Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ - హిందుస్థాన్ ఒకటేనా

హిందూ - హిందుస్థాన్: బృహస్పతి ఆగమం ప్రకారం హిందూ శబ్దంలో " హి" అంటే హిమాలయం "ఇందు " అంటే హిందూ మహాసముద్రం. ఈ రకంగా హిం...

Hindu - hindusthan



హిందూ - హిందుస్థాన్: బృహస్పతి ఆగమం ప్రకారం హిందూ శబ్దంలో "హి" అంటే హిమాలయం "ఇందు" అంటే హిందూ మహాసముద్రం. ఈ రకంగా హిందూ శబ్దం మన మాతృభూమి యొక్క భౌగోళిక స్వరూపాన్ని సూచిస్తుంది.
హిమాలయ సమారాభ్యం యావదిందుసరోవరం
తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే

(దేవతల ద్వారా నిర్మించబడిన మరియు హిమాలయం నుండి హిందూ మహాసముద్రం దాకా విస్తరించబడిన భూమిని హిందుస్థానం అంటారు)
హిందువు అనే శబ్దం వెయ్యి సంవత్సరాల పరాయి పాలన, బానిసత్వంతో ముడిపడి ఉంది. ఈ కాలంలో ప్రజలు నరకం అనుభవించారు. గురు గోవింద్ సింగ్ పృథ్వీరాజ్ విద్యారణ్య మరియు చత్రపతి శివాజీ వంటి అనేకమంది పరాక్రమవంతులు స్వాతంత్ర సమరయోధుల యొక్క చిరకాల స్వప్నం "హిందూ స్వరాజ్యం" స్థాపించడమే. హిందూ శబ్దం ఇటువంటి వీరుల యొక్క జీవన గాధలతో, వారి ఆకాంక్షలనే మధురమైన గంధంతో నిండి ఉన్నది. సాంఘికముగా మన ఏకాత్మతను, ఔదార్యాన్ని, జన సమాజాన్ని జాగృతం చేసే శక్తి హిందూ పదములో ఉన్నాయి. కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైన పదము.

హిందూ శబ్దం యొక్క ఉపయోగం రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో కొంతమంది కుహనా లౌకికవాదులు మనల్ని సాంప్రదాయక వాదులని మతోన్మాదులని ఆరోపిస్తుంటారు. నేను ఒకసారి పండిట్ నెహ్రూ గారిని కలిసినప్పుడు వారు కూడా ఇదే మాట అన్నారు. మీరు ఎప్పుడు చూసినా పదేపదే హిందూ అనే రాగాన్ని ఎందుకు ఎత్తుకుంటారు? ఇలా చేయడం వల్ల మీరు నాలుగు గోడల మధ్య బందీ అయిపోతున్నారు, బాహ్య ప్రపంచం నుంచి వచ్చే కొత్త గాలులను లోపలికి రాకుండా ఆపుతున్నారు. బాహ్య ప్రపంచం నుంచి మనల్ని వేరు చేసే ఏ గోడ అయినా మనకు సమ్మతం కాదు. మనం ఇటువంటి కాలం చెల్లిన విధానాలకు స్వస్తి చెప్పి ముందుకు వెళ్లాలి.

పండిట్ నెహ్రూ మహానుభావుడు మరియు గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తి. నేను శాంతంగా జవాబు ఇచ్చాను నేను మీ మాటలను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాను, నేను అన్ని వైపుల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలులని స్వాగతించాలనుకుంటున్నాను. మనం బయట దేశాల యొక్క విభిన్న సిద్ధాంతాలను తెలుసుకొని, సూక్ష్మంగా వాటిని పరిశీలించి మనకు అనువైన వాటిని ఆచరణలో పెట్టాలి. కానీ ఇందుకోసం మన ఇంటి గోడలను ధ్వంసం చేసుకొని, ఇంటిని కూల్చుకొని పైకప్పు మన మీద వేసుకోవలసిన అవసరం లేదు. అది సమంజసం కూడా కాదు. దీనివల్ల మన రాష్ట్రీయ అస్మిత నశిస్తుంది.

దీని మీద నెహ్రూ మాట్లాడుతూ సరే మంచిది, ఏదైన లక్ష్యం యొక్క ప్రాప్తి కొరకు నిరంతర ప్రయత్నం చేస్తూ దృఢ నిశ్చయం కలిగి ఉండాలని నేను ఒప్పుకుంటున్నాను వారు ఈ మాత్రం అన్న ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపాను. -శ్రీ గురూజీ

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments