Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రాష్ట్రీయ భావన - మనోధైర్యము

రాష్ట్రీయ భావన - మనోధైర్యము: కమ్యూనిజాన్ని అంతం చేయాలనే పాశ్చాత్య దేశాల ఆలోచన విధానాలు ఆ భావజాలం మరింత విస్తరించడానికి తోడ్పడు...


రాష్ట్రీయ భావన - మనోధైర్యము: కమ్యూనిజాన్ని అంతం చేయాలనే పాశ్చాత్య దేశాల ఆలోచన విధానాలు ఆ భావజాలం మరింత విస్తరించడానికి తోడ్పడుతున్నాయి. అత్యధికంగా డాలర్లు కుమ్మరిస్తే కమ్యూనిజం సమస్య అంతరించిపోతుందని అమెరికా భావిస్తున్నది. ఆయా దేశాలకి ఒక చరిత్ర, సంస్కృతి మరియు ప్రజల్లో ఆత్మవిశ్వాసం లేకపోతే ఇటువంటి ధన సహాయము వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చైనా మరియు వియత్నాం విషయాల్లో ఇది స్పష్టమవుతున్నది. ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా ప్రజలకు ఆర్థిక స్పృహ పెరుగుతుంది కానీ స్వతంత్ర ప్రజాస్వామ్య జీవనానికి అవసరమైన మౌలిక విషయాలను అది విస్మరించేలా చేస్తుంది.

మన దేశాన్ని కమ్యూనిజం నుంచి రక్షించాలంటే ఇక్కడ ఉన్న ప్రాచీన సనాతన ధర్మం నశించాలని చాలామంది పాశ్చాత్య బుద్ధి జీవులు విచిత్ర వాదనను తెరపైకి తెస్తున్నారు. వారి వాదన ప్రకారం కేవలం క్రైస్తవ్యానికి మాత్రమే కమ్యూనిజం యొక్క ప్రవాహానికి అడ్డుకట్ట వేసే సామర్థ్యం ఉన్నది. క్రైస్తవ మతం కపటత్వంతో కూడుకున్నదని వర్ణించిన పాశ్చాత్య చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్బి, ఆశ్చర్యకరంగా క్రైస్తవమే కమ్యూనిజానికి సరైన సమాధానం అన్నాడు.

క్రైస్తవ్యం ఈ సమస్యకు సమాధానం ఎలా అవుతుంది? విగ్రహారాధకులు అధికంగా ఉండే భారతదేశాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని అనుకునేవారు, ప్రపంచంలో అతిపెద్ద దేశమైన రష్యా క్రైస్తవాన్ని ఎందుకు విడిచిపెట్టిందో ఆలోచించాలి. మన దేశంలో ఉన్న కేరళ ప్రాంతంలో క్రైస్తవుల జనసంఖ్య అత్యధికంగా ఉన్నప్పటికీ అది కమ్యూనిస్టుల కంచు కోటగానే ఉన్నది. హిందువులను క్రైస్తవులుగా మతమార్పిడి చేయడం వల్ల కమ్యూనిజం అంతమవుతుందని అనుకునేవారు ఆత్మవంచన చేసుకుంటున్నారని గ్రహించాలి. క్రైస్తవం స్వీకరించడం వల్ల ప్రాచీన సంప్రదాయాలు, రాష్ట్రీయతకు భంగం కలుగుతుంది. ఎక్కడైతే జాతీయత నశిస్తుందో అక్కడే కమ్యూనిజం చిగురిస్తుంది. కమ్యూనిజం ఈరోజు ఇంతగా వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణం.

ఇంగ్లాండ్ ఉదాహరణ తీసుకుంటే, వారి జీవితంలో దేశభక్తికి విశిష్టమైన స్థానం ఉన్నది. ఈ దేశభక్తే వారిని అనేకమైన ప్రతికూల పరిస్థితుల నుంచి విజయం సాధించడానికి సమర్థులుగా చేసింది. రెండవ ప్రపంచ యుద్ధాంతరం ఒక ఇంగ్లాండ్ పౌరుడు మన దేశానికి వచ్చాడు. ఒక వేడుకలో చాయి తయారీకి అధికమాత్రంలో చక్కెర వాడటం చూసి, మీరు ఎంత చక్కరైతే చాయిలో వేస్తున్నారో అంత చక్కెర మా దేశంలో వారానికి ఒకసారి పంపిణీ చేసే రేషన్ లో అందిస్తారు. వస్తువుల లోటు ఉన్నదని ఎటువంటి దిగులు లేకుండా వారు సంతోషంగానే ఉన్నారు. ఇటువంటి రాష్ట్రీయ భావన వల్లనే దేశం సజీవంగా శక్తివంతంగా ఉంటుంది. విజాతీయ శక్తులను అణచివేయగలుగుతుంది.
(గుండె నిండా దేశభక్తి. అదే ప్రాణ శక్తి మనకు.
సంకటములు పారద్రోల సర్వత్ర విజయమే మనకు.)

No comments