ప్రకృతిలో ఉండే అనేక మొక్కలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అటువంటి వాటిల్లో చాలా గొప్ప సుగుణాలు ఉన్న మొక్క కలబంద. కలబంద గుజ్జును కాస్మోటిక్స్ లోను, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కలబంద మొక్కలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు.....
కలబందతో జుట్టుకు ఆరోగ్యం:
మన చర్మం కోమలంగా ఉండేలా మార్చే గొప్ప గుణం కలబంద కు ఉంది. కలబంద 96% నీటిని కలిగి గుజ్జుగా ఉంటుంది. ఇది అన్ని రకాల వాతావరణంలోనూ పెరుగుతుంది. అలోవెరా గుజ్జును మనం జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. కొబ్బరినూనె, అలోవెరా జెల్ జుట్టుకు బాగా పట్టిస్తే తలలో ఉన్న చుండ్రు పోవడంతో పాటు, మృత కణాలు తొలగిపోయి, జుట్టు నున్నగా మారుతుంది.
బీపీ, షుగర్, మల బద్దకాన్ని కంట్రోల్ చేసే కలబంద:
బిపి, షుగర్ వంటివి తగ్గడానికి కలబంద బాగా ఉపయోగపడుతుంది. రోజుకు రెండు స్పూన్ల కలబంద జ్యూస్ తాగితే బీపీ, షుగర్ రెండు కంట్రోల్లోకి వస్తాయి. కలబంద మలబద్దకాన్ని నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెరుగుపరుస్తుంది. మీలో శక్తిని పెంచుతుంది. కణాల క్షీణతను తగ్గిస్తుంది. గాయాలు త్వరగా నయం కావడానికి దోహదం చేస్తుంది.
కలబంద జ్యూస్ తాగితే బరువుకు చెక్:
హానికరమైన రోగాలు రాకుండా కాపాడుతుంది. కనుక కలబంద జ్యూస్ ను నిత్యం ఏదో ఒకరకంగా మనం వినియోగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మానికి జుట్టు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, బరువు తగ్గడానికి, బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది.
కనుక కలబంద ప్రయోజనాలను అర్థం చేసుకొని నిజజీవితంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి.