ఆత్మనిర్భర్ గా భారత్ ఎదగాల్సిన సమయం మనకు ప్రపంచం అనేక రకాలుగా అవకాశాలు ఇస్తుంది. కాబట్టి ఎటువంటి విషయాల్లో మనం ఆత్మనిర్భరత సాధించాలో తెలియజేస్తూ... ఆత్మనిర్భర్ సిరీస్ వ్యాసాలు అందించే ప్రయత్నం చేస్తాను...
అమెరికా మరోసారి భారత ప్రతిభను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అక్కడి ప్రభుత్వం H-1B వర్క్ వీసా ధరను ఒక్కవీసాకి దాదాపు ₹89 లక్షలు ($100,000) గా పెంచింది! దీంతో భారత ఐటీ నిపుణులు అమెరికాలో పని చేయడం మరింత కష్టతరమవుతుంది. కానీ ఇదే సందర్భంలో మనకు ఒక స్పష్టమైన పాఠం కనిపిస్తోంది, “ఇతర దేశాలపై ఆధారపడడం కాదు, మనమే అవకాశాలు సృష్టించుకోవాలి! విదేశాలపై ఆధారపడటమే మనకు ప్రధాన శత్రువు అనే విషయం గమనించాలి”
క్లిష్టమైన పరిస్థితులనే అవకాశంగా మలచుకోవాలి భారత టెక్ పునరుజ్జీవనం జరగాలి: ప్రముఖ పారిశ్రామికవేత్తలు టీ.వి. మోహన్‌దాస్ పాయ్ మరియు నిషా హోల్లా చెప్పిన సూచన ఈ సవాలును ఒక అవకాశంగా మార్చుతుంది. వారి ప్రకారం, భారత ప్రభుత్వం కనీసం ₹50,000 కోట్ల నిధి ఏర్పాటు చేసి, దేశీయ టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడి పెట్టాలి. ఈ నిధి ద్వారా సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లీన్ ఎనర్జీ, డీప్ టెక్ వంటి రంగాల్లో పరిశోధన, ఉత్పత్తి, స్టార్టప్‌లను ప్రోత్సహించవచ్చు.
మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ₹9 లక్షల కోట్లు సబ్సిడీలపై ఖర్చు చేస్తోంది. ఆ మొత్తంలో చిన్న భాగాన్ని కూడా ఇన్నోవేషన్, సాంకేతిక అభివృద్ధి కోసం వాడితే, భారతదేశం లక్షలకొద్దీ నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించగలదు, ప్రపంచానికి సాంకేతిక పరిష్కారాలు అందించే శక్తిగా నిలుస్తుంది.
ప్రభుత్వ ప్రోత్సాహమే కీలకం: ఇండియన్ స్టార్టప్‌లు ఎదగాలంటే, ప్రభుత్వమే మొదటగా దేశీయ టెక్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే మన కంపెనీలకు పెద్ద మార్కెట్ లభిస్తుంది, అవి Google, Microsoft, Nvidia లాంటి గ్లోబల్ కంపెనీల స్థాయికి ఎదగగలవు. మనం తయారు చేసిన సాంకేతికతను ప్రపంచం వాడే రోజులు దూరంలో లేవు.
“వీసా” కోసం కాదు, “విజన్” వైపు పరిగెత్తే సమయం దగ్గరలోనే వుంది: ఇప్పటివరకు ఎంతోమంది యువత అమెరికా వీసా కోసం క్యూలో నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఆ కాలం ముగిసింది. వీసా మన భవిష్యత్తు కాదు, విజన్ మన శక్తి అయ్యింది. ఇప్పుడు మన దేశంలోనే వేలకొద్దీ స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి, ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు మన మేధస్సులో జన్మిస్తున్నాయి.
అమెరికా మన ప్రతిభకు అడ్డుకట్ట వేయాలనుకుంటే, భారత్ మాత్రం దానికి సమాధానంగా ఒక కొత్త దిశ చూపుతుంది, “మీరు మాకు మద్ధతివ్వండి, మేము టెక్ సామ్రాజ్యాలు నిర్మిస్తాం! అంటోంది GenZ”.
ఇది కేవలం ఒక వీసా సమస్య కాదు. ఇది భారత యువత భవిష్యత్తు దిశను నిర్ణయించే క్షణం. అమెరికా మనకు తలుపులు మూస్తే, మనకు మనమే మార్గం ఏర్పరచుకోవాలి. మన సాంకేతిక శక్తిని, మన మేధస్సును, మన స్ఫూర్తిని ఏ దేశం ఆపలేను. భారత టెక్ యుగం ప్రారంభం అయ్యింది. మనమే సూపర్ పవర్‌గా ఎదగాల్సిన సమయం వచ్చుంది. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds
India US visa hurdles, Indian tech industry response, US visa restrictions 2025, India superpower vision, Indian IT companies innovation, tech talent India USA, visa challenges for Indian engineers, India global superpower goal, US visa policy impact India, Indian startups growth 2025, Make in India technology, India Silicon Valley alternative, Indian tech dominance, India technology independence, US immigration and Indian tech