Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మరో ‘నెపోలియన్’-RussiaPutin

రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మరో ‘నెపోలియన్’ వలె చరిత్ర ప్రసిద్ధికెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం రష్యాకు, పడమటి దేశాలకు ...

Image result for putin

రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మరో ‘నెపోలియన్’ వలె చరిత్ర ప్రసిద్ధికెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం రష్యాకు, పడమటి దేశాలకు మధ్య నడుస్తున్న ‘దౌత్యవేత్తల బహిష్కరణ’ ప్రహసనం పుతిన్ ఇలా ఉవ్విళ్లూరడానికి సరికొత్త ప్రేరకం. పదునాలుగవ తేదీన బ్రిటన్ ప్రభుత్వం ఇరవై ముగ్గురు రష్యా దౌత్యవేత్తలను తమ దేశం నుండి బహిష్కరించడం ఆరంభం.. పదిహేడవ తేదీన రష్యా ప్రతీకార చర్యకు పూనుకుంది, ఇరవై ముగ్గురు బ్రిటన్ దౌత్యవేత్తలను పుతిన్ ప్రభుత్వం తమ దేశం నుండి వెళ్లగొట్టింది. ఈ ‘బహిష్కరణ’ల ప్రహసనం ఇప్పుడు మరింత తీవ్రస్థాయికి చేరింది. అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాల ప్రభుత్వాలు నూట ఇరవై ఆరు మంది రష్యా దౌత్యవేత్తలను తమ దేశాల నుండి బహిష్కరించడం ప్రహసనంలో వర్తమాన ఘట్టం. బ్రిటన్‌కు, రష్యాకు మధ్య మొదలైన దౌత్యయుద్ధం- పాశ్చాత్య దేశాలకు, రష్యాకు మధ్య సంఘర్షణగా మారడానికి ప్రధాన కారణం పుతిన్ విచిత్ర వ్యక్తిత్వం. ప్రచ్ఛన్నయుద్ధం- కోల్డ్‌వార్ - మళ్లీ మొదలు కావాలన్నది పుతిన్ మహత్వాకాంక్ష. పడమటి దేశాల పట్ల పుతిన్ ‘తీవ్ర వ్యతిరేకత’ను ప్రదర్శిస్తూండడం దశాబ్దికి పైగా నడుస్తున్న చరిత్ర... రష్యాలో పుతిన్ ప్రాబల్యం పెరుగుతున్నకొద్దీ ఈ పడపటి ‘వ్యతిరేకత’ పెరుగుతోంది. ప్రచ్ఛన్న యుద్ధాన్ని మరోసారి వ్యవస్థీకరించడం ద్వారా తమ దేశం ప్రాధాన్యాన్ని పెంచుకోవాలన్నది పుతిన్ వ్యూహం! రెండవ ప్రపంచ యుద్ధం పరిసమాప్తమై డెబ్బయి మూడేళ్లయింది. యుద్ధ పరిసమాప్తి తరువాత నలబయి ఆరేళ్లపాటు అమెరికా నాయకత్వంలోని పడమటి దేశాలకు, సోవియట్ రష్యాకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. ఇరవై ఏడేళ్ల క్రితం సోవియట్ రష్యా- సోవియట్ సామ్యవాద గణ రాజ్యసమాఖ్య- యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్- యుఎస్‌ఎస్‌ఆర్-లో కమ్యూనిస్ట్ నియంతృత్వం అంతరించింది. ‘యుఎస్‌ఎస్‌ఆర్’ పదిహేను దేశాలుగా విడిపోయింది. ఈ పదహైదు దేశాలలో రష్యా అతి పెద్దది. అందువల్ల ‘సోవియట్ యూనియన్’ వారసత్వం రష్యాకు లభించింది. ‘సమాఖ్య’ విచ్ఛిన్నమైన సమయంలో ఆర్థికంగా దివాలా తీసిన రష్యా అంతర్జాతీయ సమాజంలో రాజకీయ ప్రాధాన్యం కోల్పోయింది. అమెరికా అగ్ర రాజ్యంగా అవతరించింది..
