ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు రక్షణకు EPF & EPS ఎంతో కీలకం!
చాలామందికి EPF & EPS ఎందుకు కట్ అవుతుందో తెలియదు, అలాగే EPS కి వడ్డీ కూడా ఎందుకు రాదో కూడా తెలియదు. ఈ విషయం పై మెగామైండ్స్ ని అనేక మంది అడగగా ఈ సమాచారం అందిస్తున్నాము, చిన్న ఉద్యోగులందరికీ ఈ సమాచారం తెలియజేయండి.EPF అంటే ఏమిటి?
- ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది మీరు ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రతి నెలా మీరు, మీ యజమాని కలిపి జీతం నుండి 12%+12% పొదుపుగా వేయడం.
- యజమాని వాటా మొత్తం EPFకి రాకుండా, దాని 3.67% EPFకి మరియు 8.33% EPSకి (EPS Maximum Amount - 1250/-) వెళుతుంది.
- EPFపై ప్రతి సంవత్సరం సుమారు 8.25% వడ్డీ లభిస్తుంది.
- EPF మీ సొంత డబ్బు, మీరు 58 ఏళ్ల తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి మధ్యలో తీయవచ్చు.
EPS అంటే ఏమిటి?
- EPS అంటే ఉద్యోగి పెన్షన్ పథకం.
- ఇందులో మీరు డబ్బు పెట్టలేరు - యజమాని (Company) వాటాలోని 8.33% దీనికి వెళుతుంది.
- ఈ పథకం ద్వారా 58 ఏళ్ల తర్వాత మీరు నెలవారీగా పెన్షన్ పొందవచ్చు.
- కనీసం 10 సంవత్సరాల సర్వీస్ అవసరం. (క్రింద ఇవ్వబడిన ఉదాహరణలో EPS Contribution Continues గా 10 సంవత్సరాలు ఒకే ఖాతాలో జమ అవ్వాలి.)
- ఒక వేళ మీరు పది సంవత్సరాలు లోపు ఉద్యోగం చేసినట్లయితే అప్పుడే మీరు ఇ.పి.ఎఫ్. తో పాటు తీసుకోవచ్చు.
- మరణం తర్వాత మీ భార్య/పిల్లలకు కూడా ఈ పెన్షన్ వర్తిస్తుంది.
Date | Transaction Type | Employee Share (₹) | Employer Share (₹) | EPS Contribution (₹) | Total Balance (₹) |
---|---|---|---|---|---|
01-Apr-2022 | Monthly Deposit | 1,800 | 550 | 1,250 | 3,600 |
01-May-2022 | Monthly Deposit | 1,800 | 550 | 1,250 | 7,200 |
01-Jun-2022 | Monthly Deposit | 1,800 | 550 | 1,250 | 10,800 |
01-Jul-2022 | Monthly Deposit | 1,800 | 550 | 1,250 | 14,400 |
01-Aug-2022 | Monthly Deposit | 1,800 | 550 | 1,250 | 18,000 |
... | ... | ... | ... | ... | ... |
31-Mar-2023 | Annual Interest | — | — | — | 1,350 (interest) |
Total | ₹21,600 | ₹6,600 | ₹15,000 | ₹39,000 + Interest |
ఉదాహరణ:
- జీతం: ₹15,000
- ఉద్యోగి EPF: ₹1,800 ( 12% of ₹15,000 = ₹1,800 → EPFకి మొత్తం వెళుతుంది )
- యజమాని వాటా: ₹1,250 ( EPS - 8.33% , Max-₹1250/- ), ₹550 (EPF ఇది మన జీతాన్ని బట్టి పెరుగుతుంది )
- మొత్తం EPF : ₹1,800 + ₹550 = ₹ 2350/- AND EPS పెన్షన్: ₹1250/-
- 30 ఏళ్ల తర్వాత: EPF → ₹25–30 లక్షలు వరకు రావొచ్చు.
- EPS → నెలకు ₹3,000 – ₹5,000 పెన్షన్ వరకు రావొచ్చు.
ఉద్యోగులకు చిట్కాలు:
- Login to the official EPFO website.
- EPFని విత్‌డ్రా చేయకుండా ట్రాన్స్‌ఫర్ చేయండి.
- UAN, ఆధార్, PAN లింక్ చేసినట్లుగా చూడండి.
- సంవత్సరానికి ఒకసారి EPF పాస్‌బుక్ చెక్ చేయండి.
- EPSలో మీ కుటుంబ భద్రత కూడా ఉంటుంది, అందువల్ల దానిని దృష్టిలో ఉంచుకోండి.
EPF + EPS = మీ భవిష్యత్ ఆర్థిక భద్రత
ఇవి తప్పనిసరిగా తెలుసుకుని, ప్లాన్ చేసి, ప్రాపర్‌గా నిర్వహించుకుంటే మీ పదవీ విరమణ తర్వాత జీవితం ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది!