Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బాబ్రి కట్టడం కూల్చివేతకు సంబంధించిన కథ చెప్పనా?

ఎమెస్కో వారు ముద్రించిన, గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రచించిన అమ్మ అజ్ఞానం! పుస్తకంలో ని చెప్పనా? అనేకథ.... అందరూ చదవండి. చ...

ఎమెస్కో వారు ముద్రించిన, గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రచించిన అమ్మ అజ్ఞానం! పుస్తకంలో ని చెప్పనా? అనేకథ.... అందరూ చదవండి.
చెప్పనా?

అబ్బో ప్రవాహం! జనప్రవాహం! గ్రామాలకు గ్రామాలే కదులుతున్నాయా అన్నట్టు జనం! ఏ పక్క నుంచి ఎలా వస్తున్నారో తెలియకుండా వచ్చే జనం! చుట్టుపక్కలున్న గుట్టల వెనుక నుంచి, పంట చేలల్లోంచి, చెట్ల గుంపుల్లోంచి హఠాత్తుగా అప్పటికప్పుడు ప్రత్యక్షమై, తారు రోడ్లెక్కి, ఆ రోడ్లమీద సాగిపోతున్న జనప్రవాహం!

అవునూ, ఎవరినుంచో తప్పించుకుని ముందుకు సాగిపోవాలనే తపనతో శారీరక శ్రమనీ, నిద్ర లేమినీ కూడా ఓపలేక ఓపలేక ఓపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రశాంతంగా, చిరునవ్వుతో సాగిపోతూండే ఇలాంటి జనాన్ని నువ్వెప్పుడైనా చూశావా? బాలాదివృద్ధులూ, స్త్రీపురుషులందరూ ఉన్న మహాప్రస్థానంవంటి ఇటువంటి జనసంచలనం నువ్వెక్కడైనా చూశావా? చూశావేమోలే, నిన్ను తక్కువగా అంచనా వెయ్యటమెందుకు? లోకం నీకు తెలియదా ఏమిటి?

అదుగో ఆ బృందమంతా రాత్రికి ఆ పాడుబడ్డ భవంతి దగ్గరకెళ్లారు గదా! అక్కడ లాంతర్లతో ఆ పేద గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీళ్లూ, నీళ్లు, మంచినీళ్లు! అబ్బ, చుక్క నీరు కావాలన్నా పాతాళానికెళ్లక తప్పని ఆ అడవిలో ఎన్ని వందల చేతులు తోడి ఉంచాయో గదా లెక్కలేనన్ని ఆ తోలు గంగాళాల్లో అన్ని నీళ్లని! ఇప్పుడు నీరసపడొచ్చిన ఈ బృందానికి వాళ్లు అరకులూ, గుళికెలు, కండర తైలాలూ అందిస్తున్నారు కదూ! వేడినీళ్ల స్నానాలట! వేడి వేడి జొన్న రొట్టెలట! ఆ చలిలో గడ్డి పరుపుల పడకలట!... అదిగదిగో మరి ఈ గుంపు విషయమేమిటి! వీళ్లకి ఈ పట్టణంలో ఆ కాలేజీలో విడిది. ఆ గది మధ్యలో ఆ పెద్ద గుట్టేమిటి! ఓహ్, చపాతీల గుట్టయ్యా బాబూ. అంతేనా, సకలసౌకర్యాలున్నూ! సరే, సరే, ఆ రైలు ఆ స్టేషన్లో ఆగింది గదా, దాని మాటేమిటో చూశావా? ప్లాట్ఫారం మీద ఎదురుచూస్తూ కూర్చున్న జనం రైల్లోంచి ప్రయాణికుల్ని దింపి తీసుకెడుతున్నారు ప్లాట్ఫారం చివరికి. అక్కడ వీళ్ల చేతుల్లో ఆకు దొన్నెలు పెట్టి అందులో పెడుతున్నారు గరిటెలతో ఏమిటది? జావ అంటావా! కాదు, జావలాంటి అన్నం! పచ్చిమిరపకాయలూ, బంగాళదుంపలూ వేసి ఉడికించిన అన్నం! అక్కడివాళ్లకి చేతనైన అన్నం వంట అదే మరి! దాన్నే అమృతంగా భావించి తినేస్తున్నారు ఈ రైలు జనం! గంగాళాలకు గంగాళాలు ఖాళీ అయిపోతున్నాయి. చివరికి రైలు బయల్దేరింది గదా బరువుగా, తొమ్మిదో నెల గర్భిణిలా. ఓహో ఏమి దృశ్యమయ్యా అది! ఆ పరుగెత్తుకొచ్చిన ఆసామీతో ఆ స్టేషను మాస్టరేంటి అంటున్నాడు? "టిక్కెట్టా! అక్కర్లేదు, జైకొట్టు, ఎక్కు. అంతే! టీ.సీ.లూ, పోలీసులూ ఉంటారంటావా! ఉండరు. లేరు. వాళ్లు కూడా వీళ్లల్లో కలిసిపోయారయ్యా దేవుడా! అసలు నేను కూడా వచ్చేసేవాణ్ణినయ్యా రాముడా! కుదర్లేదు, ఎళ్లెళ్లు!”

ఇన్నిన్ని జనసముద్రాలు ఇట్లా అడ్డగోలుగా నానాప్రయాసలూ పడి ప్రయాణిస్తున్నాయి గదా, ఏం సాధిద్దామనంటావు. చెప్పనా?... వద్దులే, లోకం చూస్తున్నవాడివి. నీకు తెలీదా ఏమిటి?

దోవ పొడుగునా ఈ అన్ని జనసమూహాలకీ అందుతున్న చలి దుస్తులేనా, ఆహారమేనా, బిస్కెట్లూ, రొట్టెలూ, పళ్లూ, నానబెట్టిన అటుకులూ, పచ్చిబటానీలూ. అడ్డమైనవీని! వీళ్లు ఆకలితో ఎక్కడ బాధపడతారో అని అందిస్తున్నవే అన్నీని! అవునూ, దేశంలో తిండి కరువొచ్చిపడిందని నాయకులు చెప్తున్నారు గదా, ఇంతింత ఆహారం ఎక్కడ్నుంచొచ్చిందంటావు! 'తిండి కరువు' అనేది మాయమాటే గదూ! వట్టి స్లోగనే గదూ!

 ....ఆలోచిస్తున్నావా? పోన్లే, మా మాటతో మాట కలపని నిన్ను బలవంతం చెయ్యన్లే.

సరే, అంతా అక్కడకలిసి, ఈ ఊరికి చేరుకున్నారయ్యా! అహఁహఁ చేరుకుంటున్నారు. అలలు అలలుగా చేరుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లే తోవలన్నీ అర్ధరాత్రి కూడా జనాన్ని తరలిస్తూనే ఉన్నాయి. మొత్తం ఎంతమందంటావా? తియ్యి, నీ కాల్క్యులేటర్ తియ్యి. నొక్కు. గ్రామానికి అయిదుగురు చొప్పున పదివేల గ్రామాలూ, ఇరవై రాష్ట్రాలున్నూ! ఏంటీ, నీ కాల్క్యులేటర్ పనిచెయ్యటం లేదా? ఫర్వాలేదు. అయినా అసలిది బీజగణితానికీ, రిజర్వు బ్యాంకు నోట్లకీ అందే విషయం కాదుగదయ్యా. దీని లక్ష్యమే వేరు! ఆ లక్ష్యమేమిటంటావా?... చెప్పనా...? ఒద్దులే, నీకు తెలీదా ఏమిటి, ఏదో అడుగుతున్నావు గానీ!

పోనీ ఓ పని చెయ్! ఆ ఊరి చుట్టూ వేసి ఉన్న ఆ వందల వేల గుడారాల నడుగు. అద్భుతమైన నీటి ఏర్పాట్లు చెయ్యబడ్డ ఆ స్నానశాలలను అడుగు. 'నా దేశంలో తిండిలేక ఎవరూ మరణించకూడదు' అన్న వివేకానందుడి మాటను అక్షరసత్యం చెయ్యటానికా అన్నట్టు, హఠాత్తుగా అక్కడ వెలసిన వివిధ వివిధ రుచుల భోజనశాలల్ని అడుగు. కొండొకచో ఉచితంగా కూడా చాయ్ అందించిన ఆ వందలాది చాయ్ దుకాణాల్ని అడుగు. పోనీ, అనిమిషులై అనుక్షణం ఈ జనాన్నందర్నీ అంటిపెట్టుకునుండి ఏ ఇబ్బందీ రాకుండా చూస్తున్న ఆ నూనూగుమీసాల నూత్నయౌవనుల్ని అడుగు! - వాళ్లయ్యా వాళ్లు! ఆశాజ్యోతులు!

అయినా నీకీ కాకుల లెక్కెందుకయ్యా, అసలు కథ ముందరుండగా? ఏమిటీ, ఆ కథేదో తొందరగా చెప్పేయనా? బాగుంది. అది నీకు తెలియకుండానే ఉండా ఏమిటి? లోకాన్ని రోజూ చదువుతున్నవాడివి.

అదుగో, అదే ఊళ్లో ఆ రోజు తెల్లవారింది గదా బానిసత్వ చిహ్నాలు తొలగినట్టు చీకటి తొలగింది గదా! అందరూ స్నానాల కెడుతున్నారు గదా! మైకుల్లోంచి సూచనలొస్తున్నాయి! “నది మట్టి అదుగో అక్కడ గుట్టగా పోసుంది. అందరూ తలా గుప్పెడూ ఆ మట్టి తీసుకురండి. తీసుకెళ్లి అక్కడపోయండి, ఇందుకే మనమొచ్చింది. జై!”. ఇంకేది, ఈ చిన్న సముద్రాలన్నీ ఆ నది గట్టునున్న ఆ మట్టి కట్టకీ, ఆ కట్ట నుంచి వీథుల్లోకీ, వాటిగుండా అక్కడికీ, మధ్యలో వీళ్లని ఆపుతున్న మహిళలెవ్వరు? వాకిళ్లల్లో పళ్లాలు పట్టుకుని నిలుచుని పిలుస్తున్నారు : “ఆవో బేటీ ఆవో! సిందూర్, శ్రీగంధ్ లేలో!” రా సోదరీ రా! ఈ సిందూరమూ, శ్రీగంధమూ తీసుకో! మనమంతా ఒకటే రక్తం. వీటిని కొంచెం ధరించు. మిగిలినవాటితో అక్కడ అర్చన చెయ్యి. ఇక్కడకొచ్చినవాళ్లంతా ఈ పూజకు అర్హులే! పాపులెవ్వరూ లేరు. అంతా పుణ్యాత్ములే!" అబ్బో, అర్థం కాని భాషలో ఆ పలకరింపులేమిటీ! ఆ ఆలింగనాలేమిటి? పేరంటానికి పిలిచినట్టు ఒకళ్ల కొకళ్లు ఆ బొట్టుపెట్టుకోటాలేమిటి? అబ్బో, అబ్బో! ఏం దృశ్యమయ్యా అది! ప్రాంత, కుల, భాషాభేదాలు దాటిపోయిన సోదరప్రేమ కదూ! 'మనమంతా ఒక్కటే' అన్న భావన, 'ఒకే లక్ష్యం కోసం మనం వచ్చామను భావన కదూ! 'ఈ లక్ష్య సాధన కోసమే చరిత్రలో ఆయా కష్టకాలాల్లో ఎందరో మహానుభావులు ఈ గడ్డ మీద ప్రభవించారు. జనానికి పూలబాటలందించడానిక ప్రయత్నించి వాళ్లు ముళ్లబాటల్లో నడిచారు. వాళ్ల ఆశయాన్ని తాము సిద్ధింపచెయ్యా అన్నది వీళ్ల తహతహ కదూ! ఒకే లక్ష్యంతో నిస్స్వార్థంగా ఇంతింతమంది జనం ఇట్లా సమావేశం అవ్వటం నువ్వెప్పుడైనా చూశావా?

.... ఏంటి. ఆ లక్ష్యమేంటంటావా? అబ్బా, నేను చెప్పటమేమిటయ్యా, నీకు తెలీకపోతే గదా. నన్ను తేలిక పరచటానికడుగుతున్నావుగానీ!

ఏం, ఇప్పుడు వాళ్లంతా అక్కడికెళ్లారు గదా! తోపుడు లేకుండా ప్రశాంతంగా క్యూలో వెడుతున్నారు గదా! వాళ్లలో రకరకాల పోలీసులు కూడా చేరిపోయి టోపీలు చంకలో పెట్టుకుని వీళ్లతో బాటు కదుల్తున్నారు గదా! జై కొడుతున్నారు గదా! వాళ్లంతా ఆ ఇసుక అక్కడ పోసొచ్చి, ఆ పూజ ఏదో కూడా చేసొచ్చారు గదా! ప్రశాంతంగా అక్కడ కూర్చొని భజన చేసుకుంటున్నారు గదా! 'అమ్మయ్య, మనం వచ్చిన పని అయిపోయింది. మైకుల్లోంచి సూచన రాగానే ఇళ్లకు బయల్దేరదాం' అనుకుంటున్నారు గదా! గుడారాల్లో ఉన్న వాళ్లయితే మూటా ముల్లే సర్దుకుంటున్నారు గదా! మైకుల్లోఁ" నాయకులు కూడా భజన చేయిస్తున్నారు గదా!

