భారతదేశంలో కుల గణన గురించి ఇటీవల చర్చలు ఊపందుకుంటున్నాయి. చాలామంది దీన్ని సామాజిక న్యాయం మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోణంలో చూస్తున్నారు. కానీ దీని వెనక దాగి ఉన్న అంతర్జాతీయ కుట్రను అర్థం చేసుకోవాలంటే, జోషువా ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఇది అమెరికా ఆధారిత క్రైస్తవ మిషనరీ సంస్థలు నడిపే గ్లోబల్ ఆర్గనైజేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాతులు, తెగలు, భాషలను గూర్చి తెలుసుకుని తద్వారా మతమార్పిడి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా భారత్‌పై దీని దృష్టి అత్యధికం, భారత్ లో ఇది 1995 లో మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ సమాజం ఇక్కడే ఉంది. ఈ ప్రాజెక్ట్ కేవలం డేటా సేకరణ కాదు, హిందూ సమాజాన్ని లోపల నుంచి విభజించి మతమార్పిడులను ప్రోత్సహించే సుదీర్ఘ ప్రణాళిక. ఇది మతపరమైనటువంటి యుద్ధానికి ఒక ఆయుధంగా పనిచేస్తుంది, భారత్ లోని 95.6% మందిని 'unreached' గా గుర్తించి ఒక లక్ష్యంతో వారి పై పనిచేస్తుంది.
జోషువా ప్రాజెక్ట్ అనేది క్రైస్తవ మిషనరీలకు ఒక సమాచార సాధనం. ఇది ప్రపంచంలోని 17,559 సమూహాలను వారి వారి పురాతన సాంప్రదాయాలను పాటించే వారిని లక్ష్యంగా చేస్తుంది, వీటిలో 7,541 'unreached' గా వర్గీకరించబడ్డాయి. భారత్‌లో దీని ప్రధాన లక్ష్యం హిందూ సమాజంపై ఉంది, ప్రతి కులాన్ని వేర్వేరు సమూహాలగా అధ్యయనం చేస్తుంది. పేదరికం, అక్షరాస్యత, ఉద్యోగావకాశాలు, సామాజిక బలహీనతలు వంటి వివరాలను సేకరించి, 'conversion potential' ను లెక్కిస్తుంది. 2016 రిపోర్ట్ ప్రకారం, భారత్‌లో 89% మంది unreached గా గుర్తించింది, అంటే మొత్తం సమాజం ఒకే లక్ష్యంగా గుర్తించబడింది. ఇది సాధారణ పరిశోధన కాదు, మతమార్పిడులకు లోతైన సమాచారాన్ని, నివేదికలను అందిస్తుంది. భారత్ లోని కుల భావనను ఉపయోగించి, ప్రజలను విభజించి పని చేస్తుంది, ఎందుకంటే దక్షిణ ఆసియాలో కుల భావనను ఆధారంగా నిర్వచిస్తుంది.
భారత్‌లో జోషువా ప్రాజెక్ట్ పని అత్యధికం. ఇది భారత్ లోని సాంప్రదాయాలను, కులాలు, భాషలు, మతాలను ఆధారం చేసి, లెక్కలను అందిస్తుంది. నిజం చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కుడా ఈ లెక్కలు లేవు. ఉదాహరణకు, బ్రాహ్మిన్, జాట్ వంటి కులాలను వేర్వేరు ప్రజా సమూహాలుగా వర్గీకరిస్తుంది. ఇండియా ఫ్యాక్ట్స్ రిపోర్ట్ ప్రకారం, ఇది క్రిస్టియన్ నమ్మకాలను అనుసరించని హిందూ సమూహాలను గుర్తించి పనిచేస్తుంది. కొన్ని సోర్సెస్ ప్రకారం, ఇది మాస్ & మాసివ్ కన్వర్షన్స్‌కు కారణమవుతుంది, ముఖ్యంగా సౌత్ ఇండియాలో హిందూ వ్యతిరేకత పెరగడానికి దోహదపడుతుంది. ట్రిబల్ రీజన్స్‌లో రిలిజియస్ కన్వర్షన్స్ మరియు సెపరటిజం మధ్య అవినాభావ సంబంధాలను తెలియజేస్తుంది. ఇది పూర్తి హిందూ డేటాను ఉపయోగించి మిషనరీలకు ఎవర్ని తేలికగా మతం మార్చవచ్చో తెలియజేస్తుంది.
కులం ఎందుకు లక్ష్యం? సాధారణంగా డేటా సేకరణ భాష లేదా ప్రాంతం ఆధారంగా జరుగుతుంది, కానీ జోషువా ప్రాజెక్ట్ కులాలను టార్గెట్ చేస్తుంది. హిందూ సమాజంలో కులం సమూహ బంధాన్ని సూచిస్తుంది, ఒక కులంలో కొద్ది మందిని మార్చితే మొత్తం కమ్యూనిటీ మారిపోతుంది. మతమార్పిడులు కాస్ట్ బై కాస్ట్ విస్తరిస్తాయి. ప్రాజెక్ట్ మాన్యువల్స్ ప్రకారం, ఒక కాస్ట్‌లో 2% మంది మారితే ఆ గ్రూప్ 'reached'గా మార్క్ చేయబడుతుంది, తద్వారా మరిన్ని మిషనరీల నుండి నిధులు వస్తాయి. ముందే చెప్పుకున్నట్లు దక్షిణ ఆసియా లో భాషలకన్నా కూడా కులాలకు ప్రాముఖ్యత ఎక్కువ దీనిని చర్చ్ గుర్తించి కులాల వారీగా కుడా చర్చ్ లు కడుతుంది, భీకరమైన మతమార్పిడీలకు పాల్పడుతుంది.
