Visakhapatnam gears up for International Yoga Day 2025 - యోగాంధ్ర 2025 నేర్చుకోవాల్సిన ఆసనాలు

megaminds
1
International Yoga Day 2025



Visakhapatnam gears up for International Yoga Day 2025 - Yogandhra 2025


జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగాంధ్ర 2025 పేరు తో మే 21 నుండి జూన్ 21 నిర్వహిస్తున్నారు. వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా ప్రణాళిక చేస్తున్నారు. భారతదేశంలోనే యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలాగా ప్రచారం చేస్తున్నారు. చివర రోజు విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, సీఎం చంద్రబాబు గారు హాజరుకానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు సుమారు 5 లక్షల మంది పాల్గొననున్నారు. యోగా దినోత్సవ వివరాలను కేంద్ర ఆయూష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడించారు. ఈ యోగా దినోత్సవం ఒకే భూమి ఒకే ఆరోగ్యం పేరుతొ ప్రజల్లోకి వెళ్ళింది. 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం ఉంటుంది.. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది.

యోగా ప్రతి ఒక్కరికి. ‘యోగాభ్యాసం మూడు అంచెలుగా పని చేస్తుంది. ఒకటి- యోగా రోగ నిరోధక శక్తిని ఇతోధికంగా వృద్ధి చేస్తుంది. రెండు- యోగాభ్యాసం వల్ల నిరాశానిస్పృహలను అధిగమించవచ్చు. మూడు- ప్రపంచం చేరవలసిన లక్ష్యాలను యోగా నిర్దేశిస్తుంది. దానితో మనం బలోపేతం కాగలం’ అంటారు ప్రముఖ భారతీయ యోగా గురువు భరత్‌ ‌ఠాకూర్‌. ఆం‌దోళన లేదా ఒత్తిడి నాడీమండలాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీనితో రక్తపోటు పెరుగుతుంది. కండరాల మీద కూడా ఒత్తిడికి లోనవుతాయి. దీనితో ఏకాగ్రత నశించిపోతుంది. వీటన్నిటిని చల్లార్చే గొప్ప గుణం యోగ సొంతం.

యోగ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని పెంపొందించే ఉద్యమంగా మారింది. వేగవంతమైన, ఒత్తిడితో కూడిన ఈ కాలంలో ఎంతోమంది తమ జీవితాల్లో సమతుల్యతను సాధించేందుకు యోగాన్ని ఆశ్రయిస్తున్నారు.

85% ఒత్తిడిని తగ్గించే సహజ మార్గం. యోగ శ్వాస, ధ్యానం, మరియు మృదువైన చలనం ద్వారా మనసును ప్రశాంతంగా చేస్తుంది.

90% సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తి ని పెంచడం, గుండె ఆరోగ్యం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడం వంటివి యోగా దుష్ప్రభావాల లేకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

80% మనసును స్పష్టంగా, ఏకాగ్రతతో చేస్తుంది. యోగం మనసును సచ్చేతనంగా ఉంచి, దృష్టిని మరింత కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. మనస్సుకు ప్రశాంతత, శరీర ధృఢత, వ్యాధి నిరోధక శక్తి బలోపేతం, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది, శరీర ఆకృతి మెరుగవుతుంది.

ఈ క్రింద ఇవ్వబడిన ఆసనాలు ఆంధ్ర ప్రదేశ్ యోగా కార్యక్రమం లో చేయడానికి, ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడానికి ఉపయోగపడతాయి.


అర్ధ ఉత్తానాసన , అర్ధ చక్రాసన , బద్ధ కోణాసన , అష్టాంగ నమస్కారం , ఊర్ధ్వ హస్తాసన, విపరీత వీరభద్రాసన ...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


International Yoga Day 2025, Yoga Day 2025, World Yoga Day 2025, Yoga Day theme 2025, Yoga Day date 2025, Yoga Day 2025 celebration, Yoga Day 2025 activities, Yoga Day 2025 speech, Yoga Day 2025 essay, Why is June 21 yoga day?,  ఎందుకు జూన్ 21 యోగా రోజు?


Post a Comment

1 Comments
  1. We registered in yogandra event, but we don't know where to report on 21st

    ReplyDelete
Post a Comment
To Top