లు ఆయన తన రాష్ట్రానికీ చెందలేదు. ఢిల్లీలో ఉంటూనే ఢిల్లీకీ చెందలేదు. చివరికి ఒకానొక అతి విచిత్రపరిస్థితితో ఆయనను వద్దన్న రాష్ట్ర పార్టీ ఆయన్ను ముఖ్యమంత్రిగా పిలిపించింది.ఆయనా పార్టీ పనిమీదో, ముఖ్యమంత్రుల సమావేశానికో తప్ప మళ్లీ ఢిల్లీకి వెళ్లలేదు. పన్నెండేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాక ఆయన ప్రధాని అయి ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూనే ఢిల్లీ కి చెందని వ్యక్తి. ఢిల్లీ అధికార పీఠాన్ని అతుక్కుని ఉండే లుట్యెన్స్ క్రౌడ్ అనబడే వారికి ఆయన ఇప్పటికీ దూరం. వారిని ఆయన పట్టించుకోరు. ఢిల్లీ ఆభిజాత్యానికి ప్రతీకల్లాంటి వారెవరినీ ఆయన ముట్టుకోవడం లేదు. కానీ ఆ అతిశయపు ఢిల్లీ ఆయన వెంట పడుతోంది. ఆయన పేరు నరేంద్ర దామోదరదాస్ మోడీ. మిగతా వారికి తమ తమ రాష్ట్రాలే కంచుకోటలైతే ఈయనకు అదీ లేదు. 
తమాషా ఏమిటంటే ఇలాంటి నాయకుల కోసం ప్రాణాలు పెట్టేవాళ్లు ఎంతమంది ఉంటారో వాళ్లను పచ్చిగా ద్వేషించేవాళ్లూ ఉంటారు. కరుణానిధిని అన్నా డీఎంకే అతి భయంకరంగా ద్వేషించింది. బాలాసాహెబ్ ఠాక్రేని ద్వేషించే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. కాన్షీరామ్ నూ ద్వేషించేవాళ్ల సంఖ్యా తక్కువేం కాదు. ఇక నరేంద్ర మోదీ సంగతి చెప్పనక్కర్లేదు. ఆయనను ఎవరైనా చంపేస్తే బాగుండు అని ట్విట్లర్  లో గొంతు చించుకునేవాళ్ల సంఖ్యా తక్కువేం కాదు. కరుణానిదికి వేర్పాటువాది, ప్రాంతీయ వాది అని ముద్రలేశారు. బాలాసాహెబ్ ఠాక్రే కి గూండా నుంచి ముస్లిం ద్వేషి వంటి ఎన్నో భుజకీర్తులు తగిలించారు. కాన్షీరామ్ ను దళిత దురహంకారి, పచ్చి అవకాశవాది వంటి విశేషణాలతో వర్ణించారు. ఇక నరేంద్ర మోదీ మౌత్ కే సౌదాగర్ వంటి విచిత్రాతి విచిత్ర విశేషణ విభూషితుడు. ఎవరేమన్నా, ఎన్నెన్ని విమర్శలు కురిపించినా ఢిల్లీయే వారి వెంట పడాల్సి వచ్చింది. ఢిల్లీని తమ చుట్టూ తిప్పుకోగలిగే నాయకులు వీరు. ఢిల్లీలో చక్రం తిప్పేశామని, తిప్పుతామని  అనుకునే చాలా మందిపైపు ఢిల్లీ కన్నెత్తి కూడా చూడదు. అదీ తమాషా!!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments