1. డేటా సెక్యూరిటీ రెగ్యులేషన్లు ఎందుకు ముఖ్యం మరియు వాటి నేపథ్యం:
డేటా సెక్యూరిటీ రెగ్యులేషన్లు అంటే మన వ్యక్తిగత సమాచారాన్ని (మన పేరు, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు) సురక్షితంగా ఉంచడానికి కంపెనీలు మరియు సంస్థలు పాటించాల్సిన నియమాలు మరియు చట్టాలు. ఈ నియమాలు సైబర్ హ్యాకర్లు మన సమాచారాన్ని దొంగిలించకుండా కాపాడతాయి మరియు మన ప్రైవసీని గౌరవిస్తాయి. ఈ రోజుల్లో మనమంతా ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్, హెల్త్ యాప్‌లు ఉపయోగిస్తున్నాం కదా, అక్కడ మన డేటా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ నియమాలు వచ్చాయి. ముఖ్యమైనవి: PCI-DSS (క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి), GDPR (యూరప్‌లో మన ప్రైవసీని కాపాడడానికి), HIPAA (అమెరికాలో హెల్త్ వివరాలు సురక్షితంగా ఉంచడానికి), CCPA (కాలిఫోర్నియాలో మన డేటా హక్కులు), SOX (ఫైనాన్షియల్ కంపెనీలు మోసాలు చేయకుండా), మరియు ISO 27001 (ప్రపంచవ్యాప్తంగా సమాచార నియమాలు). ఈ నియమాలు సైబర్ దాడులు పెరిగిన కారణంగా వచ్చాయి, మరియు కంపెనీలు వీటిని పాటించకపోతే భారీ జరిమానాలు (బిలియన్ల రూపాయలు) ఎదుర్కోవాలి. సామాన్యులకు ఉపయోగం, మన డేటా సురక్షితమని నమ్మకం కలుగుతుంది, కానీ కంపెనీలు ఎక్కువ ఖర్చు చేయాలి.
2. PCI-DSS: క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం:
PCI-DSS అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలను (కార్డ్ నంబర్, CVV) హ్యాండిల్ చేసే కంపెనీలు (ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, బ్యాంకులు) పాటించాల్సిన నియమాల సమూహం. ఇది Visa, Mastercard వంటి కంపెనీలు స్థాపించిన PCI సెక్యూరిటీ కౌన్సిల్ చేత నిర్వహించబడుతుంది. ముఖ్యమైన నియమాలు: సురక్షిత నెట్‌వర్క్ నిర్మాణం (ఫైర్‌వాల్ తో హ్యాకర్లను అడ్డుకునే ఏర్పాటు), డేటా ఎన్‌క్రిప్షన్ (సమాచారాన్ని కోడ్‌లో మార్చి సురక్షితంగా ఉంచడం), మరియు రెగ్యులర్ చెక్‌లు (సమస్యలను తనిఖీ చేసి సరిచేయడం). 2025లో PCI-DSS v4.0.1 మాండటరీ అవుతుంది, ఇందులో మల్టీ-ఫ్యాక్టర్ లాగిన్ (పాస్‌వర్డ్ తో పాటు OTP లాగా రెండు ధ్రువీకరణలు), స్క్రిప్ట్ సెక్యూరిటీ (పేమెంట్ పేజీలలో సురక్షా), మరియు ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ (డేటా ట్రాన్స్‌ఫర్ సురక్షితం) ఉన్నాయి. సామాన్యులకు ఉపయోగం: మన కార్డ్ వివరాలు దొంగలకు చిక్కకుండా ఉంటాయి. కానీ కంపెనీలకు దీనిని అమలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని, మరియు కంపెనీలు తప్పు చేస్తే $500,000 వరకు జరిమానా వస్తుంది.
3. GDPR: యూరప్‌లో మన సమాచారాన్ని కాపాడే చట్టం:
వివరణ: GDPR అనేది యూరప్ యూనియన్ (EU)లో 2018 మే 25(1995 నుండి వేరే పేరుతో ఉంది, దీని ఎవల్యూషన్ చాలా పెద్దది) నుండి అమలులో ఉన్న ఒక ప్రైవసీ చట్టం, ఇది EU పౌరుల మన వ్యక్తిగత సమాచారాన్ని (పేరు, ఫోన్ నంబర్, లొకేషన్) కాపాడడానికి రూపొందించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా EU పౌరుల డేటాను హ్యాండిల్ చేసే కంపెనీలకు (ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలకు) వర్తిస్తుంది. ముఖ్య నియమాలు: మన సమాచారాన్ని ఉపయోగించడానికి మన అనుమతి తీసుకోవాలి, ఏదైనా సెక్యూరిటీ ఇన్సిడెంట్ జరిగితే 72 గంటలలో చెప్పాలి, మరియు ప్రైవసీ అధికారిని నియమించాలి. 2025లో అప్‌డేట్స్: సింప్లిఫికేషన్ ప్రపోజల్స్ (చిన్న కంపెనీలకు సులభమైన నియమాలు), AI రూల్స్ (డేటా ఉపయోగం స్ట్రిక్ట్), క్రాస్-బోర్డర్ డేటా ట్రాన్స్‌ఫర్ నియమాలు (డేటా బయట దేశాలకు, ఖండాలకు పంపేటప్పుడు సురక్షా చెక్), మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచారు (రెగ్యులేటర్లు ఎక్కువగా చెక్ చేస్తున్నారు). మన సమాచారం సురక్షితం, కానీ కంపెనీలకు జరిమానాలు (కంపెనీ టర్నోవర్ 4% వరకు) పెద్ద ఎత్తున వస్తాయి.
4. HIPAA: అమెరికాలో హెల్త్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం:
HIPAA అనేది అమెరికాలో 1996లో వచ్చిన చట్టం, ఇది హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు మన హెల్త్ వివరాలను (మెడికల్ రికార్డులు, డాక్టర్ రిపోర్టులు) సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడింది. ముఖ్య నియమాలు: ప్రైవసీ రూల్ (మన సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయకూడదు), సెక్యూరిటీ రూల్ (డేటా ఎన్‌క్రిప్ట్ చేయడం), మరియు సమస్యలు జరిగితే తెలియజేయడం. 2025లో అప్‌డేట్స్: సెక్యూరిటీ నియమాల మార్పులు జరిగాయి. మార్చి 2025లో ప్రతిపాదన, జనవరి 2025లో NRPM అంటే Notice of Proposed Rulemaking (ప్రతిపాదిత నియమ నోటీసు) అని అర్థం. ఇది అమెరికా ఫెడరల్ రెగ్యులేటరీ ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ, ఇక్కడ HHS (U.S. Department of Health and Human Services) లేదా ఇతర ఏజెన్సీలు కొత్తగా లేదా మార్పులు చేసిన HIPAA రూల్స్‌ను ప్రతిపాదిస్తాయి మరియు పబ్లిక్ కామెంట్స్ కోసం ఓపెన్ చేస్తాయి. ఈ కామెంట్స్ ఆధారంగా ఫైనల్ రూల్ జారీ అవుతుంది. ఇందులో అన్ని నియమాలు తప్పనిసరి, డేటా ఎన్‌క్రిప్షన్ తప్పనిసరి, మల్టీ-ఫ్యాక్టర్ లాగిన్, మరియు రెప్రడక్టివ్ హెల్త్ సమాచారం మార్పులు (జూన్ 2025లో కోర్టు ఆదేశం ప్రకారం) ఉంటాయి. మన మెడికల్ సమాచారం సురక్షితం, కానీ హాస్పిటల్స్‌కు ఖర్చు మరియు జరిమానాలు ($50,000 వరకు) ఉంటాయి.
5. CCPA: కాలిఫోర్నియాలో మన సమాచార హక్కులు:
CCPA అనేది అమెరికా కాలిఫోర్నియాలో 2020లో వచ్చిన చట్టం, ఇది కాలిఫోర్నియా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని (పేరు, ఐడెంటిటీ వివరాలు) కాపాడడానికి రూపొందించబడింది. ముఖ్య నియమాలు: కంపెనీలు మన సమాచారాన్ని షేర్ చేయకూడదు అలాగే, ఏదైనా సెక్యూరిటీ బ్రీచ్ లాంటి సమస్యలు జరిగితే సీసీపీఏ కు చెప్పాలి, మరియు ప్రైవసీ నియమాలు అప్‌డేట్ చేయాలి. 2025లో అప్‌డేట్స్: సెప్టెంబర్ 2025లో కొత్త నియమాలు (CPPA - కాలిఫోర్నియా ప్రైవసీ ప్రొటెక్షన్ ఏజెన్సీ ద్వారా), ఇందులో AI డెసిషన్ మేకింగ్ నియమాలు, రిస్క్ చెక్‌లు, సైబర్ సెక్యూరిటీ ఆడిట్‌లు, మరియు ఆప్ట్-అవుట్ నిర్ధారణలు ఉన్నాయి, జనవరి 2026 నుండి అమలు చేయనున్నారు. సమాచారాన్ని నియంత్రించే ఓ హక్కు ప్రజలకు వస్తుంది. కంపెనీలకు జరిమానాలు ($7,500 వరకు) ఉంటాయి.
