ప్రపంచ స్ప్రింటింగ్ శిఖరం హుస్సేన్ బోల్ట్ నెలకొల్పిన రికార్డు కి అతి చేరువలో భారత యువ స్ప్రింటర్ అనిమేష్ కుజుర్ అంటే మీరు నమ్ముతారా? ఇది నిజంగా భారతదేశ అథ్లెటిక్స్ లో సంచలనం. క్రికెట్ నే ప్రపంచంగా భావించే దేశంలో ఇదొక అరుదైన ఘట్టం. నీరజ్ చోప్రా తరువాత అనిమేష్ ఒక ఆశకిరణం.
అథ్లెటిక్స్ లో ప్రపంచ స్ప్రింటింగ్ కు ఆదర్శంగా నిలిచిన హుస్సేన్ బోల్ట్. జమైకాకు చెందిన ఈ అద్భుత పరుగువీరుడు 2009లో బెర్లిన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డును ఎవరూ దాటలేకపోయారు. ఆ వేగాన్ని అందుకునే దానికి శ్రమ, శిక్షణ, ప్రతిభ మూడు కలగలపి వచ్చిన అతని విజయానికి ప్రపంచం తలవంచింది.
భారతదేశంలో స్ప్రింటింగ్ అనే మాట వింటే మనకు ఇప్పటిదాకా మనికంఠ హోబ్లీదార్ 10.23 సెక్షన్లు 2023 లో, గురివిందర్ సింగ్ 10.20 సెక్షన్లు మార్చ్ 2025 లో రికార్డులు నమోదు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడిన నవయువకులు సృష్టిస్తున్న రికార్డులు ఇవి వీరిద్దరినీ దాటి జూలై 2025 లో ఇప్పుడు, 22 సంవత్సరాల అనిమేష్ కుజుర్ కొద్దిమంది యువ ప్రతిభావంతుల్లో అగ్రస్థానాన్ని 10.18 సెక్షన్లలో రికార్డు నమోదు చేశాడు, ఇది కేవలం బోల్ట్ రికార్డ్ కి 20 సెక్షన్లు దూరంలో మాత్రమే ఉంది.
అంతర్జాతీయ వేదికపై అద్భుతం: అనిమేష్ గ్రీస్‌లో జరిగిన మెంట్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్‌లో 100 మీటర్ల పరుగును కేవలం 10.18 సెకన్లలో పూర్తిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది దేశంలో వేగంగా 100 మీటర్ల పరుగు పూర్తి చేసిన అరుదైన విజయం. ప్రస్తుతం భారత స్ప్రింటింగ్‌కు ప్రపంచ స్థాయిలో నిలబడి పోటీ ఇచ్చే సామర్థ్యాన్ని అనిమేష్ కలిగిఉన్నాడు.
శిక్షణలో ప్రతిభకు పదును పెట్టేందుకు, అనిమేష్ కుజుర్ ప్రస్తుతం బ్రిటిష్ కోచ్ మార్టిన్ ఓవెన్స్ గారి పర్యవేక్షణలో, రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో కఠినమైన శిక్షణ పొందుతున్నాడు. ఖచ్చితమైన శిక్షణ సమయం, మౌలిక వసతులు, దృఢ సంకల్పాన్ని కలిగిన కోచ్ వల్ల అతనిలోని ప్రతిభ మరింత పటిష్టమవుతోంది.
కుటుంబం నుండి స్వీకరించిన స్ఫూర్తి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జాష్పూర్ జిల్లాకు చెందిన అనిమేష్, క్రీడాస్పూర్తితో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్ కావడం, ఆయన తండ్రి అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండటం వల్ల అనిమేష్‌కు మరింత ప్రోత్సాహం లభించింది. కుటుంబం నుండి లభించిన మద్దతు అతని విజయాలకు బలమైన ఆదారం.
అసలు గుర్తింపే లేని అథ్లెటిక్స్ లో అనిమేష్ చూపుతున్న ప్రతిభ, భారత యువతలో మళ్లీ ఆసక్తిని రేపుతోంది. జావెలిన్ త్రో నీరజ్ చోప్రా తరహాలో, అనిమేష్ కూడా స్ప్రింటింగ్‌లో భారత అథ్లెటిక్స్ లో తనప్రతిభను చూపే ఆశకిరణం.
భారత యువతకు ఆదర్శంగా నిలబడేలా, హుస్సేన్ బోల్ట్ మాదిరిగా ఒలింపిక్ గోల్డ్ మెడల్ దక్కాలనే ఆశతో అనిమేష్ పరుగులు పెడుతున్నాడు. అతని కృషి, పట్టుదల ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే అతని విజయాన్ని ప్రపంచ అథ్లెటిక్స్ కి పరిచయం చేసే రోజు దగ్గరలోనే ఉంది. -రాజశేఖర్ నన్నపనేని.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Animesh Kujur, sprinter, athletics, sprinting, Indian athlete, track and field, running, sports talent, young sprinter, sprint training
చక్కని వ్యాసాలు అందిస్తున్న మీకు అభివందనాలు
ReplyDeleteజయహో భారత్
ReplyDelete