రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్ పిల్లలను రక్షించిన భారతీయ మానవత్వం
రెండవ ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అతి భయంకరమైన దశగా నిలిచింది. 1939లో నాజీ జర్మనీ పోలాండ్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమయ్యింది. బాంబులు, నిర్బంధాలు, మరణ శిబిరాలు ప్రతి చోటా భయం, ఆకలి, మరణం. ఈ అల్లకల్లోలం మధ్య అత్యంత విషాదాన్ని అనుభవించింది పోలాండ్ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు. కుటుంబాలు నాశనం కావడం, వేలాది తల్లిదండ్రులు మరణించడం లేదా గల్లంతవడం వల్ల అనేక చిన్నారులు అనాథలయ్యారు. వారు ఏ దేశానికీ స్వాగతం లేని శరణార్థులుగా మారి చరిత్రలో అతి దుఃఖభరిత జీవితాన్ని అనుభవించారు.
నాజీలు ప్రధానంగా యూదులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, అది మాత్రమే కాదు. పోలాండ్‌లోని కేథలిక్ క్రైస్తవులు, మేధావులు, రాజకీయ వ్యతిరేకులు అందరూ హింసకు గురయ్యారు. అందువల్ల అనాథలైన పిల్లల్లో యూదు పిల్లలు ఉన్నారు, క్రైస్తవ పిల్లలు ఉన్నారు, వివిధ సామాజిక వర్గాల చిన్నారులు ఉన్నారు. ఈ చిన్నారుల మతం, వర్గం అన్నవి కేవలం పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోయాయి.
భారతదేశం లో ఒక చిన్న రాజ్యం గుజరాత్‌లోని నవానగర్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మానవతా నిర్ణయం తీసుకుంది. ఆ రాజ్యం అధిపతి జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జీ. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో పోలిష్ శరణార్థులను అనుమతించకపోవడం, యుద్ధభయం, రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ ఆయనను ఆపలేకపోయాయి. ఎందుకంటే ఆయన నిర్ణయం రాజకీయాలపై ఆధారపడి కాకుండా పూర్తిగా మానవత్వంపై ఆధారపడి ఉంది.
పోలిష్ పిల్లలు ఆశ్రయం కోరినప్పుడు జామ్ సాహెబ్ ఒక చరిత్రాత్మక వాక్యాన్ని పలికారు: “వారు నా భూమిపై అడుగుపెట్టినప్పుడు వారు భారతీయులే.” ఈ మాటల్లో పాలకుడి రాజకీయం ఏమి లేదు ఒక్క మానవత్వం తప్ప; తండ్రి తన పిల్లలపై చూపే ప్రేమ మాత్రమే ఉంది. ఆ నిర్ణయం ప్రపంచ చరిత్రలో అరుదైన మానవతా ఉదాహరణగా నిలిచింది. అలాంటి ప్రమాదకర సమయంలో కూడా ఇతర దేశాలు తలుపులు మూసినా, భారతీయ హృదయం తెరిచి స్వాగతించింది.
1942 నుంచి 1946 వరకు, నవానగర్ సమీపంలోని బాలల శరణార్థి శిబిరం పోలిష్ పిల్లలకు ఒక చిన్న స్వర్గంలా మారింది. సుమారు 1,000 మంది పిల్లలు అక్కడ నివసించారు. వారికి ఆహారం, వస్త్రం, విద్య, వైద్యం అన్నీ ఉచితంగా అందించబడ్డాయి. ముఖ్యంగా, వారి సంస్కృతిని, భాషను, జాతీయతను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిబిరంలో పోలిష్ జెండా ఎగిరేది, పోలిష్ ఉపాధ్యాయులు బోధించేవారు, వారి సంప్రదాయ పండుగలు కూడా జరుపుకునేవారు.
జామ్ సాహెబ్ పిల్లలను “అతిథులు” అని ఎప్పుడూ పిలవలేదు. ఆయన వారిని “మా పిల్లలు” అని పిలిచేవారు. ఈ మాట పిల్లలలో గాఢమైన ముద్ర వేసింది. యుద్ధం ముగిసిన తర్వాత తమ దేశాలు వారిని పిలిచినా, అనేక మంది పిల్లలు వెళ్లడానికి ఇష్టపడలేదు. “మా తండ్రి ఇక్కడే ఉన్నాడు” అని వారు కన్నీళ్లతో చెప్పడం జామ్ సాహెబ్ చూపిన ప్రేమ, రక్షణ, మానవత్వం ఎంత లోతైనదో ప్రపంచానికి తెలియజేస్తుంది.
