"సర్ క్రీక్" కొత్తగా విన్నట్లుంది కదూ అవును నాకూ కొత్తే కాకపోతే ఈ పదం మన రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారి నోటి నుండి గాందీ జయంతి నాడు చాలా గంభీర స్వరంతో వినిపించే సరికి నాకూ దీని గురించి తెలుసుకోవాలనిపించింది. తెలుసుకున్నాక మనసాగక మీకూ తెలుపాలనిపించింది. అందుకే మీకోసం ఈ వ్యాసం.
ఊళ్లల్లో మనం చిన్న పెంట కుప్పల స్థలం దగ్గర కూడా నాదంటే నాదని కొట్టుకునే రోజుల్లో ఉన్నాం. మరి అలాంటిది దేశ రక్షణకు బద్రత దృష్ట్యా అంత్యంత ప్రధానమైన సరిహద్దు ప్రాంతాలను జాగ్రత్తగా చూసుకోపోతే మన పెంట కుప్పలే కాకుండా మన ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి మనమంతా దేశ భద్రత విషయంలో జాగరూకత కలిగి వుండటం కోసం ఇటువంటి విషయాలు తప్పనిసరిగా చదవాలి తెలుసుకోవాలి.
భారతదేశ సరిహద్దుల్లో ఎన్నో వివాదాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కచ్చ్ వరకు, ప్రతి అంగుళం మన జాతీయ భద్రతకు అత్యంత కీలకం. అలాంటి ఒక చర్చనీయాంశం సర్ క్రీక్. గుజరాత్‌లోని కచ్ జిల్లాకు, పాకిస్తాన్ సింధ్ ప్రాంతానికి మధ్యలో ఉన్న ఈ చిన్న నదీ మార్గం, నేడు భారత్–పాక్ మధ్య అతిపెద్ద వ్యూహాత్మక సమస్యగా, గొడవగా మారింది.
సుమారు 96 కిలోమీటర్ల పొడవైన ఈ క్రీక్ బయటికి చూస్తే పెద్దగా ప్రాధాన్యం లేనట్టే కనిపిస్తుంది. కానీ దీనిని ఎవరు నియంత్రిస్తారన్న ప్రశ్నకు సమాధానం, నేరుగా వేల చదరపు కిలోమీటర్ల అరేబియా సముద్రంపై హక్కులు ఎవరి దిశగా వెళ్ళిపోతుందో అనే భయం ఎప్పటి నుండో వుంది కానీ అది ఇప్పుడే మొదలవుతుంది వేగంగా అని ఎవరూ భావించలేదు. ఈ ప్రాంతంలో చమురు, సహజ వాయువు, చేపల వనరులు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం ఒక నదీ ప్రాంత తేమ ఉన్న భూమి సమస్య కాదు, దేశ భవిష్యత్తు వనరుల ప్రశ్న.
పాకిస్తాన్ వైఖరి ఎప్పటిలాగే స్పష్టం ఎందుకంటే పాక్ కి తను అభివృద్ధి చెందటం కన్నా భారత్ ని కంటిలో నలుసుగా, చెప్పులో ముల్లుగా మారి ఎప్పుడూ ఇబ్బంది పెట్టడమే దానికి అత్యంత ఇష్టమైన పని. అలాంటి పని ఇప్పుడు పాక్ మళ్లీ మొదలు పెట్టింది, మొత్తం సర్ క్రీక్ తమదే అని గట్టిగా వాదిస్తుంది. ఎలాంటి రాజీకి రావడానికి సిద్ధంగా లేదు, దానికి విరుద్ధంగా భారత్ ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో “న్యూట్రల్” ధోరణిలో ఉండింది. మధ్యలో సరిహద్దు వేసుకుందాం అని మితంగా మాట్లాడింది. కానీ ఈ మితిమీరిన మృదుత్వం మనకే నష్టం తెచ్చిపెడుతోంది.
చరిత్రలో కూడా అదే చెబుతుంది, 1965 యుద్ధం సమయంలో కచ్చ్ రణంలో యుద్ధం జరిగింది. తరువాత పలు కమిషన్లు, ట్రిబ్యునల్స్ ఏర్పడ్డా సమస్య తేలలేదు. పాకిస్తాన్ ఎప్పుడూ గరిష్టమైన లాభం సాధించేందుకు ప్రయత్నించింది. కానీ భారత్ మాత్రం చాలా సార్లు “వేచి చూద్దాం” అనే స్థితిలోనే ఉండిపోయింది.
కానీ పాక్ మళ్లీ సౌదీ కి తమ సైనికుల్ని అమ్ముకుని, అమెరికా దగ్గర అడుక్కొచ్చిన డబ్బులతో సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున మిలటరీ బిల్డింగ్ లు, ఎయిర్ బేస్ లు నిర్మించే ప్రయత్నం ప్రారంభం చేస్తుంది. కాకపోతే భారత్ వైపు నుండి ఇప్పుడు పరిస్థితి మారింది. గాంధీ జయంతి రోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. “పాకిస్తాన్ ఎటువంటి సైనిక అహంకారం లేదా misadventure చేసినా, భారత్ దానికి దృఢమైన సమాధానం ఇస్తుంది” అని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా ఆయన గట్టిగా గుర్తు చేశారు – “క్రీక్ ద్వారా కారాచీకి మార్గం ఉంది” అని. ఇది ఒక సాధారణ వ్యాఖ్య కాదు ఇది వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌కి ఇచ్చిన గట్టి సందేశం. అంటే ఏంటి నువ్విలాగే చేస్తే కరాచీ ని మేము కలుపుకోవాల్సి వస్తుందని ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది.
రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత్ ఎన్నో సార్లు చర్చల ద్వారా పరిష్కారం కోరిందని. కానీ పాకిస్తాన్ ఎప్పుడూ ద్వంద్వ ధోరణి ప్రదర్శించిందని ఆయన వివరించారు. చర్చలకు వస్తున్నట్టు చూపిస్తారు, కానీ అంతలోనే మరోవైపు సైనిక నిర్మాణాలు చేస్తారు. ఇది వారి తరహా రాజకీయపు బాగోతంగా వర్ణిస్తాను.
సర్ క్రీక్ సమస్యలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది, “Thalweg doctrine”. అంటే నది మధ్యలోనే సరిహద్దు నిర్ణయించాలి. భారత్ ఈ పద్ధతిని అనుసరిస్తూ తర్కబద్ధంగా ముందుకు వెళ్ళింది. కానీ పాకిస్తాన్ మాత్రం నది మొత్తాన్ని తమదిగా చూపుతూ మాయమాటలతో బలవంతం చేయాలని చూస్తోంది. ఇక్కడే ప్రశ్న వస్తుంది – మనం ఎందుకు ఎప్పుడూ తగ్గి మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. మళ్లీ అది మన సహజ స్వభావంగా అనిపిస్తుంది.
ఇక్కడ ఒక పెద్ద విషయం గమనించాలి మనం ఇది తెలిస్తే ఖచ్చితంగా షాక్ కి గురవుతాం, 2007లో మన ప్రధాని మన్మోహన్ సింగ్ జీ Siachen డిమిలిటరైజ్ (అంటే శియాచిన్ లో సైనిక బేస్ లు తీసివేయాలని) చేయాలని, Sir Creek ను పాక్షికంగా పంచుకోవాలని ఆలోచించారు. అంతేకాదు, ఆ సమయంలో అమెరికా ఒత్తిడి కూడా ఉండింది. ఇది 2006లో ముంబై లో జరిగిన సీరీస్ బాంబింగ్ (సుమారు 209 మంది ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకరం) తర్వాత జరగడం మరింత ఆశ్చర్యకరమని అనిపించింది. ఆ సమయంలో మనం తక్షణ చర్య తప్పించి, అలాగే తిరిగి శాంతిచర్చలతో వ్యవహరించాం గానీ చర్యలు తీసుకోకపోవడం మూలాన తద్వారా 26/11/2008 నాటికి మరింత శక్తివంతమైన దాడికి ప్రేరణగా మారింది.
భద్రతా భావనలను త్యజిస్తే భవిష్యత్తు శూన్యం, Siachen వంటివి ఒకసారి వదులుకున్నాక తిరిగి రావడం చాలా కష్టమయ్యే వైవిధ్యాల సూత్రం సైన్యం బలంగా హై లైట్ చేసింది. ఒక స్ధానాన్ని ఇచ్చి వెళ్ళితే, తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం, ఖర్చు, వ్యూహాత్మక ప్రమాదాలతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రజా భద్రతా అంశాలు, ప్రాథమిక రక్షణాపరమైన విలువలను పక్కన పెడితే ఆ పరిణామాలు అనేకమందికి అజేయమైన నష్టాలుగా మారతాయి అనేది మనకు PoJK విషయంలో, అక్షయచిన్, తవాంగ్ విషయంలో స్పష్టంగా అర్దమయ్యింది, మొత్తానికి మన్మోహన్ జీ ఆ ఆలోచనను విరమించుకోవడం మనకు కాస్తో కూస్తో కలిసొచ్చింది.
మనకు స్పష్టంగా అర్థమై ఉండాల్సింది ఒకటే న్యూట్రాలిటీ అనేది ఒక బలహీనత. ఇప్పుడు సమయం వచ్చింది. భారత్ తన హక్కులను స్పష్టంగా గుర్తించింది. సర్ క్రీక్ విషయంలో మనం కేవలం “రక్షణాత్మకంగా” కాకుండా “దృఢంగా ముందుకు సాగాలి”. పాకిస్తాన్ చెబుతున్నట్టు మొత్తం క్రీక్ తమదే అంటే, మనం కూడా అదేవిధంగా సగం మాది అనేది కాకుండా దృఢంగా చెప్పాలి. ఇది మన సముద్రహక్కుల కోసం, మన జాతీయ భద్రత కోసం అత్యవసరం. అందుకే రాజ్ నాథ్ సింగ్ ఈ విషయం పై కుండబద్దలు కొట్టారు, సర్ క్రీక్ దగ్గర మిలటరీ స్థావరాలు నిర్మిస్తే మాకు కరాచికి మార్గం తెలుసు అని చాలా అంటే స్ట్రాంగ్ మెస్సేజ్ పాకిస్తాన్ కి ఇచ్చారు. చివరకు ఏంజరుగుతుందో వేచి చూడాల్సిందే...
సర్ క్రీక్ వివాదం కేవలం ఒక సరిహద్దు రేఖ అనేది ఇక్కడ ప్రశ్న కానే కాదు. ఇది మన జాతీయ గౌరవం, మన భవిష్యత్ వనరులు, మన వ్యూహాత్మక శక్తి గురించి. కాబట్టి ఇకనుంచి భారత్ సహజత్వాన్ని వదులుకొని, దృఢసంకల్పంతో ముందుకు నడిస్తేనే పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇస్తాం. ఈ సమయంలో స్వామీ వివేకానంద వాక్కుని గుర్తుచేసుకుందాం, బలమే జీవనం బలహీనతే మరణం. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds


