Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆగస్టు నెల - August month has special significance in India's freedom struggle

ఆగస్టు విప్లవం భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆగస్టు నెల కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సహాయ నిరాకరణోద్యమం 1920 ఆగస్ట్ 1వ ప్రారంభమ...

ఆగస్టు విప్లవం భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆగస్టు నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సహాయ నిరాకరణోద్యమం 1920 ఆగస్ట్ 1వ ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్ట్ 9న మొదలైంది. దీన్ని ఆగస్ట్ క్రాంతి (విప్లవం) అని పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్ట్ 15న వచ్చింది. క్విట్ ఇండియా అనే గంభీరమైన తీర్మానం క్విట్ ఇండియా ఉద్యమంలో నిర్ణయాత్మకంగా మారింది.

ఆగస్ట్ 1వ తేదీన సహాయ నిరాకరణోద్యమం 101 వార్షికోత్సవం, ఆగస్ట్ 9న క్విట్ ఇండియా ఉద్యమం 79వ వార్షికోత్సవ వేడుకలు కూడా జరుపుకుంటున్నాము ఈ విధంగా 1942 ఆగస్ట్ 9వ తేదీ ఏం జరిగిందో, అసలు 1857 నుంచి 1942 వరకు భారతదేశంలో ప్రజలు ఎలాంటి ఉద్యమాలు సాగించారో, స్వేచ్ఛ కోసం ఎంతగా పరితపించారో, కలిసి పోరాడి, కష్టాలను కలిసి అనుభవించి ఏ విధంగా స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారో మన ఈ కొత్తం తరం కూడా తెలుసుకుంటున్నారు. అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించడానికి చరిత్రలోని ఈ పేజీలు మనకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించేందుకు ఎందరో వీరులు గొప్ప గొప్ప త్యాగాలు చేసి తమ జీవితాలను సైతం అర్పించారు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎంతో ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవాలి. ఈ ఉద్యమం బ్రిటీష్ పాలన నుంచి భారతదేశాన్ని ఎలాగైనా విముక్తి చేయాలనే దృఢ సంకల్పం ప్రతీ ఒక్క భారతీయుడిలో రగిలించింది. ఈ సమయంలోనే దేశ ప్రజలంతా ఏకమయ్యారు. గ్రామాలు నగరాలు, విద్యావంతులు, నిరక్షరాసులు, ధనికులు, పేదలనే తేడాలు లేకుండా క్విట్ ఇండియా ఉద్యమం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. లక్షలాది మంది ప్రజలు మహాత్మాగాంధీ అందించిన డూ ఆర్ డై అనే నినాదాన్ని ఎవరికి వారే మంత్రంగా మార్చుకుని తమను తాము పోరాటానికి అంకితం చేసుకున్నారు.

దేశంలోని యువత తమ పుస్తకాలను, అధ్యయనాలను త్యజించి మరీ కవాతుకు బయలుదేరింది. మహాత్మా గాంధీ గారు 1942 ఆగస్ట్ 9న క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొన్న ప్రతీ ప్రముఖ నాయుకుడ్నీ బ్రిటీష్ ప్రభుత్వం జైలుపాలు చేసింది. ఈ సమయంలోనే డా. రామ్ మనోహర్ లోహియా, జయ్ ప్రకాష్ నారాయణ, అరుణ అసఫ్ అలీ వంటి గొప్ప వ్యక్తులతో కూడిన రెండో తరం నాయకత్వం కీలక పాత్ర పోషించింది. మహిమాన్వితమైన మన గత చరిత్రను, స్వాతంత్రోద్యమ ప్రాముఖ్యతను మన భవిష్యత తరాలతో పంచుకోవడం మన బాధ్యత.

70 సంవత్సరాల క్రితం ఈ దేశం స్వేచ్ఛ కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించవలసి వచ్చిందో నేటి తరం తెలుసుకుంటుంది. అందుకే స్వాతంత్య్రానికి సంబంధించి ఈ సంవత్సరాన్ని అమృత సంవత్సరంగా పరిగణిస్తున్నాము. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడి కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోని కొందరు వీరుల గాథలతో వారి త్యాగాలను గుర్తించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేడు దేశంలో వారు చేసినవి త్యాగాలు మాత్రమే కాదు, వాటి ద్వారా భవిష్యత్ తరాలకు ఎనలేని ప్రేరణ కలిగించారు అటువంటి వారిలో కొందరి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుదాం

బ్రిటన్ పాలకులకు వ్యతిరేకంగా నినదించిన గొంతు ఉషా మెహతా: ఉషా మెహతా 1920, మార్చ్ 20వ తేదీన గుజరాత్ లోని సూరత్లో ఉజన్మించారు. మెహతా తండ్రి బ్రిటీష్ పాలనలో న్యాయమూర్తిగా పనిచేసేవారు. ఒక రోజు ఆమె నివసించే గ్రామంలో మహాత్మా గాంధీ గారి మీటింగ్ జరిగింది. ఆ సమావేశం ఆమె లేత హృదయంపై చెరగని ముద్ర వేసింది. ఆమె గాంధీ అనుచరురాలిగా మారింది. గాంధీజీ ఆలోచనలు, తాత్వికత ఉషను ఎంతో ప్రభావితం చేశాయి. దాంతో ఆమె అన్ని సౌకర్యాలను వదిలేసి సాధారణ జీవనశైలి అవలంభించడం ప్రారంభించారు.

ఆమె ఖాదీ చేయడం నేర్చుకుంది. అదే ఆమె వేషధారణ అయ్యింది. ఆమెకు కేవలం ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడే సైమన్ గో బ్యాక్ అంటూ తీవ్రస్వరంతో నినదించింది. 1942 ఆగస్ట్ 8వ తేదీ క్విట్ ఇండియా ఉద్యమంలో చేరాలంటూ గాంధీజీ దేశ ప్రజలకు పిలుపునిచ్చి, డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజల్లో ఉత్తేజాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. ఉషా మెహతా ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసి భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం గాంధీజీవి, ఇతర కీలక కాంగ్రెస్ నాయకులందర్నీ అరెస్ట్ చేసింది.

నాయకులందర్నీ జైళ్ళో పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చాలనేది బ్రిటీష్ పాలకుల పన్నాగం. కానీ ఉన్న వారి ప్రయత్నాలను నీరుగార్చుతూ అజ్ఞాతంలోకి (అండర్ గ్రౌండ్) వెళ్ళి పోయి రహస్యంగా ఒక రేడియో స్టేషన్ ప్రారంభించింది. ఆమె 1942 ఆగస్ట్ 14న రేడియోలో తన మొదటి ప్రసంగం వినిపించింది. క్రమంగా ఈ రేడియో స్వేచ్ఛకు స్వరం అయ్యింది. ఆమె ప్రత్యేక మాటల ద్వారా ఇతర సాధనాల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని సంపాదించి ప్రసారం చేసేది. ప్రారంభంలో ఆమె రోజుకు రెండుసార్లు తన హిందీ, ఆంగ్ల భాషల్లో తన ప్రసంగాలు ప్రసారం చేసేది, తర్వాత దాన్ని రోజులో ఒకసారికి తగ్గించింది. ఆమె అజ్ఞాతంలో ఉంటూ రేడియో స్టేషన్ నడుపుతుండడంతో ఆమె తరచూ తన స్వరాన్ని మార్చవలసిన పరిస్థితి వచ్చేది. పోలీసులు ఆమె వెంటపడుతూనే ఉన్నారు.

చివరకు ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. 1942లో ఆమెకు నాలుగు సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష విధించారు. 1946 ఏప్రిల్ లో ఉషా ఎరవాడ జైలు నుంచి విడుదల అయ్యింది. తర్వాత ఆమె బాంబే విశ్వవిద్యాలయానికి చెందిన విల్సన్ కాలేజీలో చేరి 30 సంవత్సరాలు బోధనా వృత్తిలో కొనసాగింది. ఆమె పొలిటికల్ డిపార్ట్ మెంట్ హెడ్ గా కూడా పనిచేశారు. గాంధీ పీస్ ఫౌండేషన్కి అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు. ప్రభుత్వం పద్మ విభూషణ అవార్డుతో సత్కరించింది. ఉషా మెహతా 2000 సంవత్సరం ఆగస్ట్ 11న తన 80వ ఏట మరణించారు.

గుండెల్లో బుల్లెట్లు దిగినా జెండా కోసం నిలబడ్డ యోదురాలు కనకలతా బారువా: కనకలత బారువా అస్సాంలో 1924 డిసెంబర్ 22న జన్మించారు. కర్నేశ్వరీ దేవి, కృష్ణకాంత్లు ఆమె తల్లిదండ్రులు కనకలతా బారువా భారతదేశం గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకోడానికీ, ఛాతిలో బుల్లెట్ దింపుకోడానికి వెనకాడలేదు. పసితనం నుంచే ఆమె మనసులో విప్లవ భావాలు మొలకెత్తాయి మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపిచ్చిన తర్వాత ఆమె ఆలోచనలు, అభిరుచులు కొత్త దిశను సంతరించుకున్నాయి.

ఆమె బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేది. క్విట్ ఇండియా ఉద్యమంలో 43వ రోజు... అంటే సెప్టెంబర్ 20 1942 నాడు ఉద్యమకారులంతా ఒక సమావేశం జరపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తేజ్ పూర్ పోలీస్ స్టేషన్ ముందు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని విప్లవకారులంతా తీర్మానించుకున్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని పోలీస్ స్టేషన్ వైపు కదలిపోతున్నారు. వారిలో కనక లత ముందు వరుసలో ఉంది. పోలీస్ స్టేషన్ చేరుకోగానే, ఈ జన సమూహం.. ఇంకా ముందుకు సాగడాన్ని అధికారులు నిషేధించారు.. ముందుకు వస్తే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తాము ఘర్షణ పడేందుకు రాలేదని, జెండా ఎగురవేసి వెళ్ళిపోతామని కనక లత పోలీసులకు వివరించే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు వినేందుకు సిద్ధంగా లేరు. వారికి దారి వదలలేదు. ప్రజలంతా అలా నిలబడి చూస్తున్నారు.

కానీ కనక లత మాత్రం వారి బెదిరింపులను ఖాతరు చేయకుండా జెండా పట్టుకుని ముందుకు కదులుతూనే ఉంది. దాంతో ఒక సైనికుడు ఆమెపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె ఛాతిలో దిగబడింది. ఆమె కిందపడిపోయింది. కానీ త్రివర్ణ పతాకాన్ని మాత్రం నేలకు ఒరగనివ్వలేదు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉద్యమకారులు ఆమె మృతదేహాన్ని తన గ్రామానికి తీసుకెళ్ళి కర్మకాండలు జరిపించారు. అస్సాం ప్రజలు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ఆమెను బీర్బల (వీర చాలిక) అని పిలుచుకుంటారు. తన దేశానికి చెందిన ఒక 17 ఏళ్ళ బాలికను, ఉద్యమకారిణిని దారుణంగా చంపినందుకు ఆమెపై కాల్పులు జరిపిన సైనికుడు తర్వాత చాలా పశ్చాతాపం చెందారు. ఆ బాధతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

బ్రిటీషర్లకు గుణపాఠం చెప్పిన సమరయోధుడు వసుదా సింగ్: క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమవుతుందని మహాత్యాగాంధీ ప్రకటించగానే స్వాతంత్ర్య ఉద్యమానికి చెందిన పలువురు ప్రముఖులను బ్రిటిషర్లు అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణికి చెందిన నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగి ఆందోళనను ముందుకు తీసుకుపోయారు. తమ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి, ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ నగర్ జిల్లా రాజేయుల్తాన్ పూర్ లో ఈ ఉద్యమానికి వసుధాసింగ్ నేతృత్వం వహించేవారు.

