ఇరవయ్యవ శతాబ్దపు ఏడవ దశకం అంటే 1970లలో అమెరికాలో యువతలో హిప్పీ ఉద్యమం ఉరకలెత్తుతున్న రోజుల్లో ఇద్దరు యువకులు తమ జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. ఒకరు చికాగో నుండి వచ్చిన బ్రూక్ డేవిస్ (భగవాన్ దాస్), మరొకరు కాలిఫోర్నియా నుండి వచ్చిన బ్రయన్ టిబ్బిట్స్ (ఇంద్రాయుమ్న స్వామి). ఇద్దరూ ఇస్కాన్ శ్రీల ప్రభుపాదుల దగ్గర శిశ్యులుగా చేరి, “పశ్చిమ దేశాల్లో హరినామాన్ని వ్యాప్తి చేయండి” అనే గురుదేవుల ఆదేశాన్ని పాటిస్తూ ఫ్రాన్స్ బయలుదేరారు.
1972లో భగవాన్ దాస్ పారిస్‌లో మొదటి ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించినప్పుడు ఫ్రాన్స్‌లో ఎవరికీ కృష్ణుడు అంటే తెలియదు. రోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి, సీన్ నది తీరంలో, నోట్రెడామ్ కేథడ్రల్ ముందు, ఈఫిల్ టవర్ క్రింద, మెట్రో స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ మృదంగం, కరతాళాలతో “హరే కృష్ణ” మహామంత్రాన్ని ఆలపించారు. ఫ్రెంచి ప్రజలు ఆశ్చర్యంగా చూసేవారు, కొందరు నవ్వేవారు, కానీ ఆ ధ్వని కొందరి హృదయాల్లోకి వెళ్ళింది, దానికి అప్పటికే ఫ్రాన్స్ లో స్థిరపడ్డ భారత హిందువుల భక్తి తోడయ్యింది. అది మొదలు ఇంక అక్కడ భక్తి ఉద్యమం మొదలయ్యింది.
1974లో శ్రీల ప్రభుపాదులు పారిస్‌కు వచ్చి భగవాన్ దాస్‌తో ఇలా అన్నారు: “పారిస్‌లో ఒక చిన్న ఆలయం మాత్రమే కాదు, ఒక గ్రామీణ ఆశ్రమం కూడా ఉండాలి. గో-రక్షణ, వ్యవసాయం, సరళ జీవనం, ఉన్నత ఆలోచన”. ఆ మాటే మంత్రంగా మారింది. 1975లో పారిస్ నుండి 300 కిలోమీటర్ల దూరంలోని చాటౌ డి ఔబ్లైజ్ అనే పాత రాజభవనాన్ని భక్తులు కొనుగోలు చేశారు. శ్రీల ప్రభుపాదులే దానికి “న్యూ మాయాపూర్” అని పేరు పెట్టారు. శ్రీ చైతన్య మహాప్రభు జన్మభూమి మాయాపూర్‌ను గుర్తుచేసే పవిత్ర నామం పారిస్ కృష్ణ దేవాలయానికి పెట్టారు.
1975లో ప్రభుపాదులు మొదటిసారి న్యూ మాయాపూర్‌కు వచ్చినప్పుడు ఆ భూమి మీద నడుస్తూ, “ఇది నా అత్యంత ప్రియమైన ప్రాజెక్టు” అని ఆనందంగా చెప్పారు. తన చేతులతోనే శ్రీ కృష్ణ-బలరామ విగ్రహాలను ప్రతిష్ఠించారు, గోవర్ధన శిలను ఆలయంలో ఏర్పాటు చేశారు. ఆ శిల ఇప్పటికీ అక్కడ ఉంది. ప్రభుపాదుల కరస్పర్శ ఉన్న పరమ పవిత్ర శిలను పాశ్చాత్య భక్తులు ఎంతో ప్రేమతో స్పర్శిస్తూ పరవశం చెందుతారు. 1976లో రెండోసారి వచ్చినప్పుడు పొలాల్లో నడుస్తూ, గోవులను చూసి, “ఇక్కడే వరాహ దేవుడు భూమిని ఎత్తినట్లు భావించండి” అని ఆశీర్వదించారు. ఆ రెండు సందర్శనల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు ఇప్పటికీ న్యూ మాయాపూర్ భక్తులకు ప్రేరణా దీపాలయ్యాయి.
1980ల ప్రారంభంలో ఇంద్రాయుమ్న స్వామి న్యూ మాయాపూర్ టెంపుల్ ప్రెసిడెంట్‌గా నాలుగేళ్లు సేవ చేశారు. ఆయన లక్ష్మీ-నృసింహ దేవుడిని ఆలయంలో ప్రతిష్టించారు, గోవర్ధన పరిక్రమ మార్గాన్ని నిర్మించారు. ఉదయం మూడు గంటలకు లేచి తులసీ పూజ చేసేవారు. ఆ తులసీ వనం ఇప్పటికీ ఆలయంలో పెరుగుతోంది. ఆ తరువాత గౌడమండల దాస్, గంధర్విక రాయి దేవి దాసి, ఇంకా అనేక మంది భక్తులు ఈ పవిత్ర భూమిని కాపాడుకుంటూ వచ్చారు. 2025లో న్యూ మాయాపూర్ తన 50వ జయంతిని ఘనంగా జరుపుకుంటోంది.
ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని శ్రీల ప్రభుపాదుల శిష్యుడు, 1970లోనే హరినామంలో మునిగిపోయిన లోకనానంద దాస్ (లోకనానందన ప్రభు) నడిపిస్తున్నారు. 1970లో లండన్ రథయాత్రలో త్రిభువన్నాథ ప్రభు కీర్తన విని కృష్ణ భక్తిలో తన్మయం చెందిన ఆ యువకుడు ఇప్పుడు ప్రభుపాదుల కార్యనిర్వాహకుడు. (ఆ ఇద్దరి చిత్రాలు ఒరిజినల్ దొరకలేదు) (చిత్రం లోకానంద దాస్ ప్రస్తుత పారిస్ ఇస్కాన్ నిర్వాహకుడు)
50 ఏళ్ల చరిత్రలో (1975-2025), ఇక్కడి రిట్రీట్లు, ఉత్సవాలు, భగవద్గీతా ఉపన్యాసాలు వందలాది మంది ఫ్రెంచ్ యూవతను ఆకర్షించాయి. 2025 జన్మస్థాని, రాధాష్టమి వంటి ఉత్సవాల్లో వేలాది మంది (3,000-5,000) పాల్గొంటారు. ఇక్కడి ఆర్గానిక్ ఫార్మింగ్, గో-రక్షణ (19 గోవులు), తులసీ వనం వేద మార్గాన్ని ఆధునిక జీవితంలో చూపిస్తున్నాయి. ఫేస్‌బుక్ పేజీల్లో 20,000+ ఫాలోవర్లు, యూట్యూబ్ వీడియోలు (లక్షల వ్యూస్) సామాజిక మాధ్యమాల్లో హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. పాశ్చాత్యలు హిందువులుగా మారిన భక్తులు ముఖ్యంగా ఇస్కాన్ కేంద్రాల వల్ల హిందూ ధర్మాన్ని అవలంబించేవారు. ఇస్కాన్‌తో ముడిపడినవారు మాత్రమే చూస్తే 10,000 మంది కృష్ణ భక్తులు ఉన్నారు.
ప్రస్తుత నిర్వాహకులు లోకనానంద ప్రభు నాయకత్వంలో పాల ఉత్పత్తి పెరిగింది, ఆర్గానిక్ పొలాలు విస్తరించాయి, రాధాష్టమి మూడు రోజుల ఉత్సవంగా జరుపబడుతోంది. ప్రతి రోజూ ఉదయం 4:30కి మంగళ ఆరతి, గురుపూజ, శృంగార ఆరతి, సంధ్యా ఆరతి – ప్రతి ఆరతిలోనూ ప్రభుపాదులు, భగవాన్ దాస్, ఇంద్రాయుమ్న స్వామి, లోకనానంద ప్రభు – అందరి త్యాగం ఒకే జ్యోతిగా ప్రకాశిస్తుంది.
ఫ్రాన్స్‌లో హిందూ ధర్మం ప్రధానంగా శ్రీలంక తమిళులు, భారతీయులు (పాండిచ్చేరి, మౌరిషస్), నేపాలీలు, గుజరాతీలు, బెంగాలీలు వంటి వలసల ద్వారా వ్యాపించింది. 2025 నాటికి ఫ్రాన్స్ మెయిన్‌ల్యాండ్‌లో సుమారు 3 లక్షల మంది హిందూ భక్తులు ఉన్నారు (రెయూనియన్ ద్వీపంలో ఎక్కువగా ఉన్నారు). ఇక్కడ 50+ ఆలయాలు, సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా పారిస్ (ఇల్-డి-ఫ్రాన్స్ ప్రాంతంలో). న్యూ మాయాపూర్ (ఇస్కాన్) తరహాలు ఇతర సంస్థలు భక్తి-యోగ, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం (లైసిటీ), ఈ సంస్థలు "associations cultuelles" (పూజా సంఘాలు) లేదా "associations culturelles" (సాంస్కృతిక సంఘాలు)గా రిజిస్టర్ అవుతునాయి. ఇంకా BAPS Swaminarayan Sanstha, HOTA Forum (Hindu Organisations, Temples and Associations Forum), తమిళ హిందూ అసోసియేషన్లు, ఇంకా చిన్న చిన్న సంస్థలు హిందూధర్మ ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి.
ముఖ్యంగా అమెరికా నుండి వచ్చిన ఆ ఇద్దరు యువకులు, ఒక ఆచార్యుడి ఆశీస్సులు, అనేక మంది భక్తుల కలిసి ఫ్రాన్స్ గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న భారత్ ను హిందుత్వను సృష్టించారు. ఇక్కడ ప్రతి రోజూ హరినామ ధ్వని ఆకాశాన్ని తాకుతుంది, గోవుల గంటల శబ్దం గోకులాన్ని గుర్తు చేస్తుంది. ఇదే ఆధునిక కాలంలో గొప్ప యజ్ఞం హరినామ యజ్ఞంగా బాసిల్లుతుంది. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించిన సంకీర్తన ఉద్యమం పశ్చిమ దేశాల్లో వికసించిన అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.


