Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఏకత్వం యొక్క అనుభూతి కావాలి - మనమంతా భారత మాత సంతానం అనే భావన వెల్లివిరియాలి

ఏకత్వం యొక్క అనుభూతి కావాలి:  గత వెయ్యి సంవత్సరాలు మరియు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరికి సామాజిక  ఏకాత్మతను ...

మనమంతా భారత మాత సంతానం


ఏకత్వం యొక్క అనుభూతి కావాలి:  గత వెయ్యి సంవత్సరాలు మరియు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరికి సామాజిక  ఏకాత్మతను పునర్జీవింప చేయాలనే ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ఈ సంపూర్ణ సమాజాన్ని ఈశ్వర స్వరూపంగా ప్రతి ఒక్కరి హృదయంలో పునః ప్రతిష్ట చేయాలి. ఇదే మన ప్రాచీన సంస్కృతి అందించిన గొప్ప సందేశం. ప్రపంచంలోని ఇతర దేశస్తులు దేవుడిలో పితృత్వాన్ని మనుషులలో సోదర భావాన్ని మాత్రమే గుర్తించారు. కానీ మనం బ్రహ్మాండం నుంచి మొదలుకొని జడ పదార్థాల వరకు అంతా ఒక్కటే అనే ఏకత్వం యొక్క అనుభూతిని పొంది ఉన్నాము.

ఈ విశుద్ధమైన ఏకాత్మ భావాన్ని పునర్జీవింప చేయడం ద్వారా మనందరికీ మనము ఈ పవిత్ర జన్మభూమి భరతమాత యొక్క సంతానం అనే స్ఫురణ, అనుభూతి కలుగుతాయి. సమాజాన్ని భాష వర్గ మతాలతో మభ్యపెట్టి విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులను మనం కట్టడి చేయడం కేవలం ఏకాత్మ భావన ద్వారానే సాధ్యమవుతుంది. కొంతమంది గుడ్డివారు ఏనుగు యొక్క వివిధ అంగములను తాకుతూ వారికి తోచినది ఈ విధంగా చెబుతున్నారు. ఒకడు ఏనుగు యొక్క కాళ్ళను తాకి ఇవి స్తంభాలు అన్నాడు. ఒకడు ఏనుగు తొండాన్ని స్పృశిస్తూ ఇది పాము అయ్యుంటుంది అన్నాడు. ఇంకొకడు ఏనుగు ఉదరాన్ని ఆలింగనం చేసుకుని ఇది పెద్ద డోలు లా ఉంది అన్నాడు. ఈ రకంగా వారికి తోచింది వారు అనుకుంటున్నారు. వారు అనుకున్నది పాక్షికంగా సరైనదే కానీ, సమగ్రంగా ఆ పశువు యొక్క ఆకారాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజానికి అక్కడ ఉన్నది ఒకటే ఏనుగు.

మన సమాజ పురుషునిలోని ప్రతి భాగములో ఏకాత్మత అనే జీవధార ప్రవహిస్తే మన రాష్ట్ర జీవనంలోని అన్ని అంగములు క్రియాశీలమై రాష్ట్రహితము తద్వారా లోక కళ్యాణం కోసం కలిసి పనిచేయడం మొదలుపెడతాయి. ఇలా మన నవ సమాజ ప్రగతికి అవసరమైన ప్రాచీన పద్ధతులను సంరక్షిస్తూ, వాటిని ముందు తరాలకు అందిస్తూ, కాలం చెల్లిన పద్ధతులకు మూఢాచారాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలి. ప్రాచీనమైన పద్ధతులను వదిలేయడం వలన ఎవరు చింతించవలసిన అవసరం లేదు అలాగని నవీన పద్ధతులను స్వాగతించకుండా వెనకడుగు వేయవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇదే సజీవమైన, వర్ధమాన సమాజం యొక్క ప్రకృతి.

వృక్షాలు ఎదిగే క్రమంలో పండిపోయిన ఎండిపోయిన ఆకులు నేల రాలిపోయి కొత్తగా చిగురించే ఆకులకు మార్గం సుగమం చేస్తాయి. మనందరం సావధానంగా దృష్టి సారించవలసిన విషయం ఏమిటంటే ఈ ఏకాత్మత అనే జీవ రసం సమాజంలోని ప్రతి భాగంలో ప్రవహింప చేయడం. ఇందుకోసం అవసరమైన అనేక పద్ధతులు ఆ జీవధార యొక్క పోషణలో ఎంత ఉపయోగపడతాయో దానికి అనుగుణంగా సమాజం యొక్క వృద్ధి జరుగుతుంది. అవి నిరుపయోగమైనప్పుడు ఏకాత్మత లుప్తమైపోతుంది. ఈ సమయంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంతర్గతంగా ఐకమత్య భావనను పునర్జీవింపజేసి సమాజాన్ని సజీవంగా ఉంచే చేతనను జాగృతం చేయాలి. అప్పుడు మిగిలిన సమస్యలన్నీ వాటికవే పరిష్కారం అవుతాయి.

(విరాట సాగర సమాజమే ఇది, బిందువులం మనమంతా
చిరంతనమైన సంస్కృతి మనది, హిందువులం మనమంతా)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments