హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధం Two Buddhist Countries at War Over a Hindu Temple

megaminds
0



ఆగ్నేయాసియాలో థాయ్‌లాండ్ - కంబోడియా సరిహద్దు వివాదం. శివాలయం కేంద్రంగా ఆందోళనలు పెరిగి యుద్ధానికి దారితీశాయి.


చరిత్ర - ఆధ్యాత్మికత

ప్రీహ్ విహియర్ శివాలయం 1,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది కంబోడియా-థాయ్‌లాండ్ సరిహద్దులో దాంగ్రేక్ పర్వత శ్రేణుల మధ్య 525 మీటర్లు ఎత్తున ఉంది. ప్రీహ్ విహియర్ అంటే “పవిత్ర ఆశ్రమం” అని అర్థం. దేవాలయ నిర్మాణం 9వ శతాబ్దంలో ప్రారంభమైంది. ప్రధానంగా 11వ మరియు 12వ శతాబ్దాలలో ఖ్మేర్ సామ్రాజ్య రాజులు సూర్యవర్మన్ I,II దీన్ని విస్తరించి అందమైన శిల్పకళతో నిర్మించారు. ఇది 800 మీటర్ల పొడవుగల అనుసంధిత శ్రేణి. ఇందులో ఐదు ప్రధాన "గోపురాలు" ఉన్నవి. హిందూ దేవతలు, పవిత్ర చిహ్నాలు మరియు పూజా విధానాలు శిల్పాలతో అద్భుతంగా చెక్కబడ్డాయి. నిర్మాణ మార్గాలు, దారులు పర్వత పై భాగంలో సహజంగా వుండి, ప్రకృతి ఈ దేవాలయానికి వన్నె తెచ్చింది. సామాజిక, ఆధ్యాత్మిక జీవితం లో కీలకమైన దేవాలయం. పర్వత శిఖరాల మధ్య ఉండటం వలన, దేవాలయం ఒక దివ్య స్థలంగా మారి భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారు.


యునెస్కో గుర్తింపు - యుద్ధ వాతావరణం

2008లో ప్రీహ్ విహియర్ శివాలయం యునెస్కో వరల్డ్ హిరిటేజ్ స్థలంగా గుర్తింపబడింది. ఇది ప్రపంచానికి ఖ్మేర్ ప్రాచీన శిల్ప కళను, ఆధ్యాత్మిక సంపదను చూపించే ఒక అద్భుత ఉదాహరణ. ఈ గుర్తింపు ఈ ప్రాంతం పరిరక్షణకు సహాయపడుతోంది, అయితే సరిహద్దు వివాదాలతో కూడిన పరిస్థితులను కూడా పెంచింది.


ఇప్పుడు ఈ హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు కొట్లాడుతున్నాయి. ఇది థాయ్‌లాండ్ - కంబోడియా సరిహద్దు వద్ద ఉంది. అలాగే రెండు దేశాలకు జాతీయ గౌరవ ప్రతీకగా నిలిచింది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఈ ఆలయాన్ని కంబోడియాకు అప్పగించింది, కాని థాయ్‌లాండ్‌లో కూడా దీన్ని తమదే అని భావిస్తుంది. జనాభా, ఆర్థిక శక్తి, సైనిక సామర్థ్యం పరంగా థాయ్‌లాండ్, కంబోడియా కన్నా కూడా బలంగా ఉంది. అయినప్పటికీ చైనా మద్దతు పొందిన కంబోడియా, సైన్యం సైనిక శిక్షణ పొందడంతో యుద్ధ సామర్థ్యం పెరిగింది.


2025 ఫిబ్రవరిలో, థాయ్ సైనికులు కంబోడియా పర్యాటకులను తమ జాతీయగీతం పాడకుండా అడ్డుకున్నారు, తద్వారా అంశం ఆసక్తి కలిగింది. 2025 మే 28న, సరిహద్దులో గొడవలో ఒక కంబోడియా సైనికుడు మరణించాడు. తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారి, రెండు దేశాలు ఆయుధాలను వినియోగించి తీవ్రమైన యుద్ధ వాతావరణానికి దారితీసాయి.


ఇది కేవలం సరిహద్దు వివాదమే కాదు. అమెరికా చైనా మధ్య ఆగ్నేయాసియాలో వ్యూహాత్మక ఆధిపత్య పోరు ఈ రెంటి మధ్య చిచ్చు రేపిందనవచ్చు. అమెరికా థాయ్‌లాండ్‌ను మద్దతు ఇస్తోంది, చైనా కంబోడియాకు మద్దతు ఇస్తోంది మరియు అక్కడ శాశ్వత సైనిక స్థావరాల నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ విషయం ఆగ్నేయాసియాలో ఉద్రిక్తలకు దారితీసింది, అలాగే ఈ రెండు గొడవపడి తైవాన్ ని కూడా లాగేట్లున్నాయి.


2025 జూలై 24న, థాయ్ - కంబోడియా సరిహద్దులో తీవ్ర ఘర్షణలు, పోరాటాలు కొనసాగుతున్నాయి. సరిహద్దులు మూసివేయబడ్డాయి, రాయబారులు ఆగిపోయాయి. మరింత విస్తృత రీతిలో ప్రాంతీయ యుద్ధ పరిస్థితి నెలకొన్నది.

కంబోడియా 2025 జూన్‌లో ICJ ను సంప్రదించింది. మరికొన్ని కీలక సరిహద్దు ప్రాంతాలపై హక్కును సాధించడానికి థాయ్ F-16 వాయు దాడులు ఈ వారం సరిహద్దు వివాదాన్ని  తీవ్రంగా మార్చి రెండు దేశాల మధ్య ఉన్న పరోక్ష యుద్ధ పరిస్థితి  మారి యుద్ధవాతావరణాన్ని పెంచాయి. అదృష్టవశాత్తు వరుణదేవుడు కరుణించి తుఫాను రూపంలో రావడం మూలాన ఈ రెండు దేశాలు జూలై 26 న కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి‌. - రాజశేఖర్ నన్నపనేని.


Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

indu temple dispute, Buddhist countries conflict, Thailand Cambodia border, Preah Vihear Temple, territorial dispute, 2025 border clash, F-16 air strikes, US-China rivalry, Southeast Asia geopolitics, ancient temple heritage, ICJ verdict, regional tensions, military conflict, cultural heritage conflict, border protests.



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top