అంతలో... అయ్యో, అదేమిటి ఆ యువకులు అట్లా అక్కడికి పరుగెత్తుతున్నారు? దారిలో అడ్డంకుల్ని పీకి అవతల పారేస్తున్నారు? ఎందుకుట వాళ్లకి ఆ ఆవేశం? ఆ దూకుడు? కట్టలు తెంచుకున్న ఆగ్రహం? అరెరె, అక్కడికి ఎక్కేసారు! చేతికందిన వస్తువుల్తో దాన్ని పొడి చేస్తున్నారు! వాళ్ల కండల్లో ఎంత బలం! కళ్లల్లో ఎంత కసి! వాళ్ల కెవ్వరూ నాయకుడు లేడే అసలైన నాయకులు మైకుల్లోంచి "వద్దు దిగండి, మీరు దిగి రాకపోతే మేము ఇక్కణ్ణించి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటాం” అంటున్నారే! తలలు బాదుకుంటున్నారే!

వందల సంవత్సరాలుగా వాళ్ల రక్తంలో దాగి ఉన్న కోపమా అది? గుండె కోతా? అవమానజ్వాలా? - ఏమిటది? అది ఇట్లా హఠాత్తుగా కట్టలు తెంచుకుని, అదుపు తప్పిన ఆ కొద్దిమంది యువకుల్లోంచి బయటికి తీసుకొస్తోందా? ఏంటో, ఏంటో.

అయ్యో, అది కూలిపోతోంది! పో... తోం...ది! ... పోయింది! అయ్యో, ఆ శిథిలాల కింద ముగ్గురో నలుగురో, కుర్రాళ్లు పడ్డట్టున్నారు! గాయపడ్డవాళ్లని మిగతా వాళ్లు ఇవతలికి, గుడారాల్లోకి మోసుకొస్తున్నారు...!

అయినా ఆ పొంగు ఆగటం లేదే!

ప్రాణాల క్కూడా లెక్క చెయ్యక వీరావేశంతో, కొత్త కొత్త యువకులు ముందుకు దూసుకొస్తున్నారే! ఈ నేల ఈనిందా అన్నట్లు వస్తున్నారు! అడివి చీమల్లాంటి ఆ యువకుల సముద్రాన్ని ఆపగలవాడెవ్వడు?

వేదిక మీదున్న నాయకులు నిర్ఘాంతపోయి స్థాణువులై చూస్తూండిపోయిన ఆ దయనీయస్థితిని మార్చగలవాడెవ్వడు?

"అశ్శరభ శరభ! జై! జై!" -ఓరి దేవుడో, రెండోది కూడా కూలిపోయిందయ్యా నాయనో!

అయ్యో, అయ్యో, మూడోది కూడా ధ్వంసం! నేలమట్టం! ఫినిష్! ఫినిష్!

ఏం చెయ్యటం, ఇప్పుడేం చెయ్యటం? ఇది ఏం చరిత్రని సృష్టిస్తుందో గదా! 

కానీ చూశావా, భజన చేస్తూ కూర్చునున్న అన్ని లక్షలమంది జనంలో ఎక్కడా హాహాకారాల్లేవు. తొక్కిసలాట లేదు. అసలు లేచిపోవటమనేదే లేదు! అన్ని లక్షల మంది ఏ పని కోసం వచ్చారో ఆ పనే వాళ్లంతా చేస్తూ, కూర్చున్నారు, చాలా సేపటికి దాకా! అది తప్ప ఇతరధ్యాసే లేదు వాళ్లకి! ఇది, ఈ అద్భుతం నువ్వెక్కడయినా చూశావా? మామూలుగా ఇంకెక్కడయినా అయితే, ఆవేశం కట్టలు తెంచుకుంటే, ఎంత వినాశనం జరుగుతుందో తెలీదా నీకు! ఆ పరిస్థితిలో అంతమంది జనం మధ్య వారికి మార్గదర్శనం చేస్తూన్న నాయకులు, దానికి కట్టుబడిపోయి అక్కడే ఉంటారా'

జరిగిందేదో జరిగింది. మనం నేర్చుకోవలసిందేమిటి! అనిపిస్తోంది కదూ!

ఏమిటీ, 'ఇది ఒక వర్గం వారు ఇంకొక వర్గంపై కక్షతీర్చుకోవటం కాదా? అనడుగుతున్నావా? కాదు, కానే కాదు! ఇది, ఈ దేశంలో చరిత్రకందని కాలం నించి ఉంటూ వస్తున్న ఒక వర్గం తను బతికి బట్టకట్టటానికై, తన మనుగడకై, తన 'శక్తి' ప్రదర్శించటం మాత్రమే! తనవారిలో ఉన్న ఐక్యతను అహింసాయుతంగా లోకాని చాటి చూపటం మాత్రమే! వెయ్యేళ్లుగా తనమీద జరుగుతూ వచ్చిన, ఇప్పటికీ వివిగి రూపాల్లో ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్న దాడులను నిలువరించుకొనేందుక ఈ వర్గం తనకు తానుగా వేసుకున్న అడ్డుకట్ట మాత్రమే! ఈ పెద్ద వర్గం సహాయ సహకారాలున్నప్పుడు మాత్రమే ఏ చిన్న వర్గమయినా ఇక్కడ సుఖంగా జీవించగలం చెప్పటం మాత్రమే!

ఈ జాతి తన బానిస సంకెళ్లని ఛేదించుకుని, తన శక్తిని ప్రదర్శించుకుని, తన స్వేచ్ఛను ప్రకటించుకుంది కదూ! తన ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఈ మట్టి పొయ్యటం, అనుకోకుండా జరిగిన ఈ కూల్చటం - వీటి ద్వారా ఈ రోజున ముందడుగు వేసింది కదూ!

ఈ జాతికి ఇకముందున్నదంతా పరమవైభవకాలఖండమే కదూ! ఇకనుంచీ ఈ జాతి మనుషులు ఏ దేశంలో ఉన్నా ఆత్మవిశ్వాసంతో బతికేస్తారు కదూ! మొదటి తరగతి పౌరులుగానే తల ఎగరేసుకుని తిరుగుతారు కదూ! - ఒక్క మాటలో, ఈ జాతికి రాబోయేది ధర్మరాజ్యమే కదూ!

మరి, మరి, నువ్వు నాతో ఇప్పుడైనా మాట కలుపుతావా?

ఏమిటీ, 'ధర్మం' అనే మాట అభ్యంతరకరంగా ఉండచ్చేమో- అని నీళ్లు నముల్తున్నావా? మంచిది, ఆ అభ్యంతరవాదుల్ని వాళ్ల వాళ్ల అభ్యంతరమందిరాల్లో ఉండిపోనీ! విదేశాల్లో ఉన్న తన వాళ్లను కూడా కలుపుకుంటూ, జాతి జాతి యావత్తూ, మహాజలనిధియై పొంగి పొరలుతున్న వేళ, ఈ పొంగును చూసి చెలియలి కట్టలే బెంబేలెత్తిపోతున్న వేళ, ఆ అభ్యంతరవాసుల్ని ఒంటరిగా వెనకనే దిగబడిపోనీ! మనమేం చెయ్యగలం!

ఏమంటావు? .ఆలోచిస్తున్నావా, ఆలోచించు. నిన్ను ఒత్తిడి చెయ్యన్లే!

అన్నట్టు ఆ 'మహాప్రస్థానం' లక్ష్యం ఏమిటో చెప్పనా?... ఆఁ ఎందుకులే... ఇన్ని తెలుసుకున్నవాడివి, నీకీపాటికి ఆ మాత్రం తెలీకుండా ఉందా ఏమిటి?!

ఈ కథ బాబర్ కట్టడం కూల్చివేసిన ఘట్టం... అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా అయోధ్య రామ జన్మభూమిలో మందిర నిర్మాణం జరిగింది జనవరి 22 న రాముని గుడి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది... అందరమూ ఆ రోజు ఇంట్లో దీపాలు వెలిగించి దీపావళి లా జరుపుకుందాం.. ఇది కూడా నేను చెప్పాలా ఏంటి మీకు తెలీదా? జై కొట్టు ఎవరికో కూడా చెప్పాలా?

No comments