డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య (Middle East) ప్రణాళికను చాలా శక్తివంతంగా మలచుకుంటున్నారు. దీనికి చాబహార్ పోర్ట్ కీలకంగా మారనుంది, ఇది భారత్ కి కొంత క్లిష్టమైన సమస్య కానుంది.. దీని గురించి మనం ఈ రోజు చర్చిద్దాం.
ట్రంప్ గేమ్ చాలా సింపుల్ అధిక సుంకాలు విధిస్తూనే మోడీజీ నాకు మంచి మిత్రుడు అంటూ పొగడటం. మరియు గంటల వ్యవధిలోనే భారత్ దీర్ఘకాల ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ఈ మధ్య ట్రంప్ కి రోజువారీ పనిగా మారింది. అమెరికా చాబహార్ పోర్ట్‌కి ఇచ్చిన సాంక్షన్స్ వెవర్‌ను రద్దు చేయడం కూడా ఇలాంటిదే.
2018లో భారత్‌కి ఒక ప్రత్యేక వెవర్ లభించింది. దాని ద్వారా ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టొచ్చు. ఇది దానం కాదు భారత్‌కి అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియా, రష్యా చేరుకోవడానికి పాకిస్తాన్‌ను బైపాస్ చేసే కీలక ద్వారం.
చాబహార్ పోర్ట్ ప్రాముఖ్యత: ఇది భారత్‌కి చాలా కీలకమైనది. వాజ్‌పేయి గారి కాలం నుంచే (2003) భారత్ ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ భూ మార్గం ద్వారా రష్యాని చేరుకోవడానికి అడ్డుపడింది. అలాంటి పరిస్థితిలో చాబహార్ ఒక ప్రత్యామ్నాయంగా మారింది. ఇది అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియా, రష్యా చేరుకోవడానికి కీలకం. INSTC కారిడార్‌లో ఇది ప్రధానమైన కనెక్టివిటి. 2016లో భారత్ – ఇరాన్ – అఫ్గానిస్తాన్ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2017లో తొలి షిప్‌మెంట్ అఫ్గానిస్తాన్ చేరింది. 2024లో భారత్ 10 ఏళ్ల ఆపరేషనల్ కంట్రోల్ పొందింది. ఒక కల నెరవేరినట్టే కనిపించింది.
కానీ ట్రంప్ సడన్ గా గేమ్ షురూ చేశాడు. అమెరికా విదేశాంగ విధానంలో ఒకటి మెచ్చుకోవచ్చు ఇజ్రాయెల్ కి అన్ని వేళలా రక్షణగా ఉండటం. ఇజ్రాయెల్ శత్రువు ఇరాన్ కావడంతో అమెరికా కొద్ది నెలల క్రితం కూడా చూశాం ఇరాన్ అణుస్తావరాలపై బాంబులు వేసింది. ఇప్పుడు ఇరాన్ ని ఆర్థికంగా దెబ్బతీయడం, పెట్టుబడులన్నీ ఆపివేయడం, ఇండియా – ఇరాన్ కనెక్టివిటీని బ్లాక్ చేయడం. అందుకే చాబహార్ వెవర్ రద్దు అంటే కేవలం ఇరాన్‌పై దెబ్బ కాదు, భారత్ వ్యూహాత్మక కలలపై కూడా దెబ్బతీయడమే.
ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ మళ్లీ పాకిస్తాన్‌తో దగ్గరవ్వడం. బాగ్రామ్ ఎయిర్‌బేస్ రీ-ఓపెన్ కోసం పాకిస్తాన్ సాయం. సౌదీ–పాకిస్తాన్ కొత్త డిఫెన్స్ డీల్. గల్ఫ్‌లో గొడ్డు చాకిరీ చేయబోయేది పాకిస్తాన్ సైనికులే నేనయితే పాకిస్తాన్ మానవ వనరుల్ని అమ్ముకుంటుంది అంటాను.
అమెరికా విమానాలు మొన్న వరుసగా పాకిస్తాన్ చేరాయి, దీని అర్థం భారత్ ని ఇబ్బందులకి గురిచేయడమే. చాబహార్ ప్రాజెక్ట్‌కి అనిశ్చితి. రష్యా–సెంట్రల్ ఆసియా మార్గం కష్టతరమవుతుంది. ఇండియా ఇరాన్ సంబంధాలపై ఎంతోకొంత ప్రభావం. అమెరికా మాత్రం భారత్‌ను IMEC (India–Middle East–Europe Corridor) వైపు మరలేట్లు చేయాలని చూస్తోంది అది అత్యంత ఖర్చుతో కూడుకున్న మార్గం.
ఇరాన్ అమెరికాకు మూడు ప్రధాన సమస్యలు తెస్తుంది. అందుకే ఇలా ఇరాన్ ని ఆర్దిక ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. పనిలో పనిగా భారత్ కి కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. ఇరాన్ – ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు, ఇరాన్ ఇండియా - రష్యా మార్గానికి అనువైన ప్రదేశం, గల్ఫ్‌లో US ఆధిపత్యానికి ఇది సవాలు. అందుకే ఇరాన్ పై ట్రంప్ తీవ్రమైన ఒత్తిడిని తెస్తున్నాడు. దీని వలన లాభం ఏమిటంటే ఇరాన్‌ని పూర్తిగా ఒంటరిని చేయడం, భారత్‌పై ఒత్తిడి పెంచడం.
ఇక మన ముందున్న ప్రశ్నలు – చాబహార్‌పై పనిచేస్తున్న భారత అధికారులపై US సాంక్షన్స్ ఉంటాయా? భారత్ వ్యుహాత్మకంగా వ్యవహరిస్తుందా? US ని ఎదురించి అక్కడే పోర్ట్ అభివృద్ధికై పనిచేస్తుందా? లేక ఇరాన్ తో స్నేహాన్ని వదిలేస్తుందా ఇలా అనేక సమస్యలు మన ముందున్నాయి.
రాబోయే సంవత్సరాల్లో గల్ఫ్ వార్స్‌లో పాకిస్తాన్ సైన్యం మళ్లీ సౌదీ రియాద్ వైపు యుద్ధం చేస్తుంది. అమెరికా మళ్లీ అఫ్గానిస్తాన్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇరాన్‌తో అమెరికా ఢీకొనడం కూడా ఖాయం అనిపిస్తుంది.
ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తు ను నిర్ణయిస్తాయి. స్ట్రాటజిక్ ఆటానమీ కాపాడుకోవడం (అంటే భారత్ "ఏకపక్షంగా" ఏ దేశం పై ఆధారపడకుండా ఉండటం). అందుకే భారత ప్రధాని మోడీ జీ మనం విదేశాలపై ఆధారపడటమే మనకు ప్రధానమైన శత్రువు అంటూ భావ్ నగర్ గుజరాత్ లో చిప్ అయినా షిప్ అయినా స్వదేశీయంగా తయారుచేసుకుందాం అంటూ స్వదేశీ పై తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక ఆయుధం స్వదేశీ. స్వదేశీ మన నిత్య జీవితం లో భాగమైన రోజు ఏ దేశం మనపై పెత్తనం చలాయించలేదు. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని, Mega Minds