భారత్‌లో చిన్న ఘటన జరిగినా ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. కానీ అమెరికాలో ప్రతిరోజూ జరిగే హింసాత్మక ఘటనలపై వెస్ట్రన్ మీడియా ఎందుకు మౌనం వహిస్తోంది? ఇదే అసలు ప్రశ్న. అమెరికా లోపల గన్ కల్చర్, రెసియల్ దాడులు, ఇమ్మిగ్రెంట్లపై దాడులు ఇవన్నీ తెలిసినా, అక్కడి మీడియా లోకల్ న్యూస్‌లా చూపిస్తుంది. కానీ భారత్‌లో చిన్న సమస్య వచ్చినా దానిని భూతద్దంలో చూపి అంతర్జాతీయంగా భారత్ విమర్శలతో ప్రతికూల వాతావరణం సృష్టిస్తుంది.
అమెరికా పౌరుల భద్రతలో విఫలం: 2025లోనే అనేక సంఘటనలు అమెరికా ఎంత అసురక్షితమో స్పష్టంగా చూపించాయి. ఉక్రెయిన్ రిఫ్యూజీ ఇరీనా జరుట్స్కా, నార్త్ కరోలినాలో లైట్ రైల్‌లో అకారణంగా కత్తిపోట్లకు బలి అయింది. అదే నెలలో టెక్సాస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను భార్య, కూతురు ముందే మాచెట్‌తో తల నరికి చంపారు. యూటాలో కన్జర్వేటివ్ నేత అమెరికాలో అత్యంత ప్రజాదరణ కలిగిన జాతీయవాది, చార్లీ కిర్క్‌ను కూడా కాల్చి చంపారు. ఇవన్నీ ఒక్కోటి ఇమ్మిగ్రెంట్లు, సాధారణ పౌరులు అమెరికాలో ఎదుర్కొనే ప్రమాదాలను బయటపెడుతున్నాయి.
గణాంకాల లోకి వెళితే: ప్రతి సంవత్సరం అమెరికాలో 40,000 మందికి పైగా గన్ కల్చర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయం చెబుతుండగానే చార్లీ కిర్క్ ని షూట్ చేశారు. ఆత్మహత్యలు అమెరికాలో 4.7% ప్రతి లక్షమందికి కాగా, భారత్‌లో 2.8% మాత్రమే. గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్‌లో భారత్ 66వ స్థానంలో ఉండగా, అమెరికా 89వ స్థానంలో ఉంది. అంటే అమెరికా కంటే భారత్ మరింత సురక్షితం. అయినా మీడియా అమెరికాను “డ్రీమ్ ల్యాండ్”గా, భారత్‌ను “డేంజర్ జోన్”గా చూపించడం వెనుక ఏదో ఉద్దేశ్యం స్పష్టంగా కనబడుతోంది.
భారత్‌పై ఎందుకింత వివక్ష: కశ్మీర్‌లో చిన్న ఉద్రిక్తత జరిగినా, ఉగ్రవాద దాడి జరిగినా వెస్ట్రన్ మీడియా భారత్‌ను విమర్శిస్తుంది. కానీ ఆ దాడులు ఎవరి మద్దతుతో జరుగుతున్నాయో ప్రశ్నించదు. పాకిస్తాన్‌పై మౌనం, భారత్‌పై విమర్శ ఇది చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ వంటి మీడియా హౌసులు భారత్‌ను అసహనం, పేదరికం, మైనారిటీ సమస్యలతో మాత్రమే లింక్ చేస్తాయి. పాశ్చాత్య మీడియా ప్రపంచ సమస్యలకు భారత్ స్పందించాలి. కానీ భారత్ సమస్యలను మాత్రం ప్రపంచానికి భూతద్ధంలో పెట్టి చూపిస్తుంది.
వివక్ష వెనుక వాస్తవ కారణాలు: మొదట జియోపాలిటికల్ ప్రయోజనాలు. అమెరికా గ్లోబల్ లీడర్‌గా నిలవాలంటే భారత్ ఎదగకూడదు అన్నది పాశ్చాత్య దృష్టి. రెండవది కల్చరల్ స్టీరియోటైప్స్ భారత్ అంటే పేదరికం, జనాభా, కులవ్యవస్థ అనే ఇమేజ్‌ని వెస్ట్రన్ మీడియా కొనసాగిస్తోంది. మూడవది ఎకనామిక్ రైవల్రీ, భారత్ ఐటి, స్పేస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఎదగడం పాశ్చాత్యులకు అసౌకర్యంగా మారుతోంది.
అమెరికా వాస్తవాలను దాచిపెట్టి ఎవరిని మోసం చేస్తుంది: రేసియల్ అటాక్స్, స్కూల్ షూటింగ్స్, డ్రగ్ ఎపిడెమిక్—ఇవన్నీ అమెరికాలో ప్రతిరోజు జరుగుతున్న అత్యంత ప్రమాధకరమైన వాస్తవాలు. కానీ అవి “సిస్టమ్ ఫెయిల్యూర్”గా చూపించబడవు. ఆ ఘటనలు వ్యక్తిగత క్రైమ్‌లుగా చూపిస్తారు. అదే సమయంలో భారత్‌లో జరిగే ఏదైనా నేరాన్ని “కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం”గా చూపించడం డబుల్ స్టాండర్డ్‌కి ఉదాహరణ.
భారత్ లో నిజంగా అసహనం, అభద్రతలు ఉన్నవా?: భారత్‌లోనూ సమస్యలు ఉన్నాయ్ విమెన్ సేఫ్టీ, కమ్యూనల్ టెన్షన్స్. కానీ మొత్తం గణాంకాలు చూస్తే భారత్ అమెరికా కంటే సేఫ్. భారత్‌లో చట్టాలు కఠినంగా ఉండటం, కమ్యూనిటీ సపోర్ట్ బలంగా ఉండటం వల్ల హింసాత్మక నేరాలు తక్కువ. అమెరికాలో మాత్రం గన్స్ అందుబాటులో ఉండటం వల్ల చిన్న చిన్న వాదనలు కూడా హత్యలుగా మారుతున్నాయి.
అమెరికాపై ప్రేమ, భారత్‌పై ద్వేషం ఎందుకు? సమాధానం సింపుల్: రాజకీయ స్వార్థం, కల్చరల్ పక్షపాతం, మనం ఆర్ధికంగా బలపడటం. భారత్ ఈ వివక్షను గుర్తించి. వాస్తవాలను ప్రపంచానికి వినిపించడం అత్యవసరం. భారత్ అభివృద్ధి, భద్రత పరంగా అమెరికా కంటే మెరుగ్గా నిలుస్తున్న అనేక రంగాలను ముందుకు తెచ్చే సమయం ఇది. లేకపోతే, వెస్ట్రన్ మీడియా తన కథనాలతో ప్రపంచానికి భారత్ ని దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. -కరుణాకర్ బుదురు. రాజకీయ, సామాజిక విశ్లేషణలు.