జర్మనీలో హిందూ ధర్మం ప్రారంభం అయిన వేళ యుద్ధాలు, రాజకీయాలు, వలసలతో కకావికలం అవుతుంది. అయినప్పటికీ వాటితో సంబంధం లేకుండా విశ్వవిద్యాలయాల ప్రశాంత గ్రంథాలయాలలోనే మొదలయ్యింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రెడరిక్ ష్లీగల్, విల్హెల్మ్ వాన్ హంబోల్డ్, మాక్స్ ముల్లర్ వంటివారు సంస్కృత భాషను జర్మన్ ప్రపంచానికి తెలిపారు, హిందూ ధర్మం పట్ల ఒక అసాధారణమైన విజ్ఞాన జిజ్ఞాసకి తెరలేపింది. రిగ్వేదం, ఉపనిషత్తులు జర్మన్‌లోకి అనువదించబడటం. పాశ్చాత్య దేశాల్లో హిందూ ధర్మం మొలకెత్తింది ఈ దశలోనే. హైడెల్‌బర్గ్, మార్బుర్గ్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఈరోజుకి కూడా సంస్కృతం బోధించబడుతుంది అంటే ఆ విత్తనాలు ఎంత బలంగా నాటారో తెలుస్తుంది.
జర్మనీ లో 1890లలో ఆధ్యాత్మిక రూపాన్ని దాల్చింది. స్వామి వివేకానంద యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీని సందర్శించినప్పుడు, పాల్ డ్యూసెన్ వంటి ప్రముఖ తత్వవేత్తలు వేదాంతంతో మంత్రముగ్ధులయ్యారు. షోపెన్‌హావర్, కాంట్ వంటి తత్వవేత్తల ఆలోచనల్లో ఉన్న ‘అబ్సొల్యూట్’, ‘అద్వైతం’, ‘ఆత్మ’ వంటి భావాలకు వేదాంతంలో పరిపూర్ణ సమాధానాలు దొరికాయి. వివేకానందుని ఒక్క పర్యటన జర్మన్ మేధావుల ప్రపంచంలో అఖండంగా మిగిలిపోయింది.
20వ శతాబ్దం మొదటి భాగంలో యోగా జర్మన్ సమాజంలో ఒక సైలెంట్ రివల్యూషన్ అయింది. యోగానంద పరమహంస బోధనలు, జేకబ్ విల్హెల్మ్ హావర్ ప్రసంగాలు, 1930 జర్మన్ రేడియోలో సంస్కృత వార్తల ప్రసారం. ఇవన్నీ హిందూ ధర్మాన్ని “ఎక్సోటిక్ ఫిలాసఫీ”గా జర్మన్ ప్రజల ముందుకు తెచ్చాయి. ఇది పాశ్చాత్య ప్రపంచంలో యోగా మొదటి అడుగనవచ్చు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ జర్మనీ ఆర్థిక అద్భుతానికి భారతీయ వైద్యులు, ఇంజనీర్లు, పరిశోధకులు వచ్చి చేరటం హిందూ సంస్కృతికి ఒక కొత్త వాస్తవ రూపాన్ని ఇచ్చింది. చిన్న చిన్న గణేశ్ పూజలు, లక్ష్మీ పూజలు, దసరా వేడుకలు ఇవి జర్మన్ అపార్ట్‌మెంట్‌లలో మృదువుగా మొదలయ్యాయి. అప్పట్లో హిందువుల సంఖ్య కేవలం ఐదు నుంచి పదివేల మధ్యలోనే ఉండేది.
కానీ 1970లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హాంబర్గ్‌లో ఇస్కాన్ ఆలయం స్థాపన, హరే కృష్ణ ఉద్యమం యువతలో సునామీలా వ్యాపించడం, అలాగే ‘ఫ్లయింగ్ స్వామి’ స్వామి విష్ణుదేవానంద, శివానంద ఆశ్రమాల శక్తి జర్మనీని ఆధ్యాత్మికంగా కదిలించింది. హఠ యోగా, ధ్యానం, కర్మ యోగం, “ఫైవ్ పాయింట్స్ ఆఫ్ యోగా” ఇవి జర్మన్ ప్రజలకు కొత్త జీవనశైలిని అందించాయి. 1983లో బెర్లిన్ వాల్ మీదుగా విష్ణుదేవానంద అల్ట్రా-లైట్ విమానంలో ఎగిరి శాంతి సందేశాలు పంచిన ఘట్టం ప్రపంచాన్నే షాక్‌కు గురిచేసింది.
అదే కాలంలో స్వామి వెంకటేశానంద జ్ఞానయోగానికి జర్మన్ నేలపై వెలుగులు నింపాడు. ఆయన ఇచ్చిన భగవద్గీత, రాజయోగా, యోగ వాసిష్ఠ ఉపన్యాసాలు తరువాత జర్మన్ పుస్తకాలుగా మారి, వేదాంతానికి పాశ్చాత్య ప్రపంచంలో శాస్త్రీయ రూపాన్ని ఇచ్చాయి. ఈ ఇద్దరు మహానుభావులే ఆధ్యాత్మిక యోగా-వేదాంత అధ్యయనానికి పునాది.
1980–90లలో శ్రీలంక అంతర్యుద్ధం కారణంగా వేలాది తమిళ హిందువులు జర్మనీకి చేరటం, అఫ్ఘాన్ హిందువుల ప్రవాహం. ఆఫ్ఘన్ హిందువులు జర్మన్ లో సుమారు 10 వేల మంది వున్నారు. ఇవి హిందూ ధర్మానికి సాంస్కృతిక రూపాన్ని ఇచ్చాయి. హాం నగరంలోని కామాక్షి అంపాల్ ఆలయం వంటి భారీ ద్రావిడ శైలి మందిరాలు జర్మన్ భూమిపై వికసించాయి. అప్పుడే జర్మనీలో ‘మందిర నిర్మాణ యుగం’ మొదలైంది.
ఇది కొనసాగుతూ 1990లలో సుక్‌దేవ్ సింగ్ ఖాల్సా (Volker Bretz) శివానంద పరంపరలో “Haus Yoga Vidya”ను స్థాపించి, యూరప్‌లోనే అతిపెద్ద యోగా ఆశ్రమ వ్యవస్థను నిర్మించాడు. 2025 నాటికి నాలుగు పెద్ద ఆశ్రమాలు, వందకు పైగా యోగా కేంద్రాలు, పది వేలకుపైగా యోగా టీచర్లు తయారయ్యారు. యోగా విద్యా పేరు జర్మనీలో ఒక ప్రత్యామ్నాయ జీవనవిధానంగా స్థిరమైంది.
2000 తర్వాత IT బూమ్ వచ్చి భారతీయ హిందువుల ప్రవాహం మరింత పెరిగింది. బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిఖ్ ఎక్కడ చూసినా గణేశ్ చతుర్థి, నవరాత్రి, దీపావళి వేడుకలు పెద్ద ఎత్తున జరగడం మొదలైంది. 2015 తర్వాత బ్లూ కార్డ్ ప్రవేశంతో భారతీయుల సంఖ్య మూడు లక్షలకు చేరింది, హిందువుల సంఖ్య లక్షన్నర దాటింది. మిగతా లక్షన్నర సిక్కులు, బౌద్దులు ఉన్నారు. ఈరోజు జర్మనీలో 100కి పైగా హిందూ దేవాలయాలు సజీవంగా ఉన్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో హిందూ సమాజానికి రాజకీయ, మతపరమైన గుర్తింపు కల్పించేందుకు “హిందూ ఫోరం జర్మనీ” ముందుకు రావడం మరొక ముఖ్య దశ. హిందూ పండుగల గుర్తింపు, మత స్వేచ్ఛ రక్షణ, ఆలయాల పన్ను సడలింపుల కోసం పోరాటం కొనసాగుతోంది.
ముఖ్యంగా సంస్కృత భాష ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక సబ్జెక్ట్ గా మారి సంస్కృతం పై అధ్యయనాలు నిత్యం వంద సంవత్సరాలకు పైగా చేస్తూనే ఉన్నారు. ప్రతి ఇంట్లో తులసి మొక్కలు నిజ చెప్పాలంటే తులసి వనాలే పెంచుతున్నారు. హోమాలు, యజ్ఞాలు చేస్తున్నారు. జపనామ సంకీర్తనలు వినిపించని ప్రాంతం లేదు. జర్మన్లుగా ఉంటూనే హిందుత్వ వారు అవలంబిస్తున్నారు. జర్మన్లను సెక్యులర్లుగా భావించవచ్చు. ఇప్పుడు ముస్లిం జనాభాతో నిండిపోతున్న తరుణంలో వారికి హిందువులు, ఆధ్యాత్మికత ఒక ఆశగా కనిపిస్తుంది.
2025 నాటికి జర్మనీలో హిందూ ధర్మం మూడు స్పష్టమైన రూపాలను తీసుకుంది భారత, శ్రీలంక, అఫ్ఘాన్ మూలాల ఉన్న మూడులక్షల మంది హిందువులు; యోగ విద్యా, ఇస్కాన్ ప్రభావంతో హిందుత్వంలోకి మారిన సుమారు 7,500 మంది స్థానిక జర్మన్లు; మూడోది సాంస్కృతిక హిందుత్వం, యోగా ప్రాక్టీస్, ధ్యానం, సంస్కృతం, భగవద్గీత అధ్యయనం ద్వారా హిందూ విలువలను రోజువారీ జీవితంలో అనుసరించేవారు. జర్మనీలో 3 మిలియన్లకు పైగా ప్రజలు ఈ సాంస్కృతిక వర్గానికి చెందుతారు.
రెండు శతాబ్దాల్లో పెద్ద యుద్ధాలు, రాజకీయ ఒత్తిడులు, వలసల ప్రవాహం, తత్వశాస్త్ర విప్లవాలు ఇవన్నీ దాటి ఈరోజు ఉదయం 6 గంటలకు Bad Meinberg ఆశ్రమంలో జర్మన్ యువత “ఓం నమః శివాయ” అంటూ భజన పాడుతున్న దృశ్యం కనిపించడం ఒక అద్భుతమైన నాగరికత వికాసం. వివేకానందుని ఉపదేశాలు, శివానంద-విష్ణుదేవానందుల ఆశ్రమాలు, తమిళ హిందువులు కట్టించిన ఆలయాలు యువత శక్తి ఇవి అన్నీ కలిసి జర్మనీలో ఒక బలమైన, శాంతియుతమైన, సాంస్కృతికంగా హిందూ సమాజాన్ని నిర్మించాయి.
ప్రస్తుతం స్థానిక జర్మన్ శివానంద శిశ్యుడు సుక్‌దేవ్ సింగ్ ఖాల్సా (Volker Bretz) అతిపెద్ద ఆధ్యాత్మిక విప్లవానికి శ్రీకారం చుట్టాడు అది వికసిస్తే జర్మన్ పుర్తిగా హిందూ ధర్మం వైపు మారే అవకాశం ఉండొచ్చు. ముఖ్య కారణం ముస్లింల అరాచకాలు ఎక్కువవ్వడం మూలాన హిందుత్వ వైపు మరలుతున్నారు. ఇవ్వబడిన చిత్రాలలో సుఖ్ దేవ్ సింగ్ ఖాల్సా ని చూడవచ్చు.
ఇది కేవలం ఒక మత విస్తరణ కథ కాదు. ఒక నాగరికత, ఒక విలువల వ్యవస్థ, ఒక ఆధ్యాత్మిక మార్గం జర్మనీ నేలపై ఎలా విరబూసిందో చెప్పాలనే ప్రయత్నం మాత్రమే... జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.


