లాతూర్‌లో జన్మించిన ఖాసిం రజ్వీ, పఅత్యంత కిరాతక మతోన్మాదిగా ఎదిగి, రజాకార్ల సర్వాధికారిగా మారాడు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌కు వెన్నుదన్నుగా నిలిచి, హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో కలపడం లేదా స్వతంత్ర రాజ్యంగా నిలుపుకోవడమే అతని లక్ష్యం. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి రజాకార్లను ఆయుధాలతో సిద్ధం చేశాడు.
రజాకార్ల హింస - మతమార్పిడి వ్యూహాలు: రజాకార్లు పన్నులు వసూలు చేయడానికి దారుణ పద్ధతులను ఉపయోగించారు. పన్నులు చెల్లించని వారిని వేధించడం, గోర్లు కత్తులతో పొడవడం, గ్రామస్తులను బహిరంగంగా హత్య చేయడం, మహిళలపై లైంగిక దాడులు జరపడం రోజువారీ అలవాటుగా మారింది. వరంగల్ బయిరాన్ పల్లిలో వంద మందిని ఒక గంటలో కాల్చిచంపడం, బతుకమ్మ పండుగపై దాడులు చేసి మహిళలను అవమానించడం వంటి ఘోరాలు తెలంగాణ ప్రజలను వణికించాయి.
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ‘తబ్లీగ్’ అనే ఉద్యమం ద్వారా హరిజనులను మతం మార్చుకోవాలని ప్రలోభపెట్టింది. భూములు, ఆర్థిక సహాయం వాగ్దానాలతో హిందువులను ముస్లింలుగా మారుస్తూ, ముస్లింల సంఖ్య పెంచి నిజాం పాలనను బలపరచే ప్రయత్నం జరిగింది.
భారత ప్రభుత్వంతో ఉద్రిక్తత - ప్రజల ప్రతిఘటన: హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ, నిజాం భారత్‌లో విలీనం కాకుండా పాకిస్తాన్‌తో స్నేహం పెంచుకోవాలనుకున్నాడు. ఇందుకోసం పాకిస్తాన్‌కు నిధులు ఇచ్చి సహాయం కోరినా, జిన్నా సహకరించలేదు. ఖాసిం రజ్వీ మాత్రం బెదిరిస్తూ “హైదరాబాద్‌ను భారత్‌లో కలిపితే కోటి మందిని ఊచకోత కోస్తాం” అని ప్రకటించాడు.
రజాకార్ల దారుణాలకు ప్రజలు, రైతులు, విద్యార్థులు ప్రతిఘటించారు. ఆర్యసమాజ్ కార్యకర్తలు, విశ్వవిద్యాలయ విద్యార్థులు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. పత్రికా రచయిత షోయబుల్లాఖాన్ రజాకార్లను బహిరంగంగా ఎండగట్టినందుకు హత్య చేయబడటం ప్రజల్లో కోపం రగిల్చింది.
ఆపరేషన్ పోలో - రజాకార్ల పరిణామం: 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం “ఆపరేషన్ పోలో” అనే సైనిక చర్యను ప్రారంభించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆదేశాలపై మేజర్ జనరల్ జే.ఎన్. చౌధరి నేతృత్వంలో సుమారు 36,000 మంది సైనికులు హైదరాబాద్ రాష్ట్రం లో ఉన్న రజాకార్ల పై మూకమ్మడిగా దాడి చేశారు. రజాకార్ల దాడులు, నిజాం సైన్యం ప్రతిఘటన ఉన్నప్పటికీ, కేవలం ఐదు రోజుల్లో సైన్యం విజయాన్ని సాధించింది. సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానంకి నిజాం, రజాకార్ల నుండి విముక్తి లభించింది. ఈ ఆపరేషన్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 800 మంది హతమవగా, 2,000 మంది గాయపడ్డారు. తెలంగాణ విమోచన దినంగా ఈ రోజు చరిత్రలో నిలిచింది.
నిజాం లొంగిపోవడంతో రజాకార్లలో చాలామంది పాకిస్తాన్‌కి పారిపోయారు. కొంతమంది మామూలు పౌరుల్లా మారి ప్రాణాలు దక్కించుకున్నారు. ఖాసిం రజ్వీను అరెస్ట్ చేసినా, నెహ్రూ జోక్యంతో అతన్ని చంపకుండా పాకిస్తాన్‌కు పంపించారు. అక్కడ ఎవరు పట్టించుకోక, కరాచీలో నిరుపేద స్థితిలో మరణించాడు.
ఎంఐఎం పార్టీ పునరుజ్జీవనం: జైలునుంచి విడుదలకు ముందే ఖాసిం రజ్వీ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీని అబ్దుల్ వహీద్ ఒవైసీకి అప్పగించాడు. అతని వారసత్వాన్ని నేడు ఒవైసీ కుటుంబం కొనసాగిస్తోంది. ఒకప్పుడు రజాకార్లకు అండగా నిలిచిన ఈ పార్టీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది.
1948 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం, ప్రజల ధైర్యసాహసాలకు నిదర్శనం. నిజాం, రజాకార్ల దుష్టపాలన ప్రజలపై ఎన్నో గాయాలు మిగిల్చినా, భారత సైన్యం మరియు స్థానికుల పోరాటం దాస్యానికి ముగింపు పలికింది. ఈ చరిత్రను గుర్తుంచుకోవడం, భవిష్యత్ తరాలకు నిజం తెలియజేయడం ప్రతి భారతీయుడి బాధ్యత. జయ్ హిందురాష్ట్ర. --రాజశేఖర్ నన్నపనేని, Mega Minds