6. SOX: ఫైనాన్షియల్ కంపెనీల సమాచార సురక్షా చట్టం:
SOX అనేది అమెరికాలో 2002లో వచ్చిన చట్టం, ఇది పబ్లిక్ కంపెనీలు ఫైనాన్షియల్ రిపోర్టులను (బ్యాంక్ స్టేట్‌మెంట్స్) సరిగ్గా ఉంచడానికి రూపొందించబడింది. ముఖ్య నియమాలు: సెక్షన్ 404 (ఫైనాన్షియల్ కంట్రోల్స్ తనిఖీ), డేటా సురక్షా ఆడిట్‌లు. 2025లో అప్‌డేట్స్: సైబర్ సెక్యూరిటీపై ఎక్కువ ఫోకస్ (SEC - Securities and Exchange Commission రూల్స్), కంపెనీలు సైబర్ రిస్క్‌లను రిపోర్ట్ చేయాలి. సామాన్యులకు ఉపయోగం, ఫైనాన్షియల్ మోసాలు తగ్గుతాయి. కంపెనీలకు ఆడిట్ ఖర్చు ఉంటుంది.
7. ISO 27001: ప్రపంచవ్యాప్త సమాచార సురక్షా నియమాలు:
వివరణ: ISO 27001 అనేది ప్రపంచవ్యాప్త స్టాండర్డ్, ఇది కంపెనీలు సమాచార సురక్షా వ్యవస్థను (ISMS) ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్య నియమాలు: రిస్క్ తనిఖీ (సమస్యలను ముందుగా గుర్తించడం), సురక్షా చర్యలు (ఫిజికల్ మరియు టెక్నికల్). 2022లో అప్‌డేట్ అయిన ఈ స్టాండర్డ్‌కు 2025 అక్టోబర్ 31 వరకు మార్పులు జరిగాయి. ఇందులో క్లౌడ్ సురక్షా మరియు సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నాయి. సామాన్యులకు ఉపయోగం: కంపెనీలు మన సమాచారాన్ని కాపాడతాయి, కానీ సర్టిఫికేషన్ ఖర్చు కంపెనీలకు భారం.
8. సవాళ్లు, లాభాలు మరియు భవిష్యత్ దృక్పథం:
సవాళ్లు: అమలు చేయడానికి ఖర్చు, వివిధ నియమాలు పాటించడం భారం, మరియు సమాచారం దొంగతనం ప్రమాదాలు.
లాభాలు: మన సమాచారం సురక్షితం, కంపెనీలు సైబర్ దాడులను తట్టుకుంటాయి. మరియు ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
AI మరియు క్లౌడ్ సమయంలో ఈ నియమాలు మరిన్ని మార్పులు చూస్తున్నాయి. కంపెనీలు ఆటోమేషన్ ద్వారా సురక్షా సాధనాలు ఉపయోగిస్తాయి. సామాన్యులకు PII అంటే వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారం (Personally Identifiable Information - మన పేరు, ఆధార్ నంబర్, ఇమెయిల్ లాగా మనల్ని ప్రత్యేకంగా గుర్తించే డేటా, ఇది దొంగిలించబడితే మన గురించి అన్నీ తెలుసుకునే ప్రమాదం ఉంది), PIA అంటే ప్రైవసీ ప్రభావ మూల్యాంకనం (Privacy Impact Assessment - కొత్త యాప్ లేదా సిస్టమ్ మన ప్రైవసీని ఎలా ప్రభావితం చేస్తుందో ముందుగా తనిఖీ చేసి, సమస్యలను సరిచేయడం). ఈ నియమాలు మనకు సురక్షిత డిజిటల్ జీవితాన్ని ఇస్తాయి, కానీ కంపెనీలు ఈ డేటా రక్షణ కోసం ఎక్కువ పని చేయాలి.
ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే, ఇవాళ జోహో కావొచ్చు, రేపు ఇంకొక కంపెనీ కావొచ్చు సేఫ్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అనేది తెలియకుండా యాప్స్ ను మనం ప్రమోట్ చేయకూడదు. మన దేశంలో డేటా ప్రొటెక్షన్ పై అంత సీరియస్ నెస్ ఉండకపోవచ్చు కానీ, యూరప్ మరియు అమెరికా ఇతర దేశాల్లో కంపెనీ దివాళా తీస్తుంది. అంత సీరియస్ గా ఫైన్స్ వేస్తారు. మీకుతెలుసా? గూగుల్ అతిపెద్ద డేటా చోరుడు.
సూచన: మీ పిల్లలకు ఈ కాన్సెప్టు పై ట్రైనింగ్ ఇప్పించండి, బోలెడు ఉద్యోగావకాశాలు. జాబ్ ఒక్కసారి వస్తే పోదు. అంత సెక్యూర్ గా ఉంటుంది. -పతంజలి వడ్లమూడి, Mega Minds