Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఈ దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పనిచేసే వారికి అవమానాలు తప్పవా?

ఈ దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పనిచేసే వారికి అవమానాలు తప్పవా?: సహజంగా ఈదేశం కోసం, ఈమట్టి కోసం నిజాయితీగా ఉన్నవారికి కష్టా...


ఈ దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పనిచేసే వారికి అవమానాలు తప్పవా?: సహజంగా ఈదేశం కోసం, ఈమట్టి కోసం నిజాయితీగా ఉన్నవారికి కష్టాలు, అవమానాలు తప్పవా అంటే నిజంగా తప్పవనే చెబుతాను. కాబట్టి కష్టమైనా, కంఠకాకీర్ణమయినా ఈ దేశం కోసం పనిచేసిన వారు అనేకం, పూర్వం నుండే మనదేశంలో ఈ పరిస్థితి ఉంది. హరిశ్చంద్రుని దగ్గర నుండి ధర్మరాజు, కృష్ణుని వరకూ అనేకమైన అపవాదులు, నిందలు మోసినవారే కానీ ఉన్నతమైన ధర్మాన్ని అంటిపెట్టుకునే పనిచేశారు, జీవించారు. అలాగే రాణా ప్రతాప్, శివాజీ లకి అవమానాలు తప్పలేదు మనమెంత?.

బ్రిటీష్ వారిపై స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధుల కి కూడా అపవాదులు, అవమానాలు, నిందలు తప్పలేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం:

ఈ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసింది వందేమాతర గీతం. వందేమాతర నినాదం తో ముందుకెళుతున్న భగత్ సింగ్ స్నేహితులు విప్లవమార్గాన్ని ఎంచుకుని పనిచేస్తుంటే, అదే స్వాతంత్ర్యం కోసం పనిచేస్తున్న మరొక వర్గం వారిని దారి తప్పిన దేశభక్తులంటూ ముద్రవేశారు.

ఆనందమఠం వ్రాసిన 20 ఏళ్ళ తరువాత 1905 కి ఈ దేశం అంతా విస్తరించింది దాని యొక్క ఉత్కృష్ట భావన ఈ సమాజానికి అర్దం అర్దమయ్యింది. దీనిని మొదటగా రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారు. అంతా బావుంది ఆ తరువాత ఠాగూర్ జనగణ మన వ్రాయడం జరిగింది. వారికి నోబుల్ బహుమతి కూడా వచ్చింది. కానీ ఈ సమాజం వారిని బ్రిటీష్ వ్యక్తిగా చిత్రీకరించి ఇప్పటికీ అపవాదులు, నిందలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే జనగణ మనలో అదినాయక అని, భారత భాగ్య విధాత అని ఉండటం మూలాన ఠాగూర్ ని బ్రిటీష్ వారిని స్తుతిస్తూ ఈ గీతం వ్రాశాడు అంటారు కానీ అది నిజం కాదు. ఠాగూర్ ఎప్పుడూ కూడా ఈ దేశం గురించే ఆలోచించేవాడు అసలు బెంగాల్ లో పుట్టిన ఏ ఒక్కడూ కూడా ఆ సమయం లో దేశం తప్ప వారికి మిగతావి తుచ్చమైనవి. ఠాగూర్ ఎందుకలా వ్రాశాడంటే అప్పటికే ఈదేశాన్ని తల్లిగా కీర్తిస్తూ బంకిం చంద్రుడు వందేమాతరం వ్రాశారు. వందేమాతర గీతాన్ని ప్రేరణగా తీసుకుని ఈదేశ యువత భగవద్గీత చేతబూని ఉరిని ముద్దాడారు ఠాగూర్ అప్పుడు చలించిపోయి ఈ దేశాన్ని తండ్రిగా కీర్తిస్తూ అధినాయక అన్నారు అంటే ఆ విష్ణుమూర్తి (ఎందుకంటే కృష్ణుడు గీత అందించాడు కనుక) అలాగే భాగ్య విధాత అన్నా కూడా ఆ విష్ణుమూర్తే తప్ప ఇక్కడ వేరే ఏ ప్రాపకం లేదు. అలా ఠాగూర్ కి నిందలు తప్పడం లేదు.

ఈ నిందలు అపవాదులు గాంధీ కి తప్పలేదు ఈ వ్యాసం చదివే వారికి కూడా నేను తప్పు వ్రాస్తున్నాను అనిపించవచ్చు కానీ ఎంతలేదన్నా గాంధీ ఈ దేశంకోసం అహర్నిశలు శ్రమించారు అది వాస్తవం. మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగం లో ఉన్నాం. ఒక్కొక్కళ్ళకి లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు మీరు మీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి పలానా సమయంలో మనమంతా కలుద్దాం ఒకచోట అని ఎంతమంది వస్తారో చూద్దాం. కానీ ఆ రోజుల్లో ఈదేశంకోసం గాంధీ ఉప్పు పేరుతో ఒక సత్యాగ్రహాన్ని నడిపారు. నేనోదో గొప్పగా చెబుతున్నానని కాదు కానీ గాంధీ కూడా ఈ దేశానికి నిత్యస్మరణీయుడే వారికీ నిందలు తప్పడం లేదు మీరు నిందిస్తే నేను ఏమీ చేయలేను కూడా.

సావర్కర్ ఈ పేరు పలికినంతనే దేశభక్తులకి ఒళ్ళు పులకరిస్తుంది, రోమాలు నిక్కపొడుచుకుంటాయి. కానీ సావర్కర్ ఎన్నో అవమానాలు, అపవాదులు, నిందలు మోశాడు ఇప్పటికీ మోస్తున్నాడు. వయసులో ఉండగా హాయిగా పిల్లాపాపలతో గడపాల్సిన వ్యక్తి అండమాన్ జైలు లో 11 ఏళ్ళు మగ్గాడు. అయినా ఈ దుర్మార్గపు సమాజం అతన్ని బ్రిటీష్ ఏజెంట్, కోవర్ట్, తొత్తు అంటూ అర్దంపర్దంలేని అపవాదులు వేస్తూనే ఉన్నారు. అలాగే గాంధీజి హత్యతో ఏ మాత్రము సంబంధంలేని వ్యక్తి జైలులో ఉంచి అవమానించారు కనీసం వారు నిర్దోషి అని తెలిశాక కూడా వారికి క్షమాపణలు కూడా చెప్పలేదు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం.ఇప్పటికీ సావర్కర్ ని అవమానిస్తూ నిందలు వేస్తూనే ఉన్నారు. బ్రిటీష్ వాళ్ళకి తనను విడిచిపెట్టమని అపాలజీ లెటర్ లు వ్రాశాడంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, ఆ రోజుల్లో జైలులో ఉన్న రాజకీయ ఖైదీలకి లెటర్లు వ్రాయమనే వారు మిగతా ఉద్యమకారుల్లానే తనూ ఉత్తరాలు వ్రాశాడు మరి బ్రిటీష్ వారి తొత్తయితే ఎందుకు సావర్కర్ ని జైలు నుండి విడుదల చేయలేదు. కాబట్టి ఇదంతా ట్రాష్...

ఈ నిందలు హిట్లర్ నే గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి కూడా తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ తనను కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్షుడిని కాకుండా చేసింది. అలా చేయడమే కాకుండా సుభాష్ ని మానసికంగా క్రుంగిపోయే విధంగా చేశారు కానీ ఉద్దం సింగ్ మరలా నేతాజీలో జీవాన్ని నింపాడు స్వాతంత్ర్య సమరంలో నిలదొక్కుకునేలా చేశాడు, అండమాన్ లో జెండా ఎగరేశాడు.

13 ఏళ్ళ వయసులో వందేమాతరమంటూ బ్రిటీష్ అధికారికి ముచ్చెమటలు పట్టించిన కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ కూడా ఈ నిందలను ఎదుర్కోవాల్సి వచ్చింది. డాక్టర్ చదివి హాయిగా బ్రతకాల్సిన వ్యక్తి పెళ్ళి చేసుకోకుండా ఈ దేశంలో నిద్రావస్తలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేసి సంఘటనం చేయాలనుకున్న వారిని నిరాశపరచారు, నిందలు వేశారు కానీ నేడు ఆయన స్థాపించిన ఆర్ ఎస్ ఎస్ సంస్థ మర్రివృక్షమై ఈ సమాజానికి నీడనిస్తుంది. అయినప్పటికీ నిందలు తప్పడంలేదు హెడ్గేవార్, ఆర్ ఎస్ ఎస్ స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనలేదంటూ ఈ కుహనా మేదావులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ హెడ్గేవార్ అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు, పూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొదట పలికిందే హెడ్గేవార్.

ఆర్ ఎస్ ఎస్ రెండవ సరసంఘచాలక్ శ్రీ గోళ్వాల్కర్ గారికి కూడా ఈ నిందలు తప్పలేదు. హాయిగా బెనరార్ హిందూ విశ్వవిద్యాలయంలో జీవించాల్సిన వ్యక్తి. బ్రహ్మచారిగా ఉంటూ ఈ దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వ్యక్తిని గాంధీ హత్య నెపంతో జైలులో ఉంచారు, అవమానించారు. హత్యతో సంబంధం లేదని తేలాక కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు కాంగ్రెస్ నాయకులు.

అంబేద్కర్ ని ఇప్పటికీ కొంతమంది వారు ఈ దేశ స్వాతంత్ర్య ఉద్యమం ఒకపక్క జరుగుతుంటే వీరు మాత్రం అంటరానితనం రూపుమాపాలని పనిచేశారు, అంటూ దుర్మార్గంగా మాట్లాడుతుంటారు. అసలు అంబేద్కర్ లాంటి వ్యక్తిని మనం ఆలోచించాల్సిన విధానం వేరే ఉంది. అంటరానితనం రూపుమాపితే ఈ దేశానికి స్వాతంత్ర్యం చిటికెలో వస్తుంది అనేది అంబేద్కర్ అలోచన, నిజంగా 1818 లో కోరేగావ్ లో బ్రిటీషర్స్ సైన్యంలో దళితులు ఉండటం మూలానే వారి గెలిచారు. అదే దళితుల్ని దగ్గరకు తీసి అంటరానితనం రూపుమాపితే స్వాతంత్ర్యం చిటికెలో తేవొచ్చు అని అంబేద్కర్ ఆలోచన. అయినప్పటికీ మనకు స్వాతంత్ర్యం వచ్చాక కూడా తనని ఈ కాంగ్రెస్, కమ్యునిష్ట్ లు కలిసి ఓడించారు, అవమానించారు.

అలాగే గురజాడ అప్పారావు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నందుకు కొంతమంది మహా మేదావులు గురజాడని బ్రిటీషర్స్ కి అనుకూలం అంటూ మాట్లాడుతుంటారు. వారన్న విషయం ఏమిటంటే ఓ మనిషి నువ్వు మట్టిలా ఉండకు మనిషిగా బ్రతుకు అని అర్దం. మనం కూడా ఎవరైనా తప్పుచేస్తే మనిషివేనారా అంటుంటాం. ఎందుకంటే మనిషిగా ఆలోచిస్తేనే ఈమట్టి నాది అనే భావన కలుగుతుంది.

తమిళనాడులో సుప్రసిద్ధ రచయిత, విప్లవ కవి సుబ్రహ్మణ్య భారతి అంటరానితనం రూపుమాపడానికి పనిచేస్తుంటే తోటివారే తనని వెలేసి అవమానించారు. అయినప్పటికీ ఏనాడూ ఈ సమాజాన్ని సేవించడంలో వెనుకడుగేయలేదు.

గుర్రం జాషువా గారికీ తప్పడం లేదు వారు తమ రచనల ద్వారా హిందూ సమాజాన్ని తట్టిలేపారు, వారిని కూడా క్రైస్తవుడంటూ ముద్రవేసే సమాజం మనముందు వుంది, ఏ ఈ ధర్మాన్ని దేశాన్ని సం రక్షిచుకునే బాధ్యత క్రైస్తవులకి లేదా... వారు ఈ భారతదేశాన్ని తల్లిగా తన రచనల్లో అభివర్ణించారు ఇంతకన్నా గొప్పదేశభక్తుడెవరుంటారు మీరే చెప్పండి...

ఇక మనందరికీ ఇష్టమైన మహానేత ఈ దేశానికి, రామ జన్మభూమి ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి శ్రీ లాల్ కృష్ణ అద్వాణీ గారు. నిజంగా చెప్పాలంటే వారొక స్పూర్తి కానీ ఏమయ్యింది పాకిస్తాన్ లో ఓ సందర్భంగా జిన్నాని లౌకికవాది అన్నాడు. అప్పటిదాకా పొగిడిన నోళ్ళే ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అసలు అంత గొప్ప నేత అలా ఎందుకు అని ఉంటాడా అని ఒక్కసారైనా ఆలోచించారా లేదు. నిజంగా చెప్పాలంటే వారిని సూటిపోటి మాటలతో అవమానించారు, ఎంతలా కృంగిపోయుంటారో.. కాని వారు జిన్నాని లౌకిక వాదిగా కీర్తించడం వలన పాకిస్తాన్ సమాజాన్ని విభజించాలనుకున్నారు కానీ సొంత నేతలతో మటలు పడాల్సి వచ్చింది.

ఫ్రెండ్స్ కనుక ఈ సమాజం కోసం దేశం కోసం పనిచేసే సమయంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కోవలసి వస్తుంది. నిజంగా నువ్వు దేశంకోసం పని చేయాలనుకుంటే, వీటిని పట్టించుకోవద్దు. మిమ్మల్ని ఎలాంటి మాటలంటారో కూడా నేను చెబుతాను వాటినసలు పట్టించుకోకండి.

ధర్మం కోసం పనిచేసే వారి మీద వేసే నిందలు ఇవే:
  • డబ్బులు సంపాదించడానికే పనిచేస్తునాడు అంటారు.
  • ప్రాంతీయ పిచ్చి అంటారు.
  • ఎదో ఒక పార్టీకి కోవర్ట్ అంటారు.
  • ఆత్మస్తుతి ఎక్కువ సెల్ఫ్ డబ్బా అంటారు.
  • కులాన్ని అంటగడతారు.
  • ఇతను పలానా వర్గానికి అనుకూలం అంటారు.
  • ఇతను పలానా మనిషి అంటారు.
ఈ అవమానలను భరించు, స్వీకరించు, విజయం సాధించు. ఇక ఏవేవో ఉన్నవి లేనివి ప్రచారం చేస్తారు. కానీ నిజంగా నీకు దేశం మీద ప్రేముంటే ఇవన్ని పట్టించుకోకు నిన్ను సమాజం గుర్తించిన గుర్తించకపోయినా నీపని నీవు చేసుకుంటూ పో, బీ లైక్ ఏ రా ఏజెంట్. తెలుసుగా రా ఏజెంట్ అదృష్టం బావుంటే దేశభక్తుడిగా చనిపోతాడు లేదంటే దేశద్రోహి అనే ముద్రయినా పడొచ్చు.. కాబట్టి నువ్ చేసే పని సమాజానికి పనికొస్తుంది అంటే నువ్ ఎవర్నీ పట్టించుకోవాల్సిన పనిలేదు.. కాకపోతే ఈ క్రమంలో నువ్వు ఆత్మస్తుతి, పరనింద, వ్యక్తినిష్ట లకు దూరంగా ఉండు. చివరగా నాకు బాగా నచ్చిన కొటేషన్.. -జై హిందు రాష్ట. -రాజశేఖర్ నన్నపనేని.

మనం మనల్ని తెలుసుకోవాలి ఆత్మశక్తిని గుర్తించాలి. ఎవరో చంపి పడేసిన జంతువులను సింహాలు తినవు. మనం ఒక చేత సృష్టిని, ఒక చేత ప్రళయాన్ని ధరించి సాగుతాం. అందరూ కీర్తి జ్వాలలో వెలిగితే మనం చీకటిలో వెలుగుతాం. మన కళ్ళలో వైభవపుకలలుండాలి, అడుగుల్లో తుఫాను వేగాముండాలి. రాష్ట్ర సింధు ప్రవాహం ఆగదు, ఎవరెవరు అడ్డుకున్నాసరే. -సుదర్శన్ జీ

1 comment

  1. చక్కటి వ్యాసం అందించిన మీకు అభివందనాలు

    ReplyDelete