Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సామ్యవాదంతో సంపూర్ణ అభివృద్ధి అసంభవం

సామ్యవాదంతో సంపూర్ణ అభివృద్ధి అసంభవం :  కార్ల మార్క్స్ కంటే అనేక వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులు, రాజులు లేని రాజ్యాన్ని కల్పన చే...

సామ్యవాదంతో సంపూర్ణ అభివృద్ధి అసంభవం: కార్ల మార్క్స్ కంటే అనేక వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులు, రాజులు లేని రాజ్యాన్ని కల్పన చేశారు. రాజు లేడు, నేరాలు లేవు, శిక్షలు లేవు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ధర్మ పాలన ద్వారా పరస్పరం రక్షించుకున్నారు. రాజ్యం లేని సమాజం యొక్క ఆలోచనకు మార్క్స్ ఎటువంటి ఆధారం ఇవ్వలేకపోయాడు. మన ఋషులు దాని గురించి ఒక స్పష్టమైన వివరణ ఇవ్వడమే కాకుండా దాన్ని సిద్ధించు కోవడానికి అవసరమైన మార్గాన్ని కూడా అందించారు.

వైజ్ఞానిక పరీక్షల ద్వారా మానవుని యొక్క పరిణామ క్రమాన్ని పరిశీలించినప్పుడు కాల్ మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం అసత్యం అని రుజువవుతుంది. కమ్యూనిస్టు సిద్ధాంతం పూర్తిగా భౌతిక వాదం పై ఆధారపడి ఉన్నది. భౌతికంగా జీవించడం అనేది జంతువుల స్థాయిలో కనిపిస్తుంది. స్థూలం నుండి సూక్ష్మం దిశగా పరిణామక్రమం  సాగుతుంది. మానవుడు ప్రారంభిక అవస్థలో కేవలం స్థూలమైన భౌతికపదార్థాల గురించి మాత్రమే ఆసక్తి చూపిస్తాడు. అతని యొక్క సంపూర్ణ సమయాన్ని, శక్తిని భౌతిక సుఖాలు పొందడానికి శారీరిక ఇచ్ఛలని పూర్తి చేసుకోవడానికి వినియోగిస్తాడు. క్రమక్రమంగా ఉచ్ఛ స్థితికి చేరుకునే దశలో అతని మానసిక తృష్ణ అధికమయ్యి కేవలం భావనాత్మక సుఖాలకై పరితపిస్తాడు.

అప్పుడు అతడు సంస్కృతి వైపు నడవడం మొదలుపెడతాడు. అప్పుడు అతడు బహువిధ కళలను నేర్చుకోగలుగుతాడు మరియు ఆ కళలలో దాగి ఉన్న సౌందర్యాన్ని అభినందించగలుగుతాడు. అప్పుడు అతనికి బౌద్ధికమైన సుఖం యొక్క అనుభూతి కలిగిన కారణంగా అతడు నిరంతరం జ్ఞాన గంగలో మొనకలు వేయడంలో పరమానందాన్ని పొందుతాడు. విజ్ఞాన మరియు దర్శన శాస్త్రాలు మనిషి యొక్క బౌద్ధిక సామర్థ్యాన్ని పెంచి ఆత్మా అన్వేషణ కై ప్రేరేపించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. ఈ ప్రయాణంలో కూడా మానవునికి సంతృప్తి కలుగదు. ఆ ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవడానికై అతని ప్రయాణం కొనసాగుతుంది. అప్పుడు మానవుడు బ్రహ్మ జగత్తులోకి ప్రవేశిస్తాడు. చివరిగా అతడు సచ్చిదానంద స్వరూపమైన పరమేశ్వరుని చేరుకుంటాడు. ఇది మానవుని యొక్క పరిణామ క్రమము. పురుషర్దాల యొక్క పరమార్థము.

స్థూలం నుండి సూక్ష్మము, జడత్వం నుండి చైతన్యం దిశగా సాగే మానవుని యాత్రకు సంబంధించిన ఆధారాలు భౌతికవాదులైన కమ్యూనిస్టులు ఎలా నిరూపించగలుగుతారు? కాబట్టి ఆ రకంగా కమ్యూనిస్టులు ప్రగతి నిరోధకులు మరియు అధోగతి దిశగా ప్రయాణించేవారు అని తెలుస్తుంది.

ఎప్పుడైతే సామ్యవాదం యొక్క వ్యవస్థాపకుడు చెప్పిన భవిష్యవాణి అసత్యమని నిరూపించబడిందో అప్పుడే దాని బండారం బయటపడిపోయింది. కార్ల్ మార్క్స్ యొక్క భవిష్యవాణని అనుసరించి కార్మిక విప్లవము ఇంగ్లాండ్, జర్మనీ,
అమెరికా దేశాలలో ముందుగానే జరిగి ఉండాల్సింది. కానీ ఆ విప్లవము రష్యా లాంటి వెనుకబడిన దేశాల్లో ప్రారంభమైంది. దీనిని బట్టి కమ్యూనిస్టు సిద్ధాంతం పూర్తిగా నిరాధారమైనదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంగ్లాండ్ అమెరికా లాంటి దేశంలో వ్యవస్థలకు వ్యతిరేకంగా విప్లవాలు మొదలయ్యే సంకేతాలు ఏమాత్రం కనబడడం లేదు.

(జడత్వము నుండి చైతన్యము దిశగా, స్థూలము నుండి సూక్ష్మము దిశగా
సాగుతుంది మన ప్రయాణము. సృజన లేని విజ్ఞానము వ్యర్థము దానివల్ల ఉపయోగము శూన్యము)

No comments