స్వాతంత్ర్యం కోసం పోరాట స్ఫూర్తి కలిగిన విప్లవయోధునిగా అతను అప్పటికే పేరు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో అంటేద్కర్ నగర్ అనేది ఫైజాబాద్ జిల్లా రెవిన్యూ ప్రాంతంగా వుండేది. ఫైజాబాద్ జిల్లాను, ఇప్పుడు అయోధ్య జిల్లా అని పిలుస్తున్నారు. చిన్న వయస్సులోనే స్వాతంత్య్ర పోరాటంలోకి దూకిన వసుధా సింగ్ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1942 ఆగస్టు 23వ తేదీన రాజేసుల్తాన్ పూర్ కు చెందిన స్వాతంత్య్ర పోరాట యోధులతో వసుధా సింగ్ సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటీష్ పోలీసులు ఆ సమావేశంపై దాడి చేసి లారీ ఛార్జీ చేశారు. పోలీసుల చర్యతో కోపోద్రిక్తులైన స్వాతంత్య్ర సమర యోధులు పోలీసు ఇన్ స్పెక్టర్ ను, ఇద్దరు కానిస్టేబుళ్లను మంటల్లో వేసి కాల్చేశారు. ఆ తర్వాత వారి దేహాలను సమీపంలోని నదిలో పడేశారు.

ఈ చర్యతో నాటి బ్రిటీష్ ప్రభుత్వం రగిలిపోయింది. స్థానిక ప్రజలపై విరుచుకుపడి నానా అకృత్యాలకు పాల్పడ్డారు. వసుధా సింగ్ అచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఆయన అప్పటికే తన సహచరులతో కలిసి తప్పించుకున్నారు. పేరును మార్చుకొని కలకత్తాలోని ఒక తుపాకులు ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించారు. మహాత్మాగాంధీ సూచనలమేరకు అతను పోలీసులకు లొంగిపోయారు. కోర్టులో విచారణ చేయించిన బ్రిటీష్ ప్రభుత్వం అతనికి మరణశిక్ష పడేలా చేసింది.

వసుధా సింగ్ ను రక్షించడం కోసం పలువురు స్వాతంత్య్ర సమర యోధులు రంగంలోకి దిగి ఆందోళన చేశారు. చివరకు మహాత్మాగాంధీ కలగజేసుకోవడంతో నాటి బ్రిటీష్ వైస్రాయ్, వసుధా సింగ్ ఉరిశిక్షను జైలుశిక్షగా మార్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వసుధా సింగ్ విడుదలయ్యారు. ఆయన 1982 డిసెంబర్ 11న కీర్తిశేషులయ్యారు.

తన పద్యాలు, కథల ద్వార ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన విప్లవవీరుడు బాబా కాన్షీరాం: బాబా కాన్షీరాం బారతదేశానికి చెందిన విప్లవ సాహితీవేత్త. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన దోపిడీకి విరుద్ధంగా పద్యాలు, పాటలు, కథల రూపంలో తన గళాన్ని బలంగా వినిపించేవారు. ప్రజల ఆవేదన, బాధ తన పద్యాలలో వ్యక్తపరిచేవారు. ఆయన కంగ్రా జిల్లాలో డెహ్రా సబ్ డివిజన్లోని దాదా సైనాలో 1882 జూలై 11న జన్మించారు.

మహాత్మాగాంధీని ఎంతగానో ఆరాధించే . కాన్షీరాం స్వేచ్ఛా న్యాయవాది, జలియన్ వాలా బాగ్ ఘాతుకానికి చలించిపోయిన ఆయన గాంధీజీ సందేశాలను తన పద్యాలు, పాటలతో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు తను నల్ల దుస్తులే ధరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ప్రజలు ఆయన్ని నయాపోస్ జనరల్ (ది బ్లాక్ జనరల్) గా గుర్తించారు. ఆయన మరణించేవరకూ తను చేసిన ప్రతిజ్ఞ ఉల్లఘించలేదు. ఆయన 1943, అక్టోబర్ 15వ తేదీన మరణించినప్పుడు కూడా నల్ల దుస్తుల్లోనే ఉన్నారు.

