ప్రతి స్నేహానికి ఒక కారణం ఉంటుంది. అది వ్యక్తులమధ్యైనా దేశాల మధ్య అయినా, ఇజ్రాయెల్ తో మనకు అంతటి స్నేహానికి కారణం ఒకటి మనం వాళ్లకు కష్టకాలంలో ఆశ్రయం ఇవ్వడం ఒకటైనా వాళ్ల నగరాలను శత్రువుల నుండి విడిపించడం మరొకటి. ఒట్టమన్ నుండి హైఫా విముక్తి ఎలా జరిగిందే తెలుసుకుందాం...
మొదటి ప్రపంచ యుద్ధం (1914–1918) చరిత్రలో అత్యంత రక్తపాతం సృష్టించిన సంగ్రామం. ఒకవైపు జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఒట్టొమన్ సామ్రాజ్యం (సెంట్రల్ పవర్స్), మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అలాగే అమెరికా (అలైడ్ పవర్స్) మధ్య భయంకరమైన పోరు కొనసాగింది. ఈ యుద్ధం యూరప్ పరిమితిని దాటి ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోనూ జ్వాలలు రగిలించింది.
ఆ సమయంలో మధ్యప్రాచ్యాన్ని పాలించిన ఒట్టొమన్ సామ్రాజ్యం జర్మనీలతో చేతులు కలిపి అలైడ్ శక్తులను ప్రతిఘటించింది. పాలస్తీనా, సిరియా, టర్కీ ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకున్న ఒట్టొమన్ సామ్రాజ్యం, బ్రిటిష్ సేనకు పెద్ద సవాల్‌గా మారింది.
ఇదే సమయంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ చరిత్రాత్మక పాత్ర పోషించింది. ముఖ్యంగా కవలరి దళాలు (గుఱ్ఱపు దళాలు) అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించాయి. బుల్లెట్ల వర్షంలోనూ, బుల్లెట్ల వేగంతో గుఱ్ఱాలపై దూసుకెళ్లిన వారి ఉత్సాహం, యుద్ధనైపుణ్యం శత్రువులను భయంతో వణికించాయి.
1918 సెప్టెంబర్ 23న హైఫా పట్టణ విముక్తి కోసం నిర్ణాయాత్మకమైన యుద్ధం జరిగింది. అప్పట్లో ఒట్టొమన్, జర్మన్ సేనల ఆధీనంలో ఉన్న ఈ సముద్రతీర కోటను స్వాధీనం చేసుకోవడం దాదాపు అసాధ్యమని భావించినా, భారత కవలరి సైనికులు ఆ అసాధ్యాన్ని సాకారం చేశారు. జోధ్‌పూర్, మైసూర్ లాన్సర్లు మేజర్ దల్పత్ సింగ్ నేతృత్వంలో ప్రాణాలను పణంగా పెట్టి దాడి చేసి, హైఫాను విముక్తం చేశారు. ఈ పోరాటంలో మేజర్ దల్పత్ సింగ్ వీరమరణం పొందినా, ఆయన పేరు శాశ్వతంగా "హైఫా హీరో” గా నిలిచిపోయింది.
ఈ విజయంతో హైఫా ప్రజలకు ప్రాణం తిరిగొచ్చింది. భారతీయ సైనికుల ధైర్యం, త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికులు గుఱ్ఱాలపై చేసిన ఆ దాడి ఇప్పటికీ ప్రపంచ యుద్ధ చరిత్రలో “చివరి గొప్ప కవలరి యాత్ర”గా పేర్కొనబడుతుంది. ఇప్పటికీ భారత్ లో ఆ దళం రాష్ట్రపతి ని సంరక్షించే బాధ్యతను భారత్ లో తీసుకుని పనిచేస్తుంది.
అప్పటికే బ్రిటన్ ప్రపంచ వ్యాప్తంగా తరిమివేయబడ్డ యుదులకు పాలస్తీనా ప్రాంతాన్ని ఇస్తామని మాట ఇస్తుంది. ఇచ్చిందే కాని పూర్తిగా నిలబెట్టుకోకుండా 1948 లో ఇతర మతాల వారిని ఏమీ చృయొద్దంటూ మాట తీసుకుని ఇజ్రాయేల్ ని అప్పగించింది. అదే ఇప్పుడు గాజా హమాస్ గా మారి వారిని మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా పారిపోండి అంటుంది. ఇటువంటి సమయంలో భారత కవలరీ దళల చేత ఒట్టమన్ ల నుండి హైఫా విముక్తి గావించబడిన తేజీ సెప్టెంబర్ 23 1918.
కనుక హైఫా విముక్తిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న “హైఫా డే” జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ఇజ్రాయెల్ నేతలు, భారత రాయబారులు కలిసి అమర సైనికుల సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. పాఠశాలల్లో విద్యార్థులకు హైఫా యుద్ధం, భారత సైనికుల గాథలను బోధిస్తారు.
ఈ సంవత్సరం హైఫా మేయర్ యోనా యాహవ్ ఈ వేడుకల్లో గర్వంగా ఇలా అన్నాడు: “నేను ఈ నగరంలోనే పుట్టాను, ఇక్కడే చదివాను. ఎప్పుడూ ఈ నగరాన్ని బ్రిటిష్ విముక్తి చేశారనే మాకు చెప్పారు. కానీ చరిత్ర మరోలా చెబుతుంది. మేము పరిశోధన చేస్తే హైఫాను విముక్తి చేసింది బ్రిటిష్ కాదు, భారతీయ సైనికులేనని రుజువయ్యింది. కవలరీ దళాలు భారత్ వని నిర్ధారణ జరిగింది అందుకే మేము ఇప్పుడు పాఠశాలలో పుస్తకాలను సవరించి, పిల్లలకు నిజమైన చరిత్రను చెబుతున్నాం. ఇకనుండి హైఫాను విముక్తి చేసింది బ్రిటీష్ కాదు భారత్ అని గర్వంగా మా పుస్తాకాల్లో వ్రాసుకుంటాం అని భావోద్వేగానికి గురయ్యాడు.”
ఇజ్రాయెల్‌లో హైఫా యుద్ధం కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు, అది భారత సైనికుల పట్ల కృతజ్ఞతకు ప్రతీక. ఈ సంఘటన భారత్–ఇజ్రాయెల్ సంబంధాలను మరింత బలంగా కట్టిపడేసింది. నేడు ఈ రెండు దేశాలు రక్షణ, సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో అగ్రగామి భాగస్వాములుగా నిలుస్తున్నాయి.
హైఫా యుద్ధభూమిలో రక్తం చిందించిన భారత కవలరి దళాల వీరగాథ, నేడు భారత్ ఇజ్రాయెల్ స్నేహానికి శాశ్వత ప్రతీకగా వెలుగొందుతోంది. ఇజ్రాయిల్ - భారత్ ప్రధానులు ఎవరైనా మారొచ్చు స్నేహం మాత్రం చిరకాలం కొనసాగుతుంది. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds