Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సామ్యవాదం భారతీయ సంస్కృతికి విరుద్ధం

సామ్యవాదం భారతీయ సంస్కృతికి విరుద్ధం: వర్గ సంఘర్షణకు ప్రతిక్రియగా ప్రారంభమైన సామ్యవాదం గురించి మనం తెలుసుకున్నాం. రష్యా లాంటి ...


సామ్యవాదం భారతీయ సంస్కృతికి విరుద్ధం: వర్గ సంఘర్షణకు ప్రతిక్రియగా ప్రారంభమైన సామ్యవాదం గురించి మనం తెలుసుకున్నాం. రష్యా లాంటి కమ్యూనిస్టు దేశాలన్నీ తమను తాము సామ్యవాద రాజ్యాలుగా చెప్పుకుంటాయి. ఈ సిద్ధాంతం వల్ల ఆయా దేశాలకు కూడా ఎటువంటి లాభము జరగలేదు. సిద్ధాంత రూపంలోకి రాకముందే సామ్యవాదం యొక్క విస్పోటనం జరిగిపోయింది. ఇప్పుడు ఆచరణలో దాని యొక్క విస్పోటం మరింత వేగంగా జరుగుతున్నది.

ఒక వ్యక్తి, సదరు వ్యక్తి పై దాడి చేసి వారి సంపదనంతా దోచుకుంటే, దానికి ప్రజాస్వామ్య సామ్యవాదం, సామ్యవాద ప్రజాస్వామ్యం అనే నినాదాలు ఇచ్చి కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఉన్న లోపాలను మన రాజకీయ నాయకులు కప్పిపుచ్చుతున్నారు. వాస్తవానికి ప్రజాస్వామ్యం మరియు సామ్యవాదం పరస్పర విరోధ సిద్ధాంతాలు. ప్రజాస్వామ్యం ఉన్నచోట సామ్యవాదం ఉండదు అలాగే సామ్యవాదం ఉన్నచోట ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. వ్యక్తి యొక్క స్వాతంత్రమే ప్రజాస్వామ్యానికి గీటురాయి, అయితే ఇదే స్వాతంత్రం సామ్యవాదానికి మొదటి అడ్డంకి. ప్రజాస్వామ్యంలో వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలకు ఉన్నత స్థానం ఇవ్వబడింది, కానీ సామ్యవాదంలో వ్యక్తి, రాజ్యం అనే ఒక మహా యంత్రంలోని ఒక చక్రానికి(gear) ఉన్న దంతం లాంటివాడు. నిర్జీవ పదార్థం లాంటివాడు.

ఇంకా ముందుకు వెళితే అసలు సామ్యవాదం అనేది ఈ మట్టిలో పుట్టినది కాదు. ఇది మన రక్తంలోనూ పరంపరలోనూ లేనిది. తరతరాలుగా వస్తున్న మన ప్రాచీన రాష్ట్ర జీవనం మరియు మన ఆచారాలకు ఆదర్శాలకు ఈ సామ్యవాదానికి ఎటువంటి సంబంధమూ లేదు. మనకు మన ప్రజలకు ఈ సిద్ధాంతం పరాయిది. మన హృదయాలని కదిలించి సమర్థవంతమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రేరణ కలిగించే ఏ విషయము ఇందులో లేదు. జాతీయ భావాలు, ఆదర్శాల యొక్క ఆవశ్యకతను తెలియపరచే కనీస వివరణ కూడా ఈ సిద్ధాంతంలో లేదు‌.

ఆంగ్లేయులు మన దేశం నుండి వెళ్లిన తర్వాత మన దేశాన్ని పాలించిన వారందరూ ఈ విదేశీ సిద్ధాంతాల మాయలో పడి దాదాపుగా 50 సంవత్సరాలు అభివృద్ధిని వెనక్కి నెట్టారు. రాష్ట్ర జీవనంలోని రాజనీతిక, ఆర్థిక, సామాజిక మొదలైన అన్ని క్షేత్రాల యొక్క అభివృద్ధికి తగిన వాస్తవిక ప్రామాణికమైన సమగ్రమైన మార్గాన్ని అందించిన మన దేశం, ఈ విదేశీ సిద్ధాంతాన్ని అక్కున చేర్చుకోవడం అత్యంత హేయము అవమానకరము. ఇటువంటి పాశ్చాత్య సిద్ధాంతాలు మానవుని మేధాశక్తిని ఉచ్ఛ స్థాయికి తీసుకువెళ్తాయని అనుకోవడం మన భావదారిద్ర్యానికి దివాలా కోరుతనానికి సంకేతం. మన ప్రాచీన ఋషులు అందించిన తర్కము, అనుభవము మన ఇతిహాసాలు నేర్పించిన ఆదర్శము సత్యము ఆధారంగా మాత్రమే ఈ దేశ సర్వాంగీణ వికాసము సాధ్యమవుతుంది.

శీల వినయ ఆదర్శ శిష్టత - సర్వోన్నతమైనది నీ గత చరిత
మానవ కల్యాణమే నీ జీవన యజ్ఞము - ఋషులు మునుల విలువలే ఆధారము.

1 comment

  1. చాలా మంచి విషయం చక్కగా వివరించారు. సామ్యవాదం, కమ్యునిజం, సంకుచిత హింసాత్మక మతాలు చెరుపు చేస్తాయి. సనాతన ధర్మం మాత్రమే ఆచరణీయం, అనుసరణీయం.

    ReplyDelete