ఇంగ్లాండ్ భారతదేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించింది. ఈరోజు, అదే బ్రిటన్ వాణిజ్యం, పెట్టుబడి, అవకాశాల కోసం భారతదేశం వద్దకు మొత్తం వ్యాపార వేత్తలతో కూడిన బెటాలియన్ ని తీసుకుని భారత్ ముందు సాగిలాపడింది.
స్టార్మర్ పర్యటన ఢిల్లీ కాకుండా ముంబయి ఎందుకు: ఈ నిర్ణయం వెనుక చాలా బలమైన కారణం ఉంది. స్టార్మర్ ఢిల్లీ కాకుండా ముంబయిలో దిగడం ద్వారా ఇది రాజకీయ పర్యటన కాదు, వ్యాపార పర్యటన అని ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోంది. దానితో బ్రిటన్ సుస్థిరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పర్యటనపై బ్రిటన్ మీడియా భారత మీడియా కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. GB న్యూస్, ఇతర పత్రికలు ఈ పర్యటనను ఒక సమర్థమైన విజయ యాత్రగా వర్ణిస్తున్నాయి. ముంబయి అంతా పోస్టర్లు, బ్యానర్లు, లైట్లతో మెరిసిపోతోంది. బ్రిటిష్ ప్రజలకు ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చరిత్ర ఎన్నో మార్పులతో పూర్తిగా తలక్రిందులైపోయింది.
బ్రిటన్‌కి ఈ పర్యటన ఎందుకంత కీలకం: 2020లో బ్రెగ్జిట్ (Take Back Control నినాదం తో యునియన్ నుండి బయటకు వచ్చింది.) తర్వాత, యూరోపియన్ యూనియన్ బయట బ్రిటన్ స్వతంత్రంగా ఎదగగలదని నిరూపించుకోవడమే ప్రధాన సవాలు. కానీ ఐదు సంవత్సరాలు, నలుగురు ప్రధాన మంత్రులు (బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్, కియర్ స్టార్మర్) మారినా భారత్‌తో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) ఇంకా పూర్తికాలేదు.
అలాగే ప్రతి నాయకుడూ ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. ఇప్పుడు స్టార్మర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందం ఒక రాజకీయ ప్రాణాధారంగా మారింది. ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న బ్రిటిష్ పరిశ్రమలు, యువశక్తితో నిండిన భారత మార్కెట్‌ను తమ భవిష్యత్తుగా చూస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు: అక్టోబర్ 8 న బొంబాయి నగరంలో ఇరు పక్షాలు ఒప్పందాన్ని వేగవంతంగా, సమన్వయంతో, మరియు ఫలితాల ఆధారంగా అమలు చేయడంపై తమ నియమాలని పునరుద్ఘాటించాయి. ఇది రెండు దేశాల వ్యాపారాలు మరియు వినియోగదారులకు పూర్తి ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశించబడింది. ప్రస్తుతం భారత్ బ్రిటన్ ద్వైపాక్షిక వాణిజ్యం $56 బిలియన్. లక్ష్యం 2030 నాటికి $112 బిలియన్కు పెంచడం.
ఒప్పందం లో ఏముంది?: 14 రౌండ్‌ల చర్చల తర్వాత రెండు దేశాలు ఈ పాయింట్లపై అంగీకరించాయి. అధునాతన తయారీ, వినియోగ వస్తువులు, ఆహార, పానీయాలు, విజ్ఞానం, సాంకేతికత ఆవిష్కరణ, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, శుభ్రమైన శక్తి, ఆర్థిక, ప్రొఫెషనల్ బిజినెస్ సర్వీసులు (IT/ITeS, విద్య, ఇంజినీరింగ్ సహా) వంటి ప్రాధాన్య రంగాలపై పలు సెక్టోరల్ రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. భారతదేశం నుంచి యుకేకు ఎగుమతి అయ్యే వస్తువులపై 99% సుంకాల రద్దు. యుకే వస్తువులపై భారత్ 3% తక్కువ సుంకం. ఐదేళ్లలో సుంకాలు క్రమంగా తగ్గింపు.
చరిత్ర తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలి: ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాల పేరుతో వచ్చి భారత్ ని దొచుకుని వెళ్లారు. అయితే మళ్లీ అది పునరావృతం కాకుండా ఇప్పుడు భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది దేశీయ పరిశ్రమలకు హాని కలగకుండా, ఎగుమతుల ఆధారిత వృద్ధిపై దృష్టి. రూపాయల పరంగా చూస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు ₹4.34 లక్షల కోట్లు, అందులో భారత్‌కి సుమారు ₹1 లక్ష కోట్లు అధికంగా ఉన్నాయి.
అలాగే తన ప్రతినిధులతో విమాన కాక్‌పిట్ నుంచే ప్రసంగిస్తూ స్టార్మర్ చేసిన వ్యాఖ్యలు “యుకే ఇప్పటివరకు భారత్ దేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య బృందం ఇదే” అనే మాటల్లో భారత్ తో మళ్లీ అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యంగా బ్రిటన్ మారబోతోంది అనేది తెలుస్తుంది. ఎప్పుడో భారత సంపదను దోచి సామ్రాజ్యం నిర్మింపబడిన దేశం, ఇప్పుడు అదే భారత్ వద్ద వ్యాపారం కోసం మళ్లీ సాగిలాపడింది.
ఇది కేవలం ఒక పర్యటన కాదు, ప్రపంచ శక్తి సమీకరణాలు ఎలా మారిపోయాయో చెప్పే ఒక నిశ్చబ్ద ప్రకటన. ఒకప్పుడు మనల్ని బానిసలుగా చేసి పాలించిన బ్రిటన్ నేడు అదే వ్యాపారం కోసం వాళ్ల వ్యాపార దిగ్గజాలతో భారత్ దగ్గర యాచిస్తోంది. చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్త పడదాం, కాకపోతే ఈసారి వ్యాపారం ఎలా చేయాలో భారతదేశం నిర్ణయిస్తుంది. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds