గుర్తుతెలియని డ్రోన్ల దాడుల్లో చనిపోతే మాకేం సంబంధం? భారత్.
మయన్మార్ భూభాగంలో ఉల్ఫా ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం డ్రోన్‌దాడులు చేసిన దృశ్యాలు బయటపడగా, ఈ అంశంపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.
మయన్మార్ సరిహద్దులోని ఉల్ఫా ఐ శిబిరాలపై ఇటీవల డ్రోన్‌లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ముఖ్యంగా ఈ దాడుల్లో 779 క్యాంప్ (వక్తం బస్తీ), ఈస్ట్రన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ (హోయట్ బస్తీ) సహా పలు శిబిరాలు లక్ష్యంగా దాడి జరిగాయి. ఉల్ఫా సీనియర్ లీడర్, లోయర్ కౌన్సిల్ చైర్మన్ "నయన్ అసొమ్ అలియాస్ నయన్ మేధీ" సహా ముగ్గురు టాప్ కమెండర్లను హతమయ్యారు. దాదాపు 19 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
మయన్మార్‌లోని ఉల్ఫా-ఐ శిబిరాలపై డ్రోన్ దాడులు జరిగినట్టు మీడియా, ఉల్ఫా వర్గాలు వెల్లడించాయి. అయితే భారత సైన్యం మాత్రం ఈ దాడుల్లో తమకు సంబంధం లేదని, అధికారికంగా ఖండన చేసింది.
భారత సైన్యం అధికారికంగా ఈ దాడులను అంగీకరించక పోవడానికి ప్రధాన కారణాలు:
అంతర్జాతీయ నిబంధనలు మరియు పొరుగు దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు మయన్మార్ భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేసినట్టు అధికారికంగా ప్రకటిస్తే, అది అహాంకారాన్ని ప్రదర్శించినట్లు అవుతుంది అలాగే అంతర్జాతీయ చట్టాలకు కూడా వ్యతిరేకం. భారత్-మయన్మార్ సంబంధాల్లో కొంత అనిశ్చితిని ఏర్పడి గ్యాప్ ని పెరుగుతుంది.
ఇరు దేశాల మధ్య జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గా మరి దౌత్యనీతిని ఉల్లంఘించినట్టుగా భావిస్తారు. మయన్మార్ సైన్యం సహకారంతో జరిగినా, అధికారిక ఆమోదం విడుదల చేస్తే పరోక్షంగా వారిపైనా ఒత్తిడి, విమర్శలు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ఇది రహస్యంగా జరిగిన ఒక అజ్ఞాత డ్రోన్ ల దాడిగానే భావించాలి.
"డినయబిలిటీ" పరిధిగా భావించడం ద్వారా, అవసరమైతే ఏజెన్సీలు, దేశం తమ పాత్రను గుప్తంగా ఉంచేందుకు వీలిచ్చే వ్యూహం. మిలిటరీ ఆపరేషన్లు 'గ్రీన్ జోన్' స్ట్రాటజీ ఇందులో భాగం. చైనా వంటి బలమైన దేశాలు మన సరిహద్దు దేశాలుగా ఉన్నప్పుడు మరియు మయన్మార్‌లోని అంతర్గత పరిస్థితుల దృష్ట్యా భారత్ అధికారిక ప్రకటన ఇవ్వకూడదు అనేది స్ట్రాటజీ.
ఒక వేళ నిజంగానే మయన్మార్‌లో వేర్పాటువాద సంస్థలపై సర్జికల్ దాడులు జరిపినా, కమ్యూనికేషన్లో డినయబిలిటీని (గుర్తు తెలియకపోవడం) తో కోర్టులో, యునైటెడ్ నేషన్లలో, అంతర్జాతీయ వేదికల్లో భారత్ ఈ దాడులు జరిపింది అని నిరూపించడం కష్టం అవుతుంది. అందుకే భారత సైన్యం ఈ దాడులను అధికారికంగా ఒప్పుకోలేదు. మనం అంగీకరిస్తే ఉల్ఫా ఐ కి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది.
భారత్ తరచుగా యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్, చైనాల దురాక్రమణలపై గొంతు విప్పిమాట్లాడుతున్నప్పుడు మనం మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులపై దాడులు చేశామంటే, అవే దేశాలు మనల్ని తప్పుపట్టేందుకు ముందుకొస్తాయి.
ఈ దాడి భారత సైన్యం వ్యవహార శైలి, చాకచక్యం గా చెప్పబడుతుంది. మొత్తంగా దాడి చేయడమే కాదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేశామనేది కూడా ముఖ్యం. ఈ స్ట్రైక్స్ మనదేశ కీర్తిని పెంచుతాయనడంలో సందేహం లేదు. -రాజశేఖర్ నన్నపనేని.