కుల గణన జరిగితే జోషువా ప్రాజెక్ట్‌కు కొత్త డేటా లభిస్తుంది. ఏ కులం ఎక్కువ పేదరికంలో ఉంది, అక్షరాస్యత తక్కువ ఉంది అనేవి బయటపడతాయి. ఇది వెల్ఫేర్ ప్రాజెక్టుల ద్వారా టార్గెటింగ్‌ను సులభతరం చేస్తుంది. ప్రతి జాతిని గ్రీన్, యెల్లో, రెడ్ కలర్స్‌తో గుర్తించి ప్లాన్ చేస్తారు. రాహుల్ గాంధీ కాస్ట్ సెన్సస్ డిమాండ్‌ను జోషువా ప్రాజెక్ట్ తో తో సంబంధాలు ఉన్నట్లు కొన్ని రహస్య సంస్థలు చెప్తున్నాయి. ఇది కుల గణన కాదు, ఇది మతమార్పిడీలకు సులభతర వ్యూహం.
హిందువులపైనే ఎందుకు ఫోకస్? ముస్లిం లేదా ఇతర మతాల విభజనలను ఎవరూ డిమాండ్ చేయరు. జోషువా ప్రాజెక్ట్ టార్గెట్ హిందువులు మాత్రమే. ముస్లిం సమాజంలో విభజనలను బయటపెట్టరు, హిందూ సమాజాన్ని ముక్కలుగా చేసి బలహీనతలను ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఇది హిందూ సామాజిక నిర్మాణాన్ని విభజించడానికి ప్రయత్నం. కొన్ని నివేదికల ప్రకారం, ఇది సౌత్ ఇండియాను డ్రవిడిస్తాన్, సెంట్రల్ ఇండియాను దళితిస్తాన్‌గా మార్చాలని ప్లాన్ చేస్తుంది.
కులం మొత్తాన్ని ఒకేసారి మత మార్పిడి చేయడం అదెలాగంటే ముందుగా ఒక కుల నాయకుడిని లేదా ప్రభావశీల వ్యక్తిని మారుస్తారు. ఎన్‌జీఓలు, విదేశీ నిధులతో వెల్ఫేర్ ప్రాజెక్టులు పెడతారు. వారిని రోల్ మోడల్‌గా చూపిస్తారు, తర్వాత మాస్ కన్వర్షన్లు మ్యాసివ్ గా చేస్తారు. ఒక కాస్ట్ 'reached' అయితే మరిన్ని మతమార్పిడీలకు అవకాశం కలుగుతుంది. మాస్ కన్వర్షన్ మూవ్‌మెంట్స్‌ను ప్రోత్సహిస్తుంది.
రాజకీయాల పాత్ర దురదృష్టకరం. చాలా పార్టీలు కులాల లెక్కల్లో బిజీగా ఉంటాయి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకులపై దృష్టి పెడతాయి, ప్రభుత్వం దీన్ని అడ్డుకోలేకపోతుంది. ఇంతలో హిందూ సమాజం నిశ్శబ్దంగా క్రైస్తవీకరణమవుతుంది. కొన్ని నివేదికలు రాహుల్ గాంధీకి వాటికన్ ఇన్‌స్ట్రక్షన్స్ తో సంభంధాలు ఉన్నట్లుగా తెలుపుతున్నాయి.
మీకు ఇక్కడ జాషువా ప్రాజెక్ట్ వెబ్సైట్ కుడా ఇవ్వడం జరుగుతుంది, అందులో వాళ్ళు ఎంతకు తెగబడితే పబ్లిక్ గా మిమ్మల్ని మతం మారుస్తాం అంటూ ప్రపంచ ప్రాచీన మతాలకు సవాలు విసురుతున్నారో చూడవచ్చు. joshuaproject.net అని గూగుల్ చేయండి, అందులో మీరు ఆశ్చర్యమే కాదు విస్తుపోయే వాస్తవాలను చూస్తారు. ఉదాహరణకు మీకు ఇక్కడ మంగలి కులానికి సంబంధిత లెక్కలను చూపిస్తాను, నాకు తెలిసి ఈ లెక్కలు భారత ప్రభుత్వం దగ్గర కుడా ఉండి ఉండవు.
చరిత్ర పునరావృతమవుతుందా? పూర్వం దండయాత్రికులు ఖడ్గంతో వచ్చారు, ఇప్పుడు ల్యాప్‌టాప్ లో ఫుల్ డాటా తో, ఎన్‌జీఓలు, సెన్సస్, డేటా, డబ్బు తో వస్తున్నారు. సాధనం మారింది, కానీ ఆక్రమణ అదే. ఇది నిశ్శబ్ద యుద్ధం, హిందూ నాగరికతను లోపల నుంచి వశం చేసుకోవడం.
జోషువా ప్రాజెక్ట్ ఒక సాధారణ డేటాబేస్ కాదు, హిందువులను విభజించి మార్చే బ్లూప్రింట్. కుల గణన దానికి నూతన ఉత్సాహాన్నిస్తుంది. ప్రతి హిందువూ జాగ్రత్తగా ఉండాలి, ఇది ఓటు రాజకీయాలు మాత్రమే కాదు, ధర్మాన్ని బలహీనపరచే పెద్ద ప్రణాళిక. హిందూ సమాజం జాగ్రత్తగా లేకపోతే, భవిష్యత్ తరాలు చీకట్లోకి నెట్టబడి సనాతన ధర్మాన్ని కోల్పోతాము. రాజశేఖర్ నన్నపనేని. Mega Minds