బాల శరాణార్దిలో ఉన్న పిల్లలు యూదు పిల్లలే కాదు; క్రైస్తవులు మరియు ఇతర నేపథ్యాల చిన్నారులు కూడా అక్కడ ఆశ్రయించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే జామ్ సాహెబ్ ఒక్క చిన్నారిపైనా మతం, వర్గం, జాతి ఆధారంగా ఎలాంటి తేడా చేయలేదు. ఆయన చేసిన సేవల్లో “పోలిష్ పిల్లలు” మాత్రమే ఉన్నారు; మిగతా గుర్తింపు అన్నీ ఆయన దృష్టిలో అవసరం లేనివి.
కాలక్రమేణా ఈ పోలిష్ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించారు. వారి సంతతి ఈ రోజు ఇజ్రాయెల్, పోలాండ్, అమెరికా, కెనడా వంటి దేశాలలో నివసిస్తున్నారు. కానీ వారి కుటుంబ కథల్లో జామ్ సాహెబ్ పేరు ఇంకా ఒక దేవదూతలా నిలిచి ఉంది. అందుకే వార్సా నగరంలో “గుడ్ మహారాజా స్క్వేర్”, పోలాండ్‌లో స్మారకాలు, పాఠ్యపుస్తకాలలో పాఠాలు ఇవన్నీ ఆయనపై సూచించే కృతజ్ఞత. ఇజ్రాయెల్‌లోని నెవాతిమ్ గ్రామంలో ఆయన విగ్రహం ఆ పిల్లల సంతతి చేత ఆవిష్కరించబడింది.
గత సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్‌లోని జామ్ సాహెబ్ స్మారకానికి నివాళులర్పించినప్పుడు, అది భారతదేశం చేసిన మానవతా సేవల గుర్తింపుగా ప్రపంచానికి తెలిసింది. ఈ ఘట్టం భారత్ పోలాండ్ సంబంధాలను మరింత బలపరచింది. అలాగే భారత్ ఇజ్రాయెల్ ల మధ్య కూడా బందాన్ని దృఢపరించింది. భారతీయ సంస్కృతిలోని కరుణ, ఆతిథ్యం, దయ, మానవత్వం ఇవన్నీ జామ్ సాహెబ్ కథ ద్వారా ప్రపంచానికి మరోసారి గుర్తు అయ్యాయి.
ఈ రోజు ప్రపంచం మళ్లీ యుద్ధాలు, శరణార్థుల సంక్షోభం, ద్వేషం, విభజనలతో అశాంతిగా ఉంది. ఇలాంటి సమయంలో జామ్ సాహెబ్ కథ మనకు చెప్పే ముఖ్యమైన సందేశం శక్తి కత్తుల్లో కాదు, కరుణలో ఉంటుంది. ఒక చిన్న రాజ్యం, ఒక మహానుభావుడు, వేలాది పిల్లల జీవితం మార్చిన ఒక నిర్ణయం. ఇదే భారతీయ సంస్కృతి యొక్క నిజమైన మహిమ. జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ పేరు యుగయుగాల పాటు మానవత్వానికి దీపస్తంభంగా నిలిచి ఉంటుంది.
అలా అని ఈ వ్యాసం చదివాక మళ్లీ మీలో ఒక గొప్ప మానవత్వం వికసించి అక్రమచొరబాటుదారులైన రోహింగ్యాలను మానవత్వం తో ఆదరించాలని కోరుకోవడం మన మూర్ఖత్వంగా భావింపబడుతుంది. 80 ఏళ్ల క్రితం మనం చాటిన మానవత్వానికి వాళ్ళు ఇప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కానీ రోహింగ్యాలకు తెలియక అద్దెకిచ్చిన పాపాని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలెన్నో రోదిస్తున్నాయి... ఇలాంటి తనకుమాలిన మానవత్వం మనకొద్దు. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

