బుర్ఖా నిషేదం సెక్యులర్ విధానమా? లేక సాంస్కృతిక పోరాటమా?: ప్రపంచం మొత్తం చూస్తే, మతం పేరుతో దుస్తులు ధరించడంపై నిబంధనలు కొత్తవి కావు. కానీ 2025 నాటికి 25కి పైగా దేశాలు నిఖాబ్ (niqab), బుర్ఖా (burqa) లేదా హిజాబ్ (hijab) ధరించడంపై పాక్షికం లేదా పూర్తిస్థాయి నిషేధాలు అమలు చేయడం, ముస్లిం మహిళల్లో కొత్త ఆశలు, దిశ చూపుతోంది. ఈ నిషేధాల వెనుక భద్రతా కారణాలు, సెక్యులర్ విధానం, మహిళా హక్కులు, జాతీయ గుర్తింపు వంటి పలు అంశాలు దాగి ఉన్నాయి.
పూర్తిగా నిషేదం అమలు చేసిన దేశాలు: యూరప్ ఖండం దీనిలో ముందంజలో ఉంది. ఫ్రాన్స్ 2011లోనే బహిరంగ ప్రదేశాల్లో ముఖం కప్పే దుస్తులను నిషేధించింది. ఆ మార్గంలోనే బెల్జియం, ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, నార్వే, లాత్వియా, బల్గేరియా, రష్యా, స్వీడన్ కూడా అదే దారిలో నడిచాయి. ఇటీవల స్విట్జర్లాండ్ ప్రజాభిప్రాయం ద్వారా 2025లో “ఫేస్ కవర్ బాన్” అమలు చేసింది.
అయితే అత్యంత కఠినమైన చర్య తీసుకున్నది పోర్చుగల్ బుర్ఖా లేదా నిఖాబ్ ధరించినట్లయితే ₹20,000 నుండి ₹4 లక్షల వరకు జరిమానా, బలవంతం చేస్తే మూడు సంవత్సరాల జైలుశిక్ష!. ఇటలీ కూడా కొత్త చట్టం ద్వారా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ముఖం కప్పే దుస్తులు నిషేధించింది.
ఆశ్చర్యకరంగా, సిరియా (2010), ఈజిప్ట్ (2015), మొరాకో (2017), ట్యునీషియా (2019), తజికిస్తాన్ (2017), ఉజ్బెకిస్తాన్ (2018), అల్జీరియా (2018) వంటి ముస్లిం మెజారిటీ దేశాలు కూడా “సెక్యులర్ విలువలు” పేరుతో నిఖాబ్, హిజాబ్‌లను నిరోధిస్తున్నాయి. తజికిస్తాన్‌లో హిజాబ్‌ను “విదేశీ వస్త్రం”గా పరిగణించి రూ.65,000 వరకు జరిమానా విధిస్తున్నారు. కెమరూన్, చాద్, గాబన్, కాంగో రిపబ్లిక్ వంటి ఆఫ్రికా దేశాలు 2015లో ఉగ్రవాద దాడుల తర్వాత బుర్ఖాపై నిషేధాలు విధించాయి.
హిజాబ్ కొంతమేర పరిమితులు ఉన్న దేశాలు: కొన్ని దేశాలు పూర్తిగా నిషేధించకపోయినా, విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలపైన మాత్రమే పరిమితులు పెట్టాయి. అజర్బైజాన్, కిర్గిజ్ రిపబ్లిక్ వంటి దేశాల్లో పాఠశాలల్లో హిజాబ్ ధరించరాదు. కెనడా దేశం క్యూబెక్‌లో ప్రభుత్వ ఉద్యోగులు మతపరమైన దుస్తులు ధరించరాదు. మన దేశంలో కూడా కర్ణాటక రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలల్లో హిజాబ్ నిషేధం అమలు చేసింది.
ఇది కేవలం దుస్తుల కథ కాదు, ఇది సంస్కృతి, సెక్యులరిజం, మహిళా స్వేచ్ఛ మధ్య జరుగుతున్న సున్నితమైన పోరాటం. యూరప్ దేశాలు (ఫ్రాన్స్, బెల్జియం, డెన్మార్క్, పోర్చుగల్, ఇటలీ) సెక్యులర్ విధానాన్ని ముందు పెట్టగా, మధ్య ఆసియా దేశాలు (తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్) తమ జాతీయ గుర్తింపును కాపాడే ప్రయత్నంగా ఈ నిషేధాలను సమర్థిస్తున్నాయి.
బుర్ఖా, నిఖాబ్ నిషేధం ఇప్పుడు ఒక సాంస్కృతిక, రాజకీయ మరియు భద్రతా పోరాటంగా మారింది. ఒకవైపు సెక్యులర్ విలువలు, మరోవైపు మత స్వేచ్ఛ ఈ రెండు మధ్య సమతౌల్యం కనుగొనడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. మరి భారత్ ట్రిపుల్ తలాక్ రద్దు తో ఆగిపోతుందా లేక హిజాబ్ ని బ్యాన్ చేస్తుందా? -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds
burqa ban countries list, countries banning niqab 2025, hijab restrictions worldwide, burqa ban reasons, France burqa ban law, Sri Lanka burqa ban 2019, China Xinjiang burqa rule, Europe niqab ban list, Muslim countries burqa ban, global burqa restrictions, 2025 burqa ban updates, list of countries that banned burqa, burqa hijab niqab banned nations, face veil ban by country, burqa laws worldwide


