Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మానవ జీవితం వికసించడానికి శ్రద్ధ/విశ్వాసం అవసరం

మానవ జీవితం వికసించడానికి శ్రద్ధ/విశ్వాసం అవసరం:  త్యాగము మరియు సేవ భావం లోపించడం వల్ల సమాజంలో స్వార్థభావన పెరిగి అనేక రకాలైన సం...

మానవ జీవితం వికసించడానికి శ్రద్ధ/విశ్వాసం అవసరం: త్యాగము మరియు సేవ భావం లోపించడం వల్ల సమాజంలో స్వార్థభావన పెరిగి అనేక రకాలైన సంఘర్షణలకు  దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా వ్యక్తి, సమాజం పరస్పరం సహకరించుకునే విధంగా ఒక వ్యవహారిక సిద్ధాంతం రూపొందించబడింది. సమాజంలో చెలరేగే సంఘర్షణలకు మూల కారణాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ మరియు సామ్యవాదం. ఇందులో ఒక విధానంలో వ్యక్తి సమాజానికి మరియు ఇంకొక విధానంలో సమాజం వ్యక్తికి శత్రువుగా పేర్కొనబడింది.

మనిషి కేవలం ఆహారం కోసమే జీవించడు. వ్యక్తి జననం నుండి మరణం దాకా మతము దాని పట్ల విశ్వాసం అనేది  అవసరం. ఈ విశ్వాసం లోపించడం వల్ల జీవితానికి ఒక దశ దిశ పరమార్థం లేకుండా పోతాయి. దీనివల్ల వ్యక్తి జీవితంలో దిక్కుతోచని స్థితికి చేరుకుంటాడు. ఏదో కోల్పోయిన అనుభవాన్ని పొందుతాడు. ఇది వ్యక్తికి అత్యంత క్లిష్టమైన పరిస్థితి. విజ్ఞానం అభివృద్ధి చెందక ముందు యూరప్ ఖండంలో క్రైస్తవ్యం ప్రజలకు అవసరమైన విశ్వాసం రూపంలో సహాయపడింది. కానీ వైజ్ఞానిక లోకం క్రైస్తవ్యం యొక్క విశ్వాసాన్ని ప్రశ్నించి దానిపై దాడి చేసింది. దేశ, కాలమానానికి సంబంధమైన క్రైస్తవ విశ్వాసాలన్నిటిని అంతం చేసింది. ఆ విధంగా మతం పట్ల విశ్వాసం క్షీణించి, విజ్ఞానంపై విశ్వాసం అధికమైంది. విజ్ఞానమే ఒక కొత్త మతంలా అవతరించింది. మనిషి విజ్ఞానాన్ని, పరమేశ్వరునితో సమానమైన త్రికాలదర్శిగా మరియు సర్వశక్తివంతమైనదిగా విశ్వసించసాగాడు.

కానీ వైజ్ఞానిక అన్వేషణలు ప్రాచీన ఆధారాలను ఖండిస్తూ వచ్చాయి. డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని కూడా వ్యతిరేకించాయి. ఒకప్పటి సర్వోన్నత వైజ్ఞానికుడైన ఐన్స్టైన్ కూడా ప్రపంచానికి సంబంధించిన సమస్యలన్నిటికీ సానుకూలమైన పరిష్కారాన్ని అందించే యోగ్యత విజ్ఞానానికి లేదని ఒప్పుకున్నాడు. విక్టోరియా పరిపాలించే కాలంలో వైజ్ఞానికులను త్రికాలదర్శులుగా పేర్కొన్నారు. కానీ వారు వైజ్ఞానిక రంగంలో కనుగొన్న విషయాలు కేవలం ఒక మహాసాగర తీరంలో పొగైన కొన్ని గులకరాళ్లు మాత్రమే అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

పరిశోధించడానికి అనుసంధానించడానికి ఇప్పటికి కూడా ఈ ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి. ఈ కారణంగా పాశ్చాత్య దేశాల్లో మత విశ్వసాలు అంతరించిపోయాయి. ఆ దేశాల్లోని ప్రజలు ఒక చుక్కాని, దిక్సూచి లేకుండా ఈ సంసార సాగరంలో సంచరిస్తున్నారు. ప్రాచీన విశ్వాసాలన్నీ అంతరించి అనేక కొత్త సిద్ధాంతాలు పురుడు పోసుకున్నాయి. ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకు రెండు కొత్త విశ్వాసాలు ఆవిర్భవించాయి. ఒకటి ఫాసిజం రెండవది సామ్యవాదం.

(భోగములో తేలియాడు లోకానికి త్యాగము నేర్పించుదాం.
కారు మబ్బులను చీల్చుకుంటూ సౌఖ్యాన్ని వర్షించుదాం.)

No comments