ప్రాజెక్ట్ కుష: భారత స్వదేశీ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ
ప్రాజెక్ట్ కుష అంటే ఏమిటి?
ప్రాజెక్ట్ కుష అనేది DRDO అభివృద్ధి చేస్తున్న దీర్ఘ శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇది విదేశీ ఎస్-400కు స్వదేశీ ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం విమానాలు, డ్రోన్లు, క్రూజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ వంటి గగనతల ముప్పులనుండి భారత్‌ను రక్షించటం.
2022లో క్యాబినెట్ అప్రూవల్, 2023లో ₹21,700 కోట్లకు AoN (Acceptance of Necessity) మంజూరు
మిస్సైల్ వేరియంట్ | పరిధి | లక్ష్యం | ప్రస్తుత స్థితి |
---|---|---|---|
M1 | ~150 కిలోమీటర్లు | ఫైటర్లు, డ్రోన్లు, క్రూస్మిస్సైళ్లు | సెప్టెంబర్ 2025లో పరీక్ష |
M2 | ~250 కిలోమీటర్లు | AWACS, ఆర్మ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ టార్గెట్లు | అభివృద్ధి దశలో |
M3 | 350–400 కిలోమీటర్లు | లాంగ్ రేంజ్ లక్ష్యాలు | అభివృద్ధి దశలో |
ప్రతి మిస్సైల్ ఒకే బేస్ కిల్ వెహికల్‌ను (250 మిమీ) పంచుకుంటుంది – బూస్టర్లు మాత్రమే వేరుగా ఉంటాయి.
అడ్వాన్స్‌డ్ క్యానిస్టర్ డిజైన్లు
DRDO డిజైన్ చేసిన రెండు రకాల క్యానిస్టర్‌లు:
టైప్ 1 (M1) – చిన్న క్యానిస్టర్, తక్కువ బరువు, దృఢమైన నిర్మాణం
టైప్ 2 (M2, M3) – స్లైడ్ చేయగల గేర్ డిజైన్, ఎడ్జస్టబుల్ స్పేసింగ్, హెవీ డ్యూటీ మిస్సైల్‌లకు అనువుగా
ఇవి వాహనాలపై తేలికగా అమర్చేలా రూపొందించబడ్డాయి.
ప్రాజెక్ట్ ప్రాముఖ్యత
బరాక్-8 (80 కిమీ) నుండి S-400 (400 కిమీ) మధ్య గ్యాప్‌ను భర్తీ చేయడం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ రెండింటికీ అనువుగా నవీకరణ, AESA రాడార్, మల్టీ లేయర్డ్ డిఫెన్స్ పూర్తి స్వదేశీ టెక్నాలజీ, ఆత్మనిర్భర భారత్ దిశగా మరో అడుగు. చైనా మరియు పాకిస్తాన్ నుంచి వచ్చే ఏరోస్పేస్ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం. విదేశీ డిపెండెన్సీ తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఫ్యూచర్ వార్‌ఫేర్‌కు అనుగుణంగా రూపొందించబడిన హై-టెక్ సిస్టమ్.
ప్రాజెక్ట్ టైమ్‌లైన్
2025 సెప్టెంబర్: M1 మొదటి పరీక్ష
2026–2027: M2, M3 పరీక్షలు
2028–2030: IAF 8 స్క్వాడ్రన్లలో మిస్సైల్‌ల మోహరింపు
ప్రయోజనాలు
- భారతదేశానికి స్వతంత్ర గగనతల రక్షణ సామర్థ్యం
- మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉత్పత్తి
- సరసమైన వ్యయంతో అత్యున్నత టెక్నాలజీ
- అత్యవసర సమయాల్లో వ్యూహాత్మక నిబద్ధత
ప్రాజెక్ట్ కుష భారత భద్రత రంగంలో ఒక గేమ్‌చేంజర్. ఇది కేవలం మిస్సైల్‌లు కాదు – భారత ఆత్మనిర్భర డిఫెన్స్ ఆర్కిటెక్చర్ స్వాభిమానం. మల్టీ-లేయర్ ఎయిర్ డిఫెన్స్‌ను సమర్థవంతంగా అందించగలిగే వ్యవస్థ ఇది.
Very good information sir
ReplyDelete