కోల్పోయిన ప్రాధాన్యాన్ని తిరిగి సాధించడానికి పుతిన్ గత పద్దెనిమిది ఏళ్లుగా ఎంచుకున్న మార్గం పడమటి దేశాలను ప్రధానంగా అమెరికాను వ్యతిరేకించడం. తాను వ్యక్తిగతంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ధిని గడించడం ద్వారా రష్యాను మళ్లీ అమెరికాకు దీటుగా నిలబెట్టాలన్నది ఆయన దీర్ఘకాల లక్ష్యం. ఇలా వ్యక్తిగత ప్రతిష్ఠను సాధించడానికి పుతిన్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రవర్తనా వైచిత్రి తర్కబద్ధమైనదా? అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. 2007లో అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ రష్యాను సందర్శించాడు. రష్యా రాజధాని మాస్కోలో పుతిన్‌తో కలసి అతగాడు సంయుక్త సమావేశం నిర్వహించి, ప్రజాస్వామ్య సంప్రదాయాల ఔన్నత్యం గురించి మాధ్యమాల ప్రతినిధులకు వివరించాడు. పుతిన్ మధ్యలో జోక్యం చేసుకొని, ‘మీరు ఇరాక్‌లో ఏర్పాటు చేసిన తరహా ప్రజాస్వామ్యం మాకు వద్దు..’-అని జార్జిబుష్‌కు ‘ముఖం నీళ్లు దించాడు’. గొప్ప అహంకారి అయిన జార్జిబుష్ విస్మయ చకితుడైపోయాడు! పేరుతెచ్చుకొనడానికై పుతిన్ గుఱ్ఱపుస్వారీ చేశాడు. అధ్యక్షుడు ఇలా గుఱ్ఱపు స్వారీలు చేయకూడదా? అన్నది సమాధానం లేని మరోప్రశ్న. 2000లో అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో, ఇంతగా ప్రసిద్ధుడు గాని పుతిన్ జపాన్‌కు వెళ్లాడు. జపాన్ రాజధాని టోకియోలో జరిగిన ‘జోడో’ యుద్ధ క్రీడా ప్రదర్శనను తిలకించడంతో సరిపెట్టుకోలేదు. నసూమీగూమీ అన్న పదేళ్ల బాలికతో ‘జోడో’ యుద్ధం చేశాడు. ‘జోడో’లో పుతిన్ సిద్ధహస్తుడట, ‘నల్లపట్టా’- ‘బ్లాక్‌బెల్ట్’-ను సాధించాడట! కానీ పదేళ్ల పసిపాప నసూమీగూమీతో పుతిన్ చేసిన ‘యుద్ధం’ ముప్పయి క్షణాలలో ముగిసిపోయింది. ఈ అర నిముషంలోనే ఆ పాప పుతిన్‌తో తలపడి తన భుజం పక్కగా పుతిన్‌ను తల్లకిందులుగా తిప్పి నేలపైకి విసిరికొట్టింది. ఈ ‘జోడో’యుద్ధంలో పరాజయం పాలైనప్పటికీ పుతిన్‌కు గొప్ప పేరు వచ్చింది. ఆ తరువాత చైనాకు వెళ్లిన పుతిన్ బీజింగ్‌లో అప్పటి చైనా అధ్యక్షుడు హూజింటావో భార్యను పాశ్చాత్య సంప్రదాయానుసారం ఆప్యాయంగా ఆలింగనం చేసుకోబోయాడు. హూజింటావ్ దంపతులు, చైనీయ అధికారులు ప్రాచ్యదేశాలలో ఈ పశ్చిమ నాగరికతను ప్రవేశపెట్టదలచిన పుతిన్ వైచిత్రిని చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు అప్పుడు ప్రచారమైంది. అవ్యవస్థిత మానసిక ప్రవృత్తికల వారి మంచితనం కూడ భయంకరంగా ఉంటుందన్న సామెతకు జీవన సాక్ష్యం పుతిన్ వ్యవహారం. ‘అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః!
Image result for syria

ఆరబ్ దేశాలలో సంభవించిన ‘ప్రజావిప్లవం’ ఫలితంగా అనేక దేశాలలో నియంతల అధికారం అంతరించింది. కానీ సిరియాలో మాత్రం బషీర్ అల్ అసాద్ నియంతృత్వ ప్రభుత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఇందుకు ఏకైక కారణం రష్యా, చైనాలు అసాద్‌ను సమర్ధించడం. నియంతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజాసైనికులను అమెరికా సమర్ధిస్తోంది, బ్రిటన్ సమర్ధిస్తోంది. అంతర్జాతీయంగా అమెరికాను ఢీకొనాలన్న ఆకాంక్షతో మాత్రమే పుతిన్- ప్రజాస్వామ్య రష్యా అధినేత- సిరియాలోని నియంత కొమ్ముకాస్తున్నాడు. ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న పోరాటం వల్ల ఛిన్నాభిన్నమై ఉన్న సిరియాలోని ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’- ఐసిస్- బీభత్స సంస్థ చొరబడిపోయింది. పుతిన్ నాలుకను కరచుకోవలసి వచ్చింది. ఒకప్పుడు ‘సోవియట్ యూనియన్’లో ఉండిన ఉక్రెయిన్ ఇప్పుడు స్వతంత్ర దేశం. ఉక్రెయిన్ నుంచి ‘క్రీమియా’ అన్న ప్రాంతాన్ని విడగొట్టి రష్యాలో కలుపుకోవడం పుతిన్ పాల్పడిన మరో ఐరోపా వ్యతిరేక చర్య. ఈ చర్య ఫలితంగా ఎనిమిది సంపన్న దేశాల కూటమి- జీ8- నుంచి రష్యా బహిష్కరణకు సైతం గురైంది. అయినప్పటికీ ‘అమెరికా, ఐరోపా’ల కూటమికి తాను ప్రధాన ప్రత్యర్థినన్న కీర్తిని మాత్రం పుతిన్ సాధించగలిగాడు. 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని బ్రిజ్‌బన్‌లో జరిగిన ‘ఇరవై ప్రముఖ దేశాల కూటమి’- జీ 20- సమావేశంలో అధిక దేశాలు ‘ఉక్రెయిన్- క్రీమియా’ విషయమై రష్యాను అభిశంసించాయి. ఇవి ప్రధానంగా ఐరోపా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. పుతిన్ రుసరుస లాడుతూ సమావేశాల మధ్యలోనే నిష్క్రమించాడు! పాకిస్తాన్‌తో రక్షణ సహకారం పెంపొందించుకొనడం, పాకిస్తాన్‌కు ఆయుధాలను విక్రయించడానికి అంగీకరించడం అమెరికా పట్ల పుతిన్ వ్యతిరేకతకు పరాకాష్ఠ. ఏడు దశాబ్దులపాటు బీభత్స పాకిస్తాన్‌ను దూరంగా ఉంచిన రష్యా ఇలా పాకిస్తాన్‌కు సన్నిహితం కావడం పుతిన్ మన దేశానికి వ్యతిరేకంగా తలపెట్టిన అమిత్ర చర్య...
ఐరోపా అమెరికా దేశాలలో రష్యా గూఢచారులున్నారు. రష్యాలో ఈ దేశాల గూఢచారులున్నారు. వీరిలో కొందరు వివిధ దేశాలకు రహస్య గూఢచారులు ఈ ‘ద్వంద్వ ప్రతినిధులు’-డబుల్ ఏజెంట్స్- నిజానికి ఏ దేశానికి మిత్రులు? ఏ దేశానికి శత్రువులు?- అన్నది ఎప్పుడో కాని తేలదు. ఇలా రష్యాకు, బ్రిటన్‌కు కూడ ‘డబుల్ ఏజెంట్’గా పనిచేసిన ఒక గూఢచారి ప్రస్తుతం ఇంగ్లాండులో ఉన్నాడట. ఆయనను, ఆయన కుమార్తెను హత్యచేయడానికై రష్యా దౌత్యవేత్తలు రసాయన విషాలను ప్రయోగించారట! దౌత్యవేత్తల బహిష్కరణకు ఇదీ కారణమట. ఈ బహిష్కరణలు ఇంతగా విస్తరించడానికి దీర్ఘకాల నేపథ్యం ప్రచ్ఛన్న యుద్ధం.

No comments