Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తమిళనాడులో బ్రాహ్మణులు మాయం కానున్నారా?

ఇంకొక 30 - 40 సంవత్సరాలలో తమిళనాడులో బ్రాహ్మణులు అంతరించి పోనున్నారు. 1930 లో 8% ఉన్న వారు ఇప్పుడు 3% కంటే తక్కువ ఉన్నారు. అక్కడ బ్రాహ్మణ...

Image may contain: 1 personNo automatic alt text available.

ఇంకొక 30 - 40 సంవత్సరాలలో తమిళనాడులో బ్రాహ్మణులు అంతరించి పోనున్నారు. 1930 లో 8% ఉన్న వారు ఇప్పుడు 3% కంటే తక్కువ ఉన్నారు. అక్కడ బ్రాహ్మణులపై అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పెరియార్ సిద్ధాంతం బలంగా ఉన్న తమిళనాడులో బ్రాహ్మణులు బ్రతకటమే కష్టంగా ఉంది. అక్కడి రాజకీయ నాయకులు బ్రాహ్మణులపై బహిరంగంగా విద్వేషకర వ్యాక్యలు చేసినా దాన్ని చూపటానికి అక్కడి అమ్ముడుపోయిన మీడియాకు మనసు రావడం లేదు. ఒకప్పుడు హిందూ ధర్మానికి కేంద్రంగా ఉన్న తమిళనాడులో నేడు హిందువుగా బ్రతకడం కష్టంగా ఉంది. ద్రావిడ భావజాలం అధికంగా ఉన్న తమిళనాడు ప్రజలు తాము ఒకప్పుడు అణచివేయబడ్డామని నూరి పోయబడ్డారు. ఇప్పుడు ఢిల్లీ పెత్తనం అంటూ కబుర్లు చెప్పే మన రాజకీయ నాయకులు ఒకవేళ దురదృష్టవశాత్తూ భారతం నుండి దక్షిణ భారతం వేరు పడినా తమిళుల పెత్తనం తట్టుకోవడం కష్ట మవుతుంది. అప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక దేశంగా విడిపోవడం అనేది తధ్యం. అప్పుడు భారతం మొత్తం బలహీనమై మళ్ళా విదేశీ బానిసత్వంలోకి వెళ్ళాల్సి వస్తుంది. నేడు మన రాజకీయ నాయకులు తమ ఆస్థులు,పదవులు కాపాడుకోవడం కోసం ప్రత్యేక వాదం పైకి తెస్తున్నారు. కులగజ్జితోనో, మరో గజ్జితోనో వాళ్ళని సమర్ధించే వారు మన భావితరాలకు తీరని అన్యాయం చేసిన వారు అవుతారు. ఇన్ని సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రాంతీయ పార్టీలను తరిమికొట్టి భాజపాకు పట్టం కట్టాలి. హిందువులు 85 % తగ్గకుండా ఉన్నంత వరకూ ఈ దేశాన్ని ఏ విద్రోహ శక్తి ఏమీ చేయలేదు. రాజకీయ నాయకులు విసిరే కులవలలో చిక్కుకోకుండా హిందువులు జాగ్రత్త పడాలి ...

No comments