రక్షణ వ్యూహంలో కీలకం అయిన అయిదవ తరం ఫైటర్ జెట్లపై ఫోకస్. పదాతిదళం, వాయుసేన, నావికాదళం – అన్ని భద్రతా వ్యవస్థల ద్వారా శత్రువు పై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు భారత్ తన రక్షణ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. ఇందులో యుద్ధ విమానాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలు 5th Generation Fighter Jets ను అభివృద్ధి చేయగా, భారత్ ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికా మరియు రష్యా కలిగిన F-35A vs SU-57E మధ్య ఏది మేలు అనేది ప్రధాన చర్చ.
SU-57E (Russia): తక్కువ ధర – ఫుల్ సపోర్టెడ్ వర్సన్ – మల్టీ రోల్ సామర్థ్యం.
లాభాలు:
ధర మరియు మెంటెనెన్స్:
ఒక్క యూనిట్ ఖరీదు: ₹300 కోట్లు (అంచనా)
తక్కువ నిర్వహణ ఖర్చు – బడ్జెట్ ఫ్రెండ్లీ.
సాంకేతిక బదిలీ + Make in India:
సోర్స్ కోడ్ మరియు పూర్తి టెక్నాలజీ భారత్‌కు అందించేందుకు రష్యా సిద్ధం భారత్‌లోనే తయారీకి గ్రీన్ సిగ్నల్.
ఇప్పటికే ఉన్న పరిజ్ఞానం అనుకూలత:
మనవద్ద ఇప్పటికే ఉన్న రష్యన్ ఆయుధ వ్యవస్థలతో మంచి అనుసంధానం తక్కువ శిక్షణతోనే పటిష్టంగా వాడగల సామర్థ్యం.
డబుల్ ఇంజిన్ & డాగ్‌ఫైట్ క్వాలిటీ:
Saturn AL-41F1 డబుల్ ఇంజిన్ 3500 కి.మీ పరిధి, Mach 2 (2470 kmph) వేగం ముఖాముఖి యుద్ధాల్లో మెరుగైన ప్రదర్శన.
గ్లోబల్ స్ట్రాటజిక్ సహకారం:
రష్యాతో భారత డిఫెన్స్ అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోంది. CAATSA వంటి అమెరికా ఆంక్షలు అమలుకావు
నష్టాలు:
పరిమితమైన స్టెల్త్ సామర్థ్యం:
HQ-9 వంటి శత్రు రాడార్లకు పట్టుబడే అవకాశం పెద్ద నాజిల్ కారణంగా Infrared Signature ఎక్కువ.
నెమ్మదిగా అభివృద్ధి:
ఇప్పటివరకు కేవలం 40 యూనిట్లు మాత్రమే తయారైన SU-57 రెండు సార్లు ప్రమాదానికి గురైన చరిత్ర.
యుద్ధాంతర రాజకీయాలు:
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సాంకేతిక పరంగా ఆంక్షలు, ఆలస్యం.
ఇతర దేశాల నుండి కొనుగోలు తక్కువ:
ప్రస్తుతం అల్జీరియా మాత్రమే ఖరీదు చేసిన దేశం.
AMCAపై ప్రభావం:
భారత్ అభివృద్ధి చేస్తున్న AMCA పై నిధుల దృష్టిలో ఒత్తిడి.
F-35A (USA): అధునాతన స్టెల్త్ – యుద్ధ అనుభవం – గ్లోబల్ టెక్ గెలుపు
లాభాలు:
స్టెల్త్ సామర్థ్యం:
Very Low Observable (VLO) డిజైన్ చిన్న రాడార్ క్రాస్ సెక్షన్ 360° సెన్సింగ్ సామర్థ్యం.
ప్రమాణిత యుద్ధ అనుభవం:
ఇజ్రాయెల్ వంటి దేశాలలో యుద్ధాల్లో ఉపయోగించబడింది
ఇప్పటి వరకు 1000 పైగా యూనిట్లు తయారీ.
అధునాతన సిస్టమ్‌లు మరియు ఆయుధ సామర్థ్యం:
అణు ఆయుధాల మోసగలగడం హై ప్రిసిషన్ టార్గెట్ అటాక్.
చైనా – పాక్ బెదిరింపులకు సమాధానం:
చైనా జే-20, జే-35కు ఉత్తమ ప్రత్యుత్తరం క్వాడ్ దేశాలతో అనుసంధానం పెరుగుతుంది.
నష్టాలు:
అత్యధిక ధర:
ఒక్క యూనిట్ ఖరీదు ₹875 కోట్లు ఒక్క విమానం ఫ్లైట్ ఖర్చు రూ.40 లక్షల పైగా.
ఒకే ఇంజిన్:
బహుళ మిషన్లలో రిస్క్ ఎక్కువ కొండ ప్రాంతాల్లో పనితీరు ప్రశ్నార్థకం.
సాంకేతిక పరమైన ఆధిపత్యం:
అమెరికా సోర్స్ కోడ్ ఇవ్వదు వారిని నమ్మి విమానాలను ఎగరనివ్వకపోతే ఎలాంటి పరిస్థితి?
లాజిస్టికల్ మరియు ఇంటిగ్రేషన్ ఇబ్బందులు:
మనకు ఉన్న తేజస్, సుఖోయ్, రఫేల్ వంటి ఫైటర్లతో సద్వినియోగం కష్టం డిఫెన్స్ ప్లాట్ ఫారమ్‌లను కొత్తగా మార్చాలి.
గ్లోబల్ పాలిటిక్స్ & ద్వంద్వ వైఖరి:
S-400 వాడకంపై అమెరికా CAATSA ఒత్తిడి ఇంజిన్ లైట్ వేట్ ఇవ్వకపోవడం వంటి ఉదాహరణలు ఉన్నాయి.
SU-57E – విలువను తెలుసుకునే నిర్ణయం
భారత్ యొక్క రక్షణ వ్యూహానికి గమనించినప్పుడు, మెయింటెనెన్స్, ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ, నమ్మకమైన సహకారం అనే అంశాల్లో SU-57E పై చేయి పెడుతుంది. సాంకేతిక బదిలీ, మేక్ ఇన్ ఇండియా లాంటి అంశాలు దేశీయ అభివృద్ధికి ఊతమిస్తాయి.
భారత్ కు సరైన ఎంపిక: SU-57E
దేశ భద్రత + ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలకు సమ్మేళనం.
- వడ్లముడి పతంజలి, విశ్లేషకులు.
Excelent article 👌👌
ReplyDelete