మనందరికీ తెలిసింది ఏమిటంటే, భారత్ సరిహద్దుల లోపలే వందలాది ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్నాయని. కానీ, ఒక ప్రశ్న మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది “భారత్ కి సరిహద్దులు దాటి, ఇతర దేశాల్లో కూడా ఎయిర్‌బేస్‌లు ఉన్నాయా?” అని. ఇది విని మొదట మనకు ఆశ్చర్యం కలగకమానదు. కానీ నిజం ఏంటంటే, భారత్ ఇప్పటికే మధ్య ఆసియాలో తనకంటూ ఒక ప్రాధాన్యతను ఏర్పరుచుకుంది. ఇప్పుడు ఆఫ్రికాలో పాగావేస్తోంది అదేంటో ఈ వ్యాసం లో చూద్దాం..
ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వం దేశ రక్షణను కేవలం సరిహద్దుల వరకే పరిమితం చేయకుండా, దూర ప్రాంతాల్లో కూడా తన వ్యూహాత్మక శక్తిని బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావాన్ని పెంచే ఈ ముందడుగులు, భవిష్యత్తులో గ్లోబల్ సెక్యూరిటీ సమీకరణాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
భారతదేశం ప్రపంచ వేదికపై తన రక్షణ శక్తిని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఫర్ఖోర్, ఐని (గిస్సర్) ఎయిర్‌బేస్‌లతో మధ్య ఆసియాలో ఇప్పటికే తన ముద్ర వేసుకున్న భారత్, ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో అడుగుపెట్టబోతుంది!! తాజా సమాచారం ప్రకారం, మొరాకోలోని ఒక వ్యూహాత్మక ఎయిర్‌బేస్ భారత్‌కు పూర్తిస్థాయి వినియోగానికి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఇది కేవలం మూడో విదేశీ ఎయిర్‌బేస్ మాత్రమే కాదు! భారత్ భవిష్యత్ రక్షణ వ్యూహంలో ఒక విప్లవాత్మక మార్పు!!
మొరాకో నిర్ణయం ఒక గేమ్ ఛేంజర్: మొరాకో, ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉన్న భౌగోళిక అద్భుతం. ఒక వైపు మధ్యధరా సముద్రం, మరో వైపు అట్లాంటిక్ మహాసముద్రం రెండింటికీ వంతెనలా నిలిచే దేశం. ఈ ప్రాంతం నుంచి యూరప్ కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఇలాంటి కీలక స్థలంలో ఎయిర్‌బేస్‌ను భారత్‌కు వినియోగించేందుకు అనుమతించడం అంటే భారత్‌కు పశ్చిమ ద్వారం తెరుచుకున్నట్టే. ఇకపై భారత వాయుసేన యుద్ధవిమానాలు, రవాణా విమానాలు లేదా ప్రత్యేక రక్షణ దళాలు నేరుగా ఆఫ్రికా ఖండంలోకి ప్రవేశించగలవు. సమయానికి స్పందించడానికి, శత్రువుల కదలికలను అడ్డుకోవడానికి, వ్యూహాత్మక ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఒక అద్భుతమైన ఆయుధం.
భారతదేశంకి విదేశీ ఎయిర్‌బేస్ లు: భారత్ గతంలోనూ విదేశీ ఎయిర్‌బేస్‌లను ఉపయోగిస్తూ వచ్చింది. ప్రధానంగా మూడు ఎయిర్ బేస్ లు ఉన్నవి.
1. ఫర్ఖోర్ ఎయిర్‌బేస్ – తజికిస్తాన్: ఇది భారతదేశం తొలి విదేశీ ఎయిర్‌బేస్. ఆఫ్ఘానిస్తాన్ యుద్ధం, పాకిస్తాన్-చైనా ప్రభావానికి చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషించింది.
2. ఐని/గిస్సర్ ఎయిర్‌బేస్ – తజికిస్తాన్: భారత్ మరియు తజికిస్తాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ బేస్ అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాల నిలయం. మధ్య ఆసియాలో భారత్ ఉనికిని బలపరచింది.
3. మొరాకో ఎయిర్‌బేస్ – ఆఫ్రికా (తాజాగా): ఇది భారత్‌కు మూడో విదేశీ ఎయిర్‌బేస్. ఆఫ్రికా ఖండంలో మొదటి పూర్తి స్థాయి వైమానిక కేంద్రం.
ఇవి కాక ఇంకా సింగపూర్, ఇరాన్, ఒమన్, భూటాన్, శ్రీలంక మడగాస్కర్, మారిషస్, సైకిలిస్ లలో అవసరాన్ని బట్టి ఉపయోగిస్తుంటారు. సైనిక విన్యాసాలు, వాణిజ్యానికి కొంత ఉపయోగపడతాయి.
భారత్ వ్యూహాత్మక నిర్ణయం: భారత్‌కు లభించే లాభాలు
చైనా ప్రభావానికి బలంగా చెక్ పెట్టవచ్చు. ఆఫ్రికాలో చైనా పెట్టుబడులు, సైనిక ఉనికి పెరుగుతున్న తరుణంలో భారత్‌కు ఈ ఎయిర్‌బేస్ గేమ్ ఛేంజర్ అవుతుంది. ఇది చైనాకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తి ప్రదర్శన. పశ్చిమాన మనకు రక్షణ కవచంగా మారుతుంది.
మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ సముద్రంలోని వాణిజ్య మార్గాలు భారత్ ఆధీనంలో మరింత భద్రంగా ఉంటాయి.
సముద్ర దొంగల నుండి, ఉగ్రవాద దాడులపై అన్ని వేళాలా సమాచారం అందుబాటులో ఉంటుంది. భారత్-ఆఫ్రికా సంబంధాల కొత్త అధ్యాయం. సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ బదిలీ అన్నీ మొరాకో ద్వారానే వేగవంతమవుతాయి. భారత్ ఆఫ్రికా దేశాలకు బలమైన, నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుంది.
మొరాకో ఎయిర్‌బేస్ కేవలం ఒక సైనిక ఒప్పందం కాదు చరిత్రలో నిలిచే ఒక వ్యూహాత్మక నిర్ణయం. మధ్య ఆసియా నుంచి ఆఫ్రికా వరకు వ్యాపించిన ఒక శక్తివంతమైన రక్షణ వలయం భారత్ చేతుల్లోకి వస్తుంది. ఇది భవిష్యత్‌లో భారత్‌ను కేవలం ప్రాంతీయ శక్తిగా కాక ఒక గ్లోబల్ సూపర్ పవర్ నిలబెఫుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా మొరాకో ఎయిర్ బేస్ గురించే మాట్లాడుకోవడం, గమనించాల్సిన విషయం. ఇది మనల్ని ప్రపంచంలో అజేయ శక్తిగా మార్చే ఒక నిర్ణయంగా నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం కూడా తెలుపండి... -రాజశేఖర్ నన్నపనేని, Mega Minds
Haifa Liberation Day, India foreign airbases, Indian military bases abroad, India global military presence, Indian Air Force overseas, India logistics pact, LEMOA agreement India, Duqm port Oman India, France Reunion Island India access, India Japan military pact, India US defense cooperation, base-less power projection India