ముసుగు కూడా నల్లరంగులో ఉండేది. ఆయన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సహరీ గాంధీ అని పిలిచేవారు. ఆయన తన పహరీ పదాలతో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశభక్తి సందేశాలను వినిపించినందుకు 11 సార్లు అరెస్ట్ అయ్యారు. 1930 నుంచి 1942 వరకు తన జీవితంలో సుమారు 9 సంవత్సరాలు వివిధ జైళ్ళలో గడిపారు. ఆయన రచనలు చాలావరకు జైళ్ళలో రాసినవే, అంగ్రేజ్ సర్వర్ దా నిఘా పర్ దయాదా (సూర్యడు బ్రిటీష్ సామ్రాజ్యంలో అస్తమించబోతున్నాడు) అనేది అతని ప్రసిద్ధ రచన.

ఆయన లాహోర్ లో ఉన్న సమయంలో లాలా హర్ దయాల్, సర్దార్ అజిత్ సింగ్, మౌల్వీ బర్కత్ అలీ ని కలిసారు. కాన్షీరాం జీవితంలో ఈ ముగ్గురి ప్రభావం ఎంతో కీలకమైంది. ఈయన పద్యాలు, పాటలు చిన్న తరువాత సరోజినీ నాయుడు ఈయన్ని బుల్ బులె-ఇ పహార్ అని బిరుదునిచ్చారు. ఈయన గౌరవార్ధం భారత ప్రభుత్వం 1984లో కాన్షీరాం పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.

దేశభక్తి గీతాలతో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన రామప్పనాయుడు: ఈయన కర్ణాటక రాష్ట్రంలోని రాయల్పాడు లో 1927 లో జన్మించారు. విప్లవజ్వాల అనేది చిన్నతనంలోనే రగిలింది. 1942లో గాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమ పిలుపుతో ఎంతగానో ప్రభావితులయ్యారు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో చేరారు. ఆయన సరిహద్దు ప్రజల్ని స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనే విధంగా చైతన్యపరిచే కార్యక్రమాలు ప్రారంభించారు.

ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆయన రాత్రి సమయాల్లో రహస్యంగా గ్రామాలు సందర్శించి దేశ భక్తి పాటలు పాడేవారు. ఆయనకు సంగీతం అన్నా పాటలు పాడడం అన్నా ఎంతో ప్రీతి. ఈ అభిరుచే స్వతంత్య్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అద్భుత సాధనంగా ఉపయోగపడింది. రాయల్పాడు ఉద్యమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామప్పనాయుడు కె. పట్టాభిరామన్, హర్డేకర్ మంజప్ప, కె.సి. రెడ్డి, కింగల్ హనుమంతయ్యతో బాటు ఈ ఉద్యమంలో చేరారు. 1947లో స్వాతంత్య్ర్య సమరయోధుల బృందం వేతృత్వంలో పి.నారాయణ్ రెడ్డి, రాయల్పాడు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, పత్రాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో రామప్ప కూడా ఉన్నారు.

ఈ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన మొత్తం 80 మంది సభ్యులలో 40 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అరెస్ట్ అయిన 35 మందిలో రామప్ప కూడా ఉన్నారు. పోలీసులు ఆయన్ని శారీరక చిత్రహింసకు గురిచేశారు. దేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాతే ఆయన జైల్ నుండి విడుదల జయ్యారు, స్వాతంత్ర్యానంతరం రామప్ప వినోభాబావే ప్రారంభించిన భూధాన్ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో గాంధీజీ విలువలను ప్రచారం చేసే లక్ష్యంతో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans  ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments