Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ జీవన స్వరూపం

హిందూ జీవన స్వరూపం:  ఇప్పుడు మనం ఒకసారి హిందూ జీవనం మీద దృష్టి సారిద్దాము. విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు మన సమాజంలో వివిధ నమ్మకాలు, సం...

Hinduism is a way of life


హిందూ జీవన స్వరూపం: ఇప్పుడు మనం ఒకసారి హిందూ జీవనం మీద దృష్టి సారిద్దాము. విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు మన సమాజంలో వివిధ నమ్మకాలు, సంప్రదాయాలు వర్ణాలు భాషలు ఆచార వ్యవహారాలు మొదలైన స్వాభావికమైన వైవిధ్యాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసి వారు, విభిన్నమైన చర్మం రంగు ఉన్నవారు, రకరకాల భాషలు మాట్లాడేవారు ఒక సమాజంగా ఏర్పడడం ఎలా సాధ్యం? మనందరం హిందువులం అని చెప్పుకోదగిన జీవన పద్ధతి ఏదైనా ఉన్నదా?

ఈ ప్రశ్న హిందూయేతరుల నుండి ఉత్పన్నమవుతుంది. వారికి ఇక్కడ జీవన విధానం గురించి అవగాహన లేదు. ఉదాహరణకు ఒక వృక్షాన్ని తీసుకుందాం. దానికి అనేక కొమ్మలు వేళ్ళు ఆకులు పూలు పళ్ళు వంటి వివిధ భాగాలు ఉంటాయి. ఆ వృక్షం యొక్క కొమ్మలు కాండం నుంచి వేరుగా వెళుతాయి. అలాగే కొమ్మల నుంచి ఆకులు కూడా. అన్నీ ఒకదానికొకటి విభిన్నంగా కనిపిస్తాయి. కానీ ఈ కనిపించే వైవిధ్యమంతా ఆ చెట్టు యొక్క స్వరూపమే అని మనకు తెలుసు. ఆ చెట్టు భాగాలన్నింటికీ పోషణ ఇచ్చే పదార్థము నీరు మాత్రమే. ఇదే విషయాన్ని వేల సంవత్సరాల నుంచి వికసించిన మన సమాజం విషయంలో కూడా అన్వయించుకోవచ్చు. ఏ రకంగా చెట్టు యొక్క కొమ్మలు ఆకులు చెట్టు నుండి వేరు కాదో, అదే రకంగా హిందూ సమాజంలోని వైవిధ్యం విభేదం కాదని అర్థం చేసుకోవాలి. ఇటువంటి నైసర్గిక సర్వాంగీణ వికాసమే మన సమాజ జీవనం యొక్క అద్వితీయమైన స్వరూపము.

వాస్తవానికి ప్రకృతిలో జీవ పరిణామక్రమం యోజన చేయబడింది. మన జీవనం దానికి అణుగుణంగానే ఉంటుంది. ప్రాణులు మొదటి దశలో నిరాకారంగా ఉంటాయి. వాటిని అమీబా మొదలైన సూక్ష్మ క్రిములు అంటాము. ఇవి ఏకకణ ప్రాణులు. వాటికవే పరిపూర్ణం అయినప్పటికీ రెండు కణములుగా విభక్తం చేయవచ్చు. ఇది జీవుల యొక్క ప్రాథమిక స్థితి. జీవ పరిణామ క్రమానికి మూల కారణంగా చెప్పవచ్చు. కణం వికాసం చెందుతున్న కొద్ది రకరకాల కణాలు పుట్టుకొచ్చి కొత్త రకమైన జాతులను జీవులను ఉత్పన్నం చేస్తాయి. ఈ క్రియ ని కణము ద్వారా వివిధ అంగముల ద్వారా స్వీయ నియంత్రణ చేస్తుంది. చివరకు అది మనుష్య శరీరం గా కూడా మారుతుంది. ఈ మానవ శరీరము అనేక అంగములు కలిగిన సంక్లిష్టమైన యంత్రము. ఇందులో ఉండే ప్రతి అంగానికి ఒక విశేషమైన క్రియ ఉన్నది. అనేకమైన అంగములు ఉన్నప్పటికీ అవన్నీ జీవక్రియ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. భూమి మీద శారీరికంగా మానసికంగా బౌద్ధికంగా వికసించిన అత్యంత ఉత్కృష్టమైన శరీరము మానవ శరీరమే. ఈ రకంగా మన చర్చ యొక్క నిష్కర్ష ఏమిటంటే భిన్నత్వము, వైవిధ్యము విభేదానికి దారి తీయవు. అన్ని అంగములు భౌతికంగా వివిధ ఆకారాన్ని కలిగి ఉంటాయి కానీ అన్నీ శరీరం యొక్క మంచి గురించే పని చేస్తాయి. శరీరం యొక్క వృద్ధి మరియు శక్తికి కారణం అవుతాయి.

హిందువు అంటే విశ్వ బంధువు, జడ చేతనములను బేధము లేదు.
రాయి రప్ప చెట్టు చేమ అన్నింటా బ్రహ్మమే కలదు

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments