గత నాలుగేళ్లలో దక్షిణాసియా ఎప్పుడూ లేనంత గందరగోళాన్ని చూస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కలిగిన దేశాలు ఒకదాని తరువాత ఒకటి కుప్ప కూలిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చీకటిలో మగ్గిపోతుంది. పాకిస్తాన్ సైనికుల బూట్ల కింద నలిగిపోతుంది. మయన్మార్ అంతర్యుద్ధంలో రక్తమోడింది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ప్రజాస్వామ్యం కూలిపోతూ తాత్కాలిక పాలనలతో తగలబడుతున్నాయి.
ఈ చీకటి మధ్య రెండు దేశాలు మాత్రం నిలిచాయి భూటాన్ మరియు భారత్. కానీ భారత్ ప్రత్యేకం. ఎందుకంటే భారత్ కేవలం ప్రజాస్వామ్యం దేశం మాత్రమే కాదు, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య దేశం. విలువైన సాంప్రదాయాలతో బలపడిన నాగరికత, దేశ ప్రజల్లో చైతన్యం, రాజ్యాంగ శక్తితో పటిష్టమైన గణతంత్ర, సర్వసత్తాక ప్రజాస్వామ్యం తో పెను తుఫాన్ల మధ్య దీపస్థంభం లా నిలిచివుంది.
భారత ప్రజాస్వామ్యం మనకు గర్వకారణం: మన ప్రజాస్వామ్యం ఒక యాంత్రిక వ్యవస్థ కాదు. ఇది మన సంస్కృతి, మన మూలాలు, మన గౌరవం. మన సైనిక శక్తి ఇవాళ ప్రపంచ వేదికపై భారతదేశంను సగర్వంగా నిలిపాయి. నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, రక్షణ రంగంలో అజేయ శక్తిగా, అంతరిక్షం–టెక్నాలజీ లో ముందంజలో వుంది. కానీ ఈ ప్రయాణం అంత సులభం కాదు. ప్రతి ప్రయాణంలోనూ కుట్రలు, అడ్డంకులు.
చైనా సముద్రంలో అనేక పోర్టులు నిర్మిస్తూ అష్ట దిగ్బంధనం చేయాలని చూస్తోంది. పశ్చిమ దేశాలు అధిక సుంకాలతో ఒత్తిడి తెస్తున్నాయి. పొరుగుదేశాల్లో ఒక పథకం ప్రకారం విద్యార్థి నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. భారతదేశాన్ని కూలదోయాలనే రహస్య ప్రణాళికలో భాగం.
అంతర్గత సవాళ్లు – రాజకీయ కుట్రలు: మన దేశంలోనే కొన్ని శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి. కులవివాదాలు, రిజర్వేషన్ కలహాలు, యువత నిరసనలు అన్నీ రాజకీయ కుట్రలే. భారత్ ఎదిగే ప్రతిసారి “ప్రజాస్వామ్యం ముప్పులో ఉంది” అనే నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎందుకంటే ఇది అంతా మన అభివృద్ధిని ఆపాలనే కుట్ర.
ఈ రోజు భారత్ ఒక బలమైన తాడుపై సర్కస్ చేస్తుంది. ఒక వైపు స్థిరత్వం, మరొక వైపు అస్తవ్యస్తం. ఒక వైపు బలమైన ప్రజాస్వామ్యం, మరొక వైపు కుట్రలు. కానీ ఈ తాడుకు అవతల ఉంది ఒక దృశ్యం ఒక శక్తివంతమైన, స్వతంత్ర, ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే భారతదేశం.
దేశం లో అవినీతిపరుల వాస్తవికత: భారత్ నేడు అవినీతి పై వ్యతిరేకంగా కఠినంగా పోరాడుతోంది. కానీ నినాదాలు ఇచ్చేవారు, అవినితి జరిగిందంటూ వివాదాలు లేవనెత్తేవారు నిజంగా అవినీతి పై పోరాడారా? పార్టీలవారీగా చూద్దాం...
కాంగ్రెస్ – 2G, CWG, శారద… అవినీతి జాబితా అంతులేకుండా వుంది.
సమాజ్‌వాదీ పార్టీ – ఉత్తరప్రదేశ్‌లో బంధుప్రీతి, అక్రమ సంపద.
ఆర్జేడీ – బీహార్ దాణా కుంభకోణం మొదలు దశాబ్దాల పాటు అవినీతి.
ఆప్ – అవినీతి ఆరోపణల్లో మునిగిన పార్టీ.
ఇలాంటి అవినీతి చరిత్ర ఉన్నవారు “క్లీన్ ఇండియా” అని రంకెలు వేసిది ప్రజల కోసం కాదు, కేవలం రాజకీయ ఎత్తుగడలలో భాగమే అని యువత గుర్తించాలి.
నేపాల్‌లో పునరావృతం అవుతున్న చరిత్ర: నేపాల్ వీధుల్లో, ప్రభుత్వ భవంతులు అగ్నిజ్వాలల్లో భూడదయ్యాయి. ఇదంతా “ప్రజల కోసం” అని అరిచే కమ్యూనిస్టులు వాస్తవానికి అవినీతి కప్పిపుచ్చుకోవడానికే అనేది మనకందరికీ తెలియాల్సిన వాస్తవం. అక్రమ చొరబాట్లకు తలుపులు తెరుస్తూ, హిందువులపై దాడులను కమ్యూనిస్టులు సమర్థిస్తున్నారు.
చొరబాట్లకు గేట్లెత్తడం కొత్త విషయం కాదు. 2014లో భారతదేశంలోనూ ఇదే తంతుగా మారి కోట్లాది మంది భారతదేశంలో అక్రమంగా నివశిస్తున్నారు. భారత యువత ఓటు అనే ఆయుధం తో అహింసా శక్తితో అవినీతి వ్యవస్థను తుడిచిపెట్టి వేశారు. ఇప్పుడు అదే అవినీతి నిదానాలతో నేపాల్‌లో అరాచకంగా నేపాల్ ని మార్చివేశారు. ప్రశ్న ఒక్కటే—నేపాల్ యువత ఈ మాయలో పడతారా? లేక భారత యువతలా అవినీతిని తిరస్కరించి తమ దేశానికి కొత్త భవిష్యత్తు సృష్టిస్తారా?
అవినీతి అంటే కేవలం దోపిడీ కాదు దేశ వ్యతిరేక కథనాల కపటత్వం కూడా. ఈ దేశానికి కావలసింది నిజమైన స్వచ్ఛత. కేవలం పాలనలోనే కాదు, మాటల్లో కూడా ఉండాలి, అవినీతి పరుల్ని ఆర్ధిక ఉగ్రవాదులుగా గుర్తించాలి. లేకపోతే దేశం అవినీతి నీడల్లో పెరుగుతూనే ఉంటుంది.
దేశ వ్యతిరేక హ్యాష్‌ట్యాగ్‌లు, నినాదాలు వినిపించగానే నమ్మొద్దు. చరిత్రను చదవండి, పునరావృతం కానీయకండి. ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్లు గతంలో ఏమి చేశారు అన్నది గమనించండి. దేశ భవిష్యత్తును అభివృద్ధి పథంలో నడిపించే మార్గం మన చేతుల్లోనే వుంది. తస్మాత్ జాగ్రత్త. -రాజశేఖర్ నన్నపనేని, Mega Minds


